predictions
-
ఏలియన్లతో మీటింగ్.. అంగారకుడిపై యుద్ధం తప్పదా?
భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే భావి అంచనాలను చెప్పేవారికి ఎక్కడాలేనంత డిమాండ్ ఉంటుంది. మనకు బ్రహ్మంగారు ఎలాగో.. వెస్ట్రన్ కంట్రీస్‌కు బాబా వాంగా అలాగ!. ఈమె అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన ఈమె 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కానీ, చనిపోయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పిన భవిష్యత్ అంచనాలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరొందిన బాబా వంగా తన పన్నెండేళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోస్యం చెప్పడాన్ని మొదలు పెట్టారు. మార్కా డాట్ కామ్ తెలిపిన వివరాల ప్రకారం 2021 సెప్టెంబరు 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిపై బాబా వాంగా చెప్పిన అంచనా నిజమయ్యింది. రెండు లోహపు పక్షులు (విమానాలు) ట్విన్ టవర్స్‌ను ఢీకొంటాయని, అమాయకుల రక్తం ఏరులై పారుతుందని వాంగా తెలిపారు.బాబా వాంగా తెలిపిన భవిష్యవాణులలో ముఖ్యమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో ప్రపంచం అంతం కానుంది. రాబోయే దశాబ్దాలలో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాలిలా ఉన్నాయి.2025: ఐరోపాలో భారీ సంఘర్షణల కారణంగా ఈ ఖండంలోని జనాభా గణనీయంగా తగ్గుతుంది.2028: నూతన శక్తి వనరులను కనుగొనే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటాడు.2033: ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.2076: కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది.2130: భూలోకేతర నాగరికతలతో పరిచయం ఏర్పడుతుంది.(ఏలియన్స్‌తో కమ్యూనికేషన్)2170: ప్రపంచవ్యాప్తంగా కరువు కమ్ముకుంటుంది.3005: అంగారకునిపై యుద్ధం.3797: భూమి నాశనం.. సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణం5079: ప్రపంచం అంతం. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత -
2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్.. ?
వరల్డ్‌కప్ 2023 ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో విశ్వవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఎక్కడ చూసినా జనాలు ఈ మెగా ఈవెంట్ గురించే చర్చించుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వరల్డ్‌కప్ విజేతపై ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా దీనిపై క్విజ్ పోటీలు నడుస్తున్నాయి. వరల్డ్‌కప్ విజేతలు ఎవరో కరెక్ట్‌గా అంచనా వేసిన వారికి పలు సంస్థలు ప్రైజ్‌మనీ కూడా ప్రకటించాయి. ఈ అంశంపై పాపులర్ క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలు మాజీ స్టార్లు ఫైనల్‌కు చేరే జట్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరెవరు ఏయే జట్లు ఫైనల్‌కు చేరుతాయని చెప్పారంటే.. జాక్ కల్లిస్: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ క్రిస్ గేల్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ షేన్ వాట్సన్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దినేశ్ కార్తీక్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫాఫ్ డెప్లెసిస్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వకార్ యూనిస్: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ డేల్ స్టెయిన్: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఇర్ఫాన్ పఠాన్: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ముత్తయ్య మురళీథరన్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సంజయ్ మంజ్రేకర్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పియూశ్ చావ్లా: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా అందరు స్టార్ క్రికెటర్లు ఈ సారి టీమిండియా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే ప్రత్యర్ధుల విషయంలో మాత్రం ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. మెజార్టీ శాతం ఇండియా, ఇంగ్లండ్‌లు ఫైనల్‌కు చేరతాయని అంచనా వేశారు. కొంతమంది భారత్, పాక్ మధ్య ఫైనల్ జరుగుతుందని అన్నారు. మరి రానున్నవరల్డ్కప్లో ఏ జట్లు ఫైనల్‌కు చేరతాయో మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
గ్లోబల్ ట్రెండ్, ఎఫ్‌పీఐలే కీలకం.. ఈ వారం మార్కెట్ దిశపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. జియో ఫైనాన్స్ లిస్టింగ్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్‌కానుంది. దేశీ ఎన్బీఎఫ్సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్‌లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు. విదేశీ పరిస్థితులు: యూఎస్‌లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్అండ్పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు. ఇతర అంశాలపైనా కన్ను అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది. -
దిద్దుబాటు కొనసాగొచ్చు.. మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది. ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి. ‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు... రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్‌లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి. ఈ వారంలో 7 ఐపీఓలు.. ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్ఎమ్, పీకేహెచ్ వెంచర్స్‌తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి. మూడు వారాల్లో రూ.30,600 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
'జొమాటో షేర్లలో అల్లకల్లోలం' రాకేష్ ఝున్‌ఝున్ వాలా మాటే నిజమైందే!
వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్‌ఝున్ వాలా చేసిన ప్రిడిక్షన్ నిజమైంది. ఏడాది క్రితమే జొమాటో షేర్ల పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మదుపర్లను జొమాటో షేర్లను కొనవద్దని చెబితే వారు నన్ను ఫూల్ అంటారని వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ మంచి జోరుమీదున్న సమయంలో హఠాత్తుగా ‘జొమాటో’ షేర్లు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్ జరిగే 3గంటల సమయానికి జొమాటో షేర్ ధర రూ.45.90గా ఉండగా.. జులై 23,2021 నుంచి ఆ సంస్థ షేర్లు 61.33శాతం పతనమయ్యాయి. అదే సమయంలో గతేడాది స్టాక్ మార్కెట్లో ఐపీవో లిస్టింగ్‌కు వెళ్లిన ఇతర సంస్థల షేర్లు జోరుమీద ఉండడం..పేటీఎం, నైకా షేర్లు, జొమాటో షేర్లు భారీగా పతనం కావడంతో మదపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో గతేడాది జరిగిన 'ఇండియా టుడే కన్లక్లేవ్'లో పాల్గొన్న ఝున్‌ఝున్ వాలా చేసిన వ్యాఖ్యల్ని మదుపర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియా టుడే కార్యక్రమంలో..జొమాటోతో సహా కొత్తగా లిస్టైన ఇతర కంపెనీల వాల్యుయేషన్‌పై ఝున్‌ఝున్ వాలా ఆందోళన వ్యక్తం చేశారు. జొమాటో స్టాక్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరించారు. ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.హెచ్చరించారు. "ఈ రోజు నేను జొమాటో షేర్ని కొనవద్దు అని చెబితే, ప్రజలు నన్ను ఫూల్ అంటారు" అని వ్యాఖ్యానించారు. కారణం అదేనా గత ఏడాది జూలై 23న ఐపీవోకి వెళ్లిన జొమాటో ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఈ ఏడాది జులై 23కి లాక్ ఇన్ పిరియడ్ ముగిసింది. జూలై 25 ,జూలై 26 ఈ రెండు రోజుల్లో స్టాక్ 20 శాతం భారీగా పడిపోయింది. నాటి నుంచి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్ల పతనం కొనసాగుతుంది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులపై ఆందోళన చెందుతుండగా..నాడు జొమాటో స్టాక్స్ విషయంలో రాకేష్ ఝున్‌ఝున్ వాలా మాట విని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
2022లో భూమికి పెనుముప్పు!
Nostradamus Predictions About World In 2022: కాలజ్ఞానం గురించి ప్రస్తావన వస్తే ప్రముఖంగా మనకు బ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తిగా ‘మిచెల్ డి నోస్ట్రాడమ్’కు మంచిపేరు ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడైన నోస్ట్రాడమస్ సుమారు 465 ఏళ్ల క్రితం తన పుస్తకం ‘లెస్ ప్రొఫెటీస్’లో భవిష్యత్తుకు సంబంధించి పలు అంచనాలను రాశారు. భవిష్యత్తు గురించి ఆయన చెప్పినవి.. పలు దేశాల్లో కొన్ని సంఘటనలుగా నిజమయ్యాయి కూడా! అయితే మనం ప్రస్తుతం 2022వ ఏడాదిలోకి అడుగుపెట్టడానికి దగ్గర్లో ఉన్నాం. ఆయన రాసిన పుస్తకంలో 2022వ ఏడాదికి సంబంధించి కూడా పలు విపత్కర విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన భవిష్యత్తు అంచనా విషయాలు వైరల్ అవుతున్నాయి. చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి 2022లో ప్రపంచం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు ఏర్పడనున్నట్లు జోస్యం చెప్పారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుపాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్ దేశం సంక్షోభానికి గురవుతుందని తెలిపారు. 2022 నాటికి కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ అంచనాలు చాలా కాలం తర్వాత నిజం కావచ్చు! లేదా చాలా ముందుగానే జరగవచ్చు! అప్పటివరకు వేచి చూడాల్సిందే! ఆయన ప్రపంచ చరిత్రలో కొన్ని అతిపెద్ద సంఘటనలను ముందే చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచారు. అడాల్ఫ్ హిట్లర్ పెరుగుదల గురించి గాని, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, 9/11 ఉగ్రవాదుల దాడి లాంటి ఘటనలను నోస్ట్రాడమస్ అంచనా వేసిన తెలిసిందే. చదవండి: Snake In Christmas Tree: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది! -
2021: ప్రపంచం అతలాకుతలమేనట!
బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? మరేం లేదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా కాలజ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆమె ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట. మరి ఆమె 2021 సంవత్సరం గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఆమెవరో? కాలజ్ఞానిగా ఎలా మారిందో ముందుగా తెలుసుకుందాం.. (చదవండి: అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాసా) చూపు పోయింది కానీ.. బల్గేరియాకు చెందిన బాబా వంగ అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. పన్నెండేళ్ల వయసులో వచ్చిన టోర్నడో ఆమె చూపును మింగేసింది. కానీ ఆశ్చర్యంగా రానున్న కాలంలో ఏం జరగనుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పే అద్భుత శక్తిని పొందింది. దీంతో ఆమెను బల్గేరియాలో నోస్ట్రడామస్(ఫ్రెంచ్ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేవారట. ఈ క్రమంలో ఆమె చెప్పిన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం అన్నీ నిజంగానే జరిగి తీరాయి. 1996లో ఆమె మరణించేముందు 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది. (వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు) క్యాన్సర్‌కు మందు రాబోతుందా? 2021లో ప్రకృతి విధ్వంసం భారీగా జరగబోతుందని హెచ్చరించింది. జనాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని ఊహించింది. వినాశకరమైన ఘటనలతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో క్యాన్సర్ మహమ్మారి సంకెళ్లను తెంచుకుని మానవాళి బయటపడుతుందనే శుభవార్తను కూడా అందించింది. అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్‌కు నివారణ ఔషధం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోయి పుడమి తల్లి విశ్రాంతి తీసుకోనుందని ఉద్ఘాటించింది. ఆ సమయంలో రైళ్లు సోలార్ శక్తితో నడుస్తాయంది. కొందరు ప్రజలు రెడ్ మనీ వాడుతారంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఓ డ్రాగన్ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని, దీని ఎదుర్కొనేందుకు మూడు దిగ్గజ దేశాలు ఏకమవుతాయని చెప్పింది. అలాగే ఆ మూడు దిగ్గజాలను చైనా, ఇండియా, రష్యాగా భావిస్తున్నారు. ఇక 2341 నాటికి భూమి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుందని కూడా చెప్పింది. అయితే 2021లో ఆమె చెప్పిన శుభ శకునాలు మాత్రమే నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు జనాలు. (చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!) -
దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!
సాక్షి, హైదరాబాద్: గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టీఆర్ఎస్తోపాటు బీజేపీ పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు. గెలుపు తథ్యం: టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2014 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్ఎస్ శిబిరం అంచనా వేస్తోంది. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ప్రచారం సందర్భంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా ఓటు వేశాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టీఆర్ఎస్ విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వచ్చింది. విజయం నల్లేరు మీద నడక: బీజేపీ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. చాలా గ్రామాల్లో కనీస స్థాయిలో కేడర్ కూడా లేని బీజేపీ ప్రచారపర్వంలో మెరుగైనట్లు లెక్కలు వేసుకుంటోంది. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ... ప్రచారపర్వంలో బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన రఘునందన్... ఈసారి ఓటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బీజేపీ... మంగళవారం జరిగిన పోలింగ్ సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. చాప కింద నీరులా ఫలితం: కాంగ్రెస్ దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టీఆర్ఎస్కు ఉండే అనుకూలత, బీజేపీ దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బీజేపీ మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఏకంగా పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లోకి వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. -
కోహ్లి ఏం చెప్పాడో.. అదే జరుగుతోంది!
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్ కంటే ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లిని కింగ్, మాస్టర్, గోట్ అంటూ ఎవరికి నచ్చినట్టు వారు సంభోదించారు. అయితే టోర్నీ సగం పూర్తయిన తర్వాత అతడిని జ్యోతిష్కుడు, జ్ఞాని అంటూ కొందరు క్రీడా విశ్లేషకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీనికి కారణం కోహ్లి అంచనాలు నిజమవడమే. ప్రపంచకప్ ఆరంభానికంటే ముందు ఐసీసీ ఏర్పాటు చేసిన కెప్టెన్ల అధికారిక సమావేశంలో ఆట గురించి కెప్టెన్లంతా మాట కలిపారు. సన్నాహాలు మొదలు... ఎదురయ్యే సవాళ్లపై స్పష్టమైన సమాధానాలిచ్చారు. భారీ స్కోర్లతో భారమైన టోర్నీ జరుగుతుందని, 350 పరుగులు చేసినా గెలుపు ధీమా ఉండబోదనే పలువురు సారథులు అభిప్రాయపడ్డారు. కానీ టీమిండియా సారథి విరాట్ కోహ్లి మాత్రం 250 పరుగులు కూడా కాపాడుకోవచ్చన్నాడు. ‘అతనిలో ఏమా ధీమా’ అనేలోపు అర్థవంతమైన వివరణ ఇచ్చాడు. మొదట్లో 300 అవలీలగా ఛేదించినా... మ్యాచ్‌లు జరిగే కొద్దీ పిచ్‌లు మారిపోతాయని విశ్లేషించాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో కోహ్లి ఏం చెప్పాడో అదే జరుగుతోంది. కోహ్లి అంచనాలు నిజమవుతుండటంతో క్రీడా పండితులు అతడిని జ్ఙానితో పోల్చుతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు కొన్ని వారాల ముందు జరిగిన ఇంగ్లండ్, పాకిస్తాన్ సిరీస్‌తో అందరిలోనూ పలు అనుమానాలు మొదలయ్యాయి. ఈ సిరీస్‌లో 340కి పైగా పరుగులు సాధించినా పాక్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రపంచకప్‌లో 500 స్కోర్ నమోదువుతుందని అందరూ భావించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ ఈ ప్రపంచకప్‌లో 500 స్కోర్‌ను చూస్తామని చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలయింది. అయితే టోర్నీ ప్రారంభంలో కొన్ని జట్లు అవలీలగా 300కిపైగా పరుగులు సాధించాయి. కానీ టోర్నీ జరుగుతున్నా కొద్దీ పిచ్‌లు మందకొడిగా మారుతుండటంతో స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. (చదవండి: కోహ్లి దళం... గెలుస్తుందా హృదయం?) అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లపై సాధారణ స్కోర్లు నమోదు చేసినప్పటికీ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయం సాధించింది. ఇక అత్యంత దుర్బేద్యంగా బ్యాటింగ్ లైనప్ ఉండి, భారీ స్కోర్లు నమోదు చేసే ఇంగ్లండ్ కూడా 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంకపై ఓడిపోయింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లపై లక్ష్యాన్ని ఛేదించలేక ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 245 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించడానికి న్యూజిలాండ్‌కు చుక్కలు కనిపించాయి. ఇంకా పలు మ్యాచ్‌ల్లో కూడా స్వల్ప స్కోర్లే నమోదు కావడంతో కోహ్లి అంచనాలు నిజమవుతున్నాయని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. (చదవండి: హార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి) -
ఐపీఎల్-12లో జ్యోతిష్యమే గెలిచింది..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్ నిలుస్తుందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. రోహిత్ శర్మకు, ముంబై ఇండియన్స్ జట్టుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు, అదృష్టం ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని వారు వివరించారు. అయితే జోతిష్యుల అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది. దీంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు సిద్దాంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం స్థానక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. అయితే గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలంటారు. నిన్నటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ అదృష్టం రోహిత్‌కు ఉన్న గ్రహబలమేనని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతా అంబానీ పూజలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె మ్యాచ్ మధ్యలో బల్కంపేటలోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. అనంతరం నీతా అంబానీ తిరిగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ ఆసాంతం ఆమె పూజలు చేశారు. చివరి బంతి సమయంలో కూడా మంత్రాలు చదువుతూ కనిపించారు. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్‌మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు. చదవండి: విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు -
వైరల్ : వాక్కు చెబుతూ ప్రాణాలు విడిచిన పూజారి..!
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరులో గల సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. పోరూరు గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఆలయం ఎదుట గల 20 అడుగుల ఎత్తున్న కర్రపైకి ఎక్కిన పూజారి వాక్కు చెబుతూ.. విన్యాసాలు చేసే క్రమంలో ప్రమాదావశాత్తు కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పడం ఆనవాయితీ. పూజారి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
వాక్కు చెబుతూ ప్రాణాలు విడిచిన పూజారి..!
-
తలైవాకి వెన్నుపోటు తప్పదు!
సాక్షి, బెంగళూర్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ.. కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్ అమ్మునై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్.. తలైవాకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏ మాత్రం లేదని తేల్చేశారు. ‘‘రజనీకాంత్ ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్ఛితంగా రాణించగలరు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవటం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఆయన ఆశలు పెట్టుకోకపోవటమే మంచింది. ఆయన కింగ్ మేకర్ అవుతారే తప్ప.. కింగ్(సీఎం) కాలేరు’’ అని ప్రకాష్ ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సొంతవాళ్లే వెన్నుపోటే ప్రమాదం పొంచి ఉందని.. కాబట్టి రజనీ రాజకీయాలపరంగా ఎవరినీ నమ్మకపోవటమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. మకర రాశి, సింహ లగ్నంలో జన్మించిన రజనీకాంత్‌కు రాజకీయాల్లో అడ్డు ఉండబోదని ప్రకాష్ అన్నారు. రజనీకి పెటా విజ్ఞప్తి పెటా ఇండియా శుక్రవారం రజనీకాంత్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. అభిమానంతో పేరిట మీ ఫ్యాన్స్ జంతువులను బలులు ఇస్తున్నారని.. ఆ చర్యలను అడ్డుకునేలా అభిమానులకు రజనీ పిలుపు ఇవ్వాలని పెటా కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసిన పెటా.. రాజకీయ ప్రవేశంపై రజనీకి అభినందనలు కూడా తెలియజేసింది. After @superstarrajini fans announced plans to slaughter goats in his name, PETA sent the superstar an urgent plea calling on him to stop them. Find out how you, too, can help spare these goats' lives: https://t.co/sLLdvywZf5 https://t.co/EhzW91jmnU — PETA India (@PetaIndia) 5 January 2018 -
మెట్రో రైలుపై అంచనాలు తప్పాయా?
మహానగరంలో మెట్రో రైలు పరుగుపై అధికారులు పెంచుకున్న అంచనాలు తప్పాయి. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని భావించగా.. ఇందులో సగం మంది కూడా ప్రయాణించడం లేదు. గ్రేటర్లో మెట్రో రైలు పరుగులు మొదలై బుధవారానికి 22 రోజులు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో సుమారు 25 లక్షల మంది జాయ్‌రైడ్ చేసి ఆనందించారు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షలు కాగా.. మిగతా రోజుల్లో కనాకష్టంగా లక్ష మంది ప్రయాణించారు. దీనికంతటికీ ఆయా స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడం, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడమే కారణమని తేలింది. నగరవాసులకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్‌పై మెట్రో రైలు ప్రభావం చూపిస్తుందని అంతా భావిస్తే.. ఇప్పుడా లెక్క తప్పని తేలింది. సిటీలో మెట్రో రైలు 22 రోజులుగా పరుగులు తీస్తున్నా ఎంఎంటీఎస్‌కు ప్రయాణికుల ఆదరణ మాత్రం తగ్గలేదు. రోజూ సుమారు 1.50 లక్షల మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎంఎంటీఎస్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో వల్ల సికింద్రాబాద్–హకీంపేట్ మార్గంలో కొంతమేర ప్రభావం ఉండవచ్చని మొదట్లో రైల్వే వర్గాలు భావించినా రద్దీ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతోంది. దీనికి ఎంఎంటీఎస్ సేవలు ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండడం, టికెట్ ధర కూడా తక్కువ కావడమేనని అధికారులు భావిస్తున్నారు. 22 రోజుల్లో 25 లక్షల మంది మెట్రో జర్నీ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మెట్రో రైలు పరుగులు తీస్తున్న నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని తొలుత అధికారులు వేసిన అంచనాలు తల్లకిందులైంది. ఈ 22 రోజుల్లో కేవలం 25 లక్షల మంది మాత్రమే ప్రయాణించినట్టు లెక్క తేల్చారు. అదీ శని, ఆదివారాల్లోనే రద్దీ పెరిగినట్టు గుర్తించారు. మెట్రో నడుస్తున్న మొత్తం 30 కి.మీ. మార్గంలోని 24 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లు కేవలం ఐదు మాత్రమే. మిగతా 19 స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య జఠిలంగా మారడంతో వ్యక్తిగత వాహనాలతో స్టేషన్లకు వచ్చినవారికి అగచాట్లు తప్పడంలేదు. వసతుల లేమితో వెనుకంజ నగరంలోని మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు సమీప కాలనీల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. ఇక స్టేషన్లకు లక్షలాదిమంది ప్రయాణికులు ఒకేసారిగా తరలివస్తే రద్దీ నియంత్రణ కష్టతరమవుతోంది. స్టేషన్లలో మంచినీరు వసతి అసలే లేకపోవడం, టాయిలెట్ వసతులు అరకొరగా ఉండడం.. అదీ పెయిడ్ విధానం కావడం పట్ల ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపడం లేనట్టు తెలుస్తోంది. ఇక టోకెన్లు, స్మార్ట్‌కార్డుల కొనుగోలు, వాటి రీచార్జి వంటి అంశాలపై ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా మెట్రో నేర్పిన పాఠాలు.. అధికారులు నేర్వాల్సిన గుణపాఠాలు.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు.. పబ్లిక్ డిమాండ్స్ ఇలా ఉన్నాయి.. ♦ పార్కింగ్ పరేషాన్ పరిష్కరించాలి: మొత్తం 24 స్టేషన్లల్లో మియాపూర్, రసూల్‌పురా, సికింద్రాబాద్ పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, నాగోల్ మెట్రో డిపో, చాలిస్ మకాన్ (అమీర్‌పేట్)లో మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. అన్ని చోట్లా ఉచిత పార్కింగ్ వసతి కల్పించాలని సిటీజన్లు కోరుతున్నారు. ♦ ఫీడర్ బస్సుల సంఖ్యను పెంచాలి: ప్రస్తుతం 30 కి.మీ. మెట్రో కారిడార్‌లో సమీప కాలనీలకు ఆర్టీసీ కేవలం 50 ఫీడర్ బస్సులను 10 రూట్లలో మాత్రమే నడుపుతోంది. ప్రతీ స్టేషన్ నుంచి 25 బస్సులు నిరంతరం సమీప కాలనీలు, బస్తీలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ♦ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందే: నాగోల్–అమీర్‌పేట్ (17కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మార్గంలో ప్రస్తుతం 7 చొప్పున 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక రద్దీ నేపథ్యంలో వీటి సంఖ్యను పదికి పెంచాలన్నది పబ్లిక్ డిమాండ్. ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ 10–15 నిమిషాలుగా ఉంది. దీన్ని 5 నిమిషాలకు తగ్గించాలి. ♦ రద్దీ నియంత్రణ : శని,ఆదివారాల్లో మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్‌ను తలపిస్తున్నాయి. వేలాదిమంది పిల్లాపాపలతో స్టేషన్లకు తరలివస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ సహకారంతో తొక్కిసలాట జరగకుండా స్టేషన్లలోనికి, ప్లాట్ఫారం పైకి, బోగీల్లోకి వెళ్లే సమయంలో క్యూపద్ధతి, బార్కేడింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ♦ స్మార్ట్‌కార్డు, మొబైల్యాప్: మెట్రో స్మార్ట్‌కార్డు ప్రస్తుతానికి మెట్రో జర్నీకే ఉపయుక్తం. దీని ద్వారా షాపింగ్, ఇంధన అవసరాలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఇలా 16 రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఈ కార్డు ద్వారా అందే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన పెంచాలి. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ‘టి–సవారీ’ యాప్ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సివుంది. ♦ టోకెన్ల తకరారు: స్టేషన్లలో టిక్కెట్ విక్రయయంత్రాల వద్ద పాతనోట్లను యంత్రాలు తిరస్కరిస్తున్నాయి. టిక్కెట్‌కు సరిపడా చిల్లర లభించక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీటి వినియోగం పైనా జర్నీ చేసేవారికున్న అపోహలను మెట్రో అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది. ♦ మంచినీరు, టాయిలెట్స్: మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. ప్రతీ స్టేషన్లో స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ఇక స్టేషన్లలో ఉన్న పే అండ్ యూజ్ టాయిలెట్లు.. అదీ అరకొరగానే ఉండడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తక్షణం స్టేషన్ రెండు చివరలా అత్యధికులు ఉపయోగించుకునేలా ఉచిత టాయిలెట్లు ఉండాలి. ♦ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్: ప్రతీ స్టేషన్ వద్ద తీరైన ఫుట్‌పాత్‌లు, బస్‌లు, ఆటో, క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పలు స్టేషన్ల వద్ద ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయి. ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు, హరిత వాతావరణం ఏర్పాటు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను తక్షణం పూర్తిచేయాలి. ♦ అమ్మో సైకిల్‌స్టేషన్లు: ప్రస్తుతానికి మియాపూర్ మెట్రోడిపోలనే ఈ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లకు ఈ సదుపాయం కల్పించాలని.. సైకిలింగ్ క్లబ్లో ప్రవేశించేందుకు సభ్యత్వ రుసుం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ మెట్రో రూట్లలో తగ్గని ట్రాఫికర్: ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో జర్నీ చేస్తున్నవారి సంఖ్య లక్షకు మించడం లేదు. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గాల్లో ట్రాఫికర్ అధికంగానే కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతి లేకపోవడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య కారణంగా మెజార్టీ సిటీజన్లు తమ వాహనాలనే నమ్ముకుంటున్నారు. దీంతో మెట్రో రూట్లలో ఉదయం,సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ టెర్రర్ అలాగే ఉంది. ♦ హైటెక్‌సిటీ.. ఎల్బీనగర్ వరకు ఉండాలి: అమీర్‌పేట్ వరకున్న మెట్రో మార్గాన్ని ఇటు హైటెక్‌సిటీ.. అటు ఎల్బీనగర్ వరకు పొడిగిస్తేనే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని మెజార్టీ సిటీజన్ల అభిప్రాయం ప్రధానంగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో పలు ఆస్తుల సేకరణ, స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల డిజైన్లు మమార్చడం, సైబర్ టవర్స్, శిల్పారామం ప్రహరీల కూల్చివేతలు రీడిజైనింగ్ కారణంగా.. ఈ ప్రాంతాల్లో మెట్రో రూటు పనులు జఠిలంగా మారనున్నాయి. అమీర్‌పేట్– ఎల్బీనగర్ మార్గంలో లక్డీకాపూల్ వద్ద రైలు ఓవర్‌బ్రిడ్జీ నిర్మాణం, పుత్లీబౌలి వద్ద మెట్రో పనులు నత్తనడకన సాగుతుండడం ప్రతిబంధకంగా మారింది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఈ రెండు మార్గాలు పూర్తయితేనే మెజార్టీ సిటీజన్లకు మెట్రో జర్నీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.... సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ముద్రపడిన మెట్రో రైలు.. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. గత 22 రోజులుగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నా ఎంఎంటీఎస్ సర్వీసులను వినియోగించుకుంటున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు 1.50 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రైళ్లు రాకపోకలు సాగించే మార్గాలు వేరు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే ప్రయాణికులకు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉంది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఐటీ కార్యాలయాలు ఉండడంతో ఎంఎంటీఎస్‌కు డిమాండ్ ఉంది. అటు లింగంపల్లి నుంచి, ఇటు నాంపల్లి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాళ్లకు కూడా ఎంఎంటీఎస్ మాత్రమే సౌకర్యంగా ఉంది. నాగోల్–అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో మార్గానికి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–హైటెక్‌సిటీ–లింగంపల్లి ఎంఎంటీఎస్ మార్గానికి ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఎంఎంటీఎస్‌పై మెట్రో ప్రభావం చూపలేదు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లికి ఎక్కువ మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ చౌకైన ప్రయాణం మెట్రో చార్జీలతో పోలిస్తే ఎంఎంటీఎస్ టికెట్ ధరలు చాలా తక్కువ. కనిష్ట చార్జీ రూ.5 కాగా గరిష్ట చార్జీ రూ.10 మాత్రమే. మెట్రోలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు చార్జీ ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు, సిటీ బస్సుల కంటే కూడా ఎంఎంటీఎస్ ప్రయాణం చాలా చౌకగా ఉంది. ప్రయాణికుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడానికి ఈ చౌక చార్జీలు కూడా కారణమయ్యాయి. ఎంఎంటీఎస్‌లో రూ.10 టిక్కెట్‌పై ఏకంగా ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు పయనించవచ్చు. అదే మెట్రోలో ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లేలంటే రూ.60 ఖర్చవుతుంది. మరోవైపు కేవలం రూ.450 ఎంఎంటీఎస్ పాస్‌పైన నెలంతా పయనించవచ్చు. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ప్రస్తుతం రూ.10 ఉంది, కానీ అంతే ధరతో ఎంఎంటీఎస్ టిక్కెట్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే సదుపాయం లభించడం గమనార్హం. అందుకే గ్రేటర్లో అన్ని వర్గాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్ ఒక లైఫ్‌లైన్‌గా మారింది. ఉదయం 4 నుంచి రాత్రి 11.30 వరకు కూడా ఈ రైళ్లు అందుబాటులో ఉండడం మరో సదుపాయం. రెండో దశతో మరో 2 లక్షల మందికి సేవలు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే మరో 2 లక్షల మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. ముఖ్యంగా అటు పటాన్చెరు–తెల్లాపూర్ నుంచి ఇటు మేడ్చల్–బొల్లారం–సికింద్రాబాద్ వరకు, ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు కేవలం సిటీబస్సులు మాత్రమే ఉన్న ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు పనులకు నిధుల లేమి గండంగా మారింది. 2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఆరు మార్గాల్లో రూ.812 కోట్లతో అంచనాలను రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్తం రూ.1000 కోట్లు దాటినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులను అందజేయాలి. మిగతా 1/4 వంతు రైల్వే అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రూ.150 కోట్ల వరకే అందాయి. అన్ని మార్గాల్లో సింగిల్ లైన్ డబ్లింగ్ చేశారు. కొన్ని చోట్ల విద్యుదీకరణ పూర్తయింది. మొత్తం 60 శాతం పనులు పూర్తయ్యాయి. కొత్త రైళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అల్వాల్, భూదేవినగర్, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాలి. ఇంకా కొన్ని రూట్లలో విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు పూర్తి చేయాలి. నిధుల కొరత కారణంగా ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఈ డిసెంబర్‌కు బొల్లారం–సికింద్రాబాద్ మధ్య రెండో దశ రైళ్లు నడపాలని భావించారు. అలాగే ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లను కూడా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధుల లేమి కారణంగా పనులు స్తంభించాయి. మెట్రో రెండో దశ పూర్తయితే.. రెండో దశ ఎంఎంటీఎస్ పనుల పూర్తికి డిసెంబర్ గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. కానీ వచ్చే జూన్ నాటికి మెట్రో రెండో దశ హైటెక్‌సిటీ–రాయదుర్గం లైన్ పూర్తయితే ఎంఎంటీఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులు మెట్రో వైపు మళ్లొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. నగర శివారును అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేస్తే 2 లక్షల మందికి అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది. -
ఒత్తిడిని ఎదుర్కోవటం మీకు తెలుసా?
