merge banks
-
విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్
భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో 2023 జులైలో విలీనమైంది. ఇదే తరహాలో ఇప్పుడు మరో రెండు ప్రైవేట్ బ్యాంకుల విలీనం జరుగుతోంది. విలీనానికి సిద్దమవుతున్న ఆ రెండు బ్యాంకులు ఏవి? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB).. షేర్ల డీల్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును (Fincare SFB) 2024 ఫిబ్రవరి 01 నాటికి విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల మధ్య జరుగుతున్న మొదటి పెద్ద విలీనం ఇదే అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. భారతదేశంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మొత్తం 1292 బ్యాంకింగ్ అవుట్లెట్లను కలిగి ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 339, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 640, పట్టణ ప్రాంతాల్లో 179, మెట్రో ప్రాంతాల్లో 73 అవుట్లెట్లు ఉన్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపడుతోంది. దీంతో వ్యాపార యూనిట్లకు క్రెడిట్ యాక్సెస్‌ను చేరువ చేసేందుకు ఈ విలీనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా? 2023 సెప్టెంబర్ 30 నాటికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. రూ.95977 కోట్లు, రూ.14777 కోట్లు. ఈ రెండు బ్యాంకులు విలీనం జరిగిన తరువాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్‌వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
లక్ష్మీ విలాస్ ‘ఖాతా’ క్లోజ్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో (డీబీఐఎల్) విలీన ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర పడింది. విలీన స్కీమ్‌నకుకేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ .. నవంబర్ 27 (శుక్రవారం) నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 25,000 విత్‌డ్రాయల్ పరిమితులు తొలగిపోనున్నాయి. ‘‘నవంబర్ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుంది. ఎల్వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్ బ్యాంక్ ఇండియా శాఖలుగా మారతాయి. ఎల్వీబీ డిపాజిటర్లంతా కూడా డీబీఎస్ ఖాతాదారులుగా మారతారు. అలాగే, ఎల్వీబీపై విధించిన మారటోరియం కూడా ఇక అమల్లో ఉండదు’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఎల్వీబీ ఖాతాదారులకు యథాప్రకారంగా సర్వీసులు అందేలా చూసేందుకు డీబీఎస్ బ్యాంక్ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వివరించింది. వాస్తవానికి మారటోరియం గడువు డిసెంబర్ 16తో ముగియనున్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఎత్తివేయనుండటం గమనార్హం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తిస్తాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీ బోర్డును ఆర్బీఐ నవంబర్ 17న రద్దు చేసి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆర్బీఐ సిఫార్సుల మేరకు డిపాజిటర్లు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా కేంద్రం .. ఎల్వీబీపై 30 రోజుల మారటోరియం విధించింది. సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఐఎల్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రతిపాదనను ఆర్బీఐ రూపొందించింది. తాజాగా ఇదే అమల్లోకి రానుంది. ఈ ఏడాది పెను సంక్షోభం ఎదుర్కొన్న బ్యాంకుల్లో యస్ బ్యాంక్ తర్వాత ఎల్వీబీ రెండోది. నిధుల కొరతతో కుదేలైన యస్ బ్యాంక్‌పై ప్రభుత్వం మార్చిలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో 45 శాతం వాటాలు కొనిపించి, రూ. 7,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి యస్ బ్యాంక్‌ను గట్టెక్కించింది. షేరు జూమ్.. దాదాపు వారం రోజులుగా లోయర్ సర్క్యూట్లకు పడిపోతూ వస్తున్న ఎల్వీబీ షేర్లు తాజా పరిణామాలతో బుధవారం 5 శాతం పెరిగాయి. బీఎస్ఈలో రూ. 7.65 వద్ద (అప్పర్ సర్క్యూట్) ముగిశాయి. ఒక దశలో లోయర్ సర్క్యూట్ స్థాయి రూ. 6.95కి, ఏడాది కనిష్టానికి కూడా పడిపోయినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకోవడం గమనార్హం. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్ 17 నుంచి 24 మధ్య షేరు ధర 53 శాతం పడిపోయింది. షేర్హోల్డర్లకు సున్నా..? ఈ మొత్తం లావాదేవీలో షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. విలీన ప్రతిపాదన తుది స్కీమ్‌ను బట్టి చూస్తే ముసాయిదాలో పేర్కొన్న ఈక్విటీ రైటాఫ్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం లావాదేవీ అనంతరం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తాన్ని రైటాఫ్ చేయనున్నారు. గురువారం నుంచి ట్రేడింగ్‌ను ఎన్ఎస్ఈ నిలిపివేయనుంది. శుక్రవారం ఎక్సే్చంజీల నుంచీ ఎల్వీబీ షేర్లను డీలిస్ట్ చేయనున్నారు. డిపాజిట్లు సురక్షితం.. ఎల్‌వీబీకి చెందిన 20 లక్షలకు పైగా ఖాతాదా రులు, 4,000 మంది పైగా ఉద్యోగులకు తాజా పరిణామం ఊరట కలిగిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. డిపాజిట్ల విత్‌డ్రాయల్‌పై ఇతరత్రా మరే ఆంక్షలు ఉండబోవని ఆయన చెప్పారు. ‘‘ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదు. డిపాజిట్లు సురక్షితమైన చేతుల్లోనే ఉన్నాయి. విత్‌డ్రాయల్ కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు. డీబీఐఎల్‌కు తగినంత స్థాయిలో మూలధనం ఉన్నప్పటికీ విలీనానంతరం కార్యకలాపాల వృద్ధి కోసం ముందుగానే మరో రూ. 2,500 కోట్ల నిధులను కూడా సమకూర్చుకుంటుందని చెప్పారు. ఎల్వీబీ కనుమరుగు.. సుమారు 94 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్వీబీని వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ సారథ్యంలో తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో ఏర్పాటు చేశారు. 19 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎల్‌వీబీకి 566 శాఖలు, 918 ఏటీఎంలు ఉన్నాయి. బడా సంస్థలకు భారీ స్థాయిలో రుణాలివ్వడం మొదలెట్టినప్పట్నుంచి ఎల్‌వీబీకి కష్టాలు మొదలయ్యాయి. మొండిబాకీలు భారీగా పేరుకుపోవడంతో బ్యాంకుపై ఆర్బీఐ గతేడాది ఆంక్షలు కూడా విధించింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలతో విలీనమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. 2019–20లో రూ. 836 కోట్ల నికర నష్టం ప్రకటించిన ఎల్వీబీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 397 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా పరిణామాలతో ఎల్వీబీ ఇక పూర్తిగా కనుమరుగు కానుంది. పటిష్టంగా డీబీఐఎల్... సింగపూర్ కేంద్రంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డీబీఎస్‌కు డీబీఐఎల్ భారతీయ అనుబంధ సంస్థ. డీబీఎస్‌కు ఆసియాలోని 18 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నాయి. ఎల్వీబీని విలీనం చేసుకోవడంతో డీబీఐఎల్ శాఖల సంఖ్య 600కు పెరుగుతుంది. బాధ్యులపై చర్యలు ఉంటాయి.. ఎల్వీబీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని జవదేకర్ తెలిపారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలుంటాయి. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ మెరుగుపరుస్తాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి కూడా భాగం’’ అని ఆయన చెప్పారు. ఆర్బీఐ కూడా పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోవడానికి ముందే సమస్యను ఆర్బీఐ అంచనా వేయగలగాలి. రాబోయే సమ స్యలను పసిగట్టగలిగితే పరిష్కారం సులువవుతుంది’’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. -
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్
-
ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీ నాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానిం చారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటింన సంగతి తెలిసిందే. నవ భారత ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్ పేర్కొన్నారు. పంజాబ్ నేషనన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో ఆరు బ్యాం కులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గను న్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి’ అని అన్నారు. -
ఒక్క ఉద్యోగం కూడా పోదు..
న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం.. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు. ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఊతం .. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్ కుమార్ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్ తెలిపారు. -
26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం. -
బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీనం..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది. -
బ్యాంకింగ్‌లో మరిన్ని ఏకీకరణలు
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం మంచి అడుగు: కేవీ కామత్ న్యూఢిల్లీ: ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం ఓ మంచి తొలి అడుగుగా బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చైర్మన్ కేవీ కామత్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ అవసరాలు తీర్చాలంటే పెద్ద బ్యాంకులు ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, బ్యాంకింగ్ రంగానికి తలనొప్పిగా మారిన నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ.. ‘‘మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం దృష్ట్యా మరిన్ని పెద్ద బ్యాంకుల అవసరం ఉంది. కనుక ప్రభుత్వ రంగంలో మరిన్ని బ్యాంకుల మధ్య ఏకీకరణకు వీలుంది. అంతేకాదు, ప్రైవేటు రంగంలోనూ వీలీనాల అవసరం ఉంది. ఎందుకంటే, మన ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చాలంటే చాలా పెద్ద బ్యాంకులు కావాలి. బ్యాంకులు సొంతంగా అయినా ఆ స్థాయికి ఎదగాలి. లేదా విలీనాలను అయినా చేపట్టాలి’’ అని కామత్ అన్నారు. ఎన్డీబీ రెండో వార్షికోత్సవ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇది కేవలం కొన్ని బ్యాంకులను ఒక్కటి చేయడం లేదా రెండు బ్యాంకులను ఒకటిగా మార్చడమన్న అంకెలుగానే ఉండరాదన్నారు. బ్యాడ్ బ్యాంకుకు ఎన్డీబీ నిధులు అందించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదంటూ, తమ దృష్టి అంతా మౌలిక సదుపాయాలకు నిధులు అందించడంపైనేనని స్పష్టం చేశారు.