next year
-
మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... వృద్ధి 6.5 శాతం 2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్‌సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది. మరికొన్ని అంశాలు... → దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది. → రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది. → అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది. → టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్‌ల పెంపు మద్దతు లభిస్తుంది. → ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ మందగమనం.. కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.రేటు తగ్గింపు ప్రక్రియ షురూ! రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము. – అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్ (టాటా అసెట్ మేనేజ్మెంట్)ఫిబ్రవరిలో రేటు తగ్గదు నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఏప్రిల్ పాలసీలో కోత కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుంది. – పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్ -
2025లో ఏం జరగబోతోంది..?: నోస్ట్రడామస్ ఏం చెప్పాడు ?
ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా..ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందీ మనమంతా చూశాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్ళీ గెలవడం,టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా ఆధిపత్యం సాధించడం, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి సిరియా, ఇరాన్,ఇజ్రాయెల్, పాలస్తీనా వంటివి యుద్ధాల్లో రగులుతుందడం, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం,ఎన్నడూలేని కృష్ణా నది వరదల్లో విజయవాడ అల్లాడిపోవడం..ఇవన్నీ మనం చూశాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది..ఎలా ఉండబోతోంది.కాలజ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. అవును ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ ఈ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు ప్రపంచ యుద్ధాలు అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత ఇలా ఎన్నో అంశాల గురించి ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న 2025 కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు..1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం,అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు,కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనావేసి చెప్పారు.అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫేటిస్ (ది ప్రొఫెసీస్) ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు.ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు.ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో ఏం జరగబోతోంది..2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమిమీద పెను మార్పులు సంభవిస్తాయిబ్రిటన్లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారుఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని అన్నాడు అంటే మూడేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారుసుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అంతా అలసిపోతుంది. ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారుఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయిఇంగ్లాండ్.. దేశం అటు యుద్ధాలు,ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది.ఇంగ్లాండ్ దేశం క్రూరమైన యుద్ధాలతో బాటు "శత్రువుల కంటే ఘోరంగా" ఉండే "పురాతన ప్లేగు" వ్యాప్తిని ఎదుర్కొంటుంది.గ్రహశకలం భూమిని ఢీకొంటుందా?ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యం అని నోస్ట్రడామస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి, వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్లిపోతున్నాయి.బ్రెజిల్లో ప్రకృతి వైపరీత్యాలు..గార్డెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్, ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు...దారుణ పరిస్థితులకు ప్రభవితమైపోతుందని నోస్ట్రడామస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్లవంటి ఘటనలు కూడా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు.- సిమ్మాదిరప్పన్న -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు. -
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
Real Estate: ఈ ఏడాది 20% వృద్ధి ఉండొచ్చు
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఈ పట్టణాల్లో 37–39 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) మేర లీజు నమోదు అవుతుందని అంచనా వేసింది. గతేడాది 38 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థాయిలోనే, ఈ ఏడాది కూడా డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక విడుదల చేసింది. ఆఫీస్ స్పేల్ లీజు డిమాండ్ 2019లో 47.92 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటే, 2020లో 25.38 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 26.03 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘‘2023 జనవరి–సెప్టెంబర్ వరకు ఆఫీస్ స్పేల్ లీజు 26 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022 మొత్తం ఏడాది లీజు పరిమాణంలో ఇది 68 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి లీజు సర్దుబాటు పరిమాణం 37–39 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరుగుతుంది’’అని వెల్లడించింది. 2024లో 47 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజు భారత్‌లో 45–47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఈ ఏడాదితో పోలిస్తే 20–22 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ‘‘ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 2023 చివరికి 800 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్ చివరికి ఇది 792.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్ స్పేస్ లీజింగ్ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది. -
వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా?
