ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా..ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందీ మనమంతా చూశాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్ళీ గెలవడం,టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా ఆధిపత్యం సాధించడం, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి సిరియా, ఇరాన్,ఇజ్రాయెల్, పాలస్తీనా వంటివి యుద్ధాల్లో రగులుతుందడం, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం,ఎన్నడూలేని కృష్ణా నది వరదల్లో విజయవాడ అల్లాడిపోవడం..ఇవన్నీ మనం చూశాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది..ఎలా ఉండబోతోంది.
కాలజ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. అవును ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ ఈ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు ప్రపంచ యుద్ధాలు అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత ఇలా ఎన్నో అంశాల గురించి ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న 2025 కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు..
1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం,అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు,కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనావేసి చెప్పారు.అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫేటిస్ (ది ప్రొఫెసీస్) ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు.ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు.ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి.
2025లో ఏం జరగబోతోంది..
- 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమిమీద పెను మార్పులు సంభవిస్తాయి
- బ్రిటన్‌లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారు
- ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని అన్నాడు
- అంటే మూడేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
- సుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అంతా అలసిపోతుంది. ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారు
- ఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి
- ఇంగ్లాండ్.. దేశం అటు యుద్ధాలు,ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది.
- ఇంగ్లాండ్ దేశం క్రూరమైన యుద్ధాలతో బాటు "శత్రువుల కంటే ఘోరంగా" ఉండే "పురాతన ప్లేగు" వ్యాప్తిని ఎదుర్కొంటుంది.
గ్రహశకలం భూమిని ఢీకొంటుందా?
ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యం అని నోస్ట్రడామస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి, వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్లిపోతున్నాయి.
బ్రెజిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు..
గార్డెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్, ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు...దారుణ పరిస్థితులకు ప్రభవితమైపోతుందని నోస్ట్రడామస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్లవంటి ఘటనలు కూడా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment