Nostradamus Predictions About World In 2022: కాలజ్ఞానం గురించి ప్రస్తావన వస్తే ప్రముఖంగా మనకు బ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తిగా ‘మిచెల్ డి నోస్ట్రాడమ్’కు మంచిపేరు ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడైన నోస్ట్రాడమస్ సుమారు 465 ఏళ్ల క్రితం తన పుస్తకం ‘లెస్ ప్రొఫెటీస్’లో భవిష్యత్తుకు సంబంధించి పలు అంచనాలను రాశారు.
భవిష్యత్తు గురించి ఆయన చెప్పినవి.. పలు దేశాల్లో కొన్ని సంఘటనలుగా నిజమయ్యాయి కూడా! అయితే మనం ప్రస్తుతం 2022వ ఏడాదిలోకి అడుగుపెట్టడానికి దగ్గర్లో ఉన్నాం. ఆయన రాసిన పుస్తకంలో 2022వ ఏడాదికి సంబంధించి కూడా పలు విపత్కర విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన భవిష్యత్తు అంచనా విషయాలు వైరల్ అవుతున్నాయి.
చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
2022లో ప్రపంచం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు ఏర్పడనున్నట్లు జోస్యం చెప్పారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుపాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్ దేశం సంక్షోభానికి గురవుతుందని తెలిపారు. 2022 నాటికి కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోవచ్చని ఆయన అంచనా వేశారు.
ఈ అంచనాలు చాలా కాలం తర్వాత నిజం కావచ్చు! లేదా చాలా ముందుగానే జరగవచ్చు! అప్పటివరకు వేచి చూడాల్సిందే! ఆయన ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనలను ముందే చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచారు. అడాల్ఫ్ హిట్లర్ పెరుగుదల గురించి గాని, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రవాదుల దాడి లాంటి ఘటనలను నోస్ట్రాడమస్ అంచనా వేసిన తెలిసిందే.
చదవండి: Snake In Christmas Tree: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది!
Comments
Please login to add a commentAdd a comment