Gold Prices in 2024: హద్దుల్లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయని ఆశలు పెట్టుకున్న పసిడి ప్రియులను నిపుణుల అంచనాలు కలవరపెడుతున్నాయి. 2024లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆదివారం (2023 డిసెంబర్ 31) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,550,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,870 వద్ద ఉంది. 2023 డిసెంబర్ నెల ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. గత మే 4న, గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,845, ఔన్స్‌కి 2,083 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 16న ధర మళ్లీ రికార్డు స్థాయిలో రూ.61,914కి చేరుకుందని కా కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ (Commtrendz research) డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు. రూ.70 వేలకు చేరే అవకాశం కొత్త సంవత్సరంలో బంగారం ఔన్స్ ధరలు 2,400 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. రూపాయి స్థిరంగా ఉంటే దేశంలో తులం బంగారం ధర రూ.70,000 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తేలికపరుస్తారన్న అంచనాల నేపథ్యంలో రూపాయి బలహీనపడవచ్చు. ఇది బంగారం దేశీయ ధరలను పెంచే అవకాశం ఉంది. అమ్మకాలపై తీవ్ర ప్రభావం యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి బంగారం ధరలలో పెరుగుదలకు దారితీస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా పేర్కొన్నారు. 2024లో బంగారం ధర ఔన్స్‌కు 2,250 నుంచి 2,300 డాలర్లు, 10 గ్రాముల ధర 68,000 నుంచి 70,000కి చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు 2024లో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వచ్చే ఏడాదిలో నగల వ్యాపారం 2023లో ఉన్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భరణాల డిమాండ్ పెరిగింది. -
కొత్త ఏడాదిలోనూ భారీ లేఆఫ్‌లు! కలవరపెడుతున్న లేటెస్ట్ సర్వే
Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. కారణాలివే.. ఎందుకు లేఆఫ్‌లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వారీగా.. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్‌లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్‌లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు. ఈ కంపెనీల్లోనే అత్యధికం పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి. -
2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే..
భారతదేశంలో ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. రానున్న రోజుల్లో (2024) పసిడికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని, కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) వెల్లడించింది. 2024లో గోల్డ్ రేటు పెరగటానికి కారణం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలో వేతనాలు పెరగడం, యువ జనాభా సంఖ్య, పట్టణీకరణ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువమంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతుండంతో తులం బంగారం ధరలు రూ. 60వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 70వేలుకి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం మీద భారతీయులకు ఉన్న మక్కువ కారణంగానే.. చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు, దీంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. పెరగనున్న పనిచేసే వారి సంఖ్య ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించే వారి కంటే.. పనిచేసుకుంటూ ఎదుగుతున్న జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ కేటగిరిలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. దీంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, ఇది 2040 వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్ 2000 నుంచి 2010 మధ్య కాలంలో బంగారానికి ఉన్న డిమాండ్ సుమారు 40 శాతానికి పైగా పెరిగింది. అంటే బంగారం అమ్మకాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా అన్ని కార్యక్రమాలకు బంగారు ఆభరణాలను వేసుకోవడం అలవాటు అయిపోవడంతో నగలు ఎక్కువగా కొంటున్నారు. సిటీలో ఉండేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో లేదా బంగారు కడ్డీల (గోల్డ్ బార్) రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్
భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో 2023 జులైలో విలీనమైంది. ఇదే తరహాలో ఇప్పుడు మరో రెండు ప్రైవేట్ బ్యాంకుల విలీనం జరుగుతోంది. విలీనానికి సిద్దమవుతున్న ఆ రెండు బ్యాంకులు ఏవి? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB).. షేర్ల డీల్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును (Fincare SFB) 2024 ఫిబ్రవరి 01 నాటికి విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల మధ్య జరుగుతున్న మొదటి పెద్ద విలీనం ఇదే అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. భారతదేశంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మొత్తం 1292 బ్యాంకింగ్ అవుట్లెట్లను కలిగి ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 339, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 640, పట్టణ ప్రాంతాల్లో 179, మెట్రో ప్రాంతాల్లో 73 అవుట్లెట్లు ఉన్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపడుతోంది. దీంతో వ్యాపార యూనిట్లకు క్రెడిట్ యాక్సెస్‌ను చేరువ చేసేందుకు ఈ విలీనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా? 2023 సెప్టెంబర్ 30 నాటికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. రూ.95977 కోట్లు, రూ.14777 కోట్లు. ఈ రెండు బ్యాంకులు విలీనం జరిగిన తరువాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు
న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ పేర్కొన్నారు. తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు. -
వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం) -
2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!
సాక్షి, ముంబై: కరోనా కాలంలో బంగారం ధర భారీగా పుంజుకుంది. ఈ ఏడాది 10 గ్రాముల పసిడి ధర వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. అయితే 2021 ఏడాదిలో కూడా పసిడి ధరల పరుగు మరింత వేగం అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజా ఉద్దీపన చర్యలు, బలహీనమైన అమెరికన్ డాలర్ తదితర అంచనాల మధ్య, కొత్త సంవత్సరంలో బంగారం 10 గ్రాములకు 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అగ్ర రాజ్యాల మధ్య యుద్ధ భయాలు, ట్రేడ్‌వార్ లాంటి వివిధ అనిశ్చిత సమయాల్లో పెట్టుబడికి ఎల్లప్పుడూ సురక్షితమైన స్వర్గంగా బంగారాన్ని పెట్టుబడిదారులు భావిస్తారు. దీనికి 2019 లో చైనాలో మొదలై ప్రపంచమంతా విస్తరించి 2020లో తీవ్ర కల్లోలాన్ని రేపిన కరోనా మహమ్మారి కూడా పుత్తడి ధరలనుభారీగా ప్రభావితం చేసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 56,191 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే అంతర్జాతీయంగా ఆగస్టులో మార్కెట్లో ఔన్సు ధర 2,075 డాలర్లు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది (2020)లో 10 గ్రాముల పుత్తడి రూ.39,100 వద్ద ప్రారంభమై కరోనా విజృంభణతో 56,191 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్టానికి చేరిందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈఓ జ్ఞానశేకర్ తియగరాజన్ తెలిపారు. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ లభ్యతపై భారీ ఆశలు, కోవిడ్-19 తరువాత ఆర్థిక పునరుజ్జీవనం ఉన్నప్పటికీ బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు బలంగా ఉందని ఆయన నమ్ముతున్నారు. డాలర్ ఇంకా బలహీనతను నమోదు చేయవచ్చు. ఇది కూడా 2021లో మరోసారి పెట్టుబడులను ఆకర్షించేందుకు సానుకూల అంశమని తియరాజన్ పేర్కొన్నారు. అంతేకాదు సెనేట్‌లో బలహీనమైన మెజారిటీ కారణంగా యుఎస్‌లో రాజకీయ ప్రమాదం, జో బిడెన్ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల అమలుకు గుదిబండగా మారుతుందినీ, ఇది బులియన్ మార్కెట్‌కు సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. అలాగే భారత, చైనాలోగత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఫిజికల్ గోల్డ్ డిమాండ్ 2021లో కీలక దశకు చేరుకుంటుందనీ, డిమాండ్ భారీగా పుంజుకుంటుందన్నారు. దీనికి తోడు రూపాయి కూడా స్థిరంగా ఉంటే, ధరలు 2021లో కనీసం రూ .60వేలను తాకవచ్చన్నారు. కోవిడ్-19 మహమ్మారి ఆంక్షలు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ఆందోళన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో కామెక్స్ లో పుత్తడి ధర 2,150-2,390 డాలర్ల మధ్య కదలాడనుంది. అలాగే ఎంసీఎక్స్ లో 57 వేలు - 63 వేల రూపాయలు టార్గెట్‌గా ఉండనుంది. -
వచ్చే ఏడాదికి వాయిదా!
కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది. -
ఫెడరర్ ఆడేది వచ్చే ఏడాదే
లండన్: టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఇక వచ్చే ఏడాదే కోర్టులో దిగనున్నాడు. కరోనా సంక్షోభంతో ఇప్పుడైతే ఏ టెన్నిస్ టోర్నీలూ జరగట్లేదు కానీ వైరస్ అదుపులోకి వచ్చి పోటీలు జరిగినా తను మాత్రం ఆడలేనని ఫెడరర్ తెలిపాడు. 38 ఏళ్ల ఫెడరర్ కుడి మోకాలుకు ఈ ఫిబ్రవరిలో ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతనింకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఫ్రొఫెషనల్ సర్క్యూట్‌కు ఈ ఏడాదంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ‘కొన్ని వారాల క్రితం పునరావాస ప్రక్రియలో ఉండగానే ఇబ్బంది ఎదుర్కొన్నాను. దీంతో రెండో దశ పునరావాస శిబిరంలో ఉండాలనుకుంటున్నాను. పూర్తిగా వంద శాతం కోలుకున్నాకే కోర్టులో దిగుతాను. కాబట్టి 2020 సీజన్‌కు దూరంగా ఉంటాను’ అని ఫెడరర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మాత్రమే జరగ్గా... కరోనా విలయతాండవంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రద్దు చేశారు. గత నెలాఖర్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఆఖరి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ అయిన యూఎస్ ఓపెన్ కూడా ఆలస్యమైనా సరే నిర్వహించాలనే నిర్ణయంతో యూఎస్ వర్గాలు ఉన్నాయి. -
మళ్లీ వేసవిలోనే ఒలింపిక్స్!
టోక్యో: వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2021 వేసవి సీజన్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాబోయే విశ్వక్రీడల షెడ్యూల్... 2020 గేమ్స్ కోసం చేసిన షెడ్యూల్ కన్నా భిన్నంగా ఏమీ ఉండబోదు అని మోరీ పేర్కొన్నారు. ‘అందరూ ఒలింపిక్స్ వేసవి (జూన్–ఆగçస్టు)లోనే జరగాలని కోరుకుంటారు. అందుకే మేం కూడా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యే విశ్వక్రీడల షెడ్యూల్ రూపొందించాలని ఆలోచిస్తున్నాం’ అని మోరీ పేర్కొన్నట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ ‘క్యోడో’ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 మధ్య జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ మంగళవారం గేమ్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే... ఈ క్రీడల్ని వచ్చే ఏడాది మార్చి–మేలో నిర్వహించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నాడు. అయితే ఈ వారంలో భేటీ కానున్న ‘ఒలిం పిక్స్ కార్యనిర్వాహక కమిటీ’ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో క్రీడల నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుందని మోరీ స్పష్టం చేశారు. ఐఓసీ, స్థానిక నిర్వాహకులు, వందలాది స్పాన్సర్లు, క్రీడా సమాఖ్యలు, బ్రాడ్కాస్టర్లు అందరితో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విశ్వ క్రీడల నిర్వహణ ఖర్చు గతంతో పోలిస్తే విపరీతంగా పెరుగుతుందని కమిటీ సీఈవో తోషిరో అన్నారు. -
2021లో... టోక్యో 2020
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్ క్రీడలు సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలైలోగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ ప్రభుత్వం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఒలింపిక్స్‌ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని నేను ప్రతిపాదించాను. ఐఓసీ అధ్యక్షుడు దానికి వంద శాతం అంగీకరిస్తున్నట్లు సమాధానమిచ్చారు’ అని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు వారాలు కావాలని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ఐఓసీ కూడా చివరకు సభ్య దేశాల ఒత్తిడితో తలొగ్గక తప్పలేదు. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం జరిగితే తాము కూడా పాల్గొనలేమంటూ ఒక్కో సభ్య దేశం ప్రకటిస్తుండటంతో ఐఓసీకి వాయిదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 2021లో కచ్చితమైన తేదీలు ప్రకటించకపోయినా... 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం అనుకున్న తేదీల్లోపే (జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు) మెగా ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది. వాయిదా మొదటిసారి మాత్రమే! 1896లో తొలిసారి ఒలింపిక్స్ జరిగాయి. అప్ప టి నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించకుండా వాయిదా వేయడం ఇదే తొలిసారి. గతంలో 3 సార్లు ప్రపంచ యుద్ధాల సమయంలో అసలు ఒలింపిక్స్ జరగనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను రద్దు చేశారు. ఐఓసీ, జపాన్ ఒలింపిక్ నిర్వహణ కమిటీ సంయుక్త ప్రకటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కారణంగా నెలకొని ఉన్న పరిస్థితిపై జపాన్ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడాకారులు, వారి సన్నాహాలపై దీని కారణంగా పడుతున్న ప్రభావంపై కూడా వారు చర్చించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 32వ ఒలింపిక్ క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయించాం. 2020 ముగిసిన తర్వాత 2021 వేసవిలోగా వీటిని నిర్వహిస్తాం’ అని ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. ఏడాదిని మార్చడం లేదు! టోక్యో ఒలింపిక్స్ 2021కు వాయిదా పడినా... అధికారిక నిర్వహణలో మాత్రం అదే సంవత్సరాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగినప్పుడు కూడా ఇవి ‘టోక్యో 2020’ పేరుతోనే జరుగుతాయి. టోక్యో 2020 గేమ్స్ లోగోలతో ఇప్పటికే సిద్ధం చేసిన టీ షర్ట్లు, ఇతర జ్ఞాపికలతో కూడిన ‘మర్కండైజ్’ను అమ్ముకునే అవకాశం వృథా చేయకూడదనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జ్యోతి కూడా జపాన్‌లోనే... ఒలింపిక్స్ వాయిదా పడినా జ్యోతి మాత్రం ఏడాది పాటు జపాన్‌లోనే ఉంటుంది. ‘ప్రపంచం మొత్తం తీవ్ర విషాదంలో ఉన్న ఇలాంటి సమయంలో టోక్యో నగరం భవిష్యత్తు ఆశలకు సంకేతంలా ఉండాలని మేం భావిస్తున్నాం. కష్టకాలంలో ఒలింపిక్ జ్యోతి కూడా చీకటిలో చిరుదివ్వెలాంటిది. అందుకే ఒలింపిక్ జ్యోతిని టోక్యోలోనే ఉంచాలని నిర్ణయించాం’ అని కమిటీ ప్రకటించింది. అయితే రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన టార్చ్ రిలేను మాత్రం నిలిపివేశారు. నష్టం ఎంత వరకు? కరోనా కారణంగా ఆర్థికపరంగా ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్న జపాన్‌పై ఒలింపిక్ క్రీడల వాయిదా వల్ల మరింత భారం పడనుంది. ఈ గేమ్స్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ పర్యాటకులు తదితర అంశాలపై వెంటనే దెబ్బ పడే అవకాశం ఉంది. రద్దు కాకపోవడం కొంత ఊరట కలిగించినా... ఒక మెగా ఈవెంట్ ఏడాది వాయిదా అంటే అన్ని లెక్కలు తారుమారయినట్లే! ఒలింపిక్స్‌కు సంబంధించి దాదాపు 78 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటే 45 లక్షల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఒలింపిక్ నిర్వహణ ఖర్చు గురించి 2019 చివరి నాటికి నిర్వాహకులు అంచనా వేసిన వ్యయం 12.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 96 వేల కోట్లు). గేమ్స్‌ను చూసేందుకు వచ్చే విదేశీ అభిమానుల ద్వారా సుమారు 2.28 బిలియన్ డాలర్లు (రూ. 17 వేల కోట్లు) ఆదాయాన్ని జపాన్ ఆశించింది. జపాన్ దేశానికే చెందిన కంపెనీలు 3.3 బిలియన్ డాలర్లు (రూ. 25 వేల కోట్లు) స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి. ఇదంతా నిర్వాహక కమిటీకి దక్కేవే. వీటితో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలతో భారీ మొత్తాలకు ఒప్పందాలు జరిగాయి. మొత్తంగా వాయిదా కారణంగా మరో 6 బిలియన్ డాలర్ల (రూ. 46 వేల కోట్లు) వరకు జపాన్‌కు, నిర్వాహక కమిటీకి నష్టం జరగవచ్చని ఒక అంచనా. అథ్లెట్లకు ఊరట: ఐఓఏ ‘ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలన్న ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది మన క్రీడాకారులకు ఊరటనిస్తుంది. కరోనా ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయాల్సి రావడం, రాబోయే నాలుగు నెలల కోసం కఠినంగా శ్రమించాల్సి ఉండటం మన అథ్లెట్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఇప్పుడు వారికి ఆ బెంగ లేదు. రాబోయే ఏడాది కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో, ఏమేం చేయాలో అనేది అంతా చక్కబడిన తర్వాత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జాతీయ క్రీడా సమాఖ్యలతో చర్చిస్తుంది. ప్రస్తుతానికి మన క్రీడాకారుల ఆరోగ్యమే మనకు ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకొని వారంతా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా’ –రాజీవ్ మెహతా, ప్రధాన కార్యదర్శి, ఐఓఏ -
భారత్‌కు మాల్యా : బిగ్ బ్రేక్
లండన్: భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా (63) ను స్వదేశం రప్పించే ప్రయత్నంలో మరో బ్రేక్ పడింది. మాల్యాను భారత్ అప్పగించే ఉత్తర్వుకు వ్యతిరేకంగా యుకె హైకోర్టులో మాల్యా పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. 2020 ఫిబ్రవరి 11వ తేదీకి ఈ విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై విచారణ చేపట్టనున్నామని లండన్ హైకోర్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా సుమారు రూ. 9వేల కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడిన కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాపై మనీలాండర్‌రింగ్ ఆరోపణలతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. ఆర్థిక నేరగాడు మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి2, 2016న దేశంనుంచి పారిపోయిన మాల్యాను ఎట్టకేలకు 2017లో లండన్ పోలీసుల సాయంతో మాల్యాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. అయితే బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 100శాతం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా బ్యాంకులు మాత్రం ఆ డబ్బు తీసుకోవడంలేదని మాల్యా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
వచ్చే ఏడాది కూడా ఇవే కరెంట్ చార్జీలు
-
వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా.. ‘కాళేశ్వరం’ పూర్తి
► బ్యారేజీలు పూర్తిచేసి కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి ఎస్సారెస్పీ ద్వారా నీళ్లందించాలి: సీఎం కేసీఆర్ ► రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాక ముందే కాల్వల ద్వారా చెరువులు నింపాలి ► ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలి ► చివరి ఆయకట్టుకు నీరివ్వాలి.. సొరంగ మార్గం, ఇతర పనులపై సంతృప్తి ► సాగునీటికి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బ్యారేజీ నిర్మాణాలకు ముందే కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా నీటిని తోడాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సారెస్పీ, ఇతర కాల్వల ద్వారా సాగునీటి అవసరాలకు, గ్రామాల్లోని చెరువులకు నీరందించాలని ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా, వేగంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఉన్న మార్గంలో 81 కిలోమీటర్ల మేర ఆసియాలోనే పెద్దదైన సొరంగ మార్గం తవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 78.55 కి.మీ. మేర తవ్వకం పూర్తి కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేసి, రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందివ్వాలని కోరారు. ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకముందే కాల్వల ద్వారా చెరువులు నింపే పని జరగాలని కోరారు. నీటి పారుదల ప్రాజెక్టులపై సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, జల వనరుల నిర్వహణ కమిటీ చైర్మన్ వి.ప్రకాశ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈలు వెంకటేశ్వర్లు, హరిరామ్, అనిల్, శంకర్, నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వాటి నిర్మాణ దశలపై అధికారులతో సీఎం కూలంకశంగా చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలను పెట్టి, వాటిని ప్రగతిభవన్‌కు అనుసంధానం చేశారు. ఆ పనులను ప్రగతి భవన్ నుంచే సీఎం వీక్షించారు. సమన్వయంతో ముందుకెళ్లాలి.. ప్రాజెక్టుల పనుల విషయంతో అత్యంత వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. ‘‘వర్షాలు లేనప్పుడు ఏ పనులు చేయాలి? వర్షాలున్నప్పుడు ఏ పనులు చేయాలి? వరదలు వస్తే ఎలా వ్యవహరించాలి? అనే విషయంలో ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవాలి. బ్యారేజీలు, ఇన్‌టేక్ వెల్స్, పంప్ హౌజ్‌ల నిర్మాణం జరుగుతుండగానే గేట్లు, పంపుల తయారీ, విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం సమాంతరంగా జరగాలి. ఎక్కడికక్కడ పనులు సమాంతరంగా చేస్తూ.. అంతిమంగా అన్నింటినీ లింక్ చేయాలి. ఒకదాని తర్వాత ఒక పని చేద్దామని భావన ఉండొద్దు. వర్కింగ్ ఏజెన్సీల పనిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వారు కావాల్సిన పనులను సకాలంలో చేస్తున్నారో లేదో కూడా గమనించాలి. విద్యుత్ అధికారులతో కూడా సమన్వయం ఉండాలి. కాళేశ్వరం నుంచి ఎల్ఎండీ దాకా ఎన్ని పంపులు పెడుతున్నాం? ఎంత కరెంటు కావాలి? అనే విషయాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఏర్పాట్లు చేసుకోవాలి. కాళేశ్వరానికి ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపులను ఆస్ట్రియాలో తయారు చేయిస్తున్నం. అక్కడికి వెళ్లి వాటి నిర్మాణాన్ని పరిశీలించి, వాటి పనితీరుపై అక్కడి తయారీ సంస్థలు, నిపుణులతో చర్చించి నిర్వహణ అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్లంపల్లి–మిడ్ మానేరు లింక్ పూర్తవ్వాలి కాళేశ్వరం పనులు జరుగుతుండగానే అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గోదావరి నీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘‘ఇప్పటికే సిద్ధంగా ఉన్న కాల్వలను వాడుకోవాలి. ఎల్ఎండీకి ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి కాల్వలు, ఎల్ఎండీకి దిగువన ఉన్న కాకతీయ కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలి. నీటి ప్రవాహ సామర్థ్యం పెంచాలి. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కాల్వల ద్వారా నీళ్లు పంపాలి. చెరువులు నింపాలి. ఈ నీళ్లను చివరి ఆయకట్టు వరకు పంపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాళేశ్వరం దగ్గర పుష్కలమైన నీటి లభ్యత ఉంది. దాన్ని సమర్థంగా వాడుకోవాలి. దేవాదులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే దానిపై 8 వేల కోట్లు ఖర్చు చేశారు. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి గోదావరిపై బ్యారేజీ కూడా నిర్మిస్తున్నాం. దేవాదులపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి, ఇంకా ఏం చేయాలో నిర్ణయించాలి. సిద్దిపేట సమీపంలోని ఇమాంబాద్‌లో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. 8.5 కి.మీ. పొడవున్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి అంచనాలు రూపొందించాలి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులు నింపేందుకు కార్యాచరణ గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు కట్టడానికన్నా ముందే ఆ మార్గంలో కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘మల్లన్నసాగర్, గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని బట్టి లిఫ్టులను వాడాలి. సింగూరుకు లిఫ్టులు పెట్టి నారాయణ ఖేడ్, జహీరాబాద్‌కు నీళ్లు పంపాలి. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నిర్మించాలి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు చెరువులు నింపడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి’’అని చెప్పారు. ‘‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. రాష్ట్ర బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి పెట్టుబడులు ఎక్కువ చేసుకుందాం. రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైతే రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా తెలంగాణ రాబోయే కాలంలో సిద్ధంగా ఉంటుంది. సాగునీటి రంగానికి సంబంధించి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలి’’అని సీఎం చెప్పారు. -
వచ్చే ఏడాదికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ ఇన్చార్జి జీఎం వెల్లడి ఎన్జీఎన్ను ప్రారంభించిన కలెక్టర్ ల్యాండ్‌లైన్‌తో వీడియో కాలింగ్, వాయిస్, మల్టీమీడియా సేవలు అందుబాటులోకి.. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వచ్చే ఏడాది మార్చి తరువాత జిల్లాలో 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్టు జిల్లా ఇన్చార్జి జీఎం ఎం.జాన్ క్రిసోస్టమ్ తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్) ఎక్సే్ఛంజిని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో క్రిసోస్టమ్ మాట్లాడుతూ, మొదటి దశలో 4జీ సేవలను కాకినాడలో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎన్జీఎన్ ఎక్సే్ఛంజి వల్ల ఒకే లైనుపై వాయిస్, వీడియో కాలింగ్, డేటా, మల్టీమీడియా సర్వీసులు పని చేస్తాయన్నారు. ల్యాండ్‌లైన్‌కు కూడా ప్రీపెయిడ్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 25 తరువాత నుంచి ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ ద్వారా రోజంతా ఉచిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి రానున్నదని చెప్పారు. నూతనంగా రూ.49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్, దీంతోపాటు ఒక ప్రీపెయిడ్ సిమ్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.470కే అన్ లిమిటెడ్ ప్లానులో 10 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ను పొందవచ్చని క్రిసోస్టమ్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు దీటుగా సేవలందించి ప్రజలకు బీఎస్ఎన్ఎల్ మరింత చేరువ కావాలని అన్నారు. కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఉచిత వైఫై అందిస్తే తాము సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఐటీఎస్ అ«ధికారి ఎ.శ్రీనివాసరావు, డీజీఎంలు రమేష్‌బాబు, డి.సుబ్బారావు, ఏవీ కృష్ణారావు, విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాదికి 4.04 కోట్ల మొక్కల లక్ష్యం
కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కింద 2017–18 సంవత్సరానికి జిల్లాలో 4.04 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. హరితహరంలో జిల్లాలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ చర్యలు, వచ్చే ఏడాది లక్ష్య సాధన, మరుగుదొడ్లు నిర్మాణం, పొగరహిత గ్రామాలు తదితరాంశాలపై ఆయన శుక్రవారం జాయింట్ కలెక్టర్ దివ్యతో కలిసి ఎంపీడీఓలు, తహసీల్దారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 3.77 కోట్ల మొక్కలు నాటామన్నారు. వచ్చే ఏడాది 4.04 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని అన్నారు. 4.95 కోట్ల మొక్కలను వివిధ శాఖల నర్సరీల ద్వారా పెంచేందుకు లక్ష్యాలను నిర్దేశించినట్టు చెప్పారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను గ్రామ పంచాయతీలవారీగా గ్రామ స్థాయిలో రిజిస్టర్ నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి బాధ్యునితోపాటు మండలాధికారులు వారానికి రెండుసార్లు తప్పనిసరిగా పర్యటించి మొక్కలను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలినవి త్వరగా పూర్తిచేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై ప్రతి గురువారం తహసీల్దారులు, ఎంపీడీఓలు గ్రామాలమ సందర్శించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ దివ్య మాట్లాడుతూ.. దీపం పథకం కింద రెండువేల రూపాయపలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇంతకు మించి వసూలు చేసిన గ్యాస్ ఏజెన్సీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మారుపాక నాగేశ్, ఆర్డీఓలు వినయ్‌కృష్ణారెడ్డి, రవీంద్రనా«ద్ తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్!!
-
వెయ్యికి పైగా ఇంజనీర్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: చైనీస్ ఇంటర్నెట్ సంస్థ లే ఎకో భారీ సంఖ్యలో ఇంజనీర్లను నియమించుకునేందుకు యోచిస్తోంది. భారతదేశంలో ఆర్ అండ్ డి సెంటర్ కు దాదాపు 1100 మందికి పైగా ఇంజనీర్ కేటగిరీ ఉద్యోగులు అవసరమని ప్రకటించింది. వచ్చే ఏడాదికల్లా వీరిని ఎంపిక చేయనుంది. ప్రధానంగా వీరిని టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజీలనుంచి సెలెక్ట్ చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ ఐటీలనుంచి వీరినుంచి ఎంపిక చేయనున్నామని లె ఎకో ఒక ప్రకటనలో వెల్లడించింది. బెంగుళూరులో గత వారం నిర్వహించిన ఫ్రెషర్స్ డ్రైవ్ లో అత్యున్నత ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నుంచి 2,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని కంపెనీ తెలిపింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంస్థ మోడెమ్ సాంకేతికతలు, బీఎస్పి, మల్టీమీడియా, టీవీ బ్రాడ్ కాస్ట్ , ఇంటర్నెట్ టెక్నాలజీస్ తదితర అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికోసం అన్వేషిస్తున్నామని లే ఎకో ఇండియా హెడ్( ఆర్ అండ్ డి) శ్రీనివాస్ బైరి చెప్పారు. కాగా భారత్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ 2017లో నెలకొల్పనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.