హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాల్లో టాప్‌ | HDFC to seal place in top echelons of world most valued banking space | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాల్లో టాప్‌

Published Mon, Jul 3 2023 4:53 AM | Last Updated on Mon, Jul 3 2023 4:53 AM

HDFC to seal place in top echelons of world most valued banking space - Sakshi

న్యూఢిల్లీ: మారి్టగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్‌ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్‌(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్‌బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే.

కాగా.. విలీనానంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్‌వర్త్‌ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్‌ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌కాగా.. 4,000 మంది హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement