nostradamus
-
2025 లో మహా ప్రళయం
-
2025 లో మహా ప్రళయం
-
2025లో ఏం జరగబోతోంది..?: నోస్ట్రడామస్ ఏం చెప్పాడు ?
ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా..ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందీ మనమంతా చూశాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్ళీ గెలవడం,టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా ఆధిపత్యం సాధించడం, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి సిరియా, ఇరాన్,ఇజ్రాయెల్, పాలస్తీనా వంటివి యుద్ధాల్లో రగులుతుందడం, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం,ఎన్నడూలేని కృష్ణా నది వరదల్లో విజయవాడ అల్లాడిపోవడం..ఇవన్నీ మనం చూశాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది..ఎలా ఉండబోతోంది.కాలజ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. అవును ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ ఈ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు ప్రపంచ యుద్ధాలు అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత ఇలా ఎన్నో అంశాల గురించి ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న 2025 కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు..1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం,అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు,కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనావేసి చెప్పారు.అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫేటిస్ (ది ప్రొఫెసీస్) ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు.ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు.ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో ఏం జరగబోతోంది..2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమిమీద పెను మార్పులు సంభవిస్తాయిబ్రిటన్లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారుఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని అన్నాడు అంటే మూడేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారుసుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అంతా అలసిపోతుంది. ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారుఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయిఇంగ్లాండ్.. దేశం అటు యుద్ధాలు,ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది.ఇంగ్లాండ్ దేశం క్రూరమైన యుద్ధాలతో బాటు "శత్రువుల కంటే ఘోరంగా" ఉండే "పురాతన ప్లేగు" వ్యాప్తిని ఎదుర్కొంటుంది.గ్రహశకలం భూమిని ఢీకొంటుందా?ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యం అని నోస్ట్రడామస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి, వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్లిపోతున్నాయి.బ్రెజిల్లో ప్రకృతి వైపరీత్యాలు..గార్డెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్, ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు...దారుణ పరిస్థితులకు ప్రభవితమైపోతుందని నోస్ట్రడామస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్లవంటి ఘటనలు కూడా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు.- సిమ్మాదిరప్పన్న -
Nostradamus: కమలా హారిస్‌దే విజయం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా!
బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. అలా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే ఊహించి చెప్పినవాడు ‘నోస్ట్రాడమస్’. 465 సంవత్సరాల క్రితమే వేల అంచనాలతో ‘లెస్ ప్రొఫెటీస్’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన చెప్పినవాటిలో కొన్ని నిజమయ్యాయి కూడా. అలాంటి జ్యోతిషుడే చైనాలోనూ ఉన్నాడు. ఆయన పేరు లియూ బోవెన్. ‘ద టెన్ వర్రీస్’ అనే పేరుతో ఉన్న కవితలో ఆయన భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ముందే లిఖించాడు. అందులో కరోనా పుట్టుకను, అంతాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అది కచ్చితంగా కరోనా అనేఎలా చెప్పగలరంటే... ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్య కాలంలో భయంకరమైన విపత్తు వస్తుందని, అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమైపోతుందని ఆ కవితలో పేర్కొన్నాడు. చైనీస్ జొడియాక్ సంవత్సరాల ప్రకారం ర్యాట్ ఇయర్ 2019 ఫిబ్రవరిన మొదలైంది. పిగ్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. ఈ రెండేళ్ల మధ్య పుట్టిన విపత్తు... కరోనా వైరసే. చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబరు 1న తొలి కేసును గుర్తించారు. అది ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలమే. ఇక కరోనా అంతమైపోతుందని ఆయన చెప్పిన సంవత్సరాలు... డ్రాగన్ 2024లో ప్రారంభమవుతుండగా, స్నేక్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే పూర్తిగా కరోనా నశిస్తుందని పేర్కొన్నాడు. ఆయన చెప్పిందే నిజమవుతోందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. ఉండవు కూడా. అయితే ఆ కవిత బోవెన్ రాసినట్టు ఆధారాలు కూడా ఏమీ లేవన్న విమర్శ కూడా ఉంది. చదవండి: చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత ఎవరో చక్రవర్తి ఆయన కాలంలో సంభవించిన ప్రకృతి విపత్తులనుంచి రక్షించుకోవడానికి ఇలా రాసి, అది బోవెన్ రాసినట్టుగా చెప్పి ఉంటారనీ నమ్మేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా నిజానికి... కరోనా ఎప్పుడు అంతమవుతుంది? అసలు పోతుందా? లేదా అనేది కాలానికే తెలియాలి. అయినప్పటికీ, ఇలా మన చేతుల్లో లేని విషయాల గురించి వేరెవరో ఊహించింది చదవడానికి, వినడానికి బాగుంటుంది కదా! అలాంటిదే ఇది. -
2022లో భూమికి పెనుముప్పు!
Nostradamus Predictions About World In 2022: కాలజ్ఞానం గురించి ప్రస్తావన వస్తే ప్రముఖంగా మనకు బ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తిగా ‘మిచెల్ డి నోస్ట్రాడమ్’కు మంచిపేరు ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడైన నోస్ట్రాడమస్ సుమారు 465 ఏళ్ల క్రితం తన పుస్తకం ‘లెస్ ప్రొఫెటీస్’లో భవిష్యత్తుకు సంబంధించి పలు అంచనాలను రాశారు. భవిష్యత్తు గురించి ఆయన చెప్పినవి.. పలు దేశాల్లో కొన్ని సంఘటనలుగా నిజమయ్యాయి కూడా! అయితే మనం ప్రస్తుతం 2022వ ఏడాదిలోకి అడుగుపెట్టడానికి దగ్గర్లో ఉన్నాం. ఆయన రాసిన పుస్తకంలో 2022వ ఏడాదికి సంబంధించి కూడా పలు విపత్కర విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన భవిష్యత్తు అంచనా విషయాలు వైరల్ అవుతున్నాయి. చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి 2022లో ప్రపంచం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు ఏర్పడనున్నట్లు జోస్యం చెప్పారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుపాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్ దేశం సంక్షోభానికి గురవుతుందని తెలిపారు. 2022 నాటికి కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ అంచనాలు చాలా కాలం తర్వాత నిజం కావచ్చు! లేదా చాలా ముందుగానే జరగవచ్చు! అప్పటివరకు వేచి చూడాల్సిందే! ఆయన ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనలను ముందే చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచారు. అడాల్ఫ్ హిట్లర్ పెరుగుదల గురించి గాని, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రవాదుల దాడి లాంటి ఘటనలను నోస్ట్రాడమస్ అంచనా వేసిన తెలిసిందే. చదవండి: Snake In Christmas Tree: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది! -
‘ఆయన.. ఈ శతాబ్దపు అత్యుత్తమ నటుడు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గుజరాత్ దళిత ఉద్యమనేత జిగ్నేష్ మేవాని ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. దళితులపై ప్రధాని కపట ప్రేమను కనబరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దళితులపై దాడులను గురించి ప్రధాని మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్ నుంచి ప్రపంచ మహానటుడు వస్తాడన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ అంచనాలు నిజమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన దళిత హక్కుల గురించి మోదీ ప్రసంగాల్లో చెప్పిన అంశాలను పోస్ట్ చేశారు. దళితులు హక్కులు గురించి మాట్లాడేవారంతా.. మహారాష్ట్రలో మాత్రం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిచారని అన్నారు. ‘మీరు కాల్చాంటే నన్ను కాల్చండి. దళిత సోదరులను కాదు’ అంటూ ఆగస్టులో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. దళితులపై గోరక్షకుల దాడులపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వద్గామ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేవాని విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్యక్తి మోదీనే’
న్యూఢిల్లీ: భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లగల వ్యక్తి తూర్పు ప్రాంతంలో జన్మిస్తారని ఫ్రాన్స్ దేశానికి చెందిన జ్యోతిష్యశాస్త్రవేత్త నోస్ట్రాడామస్ అప్పట్లోనే చెప్పారని, ఆ వ్యక్తి మరెవరో కాదని, ప్రధాని నరేంద్రమోదీనేనని బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు కిరిత్ సోమయ్య చెప్పారు. సోమవారం లోక్‌సభలో గ్రాంటులకోసం సప్లిమెంటరీ డిమాండ్స్‌పై మాట్లాడే సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘తూర్పు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని, అతడే భారతదేశాన్నిసరికొత్త అత్యున్నత శిఖరాలకు చేరుస్తారని నోస్ట్రాడామస్ అనాడే చెప్పారు. ఆయన చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రధాని నరేంద్రమోదీనే’ అని ఆయన అన్నారు. మరోపక్క, ప్రతిపక్షాలు ఏ చర్చ తీసుకొచ్చినా అందులోకి పెద్ద నోట్ల రద్దు విషయాన్ని తీసుకొచ్చి వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. నోస్ట్రాడామస్ ఫ్రాన్స్ దేశానికి చెందిన జ్యోతిష శాస్త్రవేత్త. 1547 సంవత్సరం ప్రాంతంలో ఆయన భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. ఆయన జోస్యాలతో కూడిన గ్రంథం పేరు సెంచరీస్. ఆ గ్రంథంలో ఆయన చెప్పినవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని అందరూ విశ్వసిస్తుంటారు. హిట్లర్ గురించి, 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి గురించి ఆయన ముందే చెప్పారని అంటుంటారు. -
మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే...
