Q3 results
-
తగ్గిపోయిన ఐటీసీ లాభం..
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ (ITC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,103 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 5,407 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా బలపడి రూ. 20,946 కోట్లను తాకింది.గత క్యూ3లో రూ. 19,309 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 12 శాతం పెరిగి రూ. 14,414 కోట్లకు చేరాయి. కాగా.. రెడీ టు కుక్ ఫుడ్స్ విభాగంలోని ప్రసూమాలో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. తొలుత 62.5 శాతం వాటాకుగాను రూ. 187 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.తదుపరి మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 37.5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. తొలుత ప్రసూమా మాతృ సంస్థ యాంపిల్ ఫుడ్స్ నుంచి 43.8 శాతం వాటాకు రూ. 131 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో మరో రూ. 56 కోట్లతో వాటాను 62.5 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 441 వద్ద ముగిసింది. -
స్విగ్గీ నష్టాలు పెరిగాయ్.. మొబిక్విక్ లాభాలు పోయాయ్..
ఫుడ్, గ్రోసరీ డెలివరీల ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 799 కోట్లను దాటింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 574 కోట్ల నష్టం నమోదైంది.కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,049 కోట్ల నుంచి రూ. 3,993 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,700 కోట్ల నుంచి రూ. 4,898 కోట్లకు పెరిగాయి. స్థూల ఆర్డర్ల విలువ(జీవోవీ) 38 శాతం బలపడి రూ. 12,165 కోట్లను తాకింది. క్విక్ కామర్స్ బిజినెస్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ జీవోవీ 88 శాతం జంప్‌చేసి రూ. 3,907 కోట్లకు చేరింది. కొత్తగా 96 స్టోర్లను జత కలుపుకోవడంతో యాక్టివ్ డార్క్ స్టోర్ల విస్తీర్ణం 2.445 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. నష్టాల్లోకి మొబిక్విక్ ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ (Mobikwik) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. పేమెంట్ గేట్‌వే వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.వన్ మొబిక్విక్ గేట్‌వే చెల్లింపుల వ్యయాలు మూడు రెట్లు పెరిగి రూ. 144 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 51 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 269 కోట్లను అధిగమించింది. పేమెంట్స్ స్థూల మెర్కండైజ్ విలువ మూడు రెట్లుపైగా జంప్‌చేసి రూ. 29,400 కోట్లయ్యింది. రిజిస్టర్డ్ వినియోగదారుల సంఖ్య 14 శాతం వృద్ధితో 17.2 కోట్లను తాకింది. పేమెంట్స్ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 196 కోట్లను దాటింది. -
విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్‌చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.టెక్ మహీంద్రాఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్‌వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు. -
Infosys Q3 Results: ఇన్ఫోసిస్ అదుర్స్..
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది.త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సీఈవో ఏం చెప్పారంటే.."క్రమానుగతంగా బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి వృద్ధిని సాధించాం. మా విభిన్న డిజిటల్ ఆఫర్లు, మార్కెట్ పొజిషనింగ్, కీలక వ్యూహాత్మక కార్యక్రమాల విజయానికి ఇది స్పష్టమైన ప్రతిబింబం. సంస్థలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉత్పాదక ఏఐపై దృష్టి సారిస్తున్నాం. ఇదే క్లయింట్లు పెరగడానికి కారణం” అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.పెరిగిన క్లయింట్లుసెప్టెంబరు త్రైమాసికంలో 1,870గా ఉన్న క్లయింట్ల క్రియాశీలక సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 1,876కి పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక స్వచ్ఛంద అట్రిషన్ (ఉద్యోగుల సంఖ్యలో తరుగుదల) గత సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 13.7 శాతంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 3,17,788 ఉండగా ఈ త్రైమాసికంలో 3,23,379గా కంపెనీ పేర్కొంది. వరుసగా రెండవ త్రైమాసికంలో హెడ్‌కౌంట్ పెరిగింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది 3,22,663. -
టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకు
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా 5,370 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.మొదటి రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్.. మూడో త్రైమాసికంలో మాత్రం వేలాదిమందిని బయటకు పంపిది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 6,07,354కు చేరింది. కరోనా మహమ్మారి తరువాత దాదాపు అన్ని కంపెనీలు కోలుకున్నాయి. దీంతో కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.ఈ త్రైమాసికంలో 25,000 మంది అసోసియేట్లను ప్రమోట్ చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రమోషన్ల సంఖ్య 1,10,000 కంటే ఎక్కువకు చేరిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు. అంతే కాకుండా.. మేము ఉద్యోగి నైపుణ్యం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది అధిక సంఖ్యలో క్యాంపస్ నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.వచ్చే ఏడాది 40,000 ఉద్యోగాలు2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని.. వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ (Milind Lakkad) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం.19 ఏళ్లలో ఇదే మొదటిసారిడిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగింది. అంతకు ముందు ఇది 12.3 శాతంగా ఉంది. ముంబై (Mumbai) కేంద్రంగా సేవలందిస్తున్న టీసీఎస్ కంపెనీ 2004లో మార్కెట్లోకి లిస్ట్ అయింది. అప్పటి నుంచి (19 సంవత్సరాల్లో) సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 22,600 పెంచుకుంది. అంతకు ముందు 2022లో 1.03 లక్షల ఉద్యోగులను చేర్చుకుంది.టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ.. భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ (K Krithivasan) పేర్కొన్నారు. -
టీసీఎస్ లాభం అప్ క్యూ3లో రూ. 12,380 కోట్లు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. విభాగాలవారీగా ప్రధాన విభాగం బీఎఫ్ఎస్ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.ఇతర విశేషాలు → కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. → ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది. → మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్మెంట్ల సాధనవైపు సాగుతోంది. → డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది. → నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి. → ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది. ఆర్డర్ల జోరు పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. – కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్ -
తగ్గిన నిరుద్యోగిత రేటు - క్యూ3 బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా పట్టణ ప్రాంతాల్లో 2023 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో రేటు 7.2 శాతంగా నమోదైంది. కార్మిక శక్తి సర్వేకు (పీఎల్ఎఫ్ఎస్) సంబంధించి ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన త్రైమాసిక బులెటిన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘2022 అక్టోబర్–డిసెంబర్లో పురుషుల్లో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ త్రైమాసికంలో 5.8 శాతానికి తగ్గింది. మహిళలలో ఇది 9.6 శాతం నుంచి 8.6 శాతానికి దిగి వచ్చింది‘ అని బులెటిన్ పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వర్కర్ల జనాభా నిష్పత్తి 44.7 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగినట్లు వివరించింది. పురుషుల్లో ఇది 68.6 శాతం నుంచి 69.8 శాతానికి మహిళల్లో 20.2 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. ఎప్పటికప్పుడు కార్మిక శక్తి వివరాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017లో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రారంభించింది. -
దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఎల్ఐసీ
ప్రముఖ జీవిత బీమా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఇక మార్కెట్ క్యాప్ చార్ట్‌లో అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విలువైన కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఎల్ఐసి అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. -
లాభాల బాటలో జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డిసెంబర్ క్వార్టర్లో తన పనితీరును మరింత బలోపేతం చేసుకుంది. రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.347 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2485 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.3,383 కోట్లకు దూసుకువెళ్లింది. డిసెంబర్ త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) తిరిగి 25 శాతం వృద్ధిలోకి వచ్చినట్టు జొమాటో ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ రూపంలో తెలిపారు. వార్షికంగా జీవోవీ 20 శాతానికి పైనే వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం, అంచనాకు మించి మార్కెట్ వాటా సొంతం చేసుకోవడంపై జీవోవీ మరింత వృద్ధి ఆధారపడి ఉంటుందని వివరించారు. క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ జీవోవీ 103 శాతం పెరిగి రూ.3,542 కోట్లకు చేరింది. బ్లింకిట్ నష్టాలు రూ.56 కోట్లకు పరిమితమయ్యాయి. ఫుడ్ డెలివరీ జొమాటో వరకే చూస్తే ఆదాయం రూ.1,565 కోట్ల నుంచి రూ.2,025 కోట్లకు పెరిగింది. క్విక్ కామర్స్ ఆదాయం రూ.301 కోట్ల నుంచి రూ.644 కోట్లకు వృద్ధి చెందింది. రెస్టారెంట్లకు గ్రోసరీని సరఫరా చేసే హైపర్‌ప్యూర్ విభాగం ఆదాయం రూ.421 కోట్ల నుంచి రూ.859 కోట్లకు చేరింది. మెరుగైన ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.149 వద్ద ముగిసింది. -
భారీగా పెరిగిన బంధన్ బ్యాంక్ లాభాలు - పూర్తి వివరాలు
బంధన్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకారం బ్యాంక్ మొత్తం వ్యాపారం 17 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లలో బ్యాంక్ రిటైల్ వాటా ఇప్పుడు 71 శాతం వద్ద ఉంది. ఈ త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 26 శాఖలను ప్రారంభించింది. దీంతో భారతదేశం మొత్తం మీద ఉన్న బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య 6250కు చేరుకుంది. వీటి ద్వారా బ్యాంక్ ఏకంగా 3.26 కోట్ల కంటే ఎక్కువ మందికి సేవలు అందిస్తోంది. బంధన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 75,000 కంటే ఎక్కువ. బ్యాంక్ డిపాజిట్ గతంలో కంటే కూడా ఈ త్రైమాసికంతో 15 శాతం పెరిగింది. మొత్తం డిపాజిట్ ఇప్పుడు రూ.1.17 లక్షల కోట్లు కాగా, మొత్తం అడ్వాన్సులు రూ.1.16 లక్షల కోట్లు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ నిష్పత్తి 36.1 శాతం వద్ద ఉంది. బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.8 శాతం వద్ద నిలిచింది. ఇది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం. బంధన్ బ్యాంక్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది, తద్వారా SME లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ వంటి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. వీటితో పాటు బ్యాంక్ ఇటీవల కమర్షియల్ వెహికల్ లెండింగ్, వ్యాపారాల కోసం ఆస్తిపై లోన్ వంటి కొత్త వర్టికల్స్ ప్రారంభించింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో బ్యాంకు గణనీయమైన వృద్ధికి సహాయపడతాయి. బంధన్ బ్యాంక్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా, ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ.. మూడవ త్రైమాసికం ఎప్పుడూ బ్యాంకుకు మంచి వృద్ధి తీసుకువస్తుందని, రానున్న రోజుల్లో మరింత వృద్ధిని సాధించడానికి, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కావలసిన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని, దేశంలో మరింత మందికి చేరువయ్యే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇదీ చదవండి: ప్రశాంతత లేదని ట్వీట్.. తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది! -
కొటక్ మహీంద్రా క్యూ3 గుడ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 4,265 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 2,792 కోట్ల నుంచి రూ. 3,005 కోట్లకు బలపడింది. డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వడ్డీ ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 6,554 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 5.47 శాతం నుంచి 5.22 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం రూ. 1,948 కోట్ల నుంచి రూ. 2,2,97 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 149 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగాయి. ఫలితంగా లాభాల్లో వృద్ధి పరిమితమైనట్లు వెల్లడించింది. బ్యాంక్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 190 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంది. అన్సెక్యూర్డ్ రుణాల కారణంగా తాజా స్లిప్పేజీలు రూ. 748 కోట్ల నుంచి రూ. 1,177 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ పటిష్టస్థితిలో ఉన్నట్లు ఎండీ, సీఈవోగా కొత్తగా ఎంపికైన అశోక్ వాస్వాని స్పష్టం చేశారు. కనీస మూలధన నిష్పత్తి 20 శాతం నుంచి 19 శాతానికి వెనకడుగు వేసింది. వారాంతాన బీఎస్ఈలో కొటక్ మహీంద్రా షేరు 2.3 % బలపడి రూ. 1,806 వద్ద ముగిసింది. -
రిలయన్స్ లాభం 17,265 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్ టు కెమికల్స్ (ఓటూసీ) నిరాశపరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్ మార్జిన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది. రిటైల్ భేష్... ► రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది. ►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. ► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు. ► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది. ఆయిల్, కెమికల్స్... ఆయిల్ టు కెమికల్స్ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్‌నగర్‌లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్ షేరు ఫ్లాట్‌గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో జూమ్... టెలికం, డిజిటల్ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలి స్తే ఫ్లాట్‌గా ఉంది. డిసెంబర్ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్‌వర్క్‌కు మళ్లారు. -
ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!
దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. క్యూ3 హైలైట్స్: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. సేవల శాతం ప్రకారం ఆఫ్‌షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది. మొత్తం బుకింగ్‌లు 3.8 బిలియన్ డాలర్లు అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది. విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. -
TCS Q3 Results: క్యూ3 ఫలితాల్లో టీసీఎస్ గుడ్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8.2 శాతం పుంజుకుని రూ. 11,735 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వృద్ధితో రూ. 60,583 కోట్లకు చేరింది. భారత్(23.4 శాతం)సహా వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పుంజుకోవడం ఇందుకు సహకరించింది. ఈ బాటలో ప్రధాన మార్కెట్లలో యూకే 8.1 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 16 శాతం, లాటిన్ అమెరికా 13.2 శాతం చొప్పున వృద్ధి సాధించగా.. ఉత్తర అమెరికా నుంచి 3 శాతం క్షీణత నమోదైంది. ఇక విభాగాలవారీగా చూస్తే ఎనర్జీ, రిసోర్సెస్ – యుటిలిటీస్(11.8 శాతం), తయారీ(7 శాతం), లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్(3.1 శాతం) ఆదాయానికి దన్నుగా నిలిచినట్లు కంపెనీ పేర్కొంది. అయితే కీలకమైన బీఎఫ్ఎస్ఐ విభాగంలో 3 శాతం, మీడియా, టెక్నాలజీలలో 5 శాతం చొప్పున ప్రతికూల వృద్ధి నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 27 చొప్పున డివిడెండును ప్రకటించింది. దీనిలో రూ. 18 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రికార్డ్ డేట్ ఈ నెల19కాగా.. ఫిబ్రవరి 5నుంచి చెల్లించనుంది. పలు ఒప్పందాలు క్యూ3లో దిగ్గజ యూకే బ్యాంక్ మోటార్ ఫైనాన్స్, లీజింగ్ బిజినెస్‌లకు ఎండ్టు ఎండ్ ట్రాన్స్ఫార్మేషన్ భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ బాటలో ఆస్ట్రేలియా ప్రధాన ఎక్సే్ఛంజీ ఏఎస్ఎక్స్ అధునాతన క్లయరింగ్, సెటిల్మెంట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్ హెల్త్‌కేర్ కంపెనీ ప్రస్తుత నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు క్లౌడ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ కోసం టీసీఎస్‌తో చేతులు కలిపింది. సాఫ్ట్వేర్ సేవలకు సీజనల్‌గా బలహీన త్రైమాసికంగా పేర్కొనే అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లోనూ కంపెనీ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించింది. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, కస్టమర్ కేంద్రంగా అమలు చేసే వ్యూహాలతోపాటు.. పటిష్ట బిజినెస్ మోడల్‌ను ఇది ప్రతిబింబిస్తోంది. వివిధ మార్కెట్ల నుంచి కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భారీ ఆర్డర్ బుక్కు కారణమవుతోంది. - కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ ఇతర విశేషాలు... నిర్వహణ మార్జిన్లు 0.5 శాతం మెరుగుపడి 25 శాతానికి చేరాయి. నికర మార్జిన్లు 19.4 శాతంగా నమోదయ్యాయి. ఆర్డర్ బుక్ 8.1 బిలియన్ డాలర్లను తాకింది. డిసెంబర్ కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 10,669 మంది తగ్గి 6,03,305కు చేరింది. వీరిలో మహిళల సంఖ్య 35.7%. కార్యకలాపాల ద్వారా రూ. 11,276 కోట్ల నగదును జమ చేసుకుంది. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 13.3 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 3,736 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో కంపెనీ రూ. 6,106 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.6,586 కోట్లతో పోలిస్తే 7.3% తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1.3% పెరుగుదలతో రూ. 38,821 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో ఆదాయం రూ. 38,318 కోట్లుగా నమోదైంది. క్లయింట్ల నుండి డిమాండ్ మందగించడం ఫలితాలపై ప్రభావం చూపింది. గైడెన్స్ కట్.. 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిన్ ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) కుదించింది. 1.5–2 శాతానికి తగ్గించింది. గత ఫలితాల సందర్భంగా ఆదాయ వృద్ధిని 1–2.5 శాతంగా అంచనా వేసింది. ‘ఇన్‌సెమీ’ కొనుగోలు.. బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్ డిజైన్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్‌సెమీ కొనుగోలు ప్రతిపాదనకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.280 కోట్లకు దీన్ని దక్కించుకోనుంది. 2024 మార్చిలోపు ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో మా పనితీరు నిలకడగానే ఉంది. బడా డీల్స్ దన్నుతో 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాం. జెనరేటివ్ ఏఐ, డిజిటల్, క్లౌడ్ తదితర విభాగాల్లో మా పోర్ట్‌ఫోలియో పటిష్టతకు ఇది నిదర్శనం. స్థూల ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఫైనాన్షియల్ సర్వీసులు, టెల్కోలు, హైటెక్ రంగాల్లో ప్రభావం కొనసాగవచ్చని భావిస్తున్నాం. - సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ ఇతర ముఖ్యాంశాలు.. క్యూ3లో ఇన్ఫీ 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో నికరంగా 71% కొత్త డీల్స్ ఉన్నాయి. డిసెంబర్ 31 నాటికి కంపెనీలో 3,22,663 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. క్యూ2తో పోలిస్తే (3,28,764) నికరంగా 6,101 మంది (1.8 శాతం) సిబ్బంది తగ్గారు. క్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్ నాటికి ఉన్న 3,46,845 మందితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7% తగ్గింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 12.9%గా ఉంది. కాగా, ఉద్యోగుల వినియోగాన్ని నిశితంగా పరిశీలిస్తామని సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ చెప్పారు. క్యాంపస్ హైరింగ్ అనేది క్లయింట్ల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి దీని అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో షేరు ధర 1.62% నష్టంతో రూ.1,495 వద్ద ముగిసింది. -
త్వరలో ఫలితాలు.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తీరినట్టేనా!
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇతర సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఐటీ కంపెనీల అవస్థలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అయితే 2023 ప్రారంభం కంటే చివరి త్రైమాసికం కొంత వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో పరిస్థితులు కొంత సాధారణస్థాయికి వచ్చినప్పటికీ.. చాలా ఐటీ సంస్థలు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాయి. ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం, రోజురోజుకి తగ్గుతున్న ఆదాయాల వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రభావం ఉద్యోగుల మీద, వారి జీతాల మీద కూడా పడింది. ఈ కారణంగానే జీతాల పెంపు కూడా కొంత వాయిదా పడింది. భారతీయ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్ టీ, టెక్ మహీంద్రా మొదలైనవన్నీ ఈ నెలలో తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మునుపటి కంటే కొంత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు లాభాల్లో రాకపోయినప్పటికీ వాటి యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ప్రకటిస్తాయోనని మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయి. యాజమాన్యాలు ఐటీ రంగానికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తే స్టాక్ల్లో మంచి ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఫెడ్ మీటింగ్‌లో రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను పెంచబోమనే సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు పాజిటివ్‌గా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ఈ ఏడాది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు కనిపించనప్పటికీ.. కొత్త ఉద్యోగాలు పెరిగే సూచనలు కూడా ఆశాజనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా! ఐటీ సంస్థల ఫలితాల విషయానికి వస్తే.. టైర్ 1 కంపెనీల వృద్ధి 2.6 శాతం నుంచి 5 శాతం, టైర్ 2 సంస్థల ఆదాయం 1 నుంచి 3 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఫలితాలు ఈ నెల చివరి నాటికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఆదాయ వివరాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఐటీ కంపెనీ స్టాక్స్‌ల్లో ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారు. -
వారెన్ బఫెట్‌కు లక్షల కోట్లు నష్టం!
ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే క్యూ3 (జూలై-సెప్టెంబర్) గానూ ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 12.8 బిలియన్ డాలర్లు (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టపోయినట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయినైట్టెంది. గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో ఏ రకం షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయింది. అదే సమయంలో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగం లాభాల్ని గడించింది. బెర్క్‌షైర్ నిర్వహణ లాభంలో 2.4 బిలియన్లు అందించగా.. ఏడాది క్రితం బీమా రంగ సంస్థలు మూడవ త్రైమాసికంలో 1.1 బిలియన్ల నష్టాన్ని నివేదించాయి. బెర్క్‌షైర్ త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కొనుగోలు చేసింది.అయితే 4.4 బిలియన్ల బెర్క్‌షైర్ షేర్లను కొనుగోలు చేసిన మొదటి త్రైమాసికం నుండి దాని బైబ్యాక్‌ల వేగం గణనీయంగా తగ్గింది. -
స్పైస్‌జెట్‌కు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డిసెంబర్ త్రైమాసికానికి రూ.107 కోట్లను ప్రకటించింది. ప్రయాణికులు, సరుకు రవాణా పరంగా పనితీరు మెరుగ్గా ఉండడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలానికి స్పైస్‌జెట్ లాభం రూ.23.28 కోట్లుగా ఉంది. విదేశీ మారకం సర్దుబాటుకు ముందు చూస్తే డిసెంబర్ క్వార్టర్లో లాభం రూ.221 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,679 కోట్ల నుంచి రూ.2,794 కోట్లకు పెరిగింది. ‘‘మా ప్యాసింజర్, కార్గో వ్యాపారం మంచి పనితీరు చూపించడం లాభాలకు తోడ్పడింది. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ భారం తగ్గించుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో మొబైల్ టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం పెరిగి రూ. 7,990 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,234 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతంపైగా బలపడి రూ. 10,621 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. రూ. 9,717 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో కంపెనీ రూ. 16,133 కోట్లమేర (స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై) చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం ఈక్విటీగా మారి్పడి చేసుకుంది. దీంతో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం 33 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. మరోపక్క కంపెనీ బోర్డు ఏటీసీ ఇండియాకు రూ. 1,600 కోట్ల విలువైన అప్షనల్లీ కన్వరి్టబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదించింది. కాగా, తాజా సమీక్షా కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 17 శాతంపైగా మెరుగై రూ. 135ను తాకింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్ల(క్యూ2) నుంచి 22.86 కోట్లకు నీరసించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7.70 వద్ద ముగిసింది. -
నాల్కో లాభం క్షీణత.. క్యూ3లో రూ. 256 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 256 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 831 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,845 కోట్ల నుంచి రూ. 3,356 కోట్లకు వెనకడుగు వేసింది. అల్యూమినా అమ్మకాలు తగ్గడం, అధిక ముడివ్యయాలు, ప్రపంచ అనిశ్చితులు లాభదాయకతను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే అల్యూమినియం ధరలు బలపడటం, ఉత్పత్తి పుంజుకోవడం కారణంగా రానున్న త్రైమాసికాలలో ఉత్తమ ఫలితాలను సాధించనున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర అంచనా వేశారు. -
మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం
ముంబై: అదానీ గ్రూప్ సంక్షోభం, ద్రవ్యోల్బణ డేటా, కీలక కార్పొరేట్ క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుందని మార్కట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై దృష్టి సారింవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, బాండ్లపై దిగుమతి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. గతవారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనై మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోగా.., నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడింది. ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, మౌలిక, ఫార్మా, కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. ‘‘ఇటీవల ప్రతికూలతలు ఎదుర్కొన్న మార్కెట్ ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ట్రేడవుతుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక బలమైన సానుకూలాంశం కోసం ఎదురు చూస్తోంది. ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్ల కొనుగోలు వ్యూహాన్ని అనుసరించాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్‌సైడ్‌లో నిఫ్టీ 18,000 వద్ద కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17600 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. అదానీ గ్రూప్ సంక్షోభం హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటున్న వివరణలు ఇన్వెస్టర్లకు భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. అలాగే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నాలుగు అదానీ కంపెనీ షేర్లపై దాని రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుండి ‘నెగటివ్’కి తగ్గించింది. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మంగళవారం క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మరింత స్పష్టత వచ్చే వీలుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, గ్రాసీం, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎన్ఎండీసీ, బయోకాన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయిదువేల కోట్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో భారీ ఉపసంహరణ తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్ఐఐల విక్రయాలు కాస్త మందగించాయి. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఈ నెల పదో తేదీకి రూ.5,000 కోట్ల షేర్లను అమ్మేశారు. జనవరిలో రూ.53,887 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు సమాచారం. స్థూల ఆర్థికాంశాల ప్రభావం మార్కెట్ నేడు గతేడాది డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి డేటాకు స్పందించాల్సి ఉంటుంది. దేశీయ జనవరి సీపీఐ ద్రవ్యోల్బణం నేడు, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (మంగళవారం) రేపు విడుదల కానున్నాయి. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం డేటాను మంగళవారం వెల్లడించనుంది. సీపీఐ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలలుగా ఆర్బీఐ నిర్ధేశించుకున్న స్థాయిలోనే నమోదువుతోంది. జనవరిలోనూ స్థిరంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం(ఫిబ్రవరి 15న) విడుదల అవుతాయి. వారాంతాపు రోజు శుక్రవారం ఆర్బీఐ ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. -
ఐవోబీ లాభం ప్లస్.. క్యూ3లో రూ. 555 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 22 శాతం ఎగసి రూ. 555 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 454 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 5,317 కోట్ల నుంచి రూ. 6,006 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 44 శాతం జంప్‌చేసి రూ. 2,272 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.71 శాతం బలపడి 3.27 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు 10.4 శాతం నుంచి 8.19 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.63 శాతం నుంచి 2.43 శాతానికి బలహీనపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 937 కోట్ల నుంచి రూ. 711 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 27.15 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ రూ. 2,502 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 2,502 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. వ్యయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 9,598 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 60,843 కోట్ల నుంచి రూ. 57,354 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 48,666 కోట్ల నుంచి రూ. 57,172 కోట్లకు పెరిగాయి. కంపెనీ రుణ భారం ప్రస్తుతం రూ. 71,706 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రూ. 3,632 కోట్ల మొత్తాన్ని కంపెనీ పెట్టుబడి వ్యయాలపై వెచ్చించింది. ఉక్కుఉత్పత్తి 7.76 మిలియన్ టన్నుల (ఎంటీ) నుంచి 7.56 ఎంటీకి తగ్గింది. ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల్లో స్థిర వృద్ధి సాధించగలిగామని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. వ్యయాల నియంత్రణ, నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఎస్బీఐ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్– డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్ క్యూ3లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్‌నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. -
అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. విభాగాలవారీగా.. క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్ఎంసీజీ విభాగం టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ టర్నోవర్ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
ఊహించని ఫలితాలు.. దుమ్మురేపిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్– డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్ క్యూ3లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్‌నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 3.2 శాతం జంప్‌చేసి రూ. 544 వద్ద ముగిసింది. చదవండి: కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు -
టీవీ టుడే: ఫలితాలు నిరుత్సాహం.. ఒక్కో షేరుకు రూ.67 బంపర్ డివిడెండ్!
న్యూఢిల్లీ: టీవీ టుడే నెట్వర్క్ లిమిటెడ్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 55 శాతం తగ్గి రూ.28 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 10 శాతం తగ్గి రూ.231 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.61 కోట్లు, ఆదాయం రూ.258 కోట్ల చొప్పున ఉన్నాయి. టెలివిజన్, ఇతర మీడియా కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.229 కోట్లుగా ఉంది. రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సేవల నుంచి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యయాలు 12 శాతం పెరిగి రూ.206 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.67 ప్రత్యేక డివిడెండ్ కింద ఇవ్వాలని కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. ఇందుకు ఫిబ్రవరి 13 రికార్డ్ తేదీగా ప్రకటించింది. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
టైటన్ స్పీడ్ తగ్గింది, షేర్లు మాత్రం దౌడు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3) లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 913 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,012 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 10,094 కోట్ల నుంచి రూ. 11,698 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 8,750 కోట్ల నుంచి రూ. 10,454 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో జ్యువెలరీ విభాగం 11 శాతం పుంజుకుని రూ. 9,518 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ బాటలో వాచీలు, ఇతర విభాగం అమ్మకాలు సైతం 15 శాతం ఎగసి రూ. 811 కోట్లకు చేరాయి. ఐ కేర్ అమ్మకాలు 12 శాతం అధికమై రూ. 174 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో గురువారం నీరసించిన శుక్రవారం టైటాన్ షేర్లు దూసుకుపోయాయి. భారీగా లాభాలతో టాప్ గెయినర్‌గా దాదాపు 7 శాతంఎగిసి రూ. 2458 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్ క్యూ3లో రూ. 7,078 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్- డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 7,078 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 3,261 కోట్ల నుంచి రూ. 3,691 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం మెరుగై రూ. 4,840 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.32 శాతం నుంచి 1.49 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో లాభదాయకత మందగించినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ వెల్లడించారు. అయితే రుణాలను కొత్త రేట్లకు వేగంగా అనుసంధానిస్తున్నట్లు, ఈ ప్రభావం రుణాలపై తదుపరి త్రైమాసికం నుంచీ ప్రతిఫలించనున్నట్లు తెలియజేశారు. వ్యక్తిగత రుణ విభాగం 26 శాతం వృద్ధిని సాధించగా.. సగటు టికెట్(రుణ) పరిమాణం రూ. 35.7 లక్షలకు బలపడినట్లు వెల్లడించారు. రూ. 18 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగల రుణగ్రహీతలు 52 శాతంగా తెలియజేశారు. గ్రూప్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనంపై ఆర్బీఐ, ఎన్సీఎల్టీ నుంచి నిర్ణయాలు వెలువడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఇది ఊహించలేదు.. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లాభం 452శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికరలాభం అంత క్రితంతో పోలిస్తే 452.5% ఎగసి రూ.9.2 కోట్లు సాధించింది. ఎబిటా 300 శాతం పెరిగి రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్ 71% అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు 3డీ, 2డీ, రోబోటిక్స్ సేవలను అందిస్తున్నామని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. ‘ఇటువంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్ ఒకటి. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వృద్ధి కొనసాగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
ఎన్టీపీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్ఎఫ్) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది. చదవండి: ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ -
పతంజలి ఫుడ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్‌చేసింది. చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్! -
వేదాంత లాభం క్షీణత
న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 2,464 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,164 కోట్లు ఆర్జించింది. పెరిగిన ముడివ్యయాలు, విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 12.5 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం, కాపర్, ఆయిల్‌గ్యాస్ కార్యకాలాపాల కోసం 91 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్, 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను పొందేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో వేదాంతా మొత్తం ఆదాయం రూ. 34,674 కోట్ల నుంచి రూ. 34,818 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 26,777 కోట్ల నుంచి 31,327 కోట్లకు భారీగా ఎగశాయి. 2022 జూలెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కారణంగా రూ. 333 కోట్ల ప్రభావం పడినట్లు కంపెనీ వెల్లడించింది. జింక్ ఇంటర్నేషనల్ ఆస్తులను రూ. 2,981 కోట్ల విలువలో హిందుస్తాన్ జింక్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. క్యూ3లో తరుగుదల, అమార్టైజేషన్ పద్దు 4 శాతం పెరిగి రూ. 2,720 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్ 31కల్లా స్థూల రుణభారం రూ. 61,550 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
జ్యోతి ల్యాబ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతీ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 77% పైగా జంప్‌చేసి రూ. 674 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 380 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,390 కోట్ల నుంచి రూ. 6,127 కోట్లకు ఎగసింది. అధిక కమోడిటీ ధరలు వినియోగాన్ని దెబ్బతీసినప్పటికీ పటిష్ట బిజినెస్‌ను సాధించగలిగినట్లు కంపెనీ పేర్కొంది. నూతన ప్రొడక్టులు, మెరుగైన పంపిణీ, కొత్త ప్రాంతాలకు విస్తరించడం వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎంఆర్ జ్యోతి పేర్కొన్నారు. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
ఇండియన్ బ్యాంక్ లాభం డబుల్
కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది. -
అరవింద్ లాభం డౌన్!
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది. చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం -
యుకో బ్యాంక్ డబుల్ ధమాకా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 653 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో సాధించిన రూ. 310 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 5.63 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీల కంటే రికవరీలు పెరగడంతో మొండి రుణాలకు కేటాయింపులు రూ. 565 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 3,919 కోట్ల నుంచి రూ. 4,627 కోట్లకు బలపడింది. కనీస మూలధన నిష్పత్తి 14.32 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ఆర్బీఐ రూ. 88 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యుకో బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 29.50 వద్ద ముగిసింది. చదవండి: మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్ -
అదరగొట్టిన మారుతి:అమ్మకాల జోష్ మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెట్టింపు కంటే ఎక్కువలాభాలను నమోదు చేసింది. అలాగే ఆదాయం కూడా 25 శాతం ఎగిసింది. EBIT మార్జిన్ కూడా 350 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 7.6 శాతానికి చేరుకుంది. లాభాల మార్జిన్ 380 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతంగా ఉంది. ప్యాసింజర్, హై ఎండ్ కార్ల బలమైన డిమాండ్, ఇటీవలి కాలంలో ధరల పెంపు నేపథ్యంలో మారుతీ గణనీయ లాభాలను సాధించింది. త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 129.55 శాతం జంప్ చేసింది. గత ఏడాదితో రూ.1,041.8 కోట్లతో పోలిస్తే, రూ.2,391.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 29,057.5 కోట్లను సాధించింది. గత ఏడాది 23,253.3 కోట్ల వార్షిక ప్రాతిపదికన 24.96 శాతం పెరిగింది. జోరందుకున్న అమ్మకాలు, ముడి సరుకు ధర తగ్గడంతో లాభాల్లో పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 430,668 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 403,929 యూనిట్లు కాగా, ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇది మొత్తం 430,668 యూనిట్ల విక్రయాలకు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు , ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లు ఉన్నాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.27,849.2 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకి 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అత్యధికంగా రూ. 81,679 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 58,284.1 కోట్లుగా ఉంది. ఎఫ్వై22 మొదటి తొమ్మిది నెలల్లో రూ.1,927.4 కోట్ల నుంచి ఏడాది మొదటి తొమ్మిది నెలల నికర లాభం రూ.5,425.6 కోట్లకు పెరిగింది. -
భళా.. అదరగొట్టిన యాక్సిస్ బ్యాంక్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56% ఎగసి రూ. 6,187 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 62% జంప్‌చేసి రూ. 5,853 కోట్లను తాకింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,614 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 32 శాతం వృద్ధితో రూ. 11,459 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.73% బలపడి 4.26 శాతానికి చేరాయి. ఆదాయం రూ. 21,101 కోట్ల నుంచి రూ. 26,892 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) వార్షిక ప్రాతిపదికన 3.17% నుంచి 2.38%కి, నికర ఎన్పీఏలు 0.91% నుంచి 0.47%కి దిగివచ్చాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 930 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
బడ్జెట్‌పై అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. క్యూ3 ఆర్థిక ఫలితాల సీజన్ కొనసాగుతున్నందున స్టాక్, రంగాల ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొంత కాలం నిఫ్టీ 17,800–18,250 పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ వారంలోనూ అదే శ్రేణిలో కదలాడొచ్చు. బడ్జెట్ వెల్లడి తర్వాత తదుపరి మూమెంటమ్ చూడొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు గతవారం స్వల్ప లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి ఈ కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ జనవరి 20 నాటికి రూ.15,236 కోట్ల షేర్లను అమ్మేశారు. చైనా లాక్డౌన్ ఎత్తివేతతో ఎఫ్ఐఐల అక్కడి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తుంనే భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఫైనాన్స్, ఐటీ, టెలికాం షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. కేవలం మెటల్, మైనింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో(జనవరి 21 నాటికి) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.16,000 వేల షేర్లను కొనుగోలు చేసి మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘బడ్జెట్‌పై ఆశలు నెలకొన్నప్పటికీ.., బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత క్యూ3 గణాంకాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రభావం సోమవారం (23న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఇదే వారంలోనే యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్‌సహా 300కి పైగా కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం జనవరి 26 గణతంత్ర దినోవత్సం సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18,100–18,200 శ్రేణిలో నిరోధం, దిగువ స్థాయిలో 18,000–17,800 వద్ద తక్షణ మద్దతు ఉందని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన సమావేశపు నిర్ణయాలు నేడు విడుదల కానున్నాయి. అమెరికాతో పాటు యూరోజోన్ జనవరి తయారీ, సేవా రంగ గణాంకాలు రేపు(మంగళవారం) వెల్లడి కానుంది. యూఎస్ గృహ విక్రయాలు, నిరుద్యోగ గణాంకాలు, క్యూ4 జీడీపీ అంచనా గణాంకాలు గురువారం(జనవరి 26న) విడుదల కానున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ప్రీ బడ్జెట్ అంచనాలు వచ్చే ఏడాది(2024)లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మూలధన వ్యయానికి భారీగా నిధులు కేటాయించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, రోడ్డు, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చంటున్నారు. బడ్జెట్ సంబంధిత ముఖ్యంగా మౌలిక వసతులు, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, ఎరువుల రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. -
రిలయన్స్ క్యూ3 లాభాలు ఢమాల్, జియో అదుర్స్
సాక్షి,ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యూ3 నికర లాభం 15 శాతం క్షీణించింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఇందులో కన్సాలిడేటెడ్ నికర లాభం 15శాతం తగ్గి రూ. 15,792 కోట్లకుచేరింది. ఇది అంతకు ముందు సంవత్సరం రూ. 18,549 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ.2,20,592 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది రూ.1,91,271 కోట్లు. అటు రిలయన్స్ బలమైన రిఫైనింగ్ మార్జిన్లు,ఇంధన డిమాండ్‌తో చమురు-రసాయనాల వ్యాపారం లాభపడింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా తమ టీమ్స్ బలమైన నిర్వహణ పనితీరులో అద్భుతంగా వర్క్ చేశాయని రిలయర్స్ ఛైర్మన్ అండ్ ఎండీ ముఖేశ్ అంబానీ సంతోషం వెలిబుచ్చారు. జియో లాభం జూమ్ కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్‌లు నికర లాభాలలో 28.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,881 కోట్లను సాధించింది. ఆదాయం 20.9 శాతం వృద్ధిచెంది 24,892 కోట్లుగా ఉంది. EBITDA 25.1 శాతం పెరిగి 12,519 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్ రిటైల్ విభాగం రిలయన్స్ రీటైల్ వ్యాపారం సంవత్సరానికి 6.2 శాతం వృద్ధితో రూ. 2,400 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 18.6 శాతం పెరిగి రూ.60,096 కోట్లకు చేరుకుంది. EBITDA 24.9 శాతం పెరిగి రూ.4,773 కోట్లకు చేరుకుంది. O2C చమురు నుంచి రసాయనాల (O2C) వ్యాపార ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,44,630 కోట్లకు చేరుకుంది. EBITDA 2.9 శాతం పెరిగి రూ.13,926 కోట్లకు చేరుకుంది. -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,964 కోట్లను తాకింది. రుణాల నాణ్యత మెరుగుపడటం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 4,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.17 శాతం మెరుగై 4.27 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం సైతం రూ. 1,877 కోట్ల నుంచి రూ. 2,076 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,654 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు క్షీణించాయి. క్యూ2 (జూలె–సెప్టెంబర్)తో పోలిస్తే తాజా స్లిప్పేజీలు రూ. 1,572 కోట్ల నుంచి రూ. 1,467 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 2.06 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.01 శాతానికి చేరింది. ఈ కాలంలో 1,800 మందికి ఉపాధి కల్పించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా తెలియజేశారు. తొలి 9 నెలల్లో 8,500 మందిని జత చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 37,870కు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు బీఎస్ఈలో 0.7% క్షీణించి రూ. 1,222 వద్ద ముగిసింది. చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్! -
సెంట్రల్ బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 458 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 279 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,524 కోట్ల నుంచి రూ. 7,636 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,285 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.16 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం4.39 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 0.22 శాతం తగ్గి 13.76 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 32.40 వద్ద ముగిసింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 87 శాతం పతనమై రూ. 38 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 312 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,768 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 1,567 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,813 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ షేరు బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 36.5 వద్ద ముగిసింది. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ3 గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. రుణ నాణ్యత అప్: క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది. . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్‌చేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
విప్రో లాభం రూ. 3,053 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. డీల్స్ రికార్డ్.. ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్ సర్వీసులు, ఇంజనీరింగ్ సర్వీసులు ఆర్డర్బుక్కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ►క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది. ► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి. ► ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది. ► ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం -
హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 భళా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,096 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,442 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పుంజుకుని రూ. 26,700 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 22,331 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు రికార్డ్ డేట్ ఈ నెల 20. డీల్స్ ప్లస్ క్యూ3లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికరంగా 2,945 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,22,270కు చేరింది. ఈ కాలంలో 17 భారీ డీల్స్‌ను పొందింది. కొత్త డీల్స్ విలువ గత క్యూ3తో పోలిస్తే 10% అధికంగా 234.7 కోట్ల డాలర్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. క్యూ2తో పోలిస్తే ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 23.8% నుంచి 21.7 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు 1.7 శాతం బలపడి రూ. 1,073 వద్ద ముగిసింది. -
అంచనాలు మించిన ఇన్ఫోసిస్: లాభాలు, ఆదాయం జంప్
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ3లో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో లాభాలను సాధించింది. ఈ క్వార్టర్లో ఏకీకృత నికర లాభం 13.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది.గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.లాభం గత త్రైమాసికంలో రూ. 6,021 కోట్లతో పోలిస్తే 9 శాతం పెరిగింది అలాగే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.31,867 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 20.2 శాతం పెరిగి రూ.38,318 కోట్లగా నమోదైంది. ఇన్ఫోసిస్ తన 2023 ఆర్థిక సంవత్సర ఆదాయ మార్గదర్శకాన్ని(రెవెన్యూ గైడెన్స్) 16.0-16.5 శాతానికి పెంచింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22శాతంగా ఆదాయ ఫలితాల సందర్భంగా ఇన్పీ గురువారం ప్రకటించింది. -
టీసీఎస్ క్యూ3 భేష్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 10,846 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,769 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 58,229 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 48,885 కోట్ల టర్నోవర్ నమోదైంది. కార్యకలాపాల్లో వృద్ధి, ఫారెక్స్ లాభాలు తాజా త్రైమాసికంలో కంపెనీ లాభదాయకతకు సహకరించాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనిలో రూ. 67 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. వెరసి డివిడెండ్ రూపేణా రూ. 33,000 కోట్లను పంచనుంది. డాలర్ల రూపేణా ఆదాయం 8 శాతం మెరుగుపడినట్లు టీసీఎస్ పేర్కొంది. భారీగా ఉద్యోగాలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో అత్యంత భారీగా ఉద్యోగ సృష్టికి తెరతీయనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. డీల్ పరిస్థితులు, పైప్‌లైన్ ఆశావహంగా ఉన్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం పేర్కొన్నారు. 7 నుంచి 9 బిలియన్ డాలర్ల మధ్య డీల్స్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. వీటికి మధ్యస్థంగా కాంట్రాక్టులు పొందినట్లు వెల్లడించారు. థర్డ్‌పార్టీ, ఇతర వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్లు ప్రభావితమైనట్లు సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. గతేడాది స్థాయిలోనే 25 శాతం ఇబిటా మార్జిన్లు సాధించగలమని తెలియజేశారు. తగ్గిన సిబ్బంది... చాలా ఏళ్ల తదుపరి క్యూ3లో టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి 6,13,974కు పరిమితమైంది. ఉపాధి కల్పనకు మించి ఉద్యోగ వలస దీనికి కారణమైనట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలియజేశారు. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 42,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోగా.. క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరికొంతమందికి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది(2023–24)లోనూ 40,000 మంది కొత్తవారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి ఏడాదిలో 1.25–1.5 లక్షల మందిని ఎంపిక చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 24.5 శాతాన్ని తాకాయి. ► క్యూ3లో 7.9 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► ఉద్యోగుల వలస(అట్రిషన్) స్వల్పంగా తగ్గి 21.3 శాతానికి చేరింది. ► కొత్త ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటన. మార్కెట్లు ముగిశాక టీసీఎస్ సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. క్యూ3 పనితీరుపై అంచనాలతో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం ఎగసి రూ. 3,320 వద్ద ముగిసింది. చదవండి: ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
ఫలితాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం ప్రధానంగా ఐటీ దిగ్గజాల క్యూ3(అక్టోబర్– డిసెంబర్) ఫలితాలు ఈక్విటీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆర్థిక గణాంకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల సీజన్ ఈ నెల 9నుంచి ప్రారంభంకానుంది. గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం నికర అమ్మకందారులుగా నిలిచిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో విదేశీ పెట్టుడి పరిస్థితులు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలియజేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం నేడు(సోమవారం) సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది క్యూ3 ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 12న, విప్రో 13న క్యూ3 పనితీరును ప్రకటించనున్నాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ 14న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 12న నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు సైతం ప్రకటించనుంది. వెరసి ఈ వారం పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఈ వారం యూఎస్, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం ఈ నెల 12నే విడుదలకానున్నాయి. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. గత వారం విడుదలైన మినిట్స్ ప్రకారం యూఎస్ ఫెడ్ 2023లోనూ వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గు చూపనున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కొంతమేర బలహీనపడ్డాయి. దేశీయంగా సెన్సెక్స్ 940 పాయింట్లు(1.55 శాతం), నిఫ్టీ 246 పాయింట్లు(1.4 శాతం) చొప్పున క్షీణించాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి సైతం 82–83 మధ్య కదులుతోంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐల వెనకడుగు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త కేలండర్ ఏడాది(2023) తొలి వారంలో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–6 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,872 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పలు దేశాలలో మరోసారి కోవిడ్–19 సమస్య తలెత్తడం, ఫెడ్ వడ్డీ పెంపు, రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడనున్న అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇకపై క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నిజానికి గత 11 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,300 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే డిసెంబర్ నెలలో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. నవంబర్‌లో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ జత చేసుకోవడం గమనార్హం! పూర్తి ఏడాది(2022)లో మాత్రం దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు పలు ప్రపంచవ్యాప్త ప్రతికూలతల నడుమ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
డీమార్ట్ ఆదాయం అప్
న్యూఢిల్లీ: డీమార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ ఆదాయం 25 శాతం ఎగసి దాదాపు రూ. 11,305 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో నమోదైన టర్నోవర్ రూ. 9,065 కోట్లు మాత్రమే. 2022 డిసెంబర్31కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 306ను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పలు రాష్ట్రాలలో డీమార్ట్ బ్రాండుతో స్టోర్లను నిర్వహిస్తోంది. ఎన్ఎస్ఈలో డీమార్ట్ షేరు 3.2 శాతం నష్టంతో రూ. 3,931 వద్ద ముగిసింది. -
ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం ముప్పు..మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు భారీ షాక్!
ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు అంతర్జాతీయ టెక్ సంస్థలకు భారీ షాకిచ్చాయి. ప్రపంచం మాంద్యంలోకి జారుతున్న వేళ..వడ్డీ రేట్ల పెంపుతో అదుపు చేసేందుకు అమెరికా చేసిన ప్రయత్నాల కారణంగా ఆ రెండు సంస్థల పనితీరు మందగించింది. దీంతో రానున్న రోజుల్లో టెక్ దిగ్గజాలు ఉద్యోగుల నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవల విడుదల చేసిన కూ3 ఫలితాల్లో గూగుల్, యూట్యూబ్ సేల్స్ మూడు నెలల కాలానికి సెప్టెంబర్ వరకు 6శాతం మాత్రమే పెరిగాయి. సంస్థలు అడ్వటైజింగ్ మీద చేసే 69 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించాయని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. వెరసి గూగుల్ దశాబ్ద కాలంలో కోవిడ్ ప్రారంభం నుంచి ఈ ఏడాది క్యూ3 (జులై, ఆగస్ట్, సెప్టెంబర్ )లో నిరాశజనకమైన ఫలితాల్ని సాధించింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర టెక్నాలజీ ప్రొడక్ట్‌లకు డిమాండ్ తగ్గిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీంతో సంస్థ అమ్మకాలు 50 బిలియన్ డాలర్లను నమోదు చేయగా..ఈ ఐదేళ్లలో సంస్థ వృద్ధిరేటు భారీగా పడిపోయింది. నియామకాల్ని తగ్గిస్తాం వార్షిక ఫలితాల విడుదల అనంతరం గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ.. గతంతో పోల్చితే క్యూ4 లో ఉద్యోగుల నియామకాలు సగానికి కంటే తక్కువగా ఉంటాయని తెలిపారు. -
ప్చ్.. తప్పడం లేదు, 4వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ దిగ్గజం
ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఫిలిప్స్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. క్యూ3 ఫలితాల విడుదల సందర్భంగా..‘ప్రొడక్టివిటీ, యాక్టివిటీని పెంచండి’ అంటూ సంస్థకు చెందిన 4వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. క్యూ3 ఫలితాల వెలువరించిన అనంతరం.. ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకోబ్స్ మాట్లాడుతూ.. ఉద్యోగులపై వేటు కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదు. వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.సంస్థ విక్రయాల విలువ 4.3 బిలియన్ యూరోస్ ఉండగా..అందులో 5శాతం తగ్గినట్లు పేర్కొంది. సప్లయి చైన్ల ప్రభావం కంపెనీ సేల్స్‌పై పడిందని ఫిలిఫ్స్ సంస్థ పేర్కొంది. ఫిలిప్స్ లాభాల బాట పడుతూ.. సంస్థ వాటాదారుల విలువను సృష్టించేలా సంస్థ ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. త్రైమాసికంలో ఫిలిప్స్ పనితీరు కార్యాచరణ, సప్లై చైన్ , ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సంస్థ పనితీరుపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు. చదవండి👉టెక్ కంపెనీల్లో..మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. -
ఎల్ఐసీ ప్రాస్పెక్టస్‌లో క్యూ3 ఫలితాలు అప్డేట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజా క్యూ3 ఫలితాలతో అప్డేట్ చేసింది. సదరు పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నిబంధనల ప్రకారం డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో అప్డేట్ చేసిన ప్రాస్పెక్టస్‌ను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ. 235 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో నమోదైన రూ. 7.08 కోట్లతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో లాభం రూ. 1,672 కోట్లకు పెరిగింది. ప్రతిపాదిత ఐపీవో కింద 5 శాతం వాటాల (31.6 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా సుమారు రూ. 60,000 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 78,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మిగతా మొత్తాన్ని ఎల్ఐసీ ఐపీవో ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం మార్చిలోనే పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేసుకున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెబీకి కొత్తగా మరోసారి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకున్న అనుమతులతో పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ప్రభుత్వానికి మే 12 వరకూ గడువు ఉంది. అతి పెద్ద ఐపీవో..: అంతా సజావుగా జరిగితే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే ఎల్ఐసీ మార్కెట్ విలువ.. రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలను కూడా మించిపోనుంది. ఇప్పటిదాకా అత్యంత భారీ ఐపీవో రికార్డు.. పేటీఎం పేరిట ఉంది. 2021లో పేటీఎం రూ. 18,300 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి. -
అమ్మకాలకే అవకాశం.. మార్కెట్‌పై ఉక్రెయిన్–రష్యా అనిశ్చితి
ముంబై: ఉక్రెయిన్–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్ మార్కెట్‌పై ట్రేడింగ్ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు.. ► ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. ► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, జజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ కావచ్చు. ► బుధవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్ రిజర్వ్ వైఖరి వెల్లడించనున్నారు. ► తయారీ, సేవల రంగ గణాంకాలు ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు. ► వరుసగా ఐదోనెల అమ్మకాలే... దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే... మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది. -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం ఆరు రెట్లుకపైగా(597 శాతం) దూసుకెళ్లి రూ. 8,764 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,258 కోట్లు ఆర్జించింది. ఇంధన ఉత్పత్తి తగ్గినప్పటికీ భారీగా బలపడిన చమురు, గ్యాస్ ధరలు అధిక లాభాలకు దోహదం చేశాయి. ముడిచమురు విక్రయాలలో ఒక్కో బ్యారల్‌కు 75.73 డాలర్ల ధర లభించగా.. గత క్యూ3లో 43.2 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఇక గ్యాస్ ధరలు సైతం ఒక్కో ఎంబీటీయూకి 2.9 డాలర్లు చొప్పున ఆర్జించింది. గత క్యూ3లో 1.79 డాలర్లు మాత్రమే లభించింది. కాగా.. కంపెనీ బోర్డు వాటా దారులకు షేరుకి రూ. 1.75 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్‌లో షేరుకి రూ. 5.5 చొప్పున తొలి డివిడెండును చెల్లించింది. తగ్గిన ఉత్పత్తి ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 67 శాతం జంప్‌చేసి రూ. 28,474 కోట్లను తాకింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 5.45 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4.2 శాతం నీరసించి 4.5 బిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ప్రధానంగా తౌకటే తుఫాన్, కోవిడ్–19 ప్రభావాలతో చమురు ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు.. -
ఆకట్టుకోని అరబిందో ఫార్మా
న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) పనితీరు పరంగా ఆకట్టుకోలేకపోయింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణించి రూ.604 కోట్లకు పరిమితమైంది. రవాణా, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం కంపెనీ లాభాలపై ప్రభావం చూపించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.777 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఒక శాతం పెరిగి రూ.6,002 కోట్లుగా నమోదైంది. ‘‘అధిక ముడి సరుకుల ధరలు, రవాణా వ్యయాలు డిసెంబర్ త్రైమాసికంలో లాభాలపై ప్రభావం చూపించాయి. కానీ స్థిరమైన ఆదాయంతో మా వ్యాపారం బలంగా పటిష్టంగానే ఉంది. కీలక ఉత్పత్తులకు ఏపీఐ డిమాండ్ బలంగా ఉండడం అనుకూలించింది’’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానందరెడ్డి తెలిపారు. తమ తయారీ యూనిట్లకు సంబంధించి నెలకొన్న నియంత్రణపరమైన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అలాగే, కాంప్లెక్స్ జనరిక్ ఉత్పత్తుల అభివృద్ధి ప్రణాళికల్లో స్థిరమైన పురోగతి ఉన్నట్టు తెలిపారు. రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుకు మూడో మధ్యంతర డివిడెండ్‌గా రూ.1.50 చొప్పున (150%) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. -
సత్తా చూపిన టాటా పవర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 552 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 318 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి వరుసగా 9వ క్వార్టర్లోనూ కంపెనీ నికర లాభాల్లో వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 42 శాతం ఎగసి రూ. 11,015 కోట్లకు చేరింది. ఇందుకు ఒడిశా డిస్కమ్‌ల విస్తరణ, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్(టీపీఎస్ఎస్ఎల్) పూర్తిచేసిన అధిక ప్రాజెక్టులు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. సోలార్ సెల్ తయారీ అనుబంధ సంస్థ టీపీఎస్ఎస్ఎల్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. ఇందుకు రూ. 3,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, పంపిణీ, రూఫ్‌టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ తదితర వృద్ధికి వీలున్న కీలక విభాగాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కంపెనీ తాజాగా 289 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. దేశవ్యాప్తంగా 1200కుపైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జేవీలు, అనుబంధ సంస్థలతో కలిపి కంపెనీ మొత్తం 13,171 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 1,085 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 727 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,103 కోట్ల నుంచి రూ. 19,454 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.49 శాతం నుంచి 11.62 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే నికర ఎన్పీఏలు 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 5,210 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 2,549 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 1 శాతం నీరసించి రూ. 48 వద్ద ముగిసింది. -
అయ్యో అనిల్ అంబానీ! నీకే ఎందుకిలా ?
న్యూఢిల్లీ: వ్యాపారం దిగ్గజం ధీరుబాయి అంబానీ రెండో కుమారుడు అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనిల్ ఆధీనంలోని కంపెనీలు వరుసగా నష్టాలు ఎదుర్కొంటూ దివాలా దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రకటించిన క్యూ 3 ఫలితాల్లోనూ ఎటువంటి మార్పు కనిపించలేదు. క్యూ 3 ఫలితాలు దివాలా చట్ట చర్యలకు లోనైన రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మరోసారి నికర నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,759 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,966 కోట్ల నష్టాలు నమోదుకాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ రూ. 1,156 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,890 కోట్ల నుంచి రూ. 4,083 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 5,658 కోట్లను తాకాయి. 2021 నవంబర్‌లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. సలహా కమిటీ కంపెనీ పాలనాధికారిగా వై.నాగేశ్వరరావును నియమించడంతోపాటు బాధ్యతల నిర్వహణలో మద్దతిచ్చేందుకు ముగ్గురు సభ్యులతో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. రుణదాతలు, డిబెంచర్ హోల్డర్లకు చెల్లింపుల విషయంలో కంపెనీ విఫలంకావడంతో దివాలా చర్యలవైపు ప్రయాణించింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 15.90 వద్ద ముగిసింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం? -
క్యూ3 ఫలితాల్లో టాటా స్టీల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 9,598 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,011 కోట్లతో పోలిస్తే ఇది 139 శాతం వృద్ధి. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 45 శాతం జంప్ చేసి రూ.60,843 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో కేవలం రూ. 42,153 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 36,495 కోట్ల నుంచి రూ. 48,666 కోట్లకు పెరిగాయి. క్యాష్‌ఫ్లో తీరిలా: తాజా సమీక్షా కాలంలో రూ. 2,045 కోట్లమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగినప్పటికీ టాటా స్టీల్ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 6,338 కోట్లకు చేరింది. కోవిడ్–19 మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దీంతో స్టీల్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.7 శాతం బలపడి రూ. 1,174 వద్ద ముగిసింది. -
ఇండిగో టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 620 కోట్ల నష్టం ప్రకటించింది. ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల ఈ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 4,910 కోట్ల నుంచి రూ. 9,295 కోట్లకు జంప్‌చేసింది. ప్యాసిజింజర్ టికెట్ల విక్రయాల ద్వారా 98 శాతం అధికంగా రూ. 8,073 కోట్ల ఆదాయం లభించినట్లు ఇండిగో వెల్లడించింది. కాగా.. వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియాను ఎండీగా నియమిస్తున్నట్లు ఇండిగో బోర్డు తాజాగా తెలియజేసింది. ఎండీగా భాటియా కంపెనీ అన్ని విభాగాలకూ సారథ్యం వహించనున్నట్లు ఇండిగో చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ టీమ్‌ను ముందుండి నడిపించనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 1,971 వద్ద ముగిసింది. -
తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి..
ముంబై: ఆభరణాల విక్రేత కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 16 శాతంపైగా బలపడి దాదాపు రూ. 135 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 3,435 కోట్లను అధిగమించింది. షోరూముల రీలొకేషన్, సిబ్బందికి బోనస్ నేపథ్యంలో రూ. 8 కోట్లమేర ఒకేసారి వ్యయాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మధ్యప్రాచ్యం నుంచి ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 515 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. కోవిడ్–19 తదుపరి అత్యధిక శాతం షోరూముల్లో అమ్మకాలు కరోనా మహమ్మారి ముందుస్థాయికి మించి నమోదైనట్లు వెల్లడించింది. ఈకామర్స్ విభాగం క్యాండీర్ విక్రయాలు 40 శాతం ఎగసి రూ. 47 కోట్లను తాకాయి. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా 21 రాష్ట్రాలు, మధ్యప్రాచ్యంలోని నాలుగు దేశాలతో కలిపి మొత్తం 151 స్టోర్లు నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 68 వద్ద ముగిసింది. -
జీ టీవీకి ఝలక్ !
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రూ. 99 కోట్లు తగ్గి రూ. 299 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 398 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,130 కోట్లకు క్షీణించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం వ్యయాలు రూ. 1,701 కోట్లకు చేరాయి. క్యూ3 టర్నోవర్‌లో ప్రకటనల నుంచి రూ. 1,261 కోట్లు, సబ్స్క్రిప్షన్ ఆదాయం రూ. 790 కోట్లు, ఇతర సర్వీసులు, అమ్మకాల నుంచి రూ. 62 కోట్లు చొప్పున లభించాయి. గత క్యూ3లో ఇతర సర్వీసుల పద్దుకింద భారీగా రూ. 842 కోట్ల ఆదాయం నమోదుకావడం గమనార్హం! ఈ కాలంలో సోనీ పిక్చర్స్ అనుబంధ సంస్థతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. -
గుడ్‌న్యూస్! టెక్ మహీంద్రాలో ఈ ఏడాది 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం బలపడి రూ. 1,378 కోట్లను అధిగమించింది. సరఫరా సవాళ్ల కారణంగా లాభాలు పరిమితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 11,450 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 15.9 శాతం నుంచి 14.8 శాతానికి నీరసించాయి. క్యూ3లో ఆదాయాలు మెరుగుపడినప్పటికీ సరఫరా సమస్యలు లాభదాయకతకు అడ్డుపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలియజేశారు. ప్రధానంగా కొత్త ఉద్యోగాలు, వేతన పెంపు, ప్రయాణ ఆంక్షల నడుమ సబ్‌కాంట్రాక్టులు వంటి అంశాలు దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. 10,000 మందికి చాన్స్ అంచనాలకు అనుగుణంగా క్యూ3లో 15 శాతం స్థాయిలో మార్జిన్లను సాధించినట్లు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ప్రస్తావించారు. గతంతో పోలిస్తే ఈ కాలంలో మానవ వనరుల అంశంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదని తెలియజేశారు. తాజాగా చేర్చుకున్న 3,800 మంది ఉద్యోగులతో కలిపి సిబ్బంది సంఖ్య 1.45 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు చోటు కల్పించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో మరో 15,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. తాజా సమీక్షా కాలంలో ఉద్యోగ వలసల(ఎట్రిషన్) రేటు రెట్టింపై 24 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. చదవండి:హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
టాటా మోటార్స్ ఢమాల్! కారణం ఇదే ?
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాలబాట పట్టింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,941 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రధానంగా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 75,654 కోట్ల నుంచి రూ. 72,229 కోట్లకు క్షీణించింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన టర్న్అరౌండ్ పనితీరు చూపింది. రూ. 176 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ. 638 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 9,636 కోట్ల నుంచి రూ. 12,353 కోట్లకు ఎగసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన అమ్మకాలు 30 శాతం పెరిగి 2,00,212 యూనిట్లకు చేరాయి. సరఫరా సమస్యలున్నపటికీ వాణిజ్య, ప్యాసింజర్ వాహన విక్రయాలు పుంజుకున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. రేంజ్ రోవర్ భళా.. తాజా క్వార్టర్లో జేఎల్ఆర్ 9 మిలియన్ పౌండ్ల పన్నుకు ముందు నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతానికిపైగా నీరసించి 4.7 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. చిప్‌ల కొరత నేపథ్యంలో వాహనాల రిటైల్ అమ్మకాలు 38 శాతం క్షీణించి 80,126 యూనిట్లకు చేరాయి. సెమీకండక్టర్ సరఫరాలతో అమ్మకాలు తగ్గినప్పటికీ తమ ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్నట్లు జేఎల్ఆర్ సీఈవో థియరీ బొలోర్ పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కొత్త రేంజ్ రోవర్ వాహనాల గ్లోబల్ ఆర్డర్‌బుక్ 30,000 యూనిట్లను తాకినట్లు వెల్లడించారు. ఇది సరికొత్త రికార్డుకాగా.. 2022లోనూ చిప్‌ల కొరత సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 10,000 ఈవీ అమ్మకాలు సాధించినట్లు గిరీష్ వెల్లడించారు. -
Dr Reddys Labs: అదిరిపోయే లాభాలు.. ఏడాదిలో ఎంత మార్పు!
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. గతేడాది ఇదే కాలానికి సంబంధించిన ఫలితాలతో పోల్చితే ఏకంగా 25 రెట్లు లాభాలను ఆర్జించి రికార్డు సృష్టించింది. పన్నెండు నెలల వ్యవధిలోనే ఫలితాల్లో అబ్బురపరిచే మార్పు కనబరిచింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 2022 జనవరి 28న ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.707 కోట్ల లాభం ఆర్జించినట్టుగా వెల్లడించింది. మూడో త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ రూ.5,319 కోట్లుగా నమోదు అయ్యింది. గతేడాది క్యూ 3లో రూ. 4,929 కోట్ల రెవెన్యూపై కేవలం రూ.27.90 కోట్ల లాభాలకే పరిమితమైంది. -
మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! ఆ రెండూ తీవ్రంగా దెబ్బతీశాయి..!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికనలో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 1,042 కోట్లకు పరిమితమైంది. ఇందుకు అమ్మకాలు నీరసించడం, సెమీకండక్టర్ల కొరత, కమోడిటీల ధరలు పెరగడం ప్రభావం చూపాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,997 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా రూ. 218 కోట్లు తగ్గి రూ. 23,253 కోట్లకు చేరింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతం నీరసించి 4,30,668 యూనిట్లను తాకాయి. గత క్యూ3లో 4,95,897 వాహనాలు విక్రయించింది. దేశీయంగా ఈ క్యూ3లో 3,65,673 వాహనాలను మారుతీ సుజుకీ విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 4,67,369 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 64,995 వాహనాలను ఎగుమతి చేసింది. గత క్యూ3లో ఈ సంఖ్య 28,528 యూనిటు. కాగా.. 2021 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ నికర లాభం రూ. 3,148 కోట్ల నుంచి రూ. 2,004 కోట్లకు జారింది. ఆదాయం మాత్రం రూ. 46,338 కోట్ల నుంచి రూ. 61,581 కోట్లకు జంప్‌చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 7% జంప్‌చేసి రూ. 8,601 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 8,662 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చదవండి: ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం! ఎస్యూవీ కేటగిరీల్లో క్రెటా ఏకంగా.. -
రిలయన్స్ అదుర్స్ ! లాభాల్లో సరికొత్త రికార్డు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రికార్డు నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 42 శాతం జంప్‌చేసి రూ. 18,549 కోట్లను తాకింది. ఇందుకు చమురు సహా రిటైల్, టెలికం విభాగాలు జోరు చూపడం సహకరించింది. అంతేకాకుండా యూఎస్ షేల్ గ్యాస్ ఆస్తుల విక్రయంతో లభించిన రూ. 2,872 కోట్ల వన్‌టైమ్ లాభం జత కలసింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 13,101 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం పురోగమించి రూ. 2,09,823 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,37,829 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ), రిటైల్, జియో, న్యూఎనర్జీ బిజినెస్‌లను నిర్వహిస్తోంది. రిటైల్ దూకుడు ఈ ఏడాది క్యూ3లో రిలయన్స్ రిటైల్ రూ. 3,822 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 2,259 కోట్లకు చేరింది. టర్నోవర్ 53 శాతం ఎగసి రూ. 57,714 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,845 కోట్ల ఆదాయం నమోదైంది. 837 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 2021 డిసెంబర్‌కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 14,412కు చేరింది. 2.3 మిలియన్ చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ సామర్థ్యాన్ని సైతం అందుకుంది. ఇతర హైలైట్స్ - 2021 డిసెంబర్‌కల్లా నగదు నిల్వలు రూ. 2,41,846 కోట్లను తాకాయి. మొత్తం రుణ భారం రూ. 2,44,708 కోట్లకు చేరింది. - కేజీ డీ6 బ్లాకులోని ఎంజే క్షేత్రం నుంచి 2022–23 మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఉత్పత్తి ప్రారంభంకాగలదని అంచనా వేస్తోంది. - మార్కెట్లు ముగిశాక ఆర్ఐఎల్ ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు యథాతథంగా రూ. 2,478 వద్ద ముగిసింది. జియో స్పీడ్... తాజా సమీక్షా కాలంలో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 3,795 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 3,486 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 24,176 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 22,858 కోట్ల టర్నోవర్ సాధించింది. క్యూ3లో 1.02 కోట్లమంది సబ్స్క్రయిబర్లు జత కలిశారు. 2021 డిసెంబర్‌కల్లా వీరి సంఖ్య 42.1 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 151.6గా నమోదైంది. డేటా ట్రాఫిక్ 48 శాతం పెరిగి 23.4 బిలియన్ జీబీలకు చేరింది. పటిష్ట వృద్ధి – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక వినియోగ విభాగాల్లో పటిష్ట వృద్ధి నేపథ్యంలో రిటైల్ బిజినెస్ సాధారణ స్థితికి చేరుకుంది. ఇందుకు పండుగల సీజన్, దేశవ్యాప్తంగా ఆంక్షలు తొలగడం దోహదపడ్డాయి. డిజిటల్ సర్వీసుల బిజినెస్ అన్ని విభాగాల్లోనూ నిలకడైన, లాభదాయక వృద్ధిని సాధిస్తోంది. డిజిటల్, న్యూకా మర్స్ విభాగాల అండతో రిలయన్స్ రిటైల్ రికార్డ్ ఆదాయాన్ని సాధించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, దుస్తుల బిజినెస్ రెట్టింపుకాగా.. గ్రోసరీ విభాగం రెండంకెల వృద్ధిని అందుకుంది. చదవండి: గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ భారీ ఒప్పందం..! -
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్..!
ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 డిసెంబర్, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం(క్యూ3 ఎఫ్ వై22) ఫలితాలను విడుదల చేసింది. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ₹18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది క్రితం 3వ త్రైమాసికంలో పొందిన లాభం కంటే (₹13,101 కోట్ల) 41 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన చమురు-రిటైల్-టెలికామ్ ఆదాయం ₹1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 54% పెరిగి ₹1.91 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాల విడుదల ముందు శుక్రవారం రిలయన్స్ ఎన్ఎస్ఈలో ₹2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్ గత ఏడాది కాలంలో 18.26% పెరిగింది. రిలయెన్స్ జియో అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త కస్టమర్లను పొందింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు. "మా రిలయన్స్ అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్ వై22లో సంస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది అని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ & డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలు నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, మేము భవిష్యత్తు వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు & భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. (చదవండి: యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!) -
సారేగామా... డివిడెండ్ రూ. 30
మ్యూజిక్ లేబుల్ కంపెనీ సారేగామా ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 38 శాతం ఎగసి దాదాపు రూ. 44 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 150 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. క్యూ3లో మొత్తం వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 100 కోట్లను దాటాయి. మ్యూజిక్ విభాగం ఆదాయం రూ. 133 కోట్లుకాగా.. ఫిల్మ్‌లు, టీవీ సీరియల్స్ నుంచి దాదాపు రూ. 16 కోట్లు లభించింది. ఈ కాలంలో కరణ్ జోహార్ రాఖీ రాణీకి ప్రేమ్ కహానీ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకుంది. విభిన్న భాషలలో 165 సినిమా పాటలను విడుదల చేసింది. షార్ట్ వీడియో యాప్ చింగారీతో గ్లోబల్ మ్యూజిక్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెస్లే, అమెజాన్, ఫోన్‌పే తదితర దిగ్గజాలు తమ బ్రాండ్ ప్రకటనలకు కంపెనీ పాటలను వినియోగించుకుంటున్నట్లు సారేగామా తాజాగా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సారేగామా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 5,267 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం పెరిగి రూ. 10,342 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ3లో కే. 8,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,523 కోట్ల నుంచి రూ. 40,652 కోట్లకు బలపడింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 8,184 కోట్లను తాకింది. ఇక నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగసి రూ. 18,443 కోట్లను దాటింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 10,591 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 39,839 కోట్ల నుంచి రూ. 43,365 కోట్లకు పురోగమించింది. డిపాజిట్లు జూమ్ క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 0.09 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,414 కోట్ల నుంచి రూ. 2,994 కోట్లకు తగ్గాయి. డిపాజిట్లు దాదాపు 14 శాతం ఎగసి రూ. 14,45,918 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 16.5 శాతం వృద్ధితో 12,60,863 కోట్లను తాకాయి. గత 12 నెలల్లో 294 బ్రాంచీలతోపాటు 16,852 మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు 15 శాతం అధికమై 9,851 కోట్లకు చేరాయి. -
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
ఇన్ఫోసిస్ భేష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11.8 శాతం పుంజుకుని రూ. 5,809 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,197 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 23 శాతం ఎగసి రూ. 31,867 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 25,927 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. భారీ డీల్స్‌ను గెలుచుకోవడం ద్వారా క్యూ3లో మొత్తం కాంట్రాక్టు విలువ(టీసీవీ) 2.53 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. 20 శాతం వరకూ మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 19.5–20 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. వెరసి ఇంతక్రితం అక్టోబర్‌లో ఇచ్చిన 16.5–17.5 శాతం అంచనాలను ఎగువముఖంగా సవరించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే సంగతి తెలిసిందే. సరఫరా సవాళ్ల నేపథ్యంలో వ్యయాలు పెరిగినప్పటికీ మరోసారి మెరుగైన మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. నైపుణ్యాలను సొంతం చేసుకోవడం, అభివృద్ధిలపై పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియజేశారు. వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచస్థాయిలో నియమించుకుంటున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య ఈ ఏడాది 55,000కుపైగా చేరనున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు 1.2% బలపడి రూ. 1,878 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. క్లయింట్లకున్న విశ్వాసం పటిష్ట పనితీరుతోపాటు, మార్కెట్ వాటాను పెంచుకోవడం వంటి అంశాలు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కంపెనీ సర్వీసులపట్ల క్లయింట్లకున్న విశ్వాసానికి ప్రతీకలు. నాలుగేళ్లుగా డిజిటల్, క్లౌడ్ సేవలలో నిలకడైన వ్యూహాలతో ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా క్లయింట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు నైపుణ్యాల పెంపు, లోతైన సంబంధాలతో క్లయింట్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఇది కంపెనీ గైడెన్స్ పెంపులో ప్రతిఫలిస్తోంది. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్స్‌పై భారీ కార్పొరేట్ల వ్యయాలు కొనసాగే వీలుంది. కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి తదుపరి దశలో మరోసారి ఆదాయపన్ను శాఖతో కలసి పనిచేస్తాం. మరిన్ని సౌకర్యాలు(మాడ్యూల్స్) సమకూర్చుతాం. డిసెంబర్‌కల్లా 5.89 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. డిసెంబర్ 31నే 46.11 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
బైబ్యాక్‌కు టీసీ‘ఎస్’
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ దేశీ దిగ్గజాల సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ కొనసాగుతోంది. కోవిడ్–19 ప్రభావంతో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. ఇది దేశీ ఐటీ దిగ్గజాలకు కలసి వస్తున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ ఫ్రెషర్స్ నియామకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సేవలు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం భారీ నిధులను కేటాయిస్తున్నాయి. దీంతో దేశీ కంపెనీలు భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. వెరసి ఈ ఏడాది క్యూ3లో ఐటీ దిగ్గజాలు మరోసారి ఆకర్షణీయ పనితీరును ప్రదర్శించాయి. టీసీఎస్ అయితే మరోసారి సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా రూ. 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతంపైగా ఎగసింది. రూ. 9,769 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,701 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం వృద్ధితో రూ. 48,885 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 42,015 కోట్ల టర్నోవర్ నమోదైంది. షేరుకి రూ. 4,500 షేరుకి రూ. 4,500 ధర మించకుండా 4 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టీసీఎస్ వెల్లడించింది. 1.08 శాతం ఈక్విటీకి ఇవి సమానంకాగా.. ఇందుకు రూ. 18,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత కేలండర్ ఏడాది(2021)లో కంపెనీ కీలకమైన 25 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అందుకున్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలియజేశారు. నైపుణ్యాలపై వెచ్చిస్తున్న పెట్టుబడులతో సరఫరాల సవాళ్లలోనూ పటిష్ట పురోగతిని సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా పేర్కొన్నారు. 2021–22 తొలి అర్ధభాగంలో తీసుకున్న 43,000 మంది ఫ్రెషర్స్ కాకుండా తాజా త్రైమాసికంలో 34,000 మందిని ఎంపిక చేసినట్లు సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్. ఇందుకు రికార్డ్ డేట్ ఫిబ్రవరి 7. ► క్యూ3లో నికరంగా 28,238 మందికి ఉపాధిని కల్పించింది. ► డిసెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కు చేరింది. ► ఉద్యోగ వలసల రేటు 15.3%గా నమోదైంది. ► డిసెంబర్‌కల్లా నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 59,920 కోట్లుగా నమోదు. ► కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 72.19%. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. షేరు 1.5% నీరసించి రూ. 3,857 వద్ద ముగిసింది. కస్టమర్ల బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ అవసరాలకు అనుగుణమైన సర్వీసులు అందించడంలో కంపెనీకున్న సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎండ్టుఎండ్ నైపుణ్యాలు, సవాళ్ల పరిష్కారంలో కంపెనీ చూపుతున్న చొరవ తదితర అంశాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితాలలో వృద్ధి కొనసాగడమే ఇందుకు నిదర్శనం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
విప్రో క్యూ3 ఫలితాలు: ఆదాయంలో భేష్..అక్కడ మాత్రం..!
ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో 2021 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2419.8 కోట్లను పొందింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ. 2649.7 కోట్లను గడించింది. ఈ క్యూ3లో నికరలాభాలు 8.67 శాతం తగ్గాయి. ఇక కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ3లో రూ.15,278 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 21.29 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ3లో ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 12, 596 కోట్లను నమోదు చేసింది. కాగా రెవెన్యూలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ రాబడిని విప్రో నివేదించింది. ఈ క్యూ3లో కంపెనీ 30 శాతం రాబడి వస్తోందని విశ్లేషకులు నివేదించారు. ► కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ. 20,313 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.3 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. ► ఐటీ సేవల విభాగంలో 2.3 శాతం వృద్ధితో 2,639.7 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని విప్రో సాధించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ... బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్ఈలో షేరు విలువ (0.40 శాతం నష్టపోయి రూ.691.85 వద్ద ముగిసింది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ
న్యూఢిల్లీ: సరఫరాపరమైన సవాళ్ల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ4) దేశీయంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలు తగ్గే అవకాశం ఉందని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 16 కోట్ల కన్నా తక్కువకే పరిమితం కావచ్చని పేర్కొంది. వరుస గా నాలుగు త్రైమాసికాలు వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు.. సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షి క ప్రాతిపదికన 12 శాతం క్షీణించి 4.8 కోట్ల యూనిట్లకు పరిమితమైనట్లు వివరించింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో (తొలి తొమ్మిది నెలలు) స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 12 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు ఐడీసీ తెలిపింది. సరఫరా పరమైన సవాళ్లతో నాలుగో త్రైమాసికంలో విక్రయాలు క్షీణించవచ్చని, వచ్చే ఏడాది ప్రథమార్ధం కూడా సమస్యాత్మకంగానే కొనసాగవచ్చని పే ర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో షావోమి 23.4 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్, వివో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్ కంపెనీల రిజల్ట్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై సామాన్యులకు ఆసక్తి పెరిగింది. రాబడుల కోసం షేర్ మార్కెట్‌వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా కంపెనీల పనితీరు తెలుసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. అందులో కొన్ని లిస్టింగ్ కంపెనీల పనితీరు వివరాలు ఇలా ఉన్నాయి. పిరమల్... వీక్ స్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం పిరమల్ ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 426 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 628 కోట్లు ఆర్జించింది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం ప్రధానంగా ఫలితాలను దెబ్బతీసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫార్మా విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు అక్టోబర్‌లో బోర్డు అనుమతించినట్లు కంపెనీ వివరించింది. ఫార్మా జోరు ఫార్మా విభాగం ఆదాయం రూ. 1,441 కోట్ల నుంచి రూ. 1,621 కోట్లకు ఎగసింది. ఫైనాన్షియల్ సర్వీసుల అమ్మకాలు మాత్రం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,484 కోట్లకు తగ్గాయి. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు లావాదేవీకి రూ. 143 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రూ. 153 కోట్లమేర అనుకోని వ్యయాలు నమోదైనట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 2,714 వద్ద ముగిసింది. గోద్రెజ్ కన్జూమర్... ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 479 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 458 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు మరింత వృద్ధితో 9 శాతం ఎగసి రూ. 3,144 కోట్లకు చేరాయి. అయితే మొత్తం వ్యయాలు సైతం 11 శాతం పెరిగి రూ. 2,579 కోట్లను తాకాయి. దేశీ బిజినెస్ 9 శాతంపైగా వృద్ధితో రూ. 1,838 కోట్లను అధిగమించగా.. ఇండొనేసియా మార్కెట్ నుంచి ఆదాయం యథాతథంగా రూ. 445 కోట్లుగా నమోదైంది. ఆఫ్రికా నుంచి అమ్మకాలు 15 శాతం జంప్‌చేసి రూ. 748 కోట్లను దాటాయి. ఇతర మార్కెట్ల నుంచి మాత్రం ఆదాయం 4 శాతం నీరసించి రూ. 174 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 953 వద్ద ముగిసింది. బజాజ్ హిందుస్తాన్... నష్టాలు తగ్గాయ్ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో షుగర్ తయారీ కంపెనీ బజాజ్ హిందుస్తాన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం 29 శాతం తగ్గి రూ. 113 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 160 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 1,344 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,570 కోట్ల ఆదాయం సాధిం చింది. ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్బీకి చెందిన రమణి రంజన్ మిశ్రాను నామినీ డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు బజాజ్ హిందుస్తాన్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ హిందుస్తాన్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 14.7 వద్ద ముగిసింది. ఐబీ హౌసింగ్ లాభం... డౌన్ ముంబై: మార్టిగేజ్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2) లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 286 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 323 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో ఇతర సంస్థలతో ఒప్పందాల నేపథ్యంలో రూ. 325 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని డిసెంబర్‌కల్లా రూ. 500 కోట్లకు, 2022 మార్చికల్లా రూ. 800 కోట్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రిటైల్ రుణాల విడుదలకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితరాలతో చేతులు కలిపినట్లు పేర్కొంది. క్యూ2లో స్థూల ఎన్పీఏలు 2.21 శాతం నుంచి 2.69 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 3.4% పతనమై రూ. 237 వద్ద ముగిసింది. ఆర్సెలర్ మిట్టల్... టర్న్ఎరౌంట్ గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఈ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో 462.1 కోట్ల డాలర్ల(రూ. 34,430 కోట్లు) నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020) ఇదే కాలంలో 26.1 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 13.3 బిలియన్ డాలర్ల నుంచి 20.2 బిలియన్ డాలర్లకు జంప్‌చేసింది. స్థూల రుణభారం బిలియన్ డాలర్లు తగ్గి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో షిప్‌మెంట్స్ 17.5 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 14.6 ఎంటీకి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా ఆటోమోటివ్ రంగం నుంచి బలహీనపడిన డిమాండ్, ఉత్పత్తి సమస్యలు, ఎగుమతులకు ఆర్డర్లు ఆలస్యంకావడం వంటి అంశాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. ధరలు బలపడటంతో క్యూ3లో పటిష్ట ఫలితాలు సాధించినట్లు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. దీంతో అత్యధిక లాభాలు ఆర్జించడమేకాకుండా 2008 తదుపరి కనిష్ట నికర రుణ భారాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు. మోర్పెన్ ల్యాబ్స్... జూమ్ హెల్త్‌కేర్ రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం వృద్ధితో రూ. 37 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 340 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు ఎగసింది. ఏపీఐలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, చైనా నుంచి సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటం వంటి అంశాల నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సుశీల్ సూరి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.25 శాతం ఎగసి రూ. 52.5 వద్ద ముగిసింది. జీవోసీఎల్‌కు రూ.23 కోట్ల నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవోసీఎల్ కార్పొరేషన్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.23 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 24 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవర్ రూ. 132 కోట్ల నుంచి రూ. 146 కోట్లకు చేరింది. ఆర్డర్ బుక్ రూ.946 కోట్లు ఉందని జీవోసీఎల్ కార్పొరేషన్ ప్రకటించింది. చదవండి: ఈ షేర్లు... తారాజువ్వలు! -
అమ్మకాల్లో దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..!
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2021 మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో వీటి వాటా 22 శాతంగా నమోదైంది. కన్సల్టెన్సీ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) రూపొందించిన ఇండియా మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ సమీక్ష నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మూడో త్రైమాసికంలో 20 పైగా 5జీ సామర్థ్యాలున్న స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీలు ఆవిష్కరించాయి. అందుబాటు ధర, లభ్యత తదితర అంశాలు 5జీ విక్రయాలకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, శాంసంగ్, వివో వంటి దిగ్గజ బ్రాండ్లు 5జీ స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యమిస్తుండటం, వినియోగదారులు కూడా భవిష్యత్ అవసరాల కోసం వీటి వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త తరం ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని సీఎంఆర్ అనలిస్ట్ శిప్రా సిన్హా తెలిపారు. ఈ అయిదు బ్రాండ్లు కలిసి 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే స్మార్ట్ఫోన్లను విక్రయించినట్లు వివరించారు. వివో టాప్.. 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో 18 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్రస్థానంలో ఉండగా, 16 శాతం వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. సరఫరాపరమైన సమస్యలు, విడిభాగాలు.. లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైన సవాళ్లు నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని సీఎంఆర్ తెలిపింది. ఏడాది మొత్తం మీద చూస్తే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 5–8 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు డిజిటల్‌కు మారే క్రమంలో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ కొనసాగుతుందని వివరించింది. మరిన్ని ముఖ్యాంశాలు .. సరఫరాపరమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో మూడో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 47 శాతం పెరిగాయి. సుమారు 5 కోట్ల పైగా అమ్ముడయ్యాయి. షావోమీ 23 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ (18 శాతం), వివో (15 శాతం), రియల్‌మి (15 శాతం), ఒప్పో (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వన్‌ప్లస్ విక్రయాలు 68 శాతం, యాపిల్ అమ్మకాలు 32 శాతం పెరిగాయి. సూపర్ ప్రీమియం (రూ. 50,000–1,00,000) సెగ్మెంట్లో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ట్రాన్సిషన్ గ్రూప్ బ్రాండ్ల (ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో) మొత్తం అమ్మకాలు 18 శాతం, స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 36 శాతం పెరిగాయి. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ విక్రయాలు 21 శాతం క్షీణించి 2.4 కోట్లకు పరిమితమయ్యాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇంత తక్కువ..! -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్‌లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్‌చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్‌పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది. -
బీహెచ్‌ఈఎల్‌షేరు ఢమాల్: ఎందుకంటే
సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్ తగిలింది. క్యు3లో ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్లో బీహెచ్ఈఎల్ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును మరింత దెబ్బ తీసింది. 2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో 218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన కంపెనీ, మార్కెట్ వర్గాలను భారీగా నిరాశపర్చింది. అలాగే ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభం, ఆర్డర్ల క్షీణత కూడా కంపెనీ లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్ కాల్ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత కొనసాగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది. -
ఎస్బీఐ మొండిబాకీలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) రూ. 5,196 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఆర్జించిన రూ. 5,583 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం క్షీణత. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం స్వల్ప వెనకడుగుతో రూ. 75,981 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 76,798 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన తాజా క్వార్టర్లో నికర లాభం 4 శాతం నీరసించి రూ. 6,258 కోట్లను తాకింది. గతంలో రూ. 4,500 కోట్లమేర లభించిన అదనపు ఆదాయం కారణంగా లాభాలు అధికమైనట్లు బ్యాంక్ ప్రస్తావించింది. వీటిలో ఎస్సార్ స్టీల్ రుణ పరిష్కారం ద్వారా రూ. 4,000 కోట్ల వడ్డీ లభించగా.. మరో రూ. 500 కోట్ల ఇతర ఆదాయం నమోదైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వివరించారు. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో ఎస్బీఐ ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడింది. క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.94 శాతం నుంచి 4.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 2.65 శాతం నుంచి 1.23 శాతానికి క్షీణించాయి. అయితే మొండి రుణాలకు ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 7,253 కోట్ల నుంచి రూ. 10,342 కోట్లకు పెరిగాయి. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 27,779 కోట్లకు చేరింది. ఇందుకు 7 శాతం రుణ వృద్ధి సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.12 శాతంగా నమోదయ్యాయి. రిటైల్ రుణాలు 15 శాతం జంప్‌చేయగా.. మొత్తం లోన్ బుక్‌లో వీటి వాటా 61 శాతానికి చేరాయి. వీటిలో వ్యక్తిగత రుణ వాటా 39 శాతంకాగా.. ఏడాది కాలంలో 45 శాతానికి పెరిగే వీలున్నట్లు ఖారా అంచనా వేశారు. డిసెంబర్‌కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతాన్ని తాకింది. ఇతర ఆదాయం రూ. 9106 కోట్ల నుంచి రూ. 9246 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మారటోరియంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీఎన్పీఏలుగా పరిగణించే స్లిప్పేజెస్ రూ. 16,461 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 6.6 శాతం జంప్‌చేసి రూ. 358 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 331 వద్ద కనిష్టానికీ చేరింది. షేరు ధర పుంజుకోవడంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 17,000 కోట్లకుపైగా బలపడింది. వెరసి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3.19 లక్షల కోట్లను అధిగమించింది. -
అమ్మకాల జోష్ : మారుతి లాభాలు భేష్
సాక్షి,ముంబై: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 24.1శాతం వృద్ధితో రూ.1941.4 కోట్లకు ఎగబాకింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.1565 కోట్లుగా నమోదైంది. కంపెనీ స్టాండలోన్ రెవిన్యూ 13.3శాతం వృద్ధితో రూ.20,706.8 కోట్ల నుంచి రూ.23,457.8 కోట్లకు పెరిగింది. కంపెనీ పన్నుల వ్యయం రూ.441.6 కోట్ల నుంచి రూ.508.4 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిట్టా 5.9శాతం వృద్ధితో రూ.2102 కోట్ల నుంచి రూ.2226 కోట్లకు చేరగా, ఎబిట్టా మార్జిన్ 10.1 శాతం నుంచి 9.5శాతానికి తగ్గింది. కరోనా సంక్షోభంలో భారీగా పడిపోయిన అమ్మకాలు తిరిగి పుంజుకోవడంతో డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో మారుతి నికరలాభం అంచనాలను అధిగమించింది. అమ్మకాలు 22,367 కోట్ల రూపాయలు పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.2శాతం ఎక్కువ.ఈ క్వార్టర్లో కంపెనీ మొత్తం 495,897 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.4శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 13.4 శాతం వృద్ధితో 4,95,897 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో దేశీయ మార్కెట్ వాటా 13శాతం వృద్ధితో 4,67,369 యూనిట్లుగా ఉంది. ఇక 20.6 శాతం వృధ్ధితో 28,528 వాహనాలకు కంపెనీ ఎగుమతి చేసింది. అయితే ఏప్రిల్- డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో మొత్తం 965,626 వాహనాలను విక్రయించింది, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.0శాతం తగ్గింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 905.015 యూనిట్లు, 17.8శాతం తగ్గాయి. ఎగుమతులు 60.611 యూనిట్ల వద్ద ఉన్నాయి, ఇది 21.9శాతం క్షీణత. మరోవైపు గురువారం నాటి బేర్ మార్కెట్లో మారుతి సుజుకి షేరునష్టాలను ఎదుర్కొంది. 3.44 శాతం నష్టంతో రూ.7600 వద్ద ముగిసింది. -
కొత్త ఏడాదిలో అతిపెద్ద పతనం
ముంబై: మార్కెట్లో విస్తృతస్థాయి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో శుక్రవారం సూచీలు ఈ ఏడాదిలో ఒకరోజు అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, క్యూ3 ఆర్థిక ఫలితాలకు ముందు అధిక వెయిటేజీ రియలన్స్ షేరు వెనకడుగువేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 746 పాయింట్లను కోల్పోయి 48,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 14372 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఆటో, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లను కోల్పోయాయి. అమెరికా నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పాటు బడ్జెట్ అంచనాలు రానున్న రోజుల్లో సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్వల్ప లాభాలతో మొదలై... భారీ నష్టాల్లోకి... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప లాభాలతో మొదలైంది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల్లో సూచీలు లాభాలను నిలుపుకోలేపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. దీనికి తోడు మార్కెట్‌కు వారంతాపు రోజు కావడంతో విక్రయాలు వెల్లువెత్తాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్లు కోల్పోయి 48,832 వద్ద, నిఫ్టీ 233 పాయింట్లు కోల్పోయి 14,357 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మరికొన్ని సంగతులు... ► మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు రిలయన్స్ షేరు 2.5 శాతం నష్టపోయింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రెండుశాతం నష్టంతో ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ బ్రోకర్ బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేట్స్ తనఖా పెట్టిన సెక్యూరిటీలను అమ్మడంతో సెబీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై రూ.కోటి జరిమానా విధించడం షేరు పతనానికి కారణమైంది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బంధన్ బ్యాంక్ షేరు రెండోరోజూ నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో ఈ బ్యాంకు షేరు 8 శాతం క్షీణించి రూ.314.2 వద్ద ముగిసింది. ► ఆస్తుల నాణ్యత పెరిగినట్లు క్వార్టర్ ఆర్థిక ఫలితాల్లో వెల్లడి కావడంతో ఎస్బీఐ కార్డ్స్ షేరు 5 శాతం లాభంతో ముగిసింది. ► ఇదే మూడో క్వార్టర్లో అదిరిపోయే ఆర్థిక ఫలితాలను వెల్లడించిన బజాజ్ షేరు 11 శాతం లాభపడి రూ.4,130 వద్ద స్థిరపడింది. ఇండిగో పెయింట్స్ ఐపీఓకు భారీ స్పందన 117 రెట్లు సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించిన ఇష్యూ ఇండిగో పెయింట్స్ ఐపీఓకు విశేష స్పందన లభించింది. చివరిరోజు నాటికి ఐపీఓ 117 రెట్ల సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 55.18 లక్షల షేర్లను ఆఫర్ చేయగా... 64.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐపీ విభాగంలో 189.57 రెట్లు, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 263.05 రెట్లు, రిటైల్ విభాగంలో 15.93 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇష్యూను పూర్తి చేసుకున్న షేర్లు ఫిబ్రవరి 2న ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంగళవారం కంపెనీ రూ.348 కోట్లను సమీకరించింది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రెండోరోజుకి 2.2 రెట్ల స్పందన మార్టిగేజ్ రుణాల సంస్థ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ రెండు రోజు ముగిసే సరికి 2.2 రెట్లు సబ్స్క్రిబ్షన్ సాధించింది. ఇష్యూ జనవరి 25న ముగియనుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదుర్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 8,760 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం నికర లాభం 18 శాతం పెరిగి రూ. 8,758 కోట్లను అధిగమించింది. ఇందుకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 16,317 కోట్లకు చేరింది. డిపాజిట్లు 19 శాతం పురోగమించగా.. కాసా డిపాజిట్లు 43 శాతం ఎగశాయి. తొలి బ్యాంకు ఈ ఏడాది క్యూ3 ఫలితాలు ప్రకటించిన తొలి ఫైనాన్షియల్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకాగా.. కొత్త సీఈవో, ఎండీ శశిధర్ జగదీశన్ అధ్యక్షతన తొలిసారి త్రైమాసిక పనితీరును వెల్లడించింది. బ్యాంకుకు 25 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించడం ద్వారా ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకులో నిలిపిన ఆదిత్య పురీ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం విదితమే. కాగా.. క్యూ3లో రుణ వృద్ధి 15.6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 11 శాతం బలపడి రూ. 7,443 కోట్లకు చేరింది. ఇందుకు పెట్టుబడుల విలువ 67 శాతం ఎగసి రూ. 1,109 కోట్లను తాకడం దోహదపడింది. రుణ నాణ్యత క్యూ3లో బ్యాంకు స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) 1.42 శాతం నుంచి 0.81 శాతానికి వెనకడుగు వేశాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా 1.08 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి. అయితే మారటోరియం సమయంలో నమోదైన రుణ ఒత్తిడులను మొండిబకాయిలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభావం చూపాయి. వీటిని పరిగణించినప్పటికీ జీఎన్‌పీఏలు 1.38 శాతంగా నమోదయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రిటైల్ వాటా.. కోవిడ్–19 నేపథ్యంలోనూ రికవరీ చాటుతూ ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,043 కోట్ల నుంచి రూ. 3,414 కోట్లకు మాత్రమే పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. వీటిలో టైర్–1 క్యాపిటల్ 17.1 శాతానికి చేరింది. రుణాలలో 48 శాతం రిటైల్ వాటాకాగా.. కార్పొరేట్ విభాగం 52 శాతం ఆక్రమిస్తోంది. కాగా.. కంపెనీ వారాంతాన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరుపై ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,467 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,472–1,445 మధ్య ఊగిసలాడింది. -
హెచ్‌సీఎల్ టెక్.. క్యూ3 కిక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 31 శాతం అధికంకాగా.. డిజిటల్, ప్రొడక్టుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్గాప్ ప్రమాణాల ప్రకారం మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లను తాకింది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం తొలుత వేసిన 1.5–2.5 శాతం అంచనాలను మించుతూ 3.5 శాతం బలపడింది. ఈ బాటలో క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఆదాయం 2–3 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. వెరసి గతంలో ఇచ్చిన 1.5–2.5 శాతం గైడెన్స్‌ను ఎగువముఖంగా సవరించింది. కొత్త ఏడాది హుషారుగా...: త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్లో పటిష్ట వృద్ధిని సాధించినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. డీల్ పైప్‌లైన్‌లో కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న త్రైమాసికాలలో మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు తెలియజేశారు. తద్వారా కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించారు. సొల్యూషన్లు, సర్వీసులపై దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ ప్రత్యేక తరహాలో వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి–డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు తెలియజేశారు. స్థిరకరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా 3.6 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఏడు బిజినెస్ విభాగాల్లో ఐదు సానుకూల వృద్ధిని సాధించినట్లు వివరించారు. ప్రధానంగా యూరోప్‌లో మీడియా, టెలికం విభాగాలు పటిష్ట ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. 20,000 మందికి చాన్స్ వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. క్యూ3లో 13 ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్‌ను కుదుర్చుకుంది. డిసెంబర్ క్వార్టర్లో నికరంగా 6,597 మందిని నియమించుకుంది. ఉద్యోగ వలస 10.2 శాతంగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తాజాగా 1,59,682కు చేరింది. మార్చి క్వార్టర్లో 5,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు వెల్లడించింది. రానున్న రెండు త్రైమాసికాలలో 20,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు విజయ్ కుమార్ తెలియజేశారు. ఐబీఎం డీల్‌ను పూర్తిచేసిన నేపథ్యంలో జూలై–డిసెంబర్ మధ్య కాలంలో 13.4 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌ను రూ. 12,252 కోట్లకు హెచ్‌సీఎల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. క్యూ3 ఫలితాలు, మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 4% పతనమై రూ. 989 వద్ద ముగిసింది. -
49000 పైకి సెన్సెక్స్
ముంబై: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు రాణించవచ్చనే ఆశలతో స్టాక్ మార్కెట్లో బుల్ జోష్ కొనసాగుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో తొలిసారి 49వేల స్థాయిపై 49,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 14,485 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ జనవరి 16వ తేదీ నుంచి కోవిడ్–19 టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండటం, కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో అమెరికా నుంచి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటుందనే సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 49,304 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 14,498 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మరోవైపు లాభాల మార్కెట్లోనూ మెటల్, బ్యాంకింగ్, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా కేసుల రికవరీ రేటు పెరగడంతో పాటు కోవిడ్ –19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ వారాంతంలో మొదలు కానుండటం మార్కెట్‌కు అనుకూలించిందని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో వేగవంతమైన రికవరీ సంకేతాల నేపథ్యంలో కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని అన్నారు. త్రైమాసిక విడుదల సందర్భంగా కంపెనీలు వృద్ధి సహాయక చర్యల నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సానుకూలాంశాలతో సూచీల రికార్డుల ర్యాలీ స్వల్పకాలం పాటు కొనసాగవచ్చని మోదీ వివరించారు. టీసీఎస్ షేరుకు క్యూ3 ఫలితాల జోష్... ఐటీ సేవల సంస్థ టీసీఎస్ షేరు సోమవారం బీఎస్ఈలో 2% లాభంతో రూ.3,175 వద్ధ ముగిసింది. క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో షేరు 3.32 శాతం ఎగసి రూ.3,224 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.09 లక్షల కోట్లను తాకింది. -
డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 16 శాతం మేర పెంచుకుంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగిందని శనివారం విడుదల చేసిన ఫలితాల్లో వె ల్లడించింది. ఏకీకృత లాభంలో సంవత్సరానికి 16.4 శాతం వృద్ధితో రూ .446.97 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 384.04 కోట్ల రూపాయలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 10.8 శాతం పెరిగి 7,542 కోట్ల రూపాయలకు చేరుకోగా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ వృద్ధి 42.1 శాతంగా ఉంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా ఈ త్రైమాసికంలో మెరుగ్గానే ఉన్నాయి. ఇబిఐటిడిఎ ముందు ఆదాయాలు సంవత్సరానికి 15.5 శాతం పెరిగి రూ .689.12 కోట్లకు చేరుకున్నాయి. వార్షికంగా మార్జిన్ విస్తరణ 9.14 శాతంగా ఉంది. పండుగ షాపింగ్ డిమాండ్ మునుపటి రెండు త్రైమాసికాల కంటే మెరుగైన త్రైమాసిక లాభాలును అందించిందని సంస్థసీఎండీ నెవిల్లే నోరోన్హా చెప్పారు. ఎఫ్ఎంసిజియేతర రంగం నుండి సప్లయ్ కొరత, ముడిసరుకు ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. అయితే పరిస్థితిలో కొంత మెరుగుదల ఉన్నా , సమీప కాలంలో అమ్మకాలు మిశ్రమంగా ఉంటాయని, ఇది మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. -
వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు జోష్‌నిచ్చే వీలుంది. వారాంతాన పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా నంబర్ వన్ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో గత వారం(4-8) మార్కెట్లు 2 శాతం ఎగశాయి. వెరసి సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడి 48,782 వద్ద నిలవగా.. నిఫ్టీ 329 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. 2009 తదుపరి వరుసగా 10 వారాలపాటు లాభాలతో నిలిచిన రికార్డును సైతం మార్కెట్లు సాధించాయి. గత వారాంతానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి దాదాపు రూ. 196 లక్షల కోట్లను తాకడం విశేషం! ఇకపై మార్కెట్లు మరింత జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలు ప్రకటించనుండటంతో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు పేర్కొంటున్నారు. చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) జాబితా ఇలా నేడు(9న) డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇన్ఫోసిస్, విప్రో 13న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 15న పనితీరును వెల్లడించనున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ 7.7 శాతమే క్షీణించనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దాదాపు ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇది కొంతమేర ఆందోళనకర అంశమే అయినప్పటికీ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనుండటం, తద్వారా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్) ఎఫ్‌పీఐల దన్ను గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ. 8,758 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లోనూ రికార్డు స్థాయిలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పంప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 తొలి వారంలోనూ దేశీ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో అంతరర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్ప కరెక్షన్ల నడుమ మార్కెట్లు మరింత వృద్ధి చూపుతున్నట్లు తెలియజేశారు. -
మళ్లీ రికార్డుల వేట..!
ముంబై: రెండురోజుల పాటు వెనకడుగు వేసిన బుల్స్ మళ్లీ పరుగును ప్రారంభించాయి. దీంతో స్టాక్ మార్కెట్లో తిరిగి రికార్డుల వేట మొదలైంది. టీసీఎస్ క్యూ3 ఫలితాలకు ముందు ఐటీ షేర్ల ర్యాలీ, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రూపాయి రికవరీ వంటి అంశాలతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 48,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14,347 వద్ద నిలిచింది. లాభాల మార్కెట్లోనూ మెటల్, ప్రభుత్వ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 761 పాయింట్లను ఆర్జించి 48,854 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 14,367 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.24 వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 329 పాయింట్ల పెరిగింది. యూఎస్ తదుపరి అధ్యక్షుడిగా జో బెడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఆర్థిక ఉద్దీపన ప్రకటన అంచనాలు మరింత పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతూ వడ్డీరేట్ల తగ్గింపునకే ఓటేస్తున్నాయి. ఫలితంగా వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి అది క్రమంగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవహిస్తుంది. దేశీయంగా డిసెంబర్ ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీ ప్రతిబింబిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ కంపెనీ టీసీఎస్ షేరు మూడుశాతం లాభపడి రూ.3,121 వద్ద ముగిసింది. ► మారుతి సుజుకీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున పెరిగాయి. ► అనుబంధ సంస్థ బయోసిమిలర్లో అబుధాబీకి చెందిన ఏడీక్యూ ఇన్వెస్ట్మెంట్ రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో బయోకాన్ షేరు రెండు శాతం లాభపడింది. ► వ్యక్తిగత, వాణిజ్య వాహనాలపై పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► క్యూ3 మెరుగైన ఫలితాలను సాధించవచ్చనే అంచనాలతో సన్ ఫార్మా షేరు 3 శాతం లాభపడటమే కాక రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. -
అదరగొట్టిన టీసీఎస్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలకు తగినట్టుగానే మూడవ త్రైమాసికంలో నికర లాభాలు 7.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో 8701 కోట్ల రూపాయలను నికర లాభాలను ఆర్జించగా, అందుకుముందు ఏడాది ఇదే కాలంలో టీసీఎస్ నికర లాభం 8118కోట్లుగా ఉంది. ఆదాయం కూడా 5.4 శాతం ఎగిసి 42,015 కోట్లుగా ఉందని టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం 39,854 కోట్ల రూపాయలు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత సంస్థ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత తొమ్మిదేళ్లలో 9 సంవత్సరాలలో బలమైన వృద్ధిని సాధించిన డిసెంబర్ క్వార్టర్ ఇదేనని తెలిపింది. అలాగే ఈక్విటీ షేరుకు రూ .6 మూడవ తాత్కాలిక డివిడెండ్‌ను టీసీఎస బోర్డు ప్రకటించింది. (రికార్డుల మోత, టెక్ మహీంద్ర ఘనత) కోర్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్, సంస్థ చేసుకున్న మునుపటి ఒప్పందాలు డిసెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలకు తోడ్పడిందని టీసీఎస్ సీఈఓ,మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. తమ మార్కెట్ ప్లేస్ గతం కంటే బలంగా ఉన్న నేపథ్యంలో సరికొత్త ఆశావాదంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. -
ఐటీ మెరుపులు..!
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై - సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ..... ‘క్యూ3’ సీజన్ వస్తోంది... ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. ఈ సీజన్లో సెలవులు అధికంగా ఉంటాయి. అవుట్‌సోర్సింగ్‌పై కంపెనీలు స్వల్పంగానే ఖర్చు చేస్తాయి. ఫలితంగా ఐటీ కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి డిమాండ్‌ను పెంచుకోవడానికి వివిధ రంగాల కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాయి. ఇది ఐటీ కంపెనీలకు కలసివచ్చింది. గత ఏడాది చివరి ఆర్నెళ్లలో వివిధ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగానే వ్యయం చేశాయి. ఐటీకి సంబంధించిన భారీ డీల్స్ బాగా పెరగడం, ఎన్నడూ లేనంత స్థాయిల్లో కంపెనీల ఆర్డర్ల బుక్‌లు కళకళలాడుతుండటం, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతుండటం, కరోనా కారణంగా కుదేలైన రిటైల్, రవాణా తదితర రంగాలు కోలుకుంటుండటం, అధిక శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తుండటంతో వ్యయాలు తగ్గడం, పర్యాటక, మార్కెటింగ్ సంబంధిత వ్యయాలు కూడా తగ్గడం... ఈ కారణాలన్నింటి వల్ల ఈసారి క్యూ3 ఫలితాలు దుమ్ము రేపనున్నాయి. వేతన పెంపు తప్ప మరే ఇతర ఒత్తిడులు మార్జిన్లపై ప్రభావం చూపవని నిపుణులు భావిస్తున్నారు. గైడెన్స్ (భవిష్యత్తు అంచనాలు) కూడా బాగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు ఆశిస్తున్నాయి. మధ్య స్థాయి కంపెనీలదీ అదే దారి...: దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఇన్పోటెక్‌లు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలున్నాయి. ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే విషయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్‌కు సంబంధించిన వివరాలు, కంపెనీలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై పురోగతి, ఇటీవల టేకోవర్ చేసిన సంస్థల ప్రభావం, వీటికి సంబంధించి యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. భారీ డీల్స్...: ఈ క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దైమ్లర్ కంపెనీతో కుదుర్చుకుంది. ఇక టీసీఎస్ కంపెనీ డాషే బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఇక విప్రో కంపెనీ జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఈఆన్, మారెల్లీ తదితర దిగ్గజాల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎనలిస్టుల అంచనాలు ఈ నెల 8న టీసీఎస్ ఫలితాలు: టీసీఎస్ ఈ నెల 8న క్యూ3 ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ నెల 13న ఇన్ఫోసిస్, విప్రోలు ఫలితాలను ప్రకటించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ఈ నెల 15న వస్తాయి. ఇటీవలి ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ఫలితాలపై భారీ అంచనాలతో చాలా ఐటీ షేర్లు మంగళవారం ఆల్‌టైమ్ హైలను తాకాయి.టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీల ఆదాయాలు సీక్వెన్షియల్‌గా 2-3శాతం మేర పెరగగలవనేది విశ్లేషకుల అంచనా. 2021-22 ఆదాయ అంచనాలను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. టీసీఎస్: ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా 2-3 శాతం ఉండొచ్చు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు పెంచినందున నిర్వహణ లాభం ఒకింత తగ్గవచ్చు. నికర లాభం కూడా 1-1.2 శాతం మేర తగ్గవచ్చు. ఇన్ఫోసిస్: ఆదాయం 3 శాతం మేర పెరుగుతుంది. నిర్వహణ లాభం ఫ్లాట్‌గా ఉండొచ్చు. లేదా ఒకింత తగ్గవచ్చు. అయితే నికర లాభం 15శాతం పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వల్ల పొదుపు చర్యలు పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, రూపాయి క్షీణత... ప్రధాన కారణాలు. విప్రో: ఈ కంపెనీ నిర్వహణ లాభం నిలకడగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఆదాయం (సీక్వెన్షియల్‌గా)2-3 శాతం రేంజ్లో పెరగవచ్చు. ' -
ఇక మార్కెట్ల చూపు టీసీఎస్‌వైపు
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 వ్యాక్సిన్లు, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రకటించనున్న ఫలితాలు నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి దేశీయంగానూ వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకానుండటంతో సెంటిమెంటు మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే యూఎస్, యూకే, కెనడా తదితర పలు దేశాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తయారీ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. దేశీయంగా ఆస్ట్రాజెనెకా తయారీ కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్స్టిట్యూట్ అందించనుంది. తొలి దశలో భాగంగా ప్రభుత్వం హెల్త్ వర్కర్లు తదితర ప్రధాన సిబ్బందికి వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తాజాగా పేర్కొన్నారు. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) శుక్రవారం ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ శుక్రవారం(8న) అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఫలితాలు ప్రకటించనుంది. తద్వారా క్యూ3 ఫలితాల సీజన్‌కు జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. డిసెంబర్ నెలకు పీఎంఐ తయారీ రంగ గణాంకాలు సోమవారం(4న) వెల్లడికానున్నాయి. ఇటీవల ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. ఫిబ్రవరి నెలకు చమురు కోతల అమలుపై ఒపెక్ దేశాలు 4న సమావేశంకానున్నాయి. దీంతో ముడిచమురు ధరలపై ఈ ప్రభావం పడనుంది. ఇటీవల చమురు ధరలు బలపడటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. వెరసి చమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ 2020లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లలో దాదాపు 23 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా నవంబర్‌లో 8.1 బిలియన్ డాలర్లు, డిసెంబర్లో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల ర్యాలీని చేస్తున్నాయి. సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయికి చేరువకాగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లు ఓవర్‌బాట్ స్థితికి చేరినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వచ్చే వారం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు అంచనా వేశారు. నిఫ్టీ 400 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని భావిస్తున్నారు. 14,200- 13,800 పాయింట్ల పరిధిలో సంచరించే వీలున్నట్లు అంచనా వేశారు. -
కరోనా ఎఫెక్ట్ : దూసుకుపోయిన అమెజాన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ లాభాల్లో దూసుకుపోయింది. క్యూ3లో బ్లాక్ బస్టర్ లాభాలను నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ భారీగా పుంజుకున్నాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో వృద్ది నమోదైంది. దీంతో మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఏడాది క్రితంతో పోలిస్తే లాభాలు మూడు రెట్లు పెరిగాయని కంపెనీ గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 37శాతం పెరిగాయి. దీంతో కరోనావైరస్ మహమ్మారి కాలంలో భారీగా లాభపడిన టెక్ దిగ్గజాల్లో ఒకటిగా అమెజాన్ నిలిచింది. (అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు) ఏడాది క్రితం 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,655 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం లాభం 6.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46,764 కోట్లు) గా నమోదయ్యాయి. ఆదాయం 37 శాతం పెరిగి 96.15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 7,12,824 కోట్లు) పెరిగాయి. క్లౌడ్ డివిజన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధిని 11.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 86,504 కోట్లు) సాధించిందని కంపెనీ తెలిపింది. -
కేపీఆర్ మిల్- క్యాస్ట్రాల్ ఇండియా అదుర్స్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 204 పాయింట్లు క్షీణించి 40,318కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో టెక్స్టైల్స్ రంగ కంపెనీ కేపీఆర్ మిల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది(2020) క్యూ3(జులై- సెప్టెంబర్)లో లూబ్రికెంట్స్ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా మెరుగైన పనితీరును చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేపీఆర్ మిల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేపీఆర్ మిల్ రూ. 113 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 88 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 74 శాతం జంప్‌చేసి రూ. 906 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1 శాతం బలపడి 22.21 శాతానికి చేరాయి. యూఎస్, తదితర మార్కెట్ల నుంచి టెక్స్‌టైల్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో రూ. 250 కోట్ల పెట్టుబడితో 4.2 కోట్ల దుస్తుల వార్షిక సామర్థ్యం కలిగతిన యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఆర్ మిల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లింది. రూ. 784ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం ఎగసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 205 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 883 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ. 288 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 3.9 శాతం బలపడి 28.77 శాతానికి ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి 9 నెలల్లో రూ. 624 కోట్ల నికర నగదును ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.5 శాతం దూసుకెళ్లి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. -
కోవిడ్ ‘విశ్వ’రూపం... గుబేర్!
చైనా కాకుండా కొత్త దేశాలకు కోవిడ్–19(కరోనా) వైరస్ విస్తరిస్తుండటం, ఆయా దేశాల్లో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా బుధవారం నష్టపోయింది. ఈ క్యూ2లో 4.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ క్యూ3లో కూడా అదే రేంజ్లో ఉండగలదన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రేపు (శుక్రవారం) ఈ క్యూ3 జీడీపీ గణాంకాలు వెలువడతాయి. సెన్సెక్స్ కీలకమైన 40,000 పాయింట్ల దిగువకు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 రోజుల చలన సగటు(డీఎమ్ఏ) దిగువకు క్షీణించింది. ఇంట్రాడేలో 521 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 392 పాయింట్లు పతనమై 39,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 11,679 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం రంగ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పుంజుకున్నా (ఇంట్రాడేలో), ముడి చమురు ధరలు 1.7 శాతం మేర పతనమైనా, మన మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. మహమ్మారిగా కోవిడ్–19 వైరస్! చైనాలో కొత్త కేసులు తగ్గినప్పటికీ, కోవిడ్–19 (కరోనా) వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,700కు, వ్యాధి సోకిన వారి సంఖ్య 80,000కు పెరిగాయి. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి కొత్త దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. చైనా తర్వాత దక్షిణ కొరియాలో అధికంగా ఈ వైరస్ బాధితులున్నారు. ఈ దేశంలో కొత్త కేసుల సంఖ్య 169కు, మొత్తం బాధితుల సంఖ్య 1,146కు, మృతుల సంఖ్య 11కు పెరిగింది. కోవిడ్ 19 వైరస్ మహమ్మారిగా మారనున్నదని, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో... యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈక్విటీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన అమెరికా బాండ్లు, డాలర్, పుత్తడిలోకి తరలిపోతున్నాయి. ► సన్ ఫార్మా 3.6% నష్టంతో రూ.375 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► బంధన్ బ్యాంక్ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. బ్రాంచ్‌ల విస్తరణకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో ట్రేడింగ్ మొదట్లో 5% లాభంతో రూ.423ను తాకింది. చివరకు 2.3% నష్టంతో రూ.394 వద్ద ముగిసింది. ► 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హీరో మోటో, జిల్లెట్ ఇండియా, ఎల్ అండ్ టీ, థెర్మాక్స్.... తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా, ఇండియా సిమెంట్స్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్‌తో రూ.105వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 37% ఎగసింది. ఏస్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ, ఆయన సోదరుడు గోపీకిషన్ దమానీ ఈ కంపెనీలో వాటాను 11.58%కి పెంచుకున్నారన్న వార్తలు దీనికి కారణం. n ఒక్కో షేర్‌కు రూ.349 డివిడెండ్‌ను ప్రకటించడంతో సనోఫీ ఇండియాఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ. 7,638ను తాకింది. చివరకు 1.6% లాభంతో రూ. 7,114 వద్ద ముగిసింది. గత ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.106 డివిడెండ్‌ను, రూ.243 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 4 రోజుల్లో 1,434 పాయింట్లు డౌన్ వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్ పతనమైంది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 1,434 పాయింట్లు, నిఫ్టీ 402 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.5.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నేడు(గురువారం) ఫిబ్రవరి సిరీ స్ డెరివేటివ్స్ ముగింపు, నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు కావడంతో సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎకానమీకి ముప్పేు.. కోవిడ్ వైరస్, అమెరికా–ఈయూ వాణిజ్య యుద్ధం, గల్ఫ్ ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఈఐయూ 2020లో వృద్ధి 2.9 శాతమని అంచనా న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్, అమెరికా–యూరోపియన్ యూనియన్ వాణిజ్య యుద్ధం, అమెరికా–ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో తలెత్తుతున్న గల్ఫ్ ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా తయారయ్యాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజం– ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.9 శాతంగా అంచనావేసింది. ఇదే జరిగితే ఇది దశాబ్దపు కనిష్టస్థాయి అవుతుంది. ఈ మేరకు విడుదలైన ఒక శ్వేతపత్రంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అమెరికా వృద్ధి రేటు అంతంతమాత్రంగానే ఉంటుంది. కోవిడ్ వైరస్ సంక్షోభం చైనాను కుదేలు చేయడమే కాకుండా, ఆసియా వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తోంది. ► 2020లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2020లోనూ ఇదే కొనసాగవచ్చు. ఇది ఇటు విధాన నిర్ణేతలకూ అటు వ్యాపారవేత్తలకూ సమస్యగా ఉంటుంది. ► పలు ఆర్థిక వ్యవస్థలు రుణ భారాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా సమస్యలతో వాణిజ్యపరమైన సరఫరాల సమస్య తలెత్తవచ్చు. ‘కోవిడ్’ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అనుకున్న సమయానికే బ్యాంకింగ్ విలీనం న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 (కరోనా) వైరస్ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అనుకున్న సమయంలో ఇది పూర్తవుతుందనీ, ఈ విషయంలో ఎటువంటి అనిశ్చితీ లేదనీ వివరించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లను ఉద్ధేశించి ప్రసంగించారు. బ్యాంకర్లు తీసుకున్న వాణిజ్య నిర్ణయాల్లో నిజాయితీ ఉంటే, ఆయా నిర్ణయాల అమల్లో కొన్ని వ్యాపార కారణాల వల్ల తప్పు జరిగినా, బ్యాంకర్లకు వేధింపులు ఉండబోవని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 10 బ్యాంకుల విలీన కీలక నిర్ణయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ మొత్తం పూర్తయితే, 2017లో 27 ఉన్న మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గుతుంది. 2017 ఏప్రిల్‌లో భారతీయ మహిళా బ్యాంకుసహా అయిదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య వృద్ధి 4.5 శాతమే: ఎస్బీఐ గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు దాదాపు 4.5 శాతంగానే ఉంటుందని ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక అంచనావేసింది. 28వ తేదీ మూడవ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. కోవిడ్–19 ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. చైనా నుంచి భారత్ వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019–20లో భారత్ జీడీపీ దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. 2019–20లో వృద్ధి 4.7 శాతం ఉంటుందని ఎస్బీఐ ఎకనమిస్ట్ నివేదిక పేర్కొంది. -
అపోలో హాస్పిటల్స్ లాభం 80 శాతం అప్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. -
ఐడియా నష్టాలు 6,439 కోట్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ చెప్పారు. మరిన్ని వివరాలు..... 30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు... గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. టారిఫ్‌ల పెంపుతో మెరుగుపడుతున్న ఆదాయం.... ఏజీఆర్‌కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్, నెట్వర్క్ ఇంటిగ్రేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్‌లను పెంచడం వల్ల సెప్టెంబర్ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్లో టారిఫ్‌లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. కాగా వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.53,000 కోట్ల మేర ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 0.6 శాతం నష్టంతో రూ.4.48 వద్ద ముగిసింది. -
భారీగా పెరిగిన వోడాఫోన్ ఐడియా నష్టం
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. 2019-20 మూడవ త్రైమాసికంలో వోడా ఐడియా నష్టాలు రూ .6,439 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 50,922లు. పెరిగిన ఆర్థిక ఖర్చులు, ఆస్తుల విలువ క్షీణత ప్రభావం చూపినట్టు కంపెనీ తెలిపింది. గురువారం ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో వోడాఫోన్ ఐడియా మొత్తం ఆదాయం 5 శాతం తగ్గి రూ .11,381 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ. 11,983 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక ఖర్చులు దాదాపు 30 శాతం పెరిగి రూ.3,722 కోట్లకు చేరుకోగా, తరుగుదల 23 శాతం పెరిగి రూ.5,877 కోట్లకు చేరుకుంది .వినియోగదారుల సంఖ్య గత క్వార్టర్లో 31.1 కోట్లతో పోలిస్తే క్యూ 3 లో 30.4 కోట్లకు తగ్గింది. వొడాఫోన్ ఐడియా సీఎండీ రవీందర్ తక్కర్ మాట్లాడుతూ గత క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 2.3 శాతం పుంజుకుందన్నారు. 14 త్రైమాసికాల తరువాత సగటు రోజువారీ రాబడి (ఎడిఆర్) వృద్ధి తిరిగి వచ్చిందని కంపెనీ పేర్కొంది. వేగవంతమైన నెట్వర్క్ ఇంటిగ్రేషన్‌తో పాటు 4జీ కవరేజ్, కీలక మార్కెట్లలో సామర్థ్యం విస్తరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఏజీఆర్ ఇతర విషయాలపై ఉపశమనం కోరుతూ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పారు. జనవరి 24 నాటికి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సి సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విలువ రూ. 53,000కోట్లు. అయితే 24 అక్టోబర్ నాటి ఉత్తర్వులను సవరించడానికి పిటిషన్ వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన మూడు వారాల తరువాత వోడాఫోన్ ఐడియా ఫలితాలు వచ్చాయి. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఉపశమనం కల్పించకపోతే కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన సంగతి విదితమే. -
తగ్గిన భెల్ నికర లాభం, నష్టాల్లో షేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ కంపెనీ భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.322 కోట్లుగా ఉంది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో కంపెనీ షేరు ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. కీలక సూచీలు లాభాలతో దూసుకుపోతుండగా మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బీహెచ్ఈఎల్ కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 7 శాతం కుప్పకూలింది. -
‘కరోనా’, గణాంకాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ కదలికలకు కీలకమని వారంటున్నారు. కరోనా కలకలం... కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002–03లో ప్రబలిన సార్స్ వైరస్ మరణాల కంటే అధికం. కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. గణాంకాల ప్రభావం... ఈ నెల 12న డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, జనవరి నెల రిటైల్ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయి. ఇక శుక్రవారం(ఈనెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈనెల 11 (మంగళవారం)న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. చివరి దశ క్యూ3 ఫలితాలు... డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్సీ, సెయిల్, అశోక్ లేలాండ్, తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కరోనాపై మార్కెట్ కన్ను...: వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని శామ్కో ఎనలిస్ట్ ఉమేశ్ గుప్తా పేర్కొన్నారు. వరుసగా ఆరో నెలా ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ప్రవాహం వరుసగా ఆరో నెలా కొనసాగుతోంది. డిపాజిటరీల డేటా ప్రకారం.. ఫిబ్రవరి 3–7 మధ్య ఎఫ్‌పీఐలు డెట్ సెగ్మెంట్లో రూ. 6,350 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే వ్యవధిలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 1,173 కోట్లు ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ. 5,177 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా ఎకానమీ, ప్రపంచ వృద్ధిపై కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ ఎనలిస్టు మేనేజరు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. -
హీరో మోటో లాభాలు భేష్
సాక్షి, ముంబై: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ హీరో మోటో షేరు 3 శాతానికిపైగా లాభాలతో హీరోగా నిలిచింది. అంచనాలకు మించి 2020 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 14.5 శాతం నికర లాభం పెరిగి 880 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 769 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో 17శాతం పుంజుకుని రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అయితే మొత్తం అమ్మకాలు 17,98,905 యూనిట్ల నుంచి 14.34 శాతం తగ్గి 15,40,876 యూనిట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 11 శాతం తగ్గి రూ .6,997 కోట్లకు చేరిందని హీరో మోటొకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో ఇబిట్టా 6 శాతం తగ్గి రూ.1,105 కోట్ల నుంచి రూ.1,039 కోట్లకు చేరింది, ఇబిట్టా మార్జిన్లు 80 బీపీఎస్ పాయింట్లు పెరిగి 14.8 శాతానికి పెరిగింది. అలాగే రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.65 డివిడెండ్(3,250 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. -
అదరగొట్టిన ఎస్బీఐ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఫలితాల్లోఅదరగొట్టింది. అక్టోబర్-డిసెంబర్ తో ముగిసిన క్యూ3లో అంచనాలకు మించిన ఫలితాలను క్యూ3లో 41 శాతం ఎగిసి రూ.5583 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదేకాలంలో రూ.3955 కోట్ల లాభాలను సాధించింది. అక్టోబర్-డిసెంబర్ 2018-19లో రూ .84,390.14 కోట్ల నుంచి మూడో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ .95,384.28 కోట్లకు పెరిగిందని ఎస్బిఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం ఆదాయం రూ. 76,798 కోట్లను సాధించింది. ఎసెట్ క్వాలిటీ బాగా పుంజుకుంది. మొత్తం త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7.9 శాతం నుంచి 6.94 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ ఫలితాలతో ఎస్బీఐ షేరు 3 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్
సాక్షి,ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించి విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. రూ. 850 కోట్లుగా వుంటుందని ఎనలిస్టులు అంచనా చేశారు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 26,992 కోట్ల రికార్డు నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం 6.82 శాతం క్షీణించి రూ. 71,676.07 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 76,916 కోట్లు. గురువారం టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. స్వతంత్ర ప్రాతిపదికన కంపెనీ 1,039.51 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో 617.62 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. స్వతంత్ర మొత్తం ఆదాయం, 10,842.91 కోట్లుగా ఉంది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో, 6,207.67 కోట్లు. మూడవ త్రైమాసికంలో, ఎగుమతులతో సహా కంపెనీ స్వతంత్ర హోల్‌సేల్స్ 24.6 శాతం క్షీణించి 1,29,185 యూనిట్లకు చేరుకున్నాయి. చైనాలో అమ్మకాలు బాగా పుంజుకోవడంతో బ్రిటీష్ ఆధారిత సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాభాలు 372 మిలియన్ల పౌండ్లకు, ఆదాయం 6.4 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎవోక్ భారీ డిమాండ్ కూడా లాభాలను ప్రభావితం చేసింది. అలాగే గ్లోబల్‌గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన హవా కొనసాగిస్తుండగా, మార్కెట్ క్షీణత, దేశీయ మార్కెట్లోబీఎస్- 6 నిబంధనలు, కంపెనీ పనితీరును ప్రభావితం చేసిందని టాటా మోటార్స్ తెలిపింది. భారతదేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఆటో పరిశ్రమ ప్రభావం కొనసాగుతోంది.మార్కెట్ షేర్లు పెరుగుతున్నప్పటికీ, లాభదాయకత ప్రభావితమైందని కంపెనీ తెలిపింది. -
ఫలితాలు అదుర్స్, షేరు హైజంప్
సాక్షి, ముంబై: బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించి భళా అనిపించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. క్యూ3లో నికర లాభం ఏకంగా 52 సాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికానికి బజాజ్ ఫైనాన్స్ లాభం రూ. 1614కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 42 శాతం దూసుకుపోయి రూ. 4537కు చేరింది. కొత్త రుణాలు 13 శాతం పెరిగాయని బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఫలితాలు అదరగొట్టడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు బుధవారం ట్రేడింగ్‌లో దూసుకుపోయి నూతన గరిష్ఠాలను తాకింది. బుధవారం షేరు 5 శాతం పెరిగి రూ. 4426 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 4444 గరిష్ఠాన్ని తాకడం విశేషం. మూడో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 40.6 శాతం పెరిగి రూ. 7011 కోట్లను చేరింది. కంపెనీ ఏయూఎం 35 శాతం వృద్ధితో 1.45 లక్షల కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో స్థూల ఎన్పీఏలు ఎలాంటి మార్పు లేకుండా 1.61 శాతం వద్ద ఉండగా, నికర ఎన్పీఏలు స్వల్పంగా పెరిగి 0.7 శాతానికి చేరాయి. ఈ కాలంలో రుణ నష్టాలు రూ. 831 కోట్లుకాగా, ప్రొవిజన్లు రూ. 451కోట్లకు చేరాయి. -
హెచ్డీఎఫ్సీ లాభం 4,196 కోట్లు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ వెల్లడించారు. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.2,114 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.8,372 కోట్లకు ఎగసిందని తెలిపారు. గృహ్ ఫైనాన్స్‌లో 9.9 శాతం వాటాకు సమానమైన 15.9 కోట్ల షేర్లను బంధన్ బ్యాంక్‌కు కేటాయించిన కారణంగా రూ.9,020 కోట్ల లాభాన్ని సాధించింది. ఇది నోషనల్ (భావాత్మక) లాభమేనని, కానీ ఖాతా పుస్తకాల పరంగా లెక్కల్లో చెప్పడం తప్పనిసరి అని వివరించారు. రుణాలు తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటాయని మిస్త్రీ వెల్లడించారు. ఫలితాల్లో మరిన్ని వివరాలు ఇవీ... నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతం స్టాండ్అలోన్ పరంగా ఆదాయం రూ.10.582 కోట్ల నుంచి రూ.20,291 కోట్లకు పెరిగింది. వ్యక్తిగత రుణాలు 24 శాతం ఎగిశాయి. గత రెండు క్వార్టర్లలో ఉన్నట్లుగానే నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,297 కోట్లకు ఎగబాకింది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా, ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్నప్పటికీ... సంస్థ స్థూల మొండి బకాయిలు 1.36 శాతం(రూ.5,950 కోట్లు) రేంజ్‌లోనే ఉన్నాయి. వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మొండి బకాయిలు మాత్రం స్వల్పంగా 2 బేసిస్ పాయింట్లు పెరిగి 0.75 శాతానికి చేరాయి. సగటున నెలకు 9,400 గృహ రుణాలను మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం రూ.3,624 కోట్ల కేటాయింపులు ఉండాల్సి ఉండగా, రూ.9,934 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ 2.2 శాతం నష్టంతో రూ.2,396 వద్ద ముగిసింది. ఇది 16 వారాల కనిష్ట స్థాయి. -
రెండింతలైన ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభం
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు క్యూ3లో నికర లాభం రెండు రెట్లుకు పైగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 4,146 కోట్ల లాభాలను నమోదు చేసి అదరహో అనిపించింది. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఇది రూ.1,605 కోట్లుగా వుందని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం ఆదాయం 17.23 శాతం పెరిగి రూ .23,638 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .20,163.25 కోట్లు. 2019 డిసెంబరు చివరిలో ఎన్పీఏలు 5.95 శాతానికి దిగి రావడంతో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ఇది ఏడాది క్రితం 7.75 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు క్యూ 3, 2020 ఆర్థిక సంవత్సరంలో లో 3.77 శాతంగా ఉందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2019 డిసెంబర్ 31 నాటికి బ్యాడ్ లోన్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టి రూ. 43 453.86 కోట్లుగా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం రూ .51 511.47 కోట్లు. నికర ఎన్‌పిఎలు మొత్తం అడ్వాన్స్‌లో 1.49 శాతంగా ఉన్నాయి, 2018 డిసెంబర్ నాటికి ఇది 2.58 శాతంగా ఉంది. క్యూ 3 లో రైట్-ఆఫ్స్ మినహా రికవరీలు, అప్గ్రేడ్లు, ఇతర తొలగింపులు రూ .4,088 కోట్లు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 1,407 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత ఆర్థి క సంవత్సరం క్యూ3లో రూ.436 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,407 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎమ్డీ, సీఈఓ సంజీవ్ చంద్ర తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,504 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో 47 శాతం పెరిగి రూ.6,621 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.7,128 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 10.91 శాతం నుంచి 10.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.79 శాతం నుంచి 4.05 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.10,387 కోట్లుగా ఉన్నాయి. దీంట్లో ఆర్బీఐ గుర్తించిన మొండి బకాయిల మళ్లింపులు రూ.4,509 కోట్ల మేర ఉన్నాయి. -
ఐదు వారాల కనిష్టానికి సెన్సెక్స్
బడ్జెట్ వచ్చే వారమే ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. చైనాలో ఇటీవల ఆరుగురి మృతికి కారణమైన కరోనా వైరస్ కేసు ఒకటి అమెరికాలో వెలుగులోకి రావడం ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 208 పాయింట్లు పతనమై 41,115 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 12,107 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు వారాల కనిష్ట స్థాయి. ఐటీఐ ఎఫ్‌పీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.72–77 ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ఇష్యూకు ప్రైస్‌బాండ్‌ను రూ.72–77గా నిర్ణయించింది. గురువారం షేర్ ముగింపు ధర, రూ.100తో పోల్చితే ఇది 25% మేర తక్కువ. శుక్రవారం మొదలయ్యే ఈ ఎఫ్‌పీఓ ఈ నెల 28న ముగుస్తుంది. బడ్జెట్ రోజు ట్రేడింగ్! ఫిబ్రవరి 1(శనివారం)న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అయితే బడ్జెట్ రోజు కావడంతో శనివారం కూడా స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడింగ్ జరగనున్నది. -
లాభాలు భేష్, బ్యాడ్ లోన్ల బెడద
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత కొటాక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 27 శాతం పెరిగి రూ.1,595.90 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది 1,290.93 కోట్ల రూపాయలు. ప్రధాన ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం 3,429.53 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.2 శాతం పెరిగింది. మొత్తం త్రైమాసికంలో మొత్తం ఆస్తుల శాతం 2.46 శాతంగా, స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించాయి. అంతకుముందు త్రైమాసికంలో 2.32 శాతంగా ఉన్నాయి. బ్యాడ్‌లోన్లు భారీగా ఎగిసాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో 5,413.20 కోట్ల రూపాయలుగా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,033.55 కోట్లు. ఈ త్రైమాసికంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ 2,16,774 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసింది. మొత్తం 1,539 శాఖల బ్యాంక్ బ్రాంచ్ నెట్వర్క్ కలిగి ఉందని బ్యాంక్ ఆదాయ ప్రకటనలో తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 4 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టం రూ. 1,630 వద్ద కొనసాగుతోంది. -
బడ్జెట్ అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం
కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వీటితో పాటు కేంద్ర బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. అంతర్జాతీయ అంశాల కన్నా కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బడ్జెట్‌పైననే మార్కెట్ దృష్టి ప్రధానంగా ఉంటుందని నిపుణుల ఉవాచ. ఫలితాల ప్రభావం..... శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలు, శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు తమ తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్ స్థాయి లాభాన్ని సాధించగా, టీసీఎస్ ఫలితాలు అంచనాలను తప్పాయి. సోమవారం మార్కెట్‌పై ఈ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం ఉంటుంది. ఇక ఈ వారంలో ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బయోకాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో సహా దాదాపు వందకు పైగా కంపెనీలు తమ ఫలితాలను వెల్లడిస్తాయి. టెలికం కంపెనీలు ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి) బకాయిల చెల్లింపునకు గడువు ఈ నెల 23 (గురువారం) కావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. అప్రమత్తత తప్పనిసరి... సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. క్యూ3 ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ కదలికలు కీలకమని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల కారణంగా వివిధ రంగ షేర్లపై ప్రభావం ఉంటుందని వివరించారు. ఎఫ్‌పీఐల పెట్టుబడులు ః రూ.1,288 కోట్లు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 17 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.10,200 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.8,912 కోట్లు వెనక్కి తీసుకున్నారు. నికరంగా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.1,288 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
అదరగొట్టిన రిలయన్స్..
ముంబై : డిసెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రోత్సాహకర త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో ఆర్ఐఎల్ నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లు ఆర్జించింది. కన్జ్యూమర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ సామర్థ్యం కనబరిచింది. ఇక ఈ త్రైమాసంలో కన్సాలిడేటెడ్ ఫలితాలను పరిశీలిస్తే ఆదాయం 1.4 శాతం తగ్గి రూ 1,68,858 కోట్లుగా నమోదైంది. పన్నుకు ముందు లాభాలు 3.6 శాతం పెరిగి రూ 14,962 కోట్లు కాగా నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లుగా నమోదయ్యాయి. మూడో క్వార్టర్లో తమ ఇంధన వ్యాపారంపై గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపించిందని, అయితే రిఫైనింగ్ విభాగంలో మెరుగైన సామర్ధ్యం కనబరిచామని ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. మరోవైపు కన్జూమర్ వ్యాపారాలు ప్రతి క్వార్టర్లో నూతన మైలురాళ్లను నెలకొల్పుతూ పురోగతి సాగిస్తున్నాయని అన్నారు. కొనసాగిన జియో జోష్.. దేశంలో 4జీ దిశగా మార్పునకు వేగంగా అడుగులు వేస్తూ జియో డిసెంబర్ త్రైమాసంలో అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. మూడవ క్వార్టర్లో అదనంగా 3.7 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. ఆదాయం రూ 13,968 కోట్లకు పెరగడంతో నికర లాభం గత క్వార్టర్‌తో పోలిస్తే 36.4 శాతం వృద్ధితో రూ 13.50 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మెరుగైన మొబైల్ కనెక్టివిటీ సేవలతో కస్టమర్లను ఆకర్షిస్తూ జియో తన విజయవంతమైన ప్రస్ధానం కొనసాగిస్తోందని అన్నారు. అందుబాటైన ధరలో ప్రజలకు అసాధారణ డిజిటల్ అనుభూతిని అందించడంపై జియో దృష్టిసారిస్తుందని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా నెట్వర్క్ సామర్ధ్యాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. చదవండి : జియో ఫైబర్ సంచలన ఆఫర్లు -
12 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.123 కోట్లకు తగ్గిందని కర్ణాటక బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,816 కోట్ల నుంచి రూ.2,024 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ3లో 4.45 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ తెలియజేసింది. నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 3.75 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.209 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆదాయం రూ.2,188 కోట్లు ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.91 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించామని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,922 కోట్ల నుంచి రూ.2,188 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయి. గత క్యూ3లో 4.88 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.96 శాతానికి పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 3.54 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.11 వద్ద ముగిసింది. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికా–చైనాల మధ్య తొలి దశ ఒప్పందంపై సంతకాలు ఈ వారమే జరుగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా సోమవారం లాభపడింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతం వృద్ధి సాధించడం, ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 70.82కు చేరడం(ఇంట్రాడేలో), సానుకూల ప్రభావం చూపించాయి. టెక్నాలజీ, బ్యాంక్, లోహ, రియల్టీ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో 41,900 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల లాభంతో 41,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,330 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో 12,338 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నికర లాభాలు పెరుగుతాయ్....! ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు బాగా ఉండటంతో ఇతర కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల కారణంగా కంపెనీల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో నికర లాభాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ► నికర లాభం 24 శాతం పెరగడంతో ఇన్ఫోసిస్ షేర్ 4.7 శాతం లాభంతో రూ.773 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల లాభంలో సగం పాయింట్లు (125 పాయింట్లు) ఇన్ఫోసిస్ షేర్వి కావడం విశేషం. ► ఇన్వెస్టర్ల సంపద ఒక్క సోమవారం రోజే రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ.158.74 లక్షల కోట్లకు ఎగసింది. ► లిస్టింగ్ నిబంధనలను పాటించనందున వచ్చే నెల 3 నుంచి కాఫీ డే ఎంటర్ప్రైజెస్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోనున్నది. దీంతో ఈ రెండు షేర్లు చెరో 5 శాతం మేర నష్టపోయాయి. కాఫీ డే షేర్ రూ.39.65కు, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ 4.9 శాతం నష్టంతో రూ.10.80కు చేరాయి. ► జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్ మిల్స్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్ఆర్ఎఫ్, టాటాగ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు ఆల్‌టైం హైని తాకాయి. ► ఎర్విన్ సింగ్బ్రెయిచ్ పెట్టుబడుల ప్రణాళికను యస్ బ్యాంక్ తిరస్కరించింది. ఈ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేశారు. అంతే కాకుండా నిధుల సమీకరణను రూ.10,000 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ 6 శాతం నష్టంతో రూ.42 వద్ద ముగిసింది. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో డీఎల్ఎఫ్ షేర్ జోరుగా పెరిగింది. 3.5 శాతం లాభంతో రూ. 253కు చేరింది. -
క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ
సాక్షి, ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం) అంచనాలనుకుమించి లాభాలను నమోదు చేసింది. క్యు3లో 24 శాతం ఎగిసి 4457 కోట్ల రూపాయల లాభాలను సాధించింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ 3,609 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 4200 కోట్ల రూపాయల లాభం రానుందని విశ్లేషకులు అంచనా వేశారు. గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం పుంజుకున్న లాభాలను నమోదు చేసిన ఇన్ఫోసిస్ ఆదాయంలోనూ వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది. అయితే మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా వచ్చాయి. దీంతో పాటు 2019-20 ఆర్థిక గైడెన్స్‌ను కంపెనీ పెంచింది. స్థిర కరెన్సీ రెవెన్యూ గ్రోత్ అంచనాలను 10-10.5 శాతంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్ 9-10 శాతం మాత్రమే. లాభాల మార్జిన్లు 21- 23 శాతం ఉంటాయని తెలిపింది. మూడో త్రైమాసికంలో కంపెనీ 180 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాలను గెలుచుకుంది. కొత్తగా 84 మంది క్లయింట్లు వచ్చారని తెలిపింది. ఈత్రైమాసికంలో మొత్తం పనితీరు సంతృప్తికరంగా ఉందనీ, బడాడీల్స్‌ను సాధించామని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణరావు అన్నారు. డిజిటల్ పరివర్తన యుగం, క్లయింట్లతో తమ ప్రయాణంలో తాము స్థిరంగా ఉన్న సంగతిని క్యూ 3 ఫలితాలు నొక్కిచెప్పాయని ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. ఆపరేటింగ్ మార్జిన్లు విస్తరించడంతో, రెండంకెల వృద్ధిలోకి వచ్చాయని, రెవెన్యూ గ్రోత్ అంచనాల పెంపునకు దారితీసిందని పేర్కొన్నారు. -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ3 (అక్టోబర్ – డిసెంబర్) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్ దాడి జరిపి తమ మిలటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై ప్రతీకార చర్య తప్పదని తాజాగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో సైతం ఒడిదుడుకులకు గురయ్యే ఆస్కారం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే.. కేంద్ర బడ్జెట్ సమీపిస్తుండడం వంటి సానుకూల సంకేతాలు మార్కెట్‌ను భారీ పతనం నుంచి నిలబెట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ ప్రకంపనలు లాభాల స్వీకరణలకు ఆస్కారం ఇవ్వవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. తాజా పరిణామాలతో ముడిచమురు ధరలు పెరిగిపోగా.. ఈ వారంలో కూడా క్రూడ్ ర్యాలీ మరింత కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు. ఫలితాల ప్రభావం... ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఈ వారం నుంచే ప్రారంభంకానుంది. ఇన్ఫోసిస్, అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్), ఇమామీ, ఐటీఐ, జీటీపీఎల్ హాత్వే కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థికాంశాలు... గతేడాది డిసెంబర్ సర్వీసెస్ పీఎంఐ ఈ నెల 6న (సోమవారం) వెల్లడికానుండగా.. నవంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 10న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. రూ. 2,418 కోట్ల పెట్టుబడి వెనక్కు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 2,418 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. అమెరికా–ఇరాన్ తాజా పరిణామాల కారణంగా 2020లో జనవరి 1–3 కాలంలో వీరు స్టాక్ మార్కెట్ నుంచి రూ. 524 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,893 కోట్లు వెనక్కు తీసుకున్నారు. -
సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఆసియా పసిఫిక్ క్యూ3–2019 ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ నివేదిక తెలిపింది బెంగళూరు తర్వాతే మెల్బోర్న్, బ్యాంకాక్.. 2019 క్యూ3లో ఆఫీస్ రెంట్స్ వృద్ధిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మెల్బోర్న్, మూడో స్థానంలో బ్యాంకాక్ నగరాలు నిలిచాయి. గతేడాదితో పోలిస్తే బెంగళూరులో అద్దెలు 17.6 శాతం వృద్ధి చెందగా.. మెల్బోర్న్లో 15.5 శాతం, బ్యాంకాక్‌లో 9.4 శాతం వృద్ధి నమోదైంది. నెల వారీ అద్దెలు చూస్తే.. ఖరీదైన అద్దెలున్న నగరాల్లో హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నెల అద్దె చ.మీ.కు రూ.206.6 డాలర్లు. టోక్యోలో 11.9 డాలర్లు, సింగపూర్‌లో 80.5 డాలర్లుగా ఉంది. మన దేశంలో ఖరీదైన ఆఫీస్ అద్దె నగరాల్లో ప్రథమ స్థానంలో ఎన్సీఆర్ (ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 5వ స్థానం), ముంబై (7వ స్థానం) నిలిచాయి. ఎన్సీఆర్లో నెలకు రూ.51.8 డాలర్లు, ముంబైలో 46.2 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 20.5 డాలర్లుగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ. ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 46.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు వాటా 70 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 42 శాతంగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ.ల ఆఫీసు స్థల లావాదేవీలు జరుగుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది మన దేశంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు అత్యధికంగా జరిగిన నగరం బెంగళూరే. ఇక్కడ 2019లో 15 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 39 శాతంగా ఉంది. ఇంజనీరింగ్, తయారీ రంగాల వాటా 16 శాతంగా ఉంది. 2019లో కొత్తగా 10.9 మిలియన్ చ.అ. స్పేస్ జత అయింది. హైదరాబాద్‌లో 10.5 మిలియన్ చ.అ. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీల వంటి కారణాలతో పాటూ అందుబాటులో స్థలాలు, తక్కువ అద్దెలు, నైపుణ్యమున్న ఉద్యోగులు తదితర కారణాలతో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఆఫీస్ అద్దెలు వృద్ధి చెందుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నగరంలో 10.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో టెక్నాలజీ కంపెనీల వాటా 51 శాతం ఉంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా నాలుగింతలు వృద్ధి చెంది 32 శాతం వద్ధ స్థిరపడింది. 2020లో హైదరాబాద్‌లో 13 మిలియన్ చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. -
భళా సన్‌ఫార్మా : లాభాలు 4శాతం అప్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో సన్ ఫార్మా నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 1242 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 7933 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 48 శాతం జంప్‌చేసి రూ. 2,153 కోట్లను తాకింది. మార్జిన్లు 21.8 శాతం నుంచి 27.8 శాతానికి బలపడ్డాయి. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ షాక్‌తో ఇటీవల భారీగా నష్టపోయిన సన్ ఫార్మా షేరు ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.2 శాతానికిపైగా లాభపడింది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థలు సన్‌ఫార్మా షేరుకు బై కాల్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. -
టాటా మోటార్స్‌కు ఫలితాల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయి నష్టాలను నమోదు చేయడంతో టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం కావడంతో దాదాపు 30శాతం కుప్పకూలింది. 1993 తరువాత ఒక రోజులో ఇంత భారీ అమ్మకాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో శుక్రవారం ఈ స్థాయిలో పతనంకావండం ఇదే తొలిసారి. అయితే అనంతరం 52 వారాల కనిష్టంనుంచి తేరుకుంది. ఇదే బాటలో టాటా మోటార్స్ డీవీఆర్ సైతం ఏడాది కనిష్టానికి చేరింది. క్యూ3 ఫలితాలు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టాటా మోటార్స్ రూ. 26,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 1077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్ తెలిపింది . నిర్వహణ లాభం 20 శాతం క్షీణించి రూ. 6381 కోట్లను తాకింది. జేఎల్ఆర్ మార్జిన్లు 2.6 శాతం బలహీనపడి 8.3 శాతంగా నమోదయ్యాయి. లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్కు సంబంధించి రూ. 27,838 కోట్లను రైటాఫ్ చేయడంతో భారీ నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. చైనా తదితర దేశాలలో జాగ్వార్, ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) వాహన అమ్మకాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు తెలిపింది. -
ఆశ్చర్యపర్చిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది. 4 శాతం జంప్ చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో పీఎన్బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఫ్రాడ్కింద రూ. 2014 కోట్లమేర ప్రొవిజన్‌ను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. -
ఆర్బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్ మార్కెట్‌పై ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు. ఫార్మా ఫలితాలు.. పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,264 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. -
72 శాతం కుదేలైన ఎయిర్టెల్ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఎదురు దెబ్బ తప్పలేదు. నికర లాభాలు ఏకంగా 72శాతం పడిపోయాయి. ఆదాయం కూడా గత క్వార్టర్ కంటే కేవలం ఒక శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. గురువారం ప్రకటించిన ఫలితాల ప్రకారం ఎయిర్టెల్ నికర లాభం 76శాతం రూ.86.2 కోట్లుగా నమోదైంది. గత క్వార్టర్లో ఇది గత సంవత్సరంలో రూ.306 కోట్లుగా ఉంది. ఎబిటా 6,307 కోట్లుగా ఉంది. క్యూ3లో రూ. 20,519 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత క్వార్టర్లో నెట్ రెవిన్యూ రూ.20,423 కోట్లు గా ఉంది. ఇండియా వైర్లెస్ బిజినెస్‌లో ఎబిటా 17శాతం వృద్ధి చెందగా, ఆఫ్రికా వ్యాపారంలో ఎబిటా మార్జిన్లలో 37శాతం వృద్ధిని సాధించింది గత సంవత్సరంతో 10,751 కోట్లతో పోలిప్తే..మొబైల్ సర్వీసెస్ మీద రెవెన్యూ రూ. 10,189 కోట్లుగా ఉందని ఎయిర్టెల్ వెల్లడించింది. తాము అనుసరించిన విధానాల కారణంగా ఈ క్వార్టర్లో వినియోగదారుల పరంగా మెరుగ్గా ఉన్నామని భారతి ఎయిర్టెల్ సీఎండీ గోపాల్ విట్టల్ ప్రకటించారు. ఈ త్రైమాసికంలో 4జీ కస్టమర్లు సంఖ్య 11 మిలియన్లకు పైమాటేనని, అలాగే 24వేల బ్రాడ్ బాండ్ల కనెక్షన్లు ఏర్పాటు చేశామని చెప్పారు -
ఐసీఐసీఐకు ప్రొవిజన్ల దెబ్బ : లాభాల్లో క్షీణత
సాక్షి,ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ లిమిటెడ్ క్యూ3 ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబరు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 2.8 శాతం క్షీణించాయి. తద్వారా ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసింది. 2017డిసెంబరు క్వార్టర్లో సాధించిన రూ.1650 కోట్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో రూ. 1605 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 19.8శాతం మేర పుంజుకుంది. రూ. 20,163 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 16,832 కోట్లుగా ఉంది. ఎసెట్ క్వాలిటీ కూడా పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 8.54 నుంచి 7.75శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తుల రేషియో కూడా 3.65 శాతం నుంచి 2.58 శాతానికి దిగి వచ్చింది. అయితే ప్రొవిజన్లు బ్యాంకు ఫలితాలను దెబ్బతీశాయి ఎనలిస్టులు పేర్కొన్నారు. గత క్వార్టర్‌తో పోలిస్తే 6శాతం, వార్షిక ప్రాతిపదికన 19శాతం ఎగిసి రూ. 4, 244కోట్లుగా నిలిచాయి. మరోవైపు రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో మాజీ సీఈవో చందా కొచర్‌పై ఎప్ఐఆర్ నమోదైంది. అటు ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణానికి సంబంధించి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్టును దర్యాప్తు సంస్థకు అందించింది. ఈ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచర్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ వార్తలు రేపటి బ్యాంకు షేర్ ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
బజాజ్ ఆటో ఫలితాలు భేష్ : నష్టాల్లో షేరు
సాక్షి,ముంబై: దేశీ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించింది. క్యూ3 ఫలితాలు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 1102 కోట్లను నమోదు చేసింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 7409 కోట్లను తాకింది. గత ఏడాది రెవెన్యూ 6387 కోట్ల రూపాయలుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1246 కోట్లకు చేరగా.. ఇతర ఆదాయం రూ. 209 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు ఎగసింది. మార్జిన్లు 19.5 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నప్పటికీ దలాల స్ట్రీట్‌ను మెప్పించలేకపోయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో బజాజ్ ఆటో షేరు దాదాపు 2 శాతం నష్టపోయింది. అయితే మార్జిన్లు క్షీణించడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
అంచనాలను అందుకోని హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్( హెచ్డీఎఫ్సీ) ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. వార్షిక ప్రాతిపదికన ఏకంగా 60శాతం నికర లాభాలను నష్టపోయింది. అలాగే త్రైమాసిక ప్రాతిపదికన ప్రస్తుతం నికర లాభం 14 శాతం తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రూ. 2114 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2017-18) క్యూ3లో నికర లాభం రూ. 5,300 కోట్లుగా నమోదైంది. ఇందుకు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీవో ద్వారా లభించిన రూ. 3675 కోట్లు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 3192 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 10450 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన పన్ను వ్యయాలు రూ. 1022 కోట్ల నుంచి రూ. 755 కోట్లకు దిగివచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతం వద్ద నిలకడగా నిలిచాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.15 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయి. ఈ ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1.31 శాతం నష్టపోయింది. అయితే చివరలో పుంజుకుంది. -
క్యూ3లో వండర్లా లాభం పైపైకి
బెంగళూరు: వినోదరంగంలోని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి రూ.78.63 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81.34 శాతం ఎక్కువని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నులు మినహాయించి వచ్చిన లాభం రూ.6.54 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.14.51 కోట్లకు చేరి 122 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బెంగళూరు, హైదరాబాద్ వండర్లా పార్కుల్లో సందర్శకుల సంఖ్య వరుసగా 23 శాతం, 12 శాతం పెరిగిందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జోసెఫ్ వెల్లడించారు. -
చతికిలపడిన మారుతి
సాక్షి,ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో చతికిలపడింది. నికరలాభాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకోలేక నిరాశాజనక ఫలితాలను వెల్లడించింది. నికర లాభాల్లో 17.2 శాతం క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసిక ఫలితాలను ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టలో ఆర్జించిన 17,99 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈ క్యూ3లో రూ. 1489 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దాదాపు రూ.1799కోట్ల లాభాలను ఆర్జించనుదని విశ్లేషకులు అంచనా వేశారు. ఆదాయం మాత్రం చాలా నామామాత్రంగా 2 శాతమే పెరిగి రూ.19,668 కోట్లను నమోదు చేసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం పడిపోయి రూ. 1930 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 15.7 శాతం నుంచి 9.8 శాతానికి బలహీనపడ్డాయి. కమోడిటీల ధరలు పెరగడం, ఫారెక్స్ నష్టాలు, మార్కెటింగ్ వ్యయాలు వంటి అంశాలు తమ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ మార్కెట్ సమాచారంలో వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు దాదాపు 8 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. -
కొత్త సీఎండీ, యస్ బ్యాంకు షేరు దూకుడు
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అటు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు..ఇటు కొత్త సీఎండీ ప్రకటన...దీంతో యస్‌బ్యాంకు కౌంటర్లో ఉత్సాం నెలకొంది. తమ బ్యాంకు కొత్త ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్‌ను ఎంపిక చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. దీనికి ఆర్బీఐ ఆమోదం లభించిందనీ, మార్చి1 నుంచి గిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గిల్ ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యస్ బ్యాంకు రూ. 1001 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 2667 కోట్లుకాగా. రూ. 2297 కోట్లమేర స్లిప్పేజెస్ నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.6 నుంచి 2.1 శాతానికి, నికర ఎన్పీఏలు 0.86 శాతం నుంచి 1.18 శాతానికి పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ ఎక్స్పోజర్ విలువ రూ. 2530 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు దూసుకుపోయింది. యస్ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 235 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14.32 శాతం లాభంతో రూ. 225 వద్ద నిలిచింది. కాగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ససేమిరా అంగీకరించికపోవడంతో ఫిబ్రవరికల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవలసి ఉన్న సంగతి తెలిసిందే -
యూనియన్ బ్యాంకు లాభం రూ.153 కోట్లు
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యూనియన్ బ్యాంక్ రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ.1250 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే రూ. 230-300 కోట్ల నికర లాభం ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .9,133.58 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 9,572.58 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధానంగా ప్రొవిజన్లు తగ్గడంతోపాటు, ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడటం దోహదం చేసింది. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలు సగానికి తగ్గి రూ. 1617 కోట్లకు చేరాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 2 శాతం క్షీణించి రూ. 2494 కోట్లకు పరిమితమైంది. క్వార్టర్ టూ క్వార్టర్ టూ గ్రాస్‌ఎన్‌పీఏ స్వల్పంగా (0.88),నికర ఎన్పీఏలు 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 2017-18 నాటి మూడవ త్రైమాసికంలో 13.03 శాతం నుంచి మొత్తం నికర ఆదాయం (ఎన్పీఏ) 15.66 శాతం పెరిగింది. నికర ఎన్ఎపిఏలు కూడా గత సంవత్సరం నుంచి 6.96 శాతం నుంచి 8.27 శాతానికి పెరిగాయి. -
అదరగొట్టిన కొటక్ మహీంద్ర బ్యాంకు
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశీయ ఐదవ అతిపెద్ద రుణదాత కొటక్ మహీంద్రా మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికరలాభంలో మెరుగైన ప్రదర్శనను కనబపర్చింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం రూ. 1,291 కోట్లును సాధించింది. అధిక వడ్డీ ఆదాయం తదితర కారణాలతో ఈ వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం కూడా 27శాతం వృద్ధి చెంది 2939కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంచనా వేసినదాని కంటే దాదాపు 26కోట్ల రూపాయలు అధికం. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 23 శాతం పుంజుకుని రూ. 2939 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.2 శాతం నుంచి 4.33 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో బ్యాడ్‌లోన్ కేటాయింపులు 50 శాతం పెరిగి 255 కోట్ల రూపాయలకు చేరాయి. మార్క్-టు-మార్కెట్ నష్టాలు రూ. 272 కోట్లు.డిసెంబర్ చివరలో మొత్తం రుణాల మొత్తం శాతం 2.07 శాతానికి నిలవగా, ఇంతకుముందు త్రైమాసికంలో 2.15 శాతం, అంతకుముందు ఏడాది 2.31 శాతంతో పోలిస్తే అస్సెట్ నాణ్యత మెరుగుపడింది. -
అంచనాలకు అనుగుణంగా ఆర్ఐఎల్ ఫలితాలు
సాక్షి, ముంబై : ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఈ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ 10,251 కోట్లుగా నమోదైంది. సంస్ధ రాబడి 55.9 శాతం పెరిగి రూ 1,71,336 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం 9.3 శాతం పెరిగి రూ 14,445 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో కంపెనీ అన్ని విభాగాల్లోనూ సంతృప్తికర ఫలితాలను సాధించిందని ఆర్ఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ 10,000 కోట్లు దాటిన జియో రాబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో కీలక విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. నిర్వహణ రాబడి రూ 10,383 కోట్లు కాగా నికర లాభం 65 శాతం వృద్ధితో రూ 831 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో రూ 504 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంచనాలకు మించి జియో ప్రస్ధానం అత్యద్భుతంగా సాగుతోందని, 28 కోట్ల మంది సబ్స్ర్కైబర్లతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్‌గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ నాణ్యతతో ప్రతిఒక్కరికీ చేరువ కావాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా జియో పయనం సాగుతోందన్నారు. -
తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285
జనవరి తొలివారంలో భారత్‌తో సహా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ...వాటి ఇటీవలి గరిష్టస్థాయిల వద్ద పరిమితశ్రేణిలో కదిలాయి. అమెరికా–చైనా ట్రేడ్‌వార్ చర్చలు సానుకూలంగా ముగిసాయన్న వార్తలు కూడా మార్కెట్లను పెద్దగా ఉత్తేజపర్చలేకపోయాయి. ఇక్కడ ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు సైతం మార్కెట్ అంచనాలకంటే దిగువస్థాయిలోనే వున్నాయి. ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించినందున, ఫలితాలు నిరుత్సాహపర్చినా, షేరు గరిష్టస్థాయిలోనే ట్రేడ్‌కావొచ్చు. అయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, కొన్ని కార్పొరేట్ బ్యాంకులు మినహా మిగిలిన హెవీవెయిట్ షేర్లన్నీ ముందడుగు వేయలేకపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునఃప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు.. జనవరి 11తో ముగిసిన వారంలో 36,270–35,750 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 315 పాయింట్ల లాభంతో 36,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్‌కు 36,200–36,285 శ్రేణి గట్టిగా నిరోధించవచ్చు. గతవారంలో పలుదఫాలు అవరోధం కలిగించిన ఈ శ్రేణిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35750 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తేక్రమేపీ 35,380 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 10830–10,870 గతవారం 10,870– 10,733 పాయింట్ల మధ్య పరిమితశ్రేణిలో ఊగిసలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,795 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10830–10,870 శ్రేణి తొలుత తీవ్ర నిరోధాన్ని కల్పించవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ వారం పైన సూచించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. గత వారంరోజులుగా మద్దతునిచ్చిన ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్ ముగింపును నమోదుచేశాయి. ఇక ఈ వారంలో.. ఫలితాలు ప్రకటించే దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యునిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటు ద్రవ్యోల్బణ సమాచారం, అంతర్జాతీయ అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. 80 కంపెనీల ఫలితాలు.. బీఎస్ఈలో లిస్టైన 80 కంపెనీలు ఈవారంలో (జనవరి 14–19) క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం ఇండియా బుల్స్ వెంచర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం జీ ఎంటర్టైన్మెంట్, డెన్ నెట్వర్క్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ట్రైడెంట్.. బుధవారం డీసీబీ బ్యాంక్, హెచ్‌టీ మీడియా, మైండ్‌ట్రీ ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ర్యాలీస్ ఇండియా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫలితాలు ఉండగా.. శుక్రవారం విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ లైఫ్, అతుల్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలో వెల్లడికానున్న ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా వెల్లడి మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయించనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి .. డిసెంబర్ నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. వాణిజ్య శేషాన్ని ప్రభుత్వం మంగళవారం వెల్లడించనుండగా.. జనవరి 11 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వల సమాచారాన్ని శుక్రవారం ఆర్బీఐ తెలియజేయనుంది. ఇదే రోజున జనవరి 4 నాటికి మొత్తం డిపాజిట్లు, బ్యాంక్ రుణా ల వృద్ధి సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 6 శాతం ర్యాలీ చేశాయి. గతేడాది డిసెంబర్లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే.. 20 శాతం పెరిగాయి. శుక్రవారం 60.55 వద్ద ముగియగా.. క్రూడ్ ధరల్లో ర్యాలీ కొనసాగితే దేశీ సూచీలకు ప్రతికూల అంశంకానున్నట్లు ఎక్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. ఇక ముడిచమురు ధర పెరుగుదల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 70.49 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ అంశాలు ఏంచేస్తాయో.. అమెరికా–మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ ముగింపు ఎప్పుడనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు యురోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగే ప్రక్రియకు సంబంధించి మంగళవారం కీలక సమాచారం వెల్లడికానుంది. యూకే ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ఉపసంహరణ డీల్‌పై బ్రిటిష్ పార్లమెంట్ ఓటు వేయనుంది. ఇక గతవారంలో అమెరికా–చైనాల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఈ చర్చల సారాంశం ఏంటనే విషయంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. ఈనెలలోని గడిచిన తొమ్మిది సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.3,600 కోట్లను ఉపసంహరించుకున్నారు. జనవరి 1–12 కాలంలో రూ.3,677 కోట్లను వీరు వెనక్కుతీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
బంధన్ బ్యాంక్ లాభం 10 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పుణ్యమాని ఈ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు. తగ్గిన రుణనాణ్యత... ఇన్ని సానుకూలాంశాలున్నా ఈ బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్ పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌నకు చెందిన గృహ్ ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బంధన్ బ్యాంక్ షేర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు పతనమైనా, బంధన్ బ్యాంక్ షేర్ 4 శాతం ఎగసి రూ.472 వద్ద ముగిసింది. -
అదరగొట్టే అవకాశాలు తక్కువే?
సాక్షి, బిజినెస్ విభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికాని(క్యూ3)కి సంబంధించి కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఈ వారం నుంచే మొదలవుతున్నాయి. 10న టీసీఎస్, 11న ఇన్ఫోసిస్‌తో క్యూ3 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై విశ్లేషకుల అంచనాలు దాదాపుగా ఒకే రీతిన ఉన్నాయి. అంతా కూడా... నిఫ్టీ–50 కంపెనీల క్యూ3 ఆదాయాల్లో మోస్తరు వృద్ధిని నమోదు చేయవచ్చనే అంచనా వేస్తున్నారు. కొన్ని రంగాలు నిదానించడం, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అధిక వృద్ధి నమోదు కావడం ఇందుకు కారణాలుగా ఉండొచ్చని చెబుతున్నారు. తయారీ వ్య యాల తగ్గుదల కారణంగా మార్చి త్రైమాసికంలో వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు. మోస్తరుగానే... ఆదాయాలు ఎనిమిది త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 7.5 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చన్నది మెజారిటీ విశ్లేషకుల అంచనా. 2017 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి 13 శాతంగా ఉంది. ఇక నికర లాభాలు వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఒకే అంకె స్థాయిలో ఉంటాయని, 6.7 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆటోమొబైల్స్, సిమెంట్, ఆయిల్, గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, టెలికం రంగ కంపెనీల ఫలితాలు పరిమితంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ కంపెనీలు మెరుగైన ఫలితాలు ఇస్తాయన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘2018 డిసెంబర్ క్వార్టర్లో పారిశ్రామిక లోహాల ధరలు తక్కువగా ఉన్నాయి. చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో చమురు, మెటల్స్ ముడి పదార్థాలుగా వినియోగించే కంపెనీలకు ప్రయోజనం. రూపాయి కూడా 9 శాతం పడిపోయింది. ఇది దిగుమతిదారులపై, విదేశీ మారకంలో రుణాలు తీసుకునే వారిపై భారాన్ని మోపుతుంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ–50 ఈపీఎస్ డిసెంబర్ క్వార్టర్లో 18–28% మధ్య పెరగొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు, క్యూ3లో దేశీ కార్పొరేట్ల ఆదాయాలు, లాభాల వృద్ధి తగ్గొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. కమోడిటీల ఆధారిత రంగాల ఆదాయాలు గణనీయంగా పెరగొచ్చని సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. వీటిలో నేచురల్ గ్యాస్ (37 శాతం), ఉక్కు ఉత్పత్తులు (27%), సిమెంటు (10) శాతం మేర వృద్ధి సాధించొచ్చని క్రిసిల్ తెలిపింది. ఇక ఇన్ఫ్రాకు సంబంధించిన నిర్మాణ తదితర రంగాల వృద్ధి 12 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. వివిధ రంగాలవారీగా విశ్లేషకుల అంచనాలు పరిశీలిస్తే.. ఆటోమొబైల్స్ ఆటోమొబైల్ కంపెనీల ఫలితాలు ఆకట్టుకునే విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మెజారిటీ కంపెనీల విక్రయాలు తగ్గడం, లేదా ఒకే అంకె వృద్ధికి పరిమితం కావడాన్ని చూస్తూనే ఉన్నాం. పండుగల సీజన్లో డిమాండ్ లేకపోవడం, డీలర్ల దగ్గర నిల్వలు పెరిగిపోవడం వంటివి ఆటోమొబైల్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెంచేవే. ఆటో కంపెనీల ఆదాయాల వృద్ధి సుమారు 4 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా. బ్యాంకింగ్ మొండి బకాయిల కోసం బ్యాంకులు చేసే ప్రొవిజన్లు తగ్గొచ్చు. బ్యాంకుల్లో కొత్తగా మరిన్ని మొండిబాకీలు నమోదు కావడం తగ్గుముఖం పడుతోంది. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్‌పై తక్కువ ఈల్డ్ వల్ల ట్రెజరీ ఆదాయం అధికంగా వస్తుందని, ఇది బ్యాంకుల లాభాలను పెంచేదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్యాపిటల్ గూడ్స్ ప్రభుత్వం నుంచి ఆర్డర్లు నిలకడగా ఉండడం ఈ రంగంలోని కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం ఫలితాలకు కలసిరానుంది. అంతకుముందు కొన్ని త్రైమాసికాలుగా ప్రాజెక్టుల విషయంలో నత్తనడక కొనసాగింది. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన పాలసీ చర్యలు, సంస్కరణలతో వాటి నిర్మాణం వేగాన్ని పుంజుకుంటోంది. ఈ రంగంలో అగ్రగామి కంపెనీ ఎల్ అండ్ టీ డిసెంబర్ త్రైమాసికంలో అంచనాల కంటే తక్కువ ఆర్డర్లనే సంపాదించింది. దీంతో ఈ కంపెనీ చేసే వ్యాఖ్యలను పరిశీలించాల్సి ఉంది. సిమెంట్ దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు డిసెంబర్లో బ్యాగుపై 2 శాతం వరకు తగ్గి రూ.308 స్థాయికి పరిమితం అయ్యాయి. పలు ప్రాంతాల్లో సిమెంట్‌కు డిమాండ్ పెరిగినప్పటికీ పోటీ కారణంగా ధరలు పెంచే పరిస్థితి లేకపోయింది. పెద్ద కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్, దాల్మియా భారత్, శ్రీసిమెంట్ కంపెనీలు 10–15 శాతం మధ్యలో అమ్మకాల వృద్ధిని నమోదు చేయవచ్చని, కానీ ఆదాయ వృద్ధి మాత్రం 3–9 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ పండుగల సమయంలో అధిక విక్రయాలు, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఈ రంగ కంపెనీలపై కనిపించనుంది. గత కొన్ని క్వార్టర్లుగా గ్రామీణ డిమాండ్ వృద్ధికి దన్నుగా నిలిచింది. డిసెంబర్ క్వార్టర్లో మాత్రం ఇది ఒక మోస్తరుగా ఉండొచ్చని భావిస్తున్నారు. అధిక ముడి ఉత్పత్తి వ్యయాల రూపంలో మార్జిన్లపై ప్రభావం ఉంటుంది. అయితే, జీఎస్టీ రేట్ల తగ్గింపు కొంత ఉపశమనం కలిగించేది. ఎఫ్ఎంసీజీ రంగం 8 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. మెటల్స్ ఈ ఏడాది అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో చాలా వరకు కమోడిటీల ధరలు క్షీణించాయి. స్టీల్ ధరలు 15 శాతం వరకు తగ్గడం జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ కంపెనీలకు ప్రతికూలంగా పరిణమించనుంది. అల్యూమినియం ధరలు తగ్గడం హిందాల్కో, వేదాంత కంపెనీలపై ప్రభావం చూపించనుంది. వేదాంత లిమిటెడ్‌కు చమురు ఉత్పత్తి కూడా ఉంది. చమురు ధరల తగ్గుదల ప్రభావం కూడా ఈ కంపెనీపై పడనుంది. ఫార్మా అమెరికా, దేశీయ మార్కెట్లలో సమస్యల నేపథ్యంలో ఫార్మా కంపెనీలు మెప్పించే ఫలితాలను ప్రకటించే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. అమెరికా మార్కెట్లో ధరల పతనానికి బ్రేక్ పడటం ఎగుమతి చేసే ఫార్మా కంపెనీలకు ఊరట కలిగించే విషయం. గత క్వార్టర్లో రూపాయి 11 శాతం క్షీణించిన దరిమిలా ఫార్మా 10 శాతం, ఐటీ రంగం 21 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. -
ఫలితాలు, గణాంకాలు కీలకం!
ముంబై: ఐటీ కంపెనీల బోణీతో ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. టీసీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థల ఫలితాలకు తోడు.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాలు ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండగా.. ఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగిన 31వ సమావేశంలో పలు వస్తు, సేవలపై జీఎస్టీ రేటును కౌన్సిల్ తగ్గించిన నేపథ్యంలో ఈసారి సమావేశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇక శుక్రవారం వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు కన్నేసివుంచారు. వీటితో పాటు ముడిచమురు, రూపాయి కదలికలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. ఒడిదుడుకులకు అవకాశం.. ‘కార్పొరేట్ ఫలితాల అంశం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగేందుకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనుండగా.. ఇక్కడ నుంచి అందే సంకేతాలు, క్రూడ్ ధరల కదలికలు, రూపాయి మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి.’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేషన్, దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం.. పట్టణ, గ్రామీణ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్య లభ్యత కారణంగా వచ్చే త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయంలో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. ఇక సాధారణ ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ఇంకొంతకాలం మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనావేస్తున్నాం.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ సైతం ఒడిదుడుకులు కొనసాగేందుకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సమాచారం అనంతరం ఇందుకు ఆస్కారం అధికంగా ఉండగా.. ఈ డేటా వెల్లడి తరువాత మార్కెట్‌కు ఒక దిశా నిర్దేశం కానుందన్నారు. దేశీ ఆర్థిక అంశాల్లో ఐఐపీ ఈవారంలో కీలకంగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. అమెరికా–చైనాల చర్చ.. ఈనెల 7–8 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు బీజింగ్‌లో సమావేశంకానున్నారు. గతేడాదిలో చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధం మొదలుకాగా, ఆ తరువాత ఇరు దేశాలు రాజీ ధోరణి ప్రదర్శించినప్పటికీ.. ఏ క్షణంలో ఎటువంటి వార్తలు వెలువడుతాయో అనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్–చైనా ప్రతినిధుల చర్చ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈవారంలో మార్కెట్‌ను ప్రభావితం చేయదగిన అంతర్జాతీయ అంశాల్లో.. డిసెంబర్ అమెరికా పేరోల్ రిపోర్ట్, ఆ దేశం ద్రవ్యోల్బణం, తయారీయేతర పీఎంఐ డేటాలు ఉన్నాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.83,000 కోట్లు గతేడాదిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్ నుంచి రూ.83,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూ.33,553 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి.. రూ.49,593 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి పతనంతో 2018లో ఈస్థాయి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని ఫండ్స్ఇండియా డాట్ కామ్ మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల అన్నారు. -
రిలయన్స్ క్యాపిటల్ నికరలాభం రూ.315 కోట్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ క్యూ3లో లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 50శాతం వృద్దిని సాధించింది. డిసెంబర్ 31 తో ముగిసిన ఈ త్రైమాసికంలో రిలయన్స్ క్యాపిటల్ రూ. 315 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ .4,771 కోట్లకుగా నమోమైందని కంపెనీ గురువారం వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 3,964 కోట్ల రూపాయల ఆదాయాన్ని రిలయన్స్కంపెనీ నికర విలువ రూ .16,232 కోట్లగాను, రుణ ఈక్విటీ నిష్పత్తి 2.48 గా ఉంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ రూ .470 కోట్లు ఆర్జించగా , 130 కోట్ల రూపాయల నికరలాభాన్ని ఆర్జించింది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే 26 శాతం వృద్ధి సాధించింది. భీమా పరిధిలో లైఫ్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అధిక ప్రీమియం ఆదాయాన్ని పోస్ట్ చేశాయి. డిసెంబరు 31 న ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్థూల రాబడి వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధిరేటుతో రూ. 1,075 కోట్లుగా ఉంది. నిరక లాభం54 శాతం వృద్ధితో 28 కోట్ల రూపాయలను సాధించింది. అలాగే సంస్థకు చెందిన బ్రోకింగ్ సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ 83 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన 2 శాతం గ్రోత్తో 14 కోట్ల లాభాన్నినమోదు చేసింది. -
క్యూ3లో నిరాశపర్చిన టాటా మోటార్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటామెటార్స్ క్యూ3 ఫలితాల్లో నీరస పడింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించిలేక ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. నికర లాభాలు రూ.1215 కోట్లను సాధించింది. అయితే సుమారు రూ. 3,040కోట్ల లాభాలను సాధించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. వైడ్ మార్జిన్లు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ బలహీనమైన అమ్మకాలు ఫలితాలను దెబ్బతీసినట్టు అంచనా. అయితే దేశీయ వ్యాపారంలో ఆరోగ్యకరమైన పనితీరును నివేదించింది. ముఖ్యంగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో బలమైన ప్రదర్శన ద్వారా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16 శాతం పెరిగి రూ .74,156 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 63,933 కోట్ల రూపాయలు. డిసెంబర్ 2017 తో ముగిసిన త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్లు 57.8 శాతం పెరిగి రూ .16,101.6 కోట్లకు పెరిగింది. ఈబీఐటీడీఏ వృద్ధిరేటు 77 శాతం క్షీణించి రూ. 1,383 కోట్లు. ఏకీకృత ఆపరేటింగ్ లాభం (వడ్డీకి ముందు ఆదాయం, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచన) 80 శాతం వృద్ధితో రూ. 8,671 కోట్లుగా నమోదైంది. -
ఆర్బీఐ పాలసీ, క్యూ3 కీలకం
ఆర్బీఐ పాలసీ, ఈ వారంలో వెలువడే కొన్ని దిగ్గజ కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి కూడా ఈ వారం స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఇక నేడు(సోమవారం) వెలువడే సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వెయ్యి కంపెనీల ఫలితాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరిదైన ఆర్బీఐ ద్రవ్య పాలసీ సమావేశం మంగళవారం(రేపు) మొదలై బుధవారం ముగుస్తుంది. కీలక రేట్లపై ఈ నెల 7(బుధవారం)న ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఈ వారంలో దాదాపు వెయ్యి వరకూ కంపెనీలు క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, భెల్, సెయిల్, లుపిన్, సిప్లా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. ఎల్టీసీజీ ప్రభావం తాత్కాలికమే... వచ్చే ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు అంచనాలను మించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాల కారణంగా వడ్డీరేట్ల విషయమై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎల్టీసీజీ విధింపు తాత్కాలికంగానే ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సంబంధిత ఒడిదుడుకులు ఎక్కువ కాలం కొనసాగిన దాఖలాలు లేవని, మార్కెట్ దృష్టి కంపెనీల ఫలితాలు, ఇతర ఆర్థిక విషయాలపైకి మరలుతుందన్నారు. గత రెండు నెలలుగా మార్కెట్ అధిక వేల్యూయేషన్‌తో ట్రేడవుతోందని, బడ్జెట్ తర్వాత పతనమైందని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎమ్డీ, సీఈఓ అరుణ్ తుక్రల్ తెలిపారు. ఎల్టీసీజీతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారని అరిహంత్ క్యాపిటల్ డైరెక్టర్ అనితా గాంధీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకునేలా బడ్జెట్ ఉందని, భారత వృద్ధిని మరో మెట్టుపైకి తీసికెళ్లేలా బడ్జెట్ ఉందని, అయితే అమలు కీలకం కానున్నదని పేర్కొన్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని మీరకుండా బడ్జెట్లో ప్రతిపాదించిన భారీ పథకాలు అమలు సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. గెలాక్సీ లిస్టింగ్...: గెలాక్సీ సర్ఫ్క్టాంట్స్ కంపెనీ షేర్ ఈ నెల 8న (గురువారం) స్టాక్మార్కెట్లో లిస్ట్ కానున్నది. గత నెల 29–31 మధ్య రూ. 1,470–1,480 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.937 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 20 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. జనవరిలో రూ.22,000 కోట్ల విదేశీ పెట్టుబడులు.. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో గత నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, బాండ్ల ఈల్డ్‌లు ఆకర్షణీయంగా ఉండడం, కొత్త ఏడాది ఖాతాల ప్రారంభం సందర్భంగా కొనుగోళ్లు చోటు చేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది జనవరిలో మన క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.22,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు మన స్టాక్ మార్కెట్లో రూ.13,781 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.8,473 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. -
అంచనాలను అధిగమించిన టెక్ మహీంద్ర
సాక్షి,ముంబై: దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఈ ఏడాది మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను సోమవారం విడుదల చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికరలాభం 12.8 శాతం పెరిగి రూ .943 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 2.2 శాతం పెరిగి రూ. 7776 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం( ఇబిటా) రూ. 1256 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 16.3 శాతంగా నమోదయ్యాయి. డాలర్ పరంగా రెవెన్యూ 2.5 శాతం పెరిగి 1,209 మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. వడ్డీకి ముందు ఆదాయం 17.9 శాతం పెరిగి 990 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 12.7 శాతం పెరిగింది. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్పై తాము ఎక్కువగా దృష్టిపెట్టామని, భవిష్యత్ ఆవశ్యకతల కనుగుణంగా తమ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని టెక్ మహీంద్ర వైస్ ఛైర్మన వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు సోమవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో మంగళవారం ట్రేడింగ్‌లో సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
బడ్జెట్ చుట్టూనే ఇన్వెస్టర్ల చూపులన్నీ..
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇప్పుడు బడ్జెట్ కోసం వేచి చూస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ గురువారం(ఫిబ్రవరి 1)న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు, ఈ వారం వెలువడే బ్లూచిప్ కంపెనీల క్యూ3 ఫలితాలు, తయారీ రంగ గణాంకాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై తగిన ప్రభావం చూపనున్నాయి. బడ్జెట్ రోజే తయారీ రంగానికి సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడి కానుండటం కీలకం. ‘‘ప్రస్తుతం స్టాక్ విలువలు అధిక స్థాయిల్లో ఉండటంతోపాటు, త్వరలో జరిగే పరిణామాలు దూకుడుతో కూడిన కొనుగోళ్లకు బ్రేక్ వేయొచ్చు. కీలకమైన బడ్జెట్, ఆర్థిక గణాంకాల నేపథ్యంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండొచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ అన్నారు. ‘‘జీఎస్టీ తర్వాత ఇది మొదటి బడ్జెట్. అలాగే, ప్రస్తుత ప్రభుత్వానికి చివరి పూర్తి సంవత్సరపు బడ్జెట్ కావడంతో అంచనాలు అధికంగా ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణతోపాటు మౌలిక, గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేటు క్లయింట్గ్రూపు హెడ్ వీకే శర్మ తెలిపారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజే ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ఫిబ్రవరి 1(గురువారం) మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ జనవరి నెలకు సంబంధించిన భారత సేవల రంగం పనితీరును ప్రతిబింబించే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలను వెల్లడిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో 52.6గా ఉన్న పీఎమ్ఐ సూచీ గత నెలలో 54.7కు పెరిగాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, చైనా, యూరోజోన్, అమెరికా జనవరి నెల తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు ఈ గురువారం (ఫిబ్రవరి 1న) వస్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశాలు ఈ నెల 30న ఆరంభమవుతాయి. నేడు హెచ్డీఎఫ్సీ ఫలితాలు: ఇక కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, నేడు(సోమవారం) హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, టెక్ మహీంద్రాలు క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 30) ఐఓసీ, ఈ నెల 31న(బుధవారం) ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, వేదాంత కంపెనీలు, శుక్రవారం (ఫిబ్రవరి 2న) బజాజ్ ఆటో, హిందాల్కో కంపెనీల క్యూ3 ఫలితాలు వస్తాయి. నేటి నుంచి గెలాక్సీ ఐపీఓ గెలాక్సీ సర్ఫాక్టంట్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి నుంచి ప్రారంభమవుతోంది. రూ. 1.470–1,480 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా రూ. 937 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కనీసం 10 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 63.31 లక్షల షేర్లను జారీ చేయనున్నారు. వచ్చే నెల 8న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. రెండు లిస్టింగ్‌లు.. ఈ వారంలో రెండు కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. నేడు(సోమవారం) న్యూజెన్ సాఫ్ట్వేర్ షేర్లు లిస్టవుతాయి. ఈ నెల 16–18 మధ్య రూ.240–245 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 8 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇక అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ నెల 30న(మంగళవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. ఈ నెల 17–19 మధ్య రూ.855–859 ప్రైస్‌బాండ్‌తో వచ్చి న ఈ ఐపీఓ 165 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ వారం ఈవెంట్స్ జనవరి 29 పార్లమెంట్ బడ్జెట్ సమాశాలు ఆరంభం, ఆర్థిక సర్వే, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాలు జనవరి 30 ఐఓసీ ఫలితాలు జనవరి 31 ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, వేదాంత ఫలితాలు ఫిబ్రవరి 1 బడ్జెట్, తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు ఫిబ్రవరి 2 బజాజ్ ఆటో, హిందాల్కో క్యూ3 ఫలితాలు -
ఐడియాకు క్యూ3లోనూ తప్పని నష్టాలు
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఐడియా సెల్యులర్ మళ్లీ ఫలితాల్లో నిరాశపర్చింది. ఆర్థిక సంవత్సరం క్యూ3లో నష్టాలను నమోదు చేసింది. మంగళవారం విడుదల చేసిన కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,284 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 6510 కోట్లను తాకింది. క్యూ2లో రూ. 7466 కోట్ల ఆదాయం సాధించింది. ఆపరేటింగ్ మార్జిన్ 18.8శాతంగా ఉంది.గత ఏడాది ఇది 20శాతంగాఉంది. అయితే వినియోగరుదాల మార్కెట్లో వృద్ధిని సాధించింది. డిసెంబర్ నాటికి 20.3 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి నికర రుణాలు రూ. 55,780 కోట్లకు చేరినట్లు ఐడియా సెల్యులర్ ఫలితాల విడుదల సందర్భంగా వివరించింది. మరోవైపు యూకే దిగ్గజం వొడాఫోన్తో విలీన ప్రక్రియ తుది దశకు చేరిందని, 2018 మొదటి త్రైమాసిం నాటికి ఈ విలీనం పూర్తికావచ్చని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఆరంభంనుంచి నష్టాల్లో ఉన్న ఐడియా కౌంటర్ మరింత బలహీనపడి దాదాపు 5శాతం పతనాన్ని నమోదు చేసింది. -
మార్కెట్లో ఫలితాల జోరు
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లో క్యూ3 ఫలితాల జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలుకౌంటర్లు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో కీలక సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా, నిప్టీ 10,900కి పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ కౌంటర్ రికార్డు ధరని(రూ.2231.50) నమోదు చేసింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ బ్యాంకు, అదానీ పోర్ట్, కోటక్ మహీంద్ర, ఎస్ బ్యాంక్ 7శాతానికిపై గా పుంజుకోవడం విశేషం. మరోవైపు సోమవారం ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు కూడా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ క్యూ3లో రూ.66కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20కోట్ల లాభం సాధించగా..ఇప్పుడీ లాభం మూడింతలైనట్లైంది. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే రూ.795.20కోట్లు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం లభాలను, హెచ్డీఎఫ్ఎసీ లాభం 20శాతం, అదానీ పోర్ట్స్20శాతం, ఎస్‌బ్యాంక్ 22శాతం వార్షిక గ్రోత్‌ను , కోటక్ మహీంద్ర 20శాతం లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన ఐటీసీ
సాక్షి, ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గంజం ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించి ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. ఐటీసీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ.9522 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో రూ .9248 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నికర లాభం 17 శాతం పెరిగి 3,090 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికరలాభం 2,647 కోట్ల రూపాయలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సిగరెట్ల ఆదాయం మాత్రంక్షీణించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 10 శాతం పుంజుకుని రూ. 3904 కోట్లను తాకగా.. మార్జిన్లు 38 శాతం నుంచి 40 శాతానికి ఎగశాయి. ఇయర్ ఆన్ ఇయర్ సిగరెట్ల అమ్మకాల 44శాతం తగ్గాయి. తద్వారా రూ. 4629 కోట్లు లభించినట్లు కంపెనీ పేర్కొంది. అగ్రి బిజినెస్ కూడా 8.44 శాతం తగ్గి రూ .1,530.86 కోట్లకు పడిపోయింది. అయితే పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారాలు 4.20 శాతం పెరిగి 1,279.6 కోట్లకు తగ్గాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం దాదాపు 27 శాతం క్షీణించి రూ. 9,772 కోట్లకు చేరింది. -
ఫలితాలు, గణాంకాలు నడిపిస్తాయ్ !
కీలక కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా తగిన ప్రభావాన్ని చూపిస్తాయని వారంటున్నారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలకు సోమవారం మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. పారిశ్రామికోత్పత్తి 17 నెలల గరిష్ట స్థాయి, 8.4 శాతానికి ఎగియగా, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల గరిష్ట స్థాయి, 5.2 శాతానికి ఎగిశాయి. మార్కెట్ జోరు కొనసాగుతుంది... ఇక మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, విప్రో, హిందుస్తాన్ యూనిలివర్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, తదితర దిగ్గజ సంస్థల క్యూ3 ఫలితాలు వెలువడుతాయి. ప్రపంచ మార్కెట్ల జోరు, నిధుల ప్రవాహం బాగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత సానుకూలతలు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, బడ్జెట్ సంబంధించిన సంకేతాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాలు అంచనాలకనుగుణంగానే వచ్చాయని, మార్కెట్ జోరు కొనసాగుతుందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్‌టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ చెప్పారు. విదేశీ పెట్టుబడులు ః రూ.5,200 కోట్లు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 1–12 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.2,172 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,080 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఈల్డ్స్ ఆకర్షణీయంగా ఉండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాలు దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇవే కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు. గత ఏడాది డెట్, ఈక్విటీల్లో కలిపి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. -
34,500 పాయింట్ల పైకి సెన్సెక్స్
ముంబై: కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయన్న అంచనాలతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐటీ, రియల్టీ షేర్లు లాభపడడంతో స్టాక్ సూచీలు ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 34,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,650 పాయింట్లపైకి ఎగబాకాయి. ఈ ఏడాది వేగంగా వృద్ధి చెందనున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న ప్రపంచ బ్యాంక్ నివేదిక సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 34,503 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10,651 పాయింట్ల వద్ద ముగిశాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,559 పాయింట్లు, నిఫ్టీ 10,665 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి.ఇది నిఫ్టీకి ఆల్‌టైమ్‌హై. నేడు(శుక్రవారం) క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండడటంతో ఇన్ఫోసిస్ షేర్ 2.2 శాతం లాభంతో రూ.1,076 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, 1,083ని తాకింది. ఈ షేర్‌తో పాటు టెక్ మహీంద్రా కూడా 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. -
జనవరి 12న ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఆర్థిక ఫలితాలను వచ్చే నెల 12న వెల్లడించనుంది. తమ కంపెనీ, ఇతర అనుబంధ సంస్థల అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు చెందిన ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల నిమిత్తం వచ్చే నెల 11, 12 తేదీల్లో డైరెక్టర్ల సమావేశం జరగనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. 12వ తేదీని కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తామని వివరించింది. -
సన్‌ఫార్మా లాభాలు నామమాత్రం
ముంబై: దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అమెరికా మరియు భారతీయ మార్కెట్లలో అమ్మకాలు నెమ్మదించడంతో థర్డ్ క్వార్టర్ లో లాభాలు నామామాత్రంగా నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 5 శాతం నికర లాభాలు క్షీణించి రూ.1472 కోట్లను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో రూ.1545 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం8 శాతం పెరిగి 7683 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 9 శాతం పుంజుకుని రూ. 2,453 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 31.5 శాతం నుంచి 31 శాతానికి బలహీనపడ్డాయి. పన్ను వయ్యాలు రూ. 59 కోట్ల నుంచి రూ. 373 కోట్లకు పెరిగాయి. -
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ద్రవ్యోల్బణ గణాంకాలు ♦ చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు ♦ యూపీ ఎన్నికల సరళి ♦ ఈ వారం మార్కెట్ ప్రభావిత అంశాలు ఇవే.. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఈ వారం వెలువడే కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ. తదితర అంశాలు స్టాక్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేడు(సోమవారం) మార్కెట్ ముగిసిన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. ఇక ఈ వారంలో హిందాల్కో, ఎన్ఎండీసీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, వేదాంత, నాల్కో, పవర్ ఫైనాన్స్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వెలువడతాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి మార్కెట్ చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వారంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం ఉంటుంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 28,334 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,794 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. విదేశీ కొనుగోళ్ల జోరు.. నాలుగు నెలలుగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఫిబ్రవరిలో అడ్డుకట్ట పడింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల విషయమై స్పష్టత రావడంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.5,827 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,088 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.3,739 కోట్లు చొప్పున పెట్టుబడలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్లు విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.