HDFC Ltd
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్‌వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్‌ల భేటీ
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తితో కలిసి ఆర్థికమంత్రితో సమావేశమయినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. రెండు ఆర్థిక దిగ్గజ సంస్థల 40 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం పలు రంగాలకు రుణ లభ్యత సౌలభ్యతను మెరుగుపరుస్తుందని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్బీఐ నిబంధనల వల్ల నాన్ బ్యాంకింగ్ కంపెనీలు తగిన ప్రయోజనాలు పొందలేకపోతున్నాయని, ఈ కారణంగానే విలీన ప్రతిపాదన ముందుకు వచ్చిందని పరేఖ్ వ్యాఖ్యానించారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బడా బ్యాంకింగ్ యేతర సంస్థలు మారుతున్న నిబంధనలను అనుగుణంగా నడుచుకోవడమో లేక తమకుతాము పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
క్యాడిలా హెల్త్‌కేర్- హెచ్డీఎఫ్సీ.. జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరంక్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ కౌంటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2లో రూ. 2,870 కోట్ల నికర లాభంఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 28 శాతం క్షీణతకాగా.. గతంలో పెట్టుబడుల విక్రయం ద్వారా డివిడెండ్ ఆదాయం భారీగా లభించడంతో లాభాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. నికర వడ్డీ ఆదాయం 21 శాతం ఎగసి రూ. 3,647 కోట్లను తాకింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 10 శాతంపైగా పెరిగి రూ. 5.4 ట్రిలియన్లను తాకింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 75 శాతం. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 6 బేసిస్ పాయింట్లు తగ్గి 1.81 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 2,119ను తాకింది. ఇది మార్చి 13 తదుపరి గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2,104 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ షేరు 10 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. క్యాడిలా హెల్త్‌కేర్ ఈ ఏడాది క్యూ2లో క్యాడిలా హెల్త్‌కేర్ నికర లాభం సర్దుబాట్ల తదుపరి 73 శాతం ఎగసింది. రూ. 562 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 13 శాతంపైగా వృద్ధితో రూ. 3,820 కోట్లకు చేరింది. యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు 18 శాతం పుంజుకుని రూ. 1,709 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా ఫార్ములేషన్ల అమ్మకాలు సైతం 11 శాతం అధికంగా రూ. 1,087 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో క్యాడిలా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 13 శాతం దూసుకెళ్లింది. రూ. 464 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 438 వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్లో ఫలితాల జోరు
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లో క్యూ3 ఫలితాల జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలుకౌంటర్లు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో కీలక సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా, నిప్టీ 10,900కి పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ కౌంటర్ రికార్డు ధరని(రూ.2231.50) నమోదు చేసింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ బ్యాంకు, అదానీ పోర్ట్, కోటక్ మహీంద్ర, ఎస్ బ్యాంక్ 7శాతానికిపై గా పుంజుకోవడం విశేషం. మరోవైపు సోమవారం ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు కూడా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ క్యూ3లో రూ.66కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20కోట్ల లాభం సాధించగా..ఇప్పుడీ లాభం మూడింతలైనట్లైంది. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే రూ.795.20కోట్లు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం లభాలను, హెచ్డీఎఫ్ఎసీ లాభం 20శాతం, అదానీ పోర్ట్స్20శాతం, ఎస్‌బ్యాంక్ 22శాతం వార్షిక గ్రోత్‌ను , కోటక్ మహీంద్ర 20శాతం లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
అంచనాలను అధిగమించిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభాలను 26.80శాతం పెంచుకుని, రూ.2,796.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.2,204 కోట్లగా ఉన్నాయి. రూ.11,397.29 కోట్లగా ఉన్న మొత్తం ఆదాయాలు రూ.13,516.99 కోట్లకు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయలు(వడ్డీ ఆదాయాలకు, వడ్డీ చెల్లింపులకు తేడా) సైతం 9శాతం ఎగిసి, ఏడాది బేసిస్‌తో రూ.2,229.15 కోట్లగా నమోదైనట్టు తెలిపింది. జూన్ క్వార్టర్ ముగిసేనాటికి ఈ ఫైనాన్స్ కంపెనీ లోన్ బుక్ కూడా రూ.2.65 కోట్లకు పెరిగి, గతేడాది కంటే 14.92శాతం ఎగిసినట్టు హెచ్డీఎఫ్సీ తన ఫలితాల్లో ప్రకటించింది. ఈ త్రైమాసిక కాలంలో మొత్తం రూ.5,108 కోట్ల రుణాలను కార్పొరేషన్ అమ్మినట్టు, దానిలో రూ.3,296 కోట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విక్రయించినట్టు వెల్లడించింది. 12.3 కోట్ల హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్సూ కంపెనీ ఈక్విటీ షేర్లను తన పార్టనర్ ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీకి అమ్మినట్టు, దానివల్ల రూ.921.61 కోట్ల ప్రీ-టాక్స్ లబ్దిని పొందినట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉన్నట్టు, స్థూల నిరర్ధక ఆస్తులు 0.75 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ సేర్లు 1.48 శాతానికి ఎగిసి, రూ.1,398గా నమోదయ్యాయి.