న్యూఢిల్లీ: ‘భారత దేశాన్ని 2014 నుంచి 2026 వరకు సమర్థుడైన నాయకుడు పాలిస్తాడు. తొలుత ఆ నాయకుడిని ప్రజలు ద్వేషిస్తారు. కానీ ఆయన అనతి కాలంలోనే భారత దేశ దుస్థితిని, దిశను మార్చివేయడాన్ని గమనించి ప్రజలంతా ఆయన్ని ఎంతోగానే ప్రేమిస్తారు. ఆ సమర్థుడైన నాయకుడు భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే బంగారు భవిష్యత్తు తీసుకొస్తాడు. అనేక దేశాలు భారత్ కింద తలదాచుకుంటాయి. ఫ్రెంచ్ బ్రహ్మ నోస్ట్రాడామస్ అన్న మాటలివి. ఇవి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి చేసినవే’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు గురువారం రాత్రి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి 1555లో వేసిన అంచనాలని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో పార్టీల బలాబలాల్లో దాగున్న 13వ సంఖ్య గురించి ప్రస్తావించారు. లోక్ సభలో బీజేపీకి 283 సీట్లు ఉన్నాయని, వీటిని 2+8+3 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, అలాగే ఎన్డీయేకు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 337 అని, వీటిని 3+3+7 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, యూపీఏకు వచ్చిన సీట్లు 58 అని, వీటిని 5+8 అని కూడినా 13 సంఖ్య వస్తుందని, అలాగే ఇతర పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్య 148 అని, వీటిని కూడా 1+4+8 కూడినా 13 సంఖ్య వస్తుందని అన్నారు. ఈ సంఖ్యలకు 455 ఏళ్ల క్రితం నోస్ట్రోడామస్ అంచనాలకు లింకేమిటో మాత్రం మన మంత్రి రిజీజు వివరించలేదు. పైగా పాశ్చాత్యుల విశ్వాసం ప్రకారం 13వ సంఖ్య అనర్థదాయకం. రిజీజు ఫేస్ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటారు. తాను పాల్గొన్న సభలు, సమావేశాలను సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఫేస్ బుక్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఆయనకు 36,409 ఫాలోవర్స్ ఉన్నారు. -
యూరప్ తుడిచిపెట్టుకు పోతుందా?
సోఫియా: ఆమె వాక్కు బ్రహ్మంగారి వాక్కు. ప్రపంచ పరిణామాల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం పరిణామాలు నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, అందులో అమాయక ప్రజలు మృత్యువాత పడతారని. 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లిం యుద్ధం ప్రారంభమవుతుందనీ చెప్పిన విషయం కూడా, పేట్రేగి పోతున్న ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను చూస్తుంటే దాదాపు నిజమేనని అనిపిస్తోంది. ఈ యుద్ధం 2016 లో ముస్లిం మహా యుద్ధంగా పరిణమించి 2043 నాటికి మొత్తం ఐరోపా తుడిచిపెట్టుకు పోతుందని, ఖలిఫా రాజ్యం ఏర్పడుతుందని కూడా ఆమె భవిష్యవాణి వినిపించారు. ఇందులో ఏ మాత్రం నిజమవుతుందో రానున్న చారిత్రక పరిణామాలే తెలియజేయాలి. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసినదీ బల్గేరియాకు చెందిన బాబా వాంగ. ఆమె దాదాపు 20 ఏళ్ల క్రితమే, అంటే 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ఆమె అనుచర వర్గాలు చెబుతున్నాయి. రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పడం, 2001, సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం 2004, డిసెంబర్ 26వ తేదీన ఇండోనేసియా, సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడమేనని ఆ వర్గాలు అంటున్నాయి. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు. భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని చెప్పారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికవడం తెల్సిందే. ఆయనే ఆఖరి అధ్యక్షుడవాతారా అన్నది మిలియన్ డాలర్ల అనుమానం. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేశారు. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.