భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో 2023 జులైలో విలీనమైంది. ఇదే తరహాలో ఇప్పుడు మరో రెండు ప్రైవేట్ బ్యాంకుల విలీనం జరుగుతోంది. విలీనానికి సిద్దమవుతున్న ఆ రెండు బ్యాంకులు ఏవి? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB).. షేర్ల డీల్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును (Fincare SFB) 2024 ఫిబ్రవరి 01 నాటికి విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల మధ్య జరుగుతున్న మొదటి పెద్ద విలీనం ఇదే అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది.
భారతదేశంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మొత్తం 1292 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 339, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 640, పట్టణ ప్రాంతాల్లో 179, మెట్రో ప్రాంతాల్లో 73 అవుట్‌లెట్‌లు ఉన్నాయి.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపడుతోంది. దీంతో వ్యాపార యూనిట్లకు క్రెడిట్ యాక్సెస్‌ను చేరువ చేసేందుకు ఈ విలీనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది.
ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా?
2023 సెప్టెంబర్ 30 నాటికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. రూ.95977 కోట్లు, రూ.14777 కోట్లు. ఈ రెండు బ్యాంకులు విలీనం జరిగిన తరువాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment