సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లో క్యూ3 ఫలితాల జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలుకౌంటర్లు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో కీలక సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా, నిప్టీ 10,900కి పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ కౌంటర్ రికార్డు ధరని(రూ.2231.50) నమోదు చేసింది. దీంతోపాటు హెడ్‌ఎఫ్‌సీ బ్యాంకు, అదానీ పోర్ట్, కోటక్ మహీంద్ర, ఎస్ బ్యాంక్ 7శాతానికిపై గా పుంజుకోవడం విశేషం. మరోవైపు సోమవారం ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు కూడా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది.
జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ క్యూ3లో రూ.66కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20కోట్ల లాభం సాధించగా..ఇప్పుడీ లాభం మూడింతలైనట్లైంది. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే రూ.795.20కోట్లు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం లభాలను, హెచ్‌డీఎఫ్‌ఎసీ లాభం 20శాతం, అదానీ పోర్ట్స్20శాతం, ఎస్‌బ్యాంక్ 22శాతం వార్షిక గ్రోత్‌ను , కోటక్ మహీంద్ర 20శాతం లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment