
హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల మెగా విలీనం...ఆర్థికమంత్రితో ‘హెచ్‌డీఎఫ్‌సీ’ చీఫ్‌ల భేటీ
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీపక్ పరేఖ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తితో కలిసి ఆర్థికమంత్రితో సమావేశమయినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
రెండు ఆర్థిక దిగ్గజ సంస్థల 40 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం పలు రంగాలకు రుణ లభ్యత సౌలభ్యతను మెరుగుపరుస్తుందని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్‌బీఐ నిబంధనల వల్ల నాన్ బ్యాంకింగ్ కంపెనీలు తగిన ప్రయోజనాలు పొందలేకపోతున్నాయని, ఈ కారణంగానే విలీన ప్రతిపాదన ముందుకు వచ్చిందని పరేఖ్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బడా బ్యాంకింగ్ యేతర సంస్థలు మారుతున్న నిబంధనలను అనుగుణంగా నడుచుకోవడమో లేక తమకుతాము పునర్‌వ్యవస్థీకరణ నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది.
చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!