దగ్గరివారు దూరం అవ్వటం, ఒకరిపై పెట్టుకొన్న అంచనాలు తలకిందులవ్వటం, అనుకున్నది సాధించలేకపోవటం, ఉన్నదానికంటే ఎక్కువగా కోరుకోవటం... ఇలా ఎన్నో కారణాలు మనిషి ఒత్తిడికి కారణం అవుతాయి. ఇలాంటివాటిని ఎదుర్కొనేవారు ఎలాంటి బాధలు, అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలరు. సమస్యలను సున్నితంగా పరిష్కరించగలరు. మీరు స్ట్రెస్‌ను ఎదుర్కోగలరా? అది ఎలాగో మీకు తెలుసా? 1. బయట సమస్యలను ఇంటిదాకా తెస్తారు. ఎ. అవును బి. కాదు 2. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. స్నేహితులతో అప్పుడప్పుడూ సమయాన్ని గడుపుతారు. ఎ. కాదు బి. అవును 4. స్పోర్ట్స్ / ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొంటారు. ఎ. కాదు బి. అవును 5. ఒకే విషయాన్ని పదేపదే తలచుకోరు. ఎ. కాదు బి. అవును 6. ఆధ్యాత్మికతకు మీలో చోటుంది. ఎ. కాదు బి. అవును 7. ఆనందించాల్సిన సమయంలో మీ వర్క్ పూర్తి చేయాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఒత్తిడికి కారణమైన విషయం/వ్యక్తుల్లో పాజిటివ్ అంశాలను గుర్తిస్తారు. ఊహలకు తావివ్వరు. ఎ. కాదు బి. అవును 9. ప్రతికూలంగా ఆలోచిం^è డాన్ని నిరోధిస్తారు. ఎ. కాదు బి. అవును 10. ఒత్తిడిలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలు (ఆల్కహాల్, సిగరెట్) సాంత్వనను అందిస్తాయి. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీది ఒత్తిడిలో కూరుకుపోయే మనస్తత్వం. ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసే ప్రయత్నాన్ని మానండి. సమస్యలు సహజమని గుర్తించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఒత్తిడిని ఎదుర్కోవటం మీకు తెలుసు. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉంటారు. -
వెలిగొండ.. అంచనాల కొండ
ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలో అంచనాలు పెంచుకొనే విషయంలో ప్రభుత్వం చూపించే శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించడం లేదు. 2017 నాటికే పనులు పూర్తిచేసి జిల్లా వాసులకు సాగు, తాగునీరందిస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు మాటమార్చి 2018 నాటికి నీరంటోంది. పనుల తీరుచూస్తే మరో పదేళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచుకొని ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2013–14 ప్రారంభంలో రూ.5,150 కోట్ల అంచనాలతో ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా ఈ అంచనాలను రూ.7,784 కోట్లకు పెంచుతూ ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అంచనాలను పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడో, రేపో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. భారీగా పెంచుకున్న అంచనాలు.. ప్యాకేజీ–1 నుంచి ప్యాకేజీ–6 వరకు వివిధ రకాల పనుల అంచనాల విలువ కోట్లాది రూపాయలు పెరిగిపోయింది. ప్యాకేజీ–1లో టన్నెల్–1 పనులు గత అంచనాల కంటే రూ.306.39 కోట్లు అదనంగా పెంచారు. ప్యాకేజీ–2లో తీగలేరు ఫీడర్ కెనాల్ పనులు రూ.433.5 కోట్ల మేర పెంచారు. ప్యాకేజీ–3 పరిధిలోని గొట్టిపడియ అంచనాలను రూ.100 కోట్లు పెరిగాయి.ప్యాకేజీ–4 పరిధిలోని తూర్పు ప్రధాన కాలువ (కాకర్ల డ్యామ్) అంచనాలు ఏకంగా రూ.690 కోట్లు పెంచడం గమనార్హం. ప్యాకేజీ–5 పరిధిలో టన్నెల్–2 పాత అంచనాలు రూ.296 కోట్లు, ప్యాకేజీ–6లోని తూర్పు ప్రధాన కాలువ అంచనాలను రూ.313 కోట్లు, ప్యాకేజీ–7లో పశ్చిమ ఉపకాలువ రూ.220 కోట్ల మేర అదనంగా పెరిగింది. మొత్తంమీద రూ.2,634 కోట్లు అదనంగా పెంచారు. పనులపైనా రూ.1159 కోట్లు పెంచగా భూసేకరణ పైనా రూ.970 కోట్లు పెంచారు. కేవలం రూ.58 కోట్లున్న ఆర్.ఆర్. పనులపైన రూ.489 కోట్లు పెంచారు. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్లో సైతం రూ.16 కోట్లు పెంచారు. మొదలు కాని హెడ్ రెగ్యులేటర్ పనులు.. వెలిగొండ ప్రాజెక్టు కోసం 41,408 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా 24,908 ఎకరాలు మాత్రమే సేకరించారు. వెలిగొండ పరిధిలో 11 ముంపు గ్రామాలుండగా 2006 నుంచి ఇప్పటి వరకు ఐదు గ్రామాలకు మాత్రమే ఆర్.ఆర్. సెంటర్లు గుర్తించారు. ఇంకా ఆరు గ్రామాలను గుర్తించాల్సి ఉంది. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కోర్టు కేసులున్నా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని చేర్చే హెyŠ æరెగ్యులేటర్ పనులను ఇంత వరకు మొదలు పెట్టకపోవడం గమనార్హం. తాజాగా రూ.95 కోట్లతో హెడ్రెగ్యూలేటర్ పనులు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికి సింగిల్ టెండర్ ఆమోదించింది. వాస్తవానికి హెడ్ రెగ్యులేటర్ నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం పనులు చేసే పరిస్థితి లేదు. అక్కడ వసతి లేదు. ఒక వైపు శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్, మరో వైపు ఫారెస్ట్. పట్టుమని రెండు ఎకరాల స్థలం కూడా పనులు జరిగే ప్రాంతంలో లేదు. హెడ్ రెగ్యులేటర్‌తో పాటు టన్నెల్ పనులను అటు వైపు నుంచి చేపడుతున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అదే జరిగితే పనులకు సంబంధించిన మట్టిని ఎక్కడికి తరలించాలో తెలియని పరిస్థితి. ఫారెస్ట్‌లో వేద్దామంటే ఇప్పటికీ అటవీశాఖ అనుమతి లేదు. అనధికారికంగా ఫారెస్ట్ అధికారులతో ప్రాజెక్టు అధికారులు ఒప్పందానికి వచ్చే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ ద్వారా వారికి అనధికారికంగా డబ్బులు ముట్టజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది. పేరుకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ ఇప్పట్లో పని చేసే పరిస్థితి కానరావడం లేదు. మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు హెడ్రెగ్యూలేటర్ టెండర్లు పిలిచినట్లు ఇరిగేషన్ అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ లెక్కన వెలిగొండ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. -
రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆయన పొలిటికల్ ప్యూచర్‌పై ఎడతెగని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అభిమానులను ఎన్నడూ నిరాశ పరచనని హామీ ఇచ్చారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశానికే అభిమానులతో రజనీకాంత్ సమావేశాలని రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన ఆలోచనలకు అభిమానుల సలహాతో పదును పెట్టేందుకు సిద్ధమైన ఆయన రాజకీయ అరంగేట్రం ఇక ఎంతో దూరంలో లేదని అంటున్నారు. ఆ శుభదినం ఈ నెల 19వ తేదీ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తదితర పార్టీలు అప్పుడే ప్రకటించేశాయి. కేరళలోని ఒక ప్రముఖ జోస్యుని వద్ద రజనీకాంత్ సన్నిహితుడు ఒకరు జాతకం చూపగా, రాజకీయాల్లో రజనీ రాణిస్తారు, ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని అభిమానులను జిల్లాలవారీగా విభజించి వారితో సమావేశమయ్యే కార్యక్రమం ఈ నెల 15వ తేదీన రజనీకాంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో కన్యాకుమారి, కరూరు, దిండుగల్లు, తిరునెల్వేలి, తూత్తుకూడి, తేని జిల్లాలకు చెందిన సుమారు 1500 మందికిపైగా అభిమానులను ఆయన కలుసుకుని, ఫొటోలు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న అభిమానులను మాత్రమే లోనికి అనుమతించి ఫొటోలు దిగనిస్తున్నారు. మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఉదయం తొమ్మిది గంటలకు రాఘవేంద్ర కల్యాణ మండపానికి రజనీకాంత్ చేరుకున్నారు. గుర్తింపు కార్డుల్లేని అభిమానుల బైటనే ఉండిపోవడం గమనించి, కారు దిగారు. ఆయనను చూడగానే ‘రజనీకాంత్ వాళ్గ(రజనీకాంత్ వర్ధిల్లాలి), ‘తలైవర్ రజనీ వాళ్గ’ ( అధినేత వర్ధిల్లాలి) అంటూ నినాదాలు చేశారు. రజనీకాంత్ అందరికీ అభివాదం చేస్తూ పలకరించి ఆ తరువాత లోనికి వెళ్లిపోయారు. తిరువణ్ణామలై, శివగంగై, విళుపురం జిల్లాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ వరుస సంఖ్యలను కేటాయించి జిల్లాకు 250 మంది చొప్పున ఎంపిక చేసి ఫొటోకు అనుమతించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని ఆయనపై ఒత్తిడి చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో రజనీ మాట్లాడుతూ అభిమానులతో సమావేశం కావడం, ఫొటోలు తీసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నాలుగో రోజైన గురువారం (ఇవాళ) కడలూరు, తంజావూరు, పాండిచ్చేరి, కారైక్కాల్ జిల్లాలకు చెందిన అభిమానులు హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీతో సమావేశాలు ముగుస్తుండగా, మిగిలిన జిల్లాల అభిమానుల కోసం రెండో దశ సమావేశాలు వచ్చేనెల నిర్వహిస్తారని తెలుస్తోంది. -
జోస్యాల జోలికి పోవద్దు.. రెండేళ్లు బహు దూరం
అవలోకనం ఉత్తరాదిలో మోదీ 2014 ఫలితాలను పునరావృతం చేయడం సవాలే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో బీజేపీ ఇçప్పటి తన మద్దతును నిలుపుకోలేకపోవచ్చు. కానీ మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, బెంగాల్‌లలో మరింత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు మోదీకి తక్కువ కీలకమైనవి అవుతాయి. అయినా ఆ రాష్ట్రాల్లోనూ ఆయన మంచి స్థానంలోనే ఉన్నారు. మరో రెండేళ్లకు ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వాలు, హీరోలు అంతకంటే చాలా తక్కువ కాలంలోనే జనాదరణను కోల్పోయారు. ‘‘జరగబోయేదాన్ని చెప్పడం, ప్రత్యేకించి భవిష్యత్తును చెప్పడం కష్టం.’’ ఈ చతురోక్తిని విసిరినది అమెరికన్ బేస్ బాల్ క్రీడాకారుడు యోగి బెర్రా అంటారు. అయితే ఆయన నిజం పేరు మాత్రం లోరెంజో బెర్రా. ‘‘యోగి’’ అతని ముద్దు పేరు. భారతీయులలా అతను మటం వేసుకుని కూచోగలడు కాబట్టి ఆ పేరొ చ్చింది. మనం యోగులం, ఆథ్యాత్మికవాదులం కావద్దుగానీ, 2019 ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యాలు చెప్పడం జోలికి పోకుండా ఉందాం. అయినా మనం ఒకసారి 2014 ఎన్నికల గణాంకాలవైపు దృష్టిసారించి, వాటిని వేటికవిగా విడదీసి 2019లో సంభవం కాగల పరిణామాలను విశ్లేషిద్దాం. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సాధించిన తాజా విజయం 2019లో నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావడాన్ని అనివార్యం చేసింది. అది నిజంగానే అలా జరగాలంటే ఏమి జరగాల్సిన అవసరం ఉంది? 2014లో సరిగ్గా ఓట్ల లెక్కింపునకు ముందు మోదీ రానున్న ఫలితాలను ఊహించి చెప్పారు. 1984 తర్వాత భారత రాజకీయాలలో కనీ వినీ ఎరుగని రీతిలో తనకు పూర్తి ఆధిక్యత లభిస్తుందన్నారు. తన సభలకు హాజరైన ప్రజలే ఆ విషయం చెప్పారని తెలిపారు. ఆయన అంచనా కచ్చితమైన ది. 543 లోక్‌సభ స్థానాలలో 282 ఆయనకు లభిం చాయి. ఈ సంఖ్యా బలం మోదీకి ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచే సమ కూరింది. ఆయన పూర్తి ఆధిక్యతను సాధించిన ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి లేదా ఆ పార్టీ బలంగా ఉనికిలో ఉంది. అవి, మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ (26కు 26), రాజస్థాన్ (25కు 25), మధ్యప్రదేశ్ (29కి 27), జార్ఖండ్ (14కు 12), హిమాచల్‌ప్రదేశ్ (4కు 4), హరియాణా (7కు 7), ఢిల్లీ (7కు 7), ఛత్తీస్‌గఢ్ (11కు 10), ఉత్తరాఖండ్ (5కు 5), ఉత్తరప్రదేశ్ (80కి 71). ఉత్తరాది రాష్ట్రాలను ఇలా తుడిచిపెట్టేయడానికి తోడు బీజేపీకి ఈశాన్యంలో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు దక్కాయి. ఇలా ఆ పార్టీకి దాదాపు 200 సీట్లకు పైగా అక్కడే లభిం చాయి. గత 30 ఏళ్లలో ఏ పార్టీకి ఆ ప్రాంతంలో అంత పెద్ద సంఖ్యా బలం సమకూరలేదు. దీంతో ఇతర ప్రాంతాలలో ఓ మోస్తరు ఫలితాలను సాధించడం మాత్రమే మోదీ గెలుపునకు అవసరమైంది. అవే çఫలితాలను తిరిగి సాధించడం ఆయన చేయగల అతి తేలిక పని. కాకపోతే ఉత్తరాదిలో తిరిగి ఈ స్థాయి ఫలితాలను పునరావృతం చేయడం ఒక సవాలే అవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బహుశా ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో పార్టీ ఇప్పుడు తనకున్న మద్దతును నిలుపుకోలేక పోవచ్చు. పరిపూర్ణమైనదాన్ని ఎవరూ ఇంకా మెరుగుపరచలేరు. గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీలలో మోదీ ఇప్పటికే పరిపూర్ణతను సాధించారు. ఇక గుజారాత్‌లో బీజేపీ తమకు అత్యంత విధేయ ఓటర్లయిన పాటిదార్ల తిరుగుబాటును ఎదు ర్కొంటోంది. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ వంటి సమర్థవంతులైన ప్రత్యర్థి నేతలు న్నారు. సమర్థులైన స్థానిక నేతలున్న పంజా»Œ లో జరిగినట్టే అక్కడా సీటు సీటుకూ పోరాటం సాగవచ్చు. అయితే అదృష్టవశాత్తూ ఇతర పెద్ద రాష్ట్రాలలో మరింత మెరుగైన ఫలితా లను సాధించే అవకాశం ఉండటమనే వెసులుబాటు మోదీకి ఉంది. మహారాష్ట్ర (48కి 23), బిహార్ (40కి 22), ఒడిశా (21కి 1), పశ్చిమ బెంగాల్ (42కు 2) రాష్ట్రాల్లో ఆయన తన సంఖ్యా బలాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌ను, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్‌ను, ఉద్ధవ్ ఠాక్రే శివసేనను వెనక్కు నెట్టేసి, ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీగా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎన్నడూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడింది లేదు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఫలితాలు ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని, బెంగాల్లో కొంత పునాదిని ఏర్పరచుకోగలిగిందని స్పష్టం చేశాయి. మొత్తంగా మోదీకి ఉన్న జనాదరణ ఇందుకు కొంతవరకు కారణం కావచ్చు. అది 2019లో ఆయన అభ్యర్థులకు సహా యపడుతుంది. ఈ నాలుగు రాష్ట్రాలలో మోదీకి ఊపిరి పీల్చుకునే ఈ వెసులుబాటు ఉంది కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు అయనకు మరింత తక్కువ కీలకమైనవి అవు తాయి. అయినా ఆయన ఆ రాష్ట్రాల్లో కూడా మంచి స్థానంలోనే ఉన్నారు. కర్ణాటక (28కి 17), ఆంధ్రప్రదేశ్ (25కి 2), కేరళ (20కి 0), తమిళనాడు (39కి 1), తెలంగాణ (17కి 1) రాష్ట్రాలలో ఆయన తన ఇప్పటి బలాన్ని నిలుపుకోగలుగు తారు లేదా మెరుగుపరచుకోగలుగుతారు. ఓడిపోయినా ఈ రాష్ట్రాలు కొన్నిటిలో బీజేపీకి మంచి ఓట్ల శాతం లభించింది (ఉదాహరణకు, కేరళలో దానికి 10 శాతం ఓట్లు లభించాయి). ఈ రాష్ట్రాలలో ఆ పార్టీ తన ఉనికిని సుస్థిరమైనదిగా మార్చు కునే వరిస్థితిలో ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఇందుకు కొంత వరకు కారణం (స్థానిక ఎన్నికల విజయాలను మదింపు వేసిన ప్రతిసారీ మోదీ వారిని అభినం దిస్తుంటారు). దశాబ్దాల తరబడి వారు నిస్వార్థంగా చేసిన స్వచ్ఛంద కృషి ఫలి తాలను ఇచ్చింది. ఈ రాష్ట్రాలన్నిటిలోనూ కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం. మనలో చాలా మందిమి 2004లో అటల్ బిహారి వాజ్‌పేయి మెజారిటీ స్థానా లను సాధిస్తారని భావించాం. ఆయన సైతం ఆ విషయంలో ధీమాగా ఉండి, ఆరు నెలల ముందే ఎన్నికలకు దిగి, ఓడిపోయారు. కాబట్టి మరో రెండేళ్లు గడిచాక ఏమి జరుగుతుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం అవివేకం అవుతుంది. ప్రభు త్వాలు, హీరోల్లాంటి ఎదురులేని నేతలు సైతం అంతకంటే చాలా చాలా తక్కువ సమయంలోనే జనాదరణను కోల్పోయారు మరి. అయితే గణాంకాలు మాత్రం మోదీకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినా అనుకోనిదే జరిగేట్టయితే... 2019 ఎన్నికలను మోదీ ఓడిపోయే ఎన్నికలు అనగలమే తప్ప, ప్రతిపక్షం గెలిచే ఎన్నికలు అనలేం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
అంచనాల్లో అభ్యర్థులు
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం – సంఘాలపైనే అభ్యర్థుల గెలుపు – విస్త్రత ప్రచారం చేసిన కేవీ సుబ్బారెడ్డి – పోటా పోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు కర్నూలు సిటీ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సర్వసిద్ధం అయ్యింది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 9వ తేదిన ఎన్నికలకు ఉపాధ్యాయులు సిద్ధం అవుతున్నారు. కర్నూలు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు 25515 మంది ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 10 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలో 7430 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి ప్రచారంలో దూసుకుపోయారు. మిగతా వారు సైతం వారి వారికి తగ్గట్లు ప్రచారం చేశారు. తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థిగా బచ్చల పుల్లయ్యను ప్రకటించింది. అయితే ఆయన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అనంతపురం జిల్లాలో ఓ లాడ్జిలో డబ్బులు పంచడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా గతంలో బచ్చల పుల్లయ్యకు మద్దతు ఇచ్చిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన వారు.. ఈ ఏడాడి కేవీ సుబ్బారెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈయనకు మూడు జిల్లాలో వైఎస్ఆర్టీఎఫ్ మద్దతు ఇస్తోంది. మరో అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి నాన్‌లోకల్ సమస్య అడ్డుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. నాన్‌లోకల్ కింద చిత్తూరు జిల్లాలో కత్తి నరసింహా రెడ్డి పని చేస్తున్నారని, పుట్టింది మాత్రం కడప జిల్లా సుండ్రుపల్లి మండలం జికె రాజపల్లి గ్రామం అని ఆయనకు మద్దతు ఇచ్చేవారు చెబుతున్నారు. ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ నామమత్రంగానే మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్రిముఖ పోటీ...! సాధారణ ఎన్నికలను సైతం తలపించేలా పశ్చిమ రాయల సీమ ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు వారిని బలపరిచిన వారి నుంచి సేకరించికున్న సమాచరంతో గెలుపుపై అంచనాలు వేసుకునే పనిలో ఉన్నారు. పది మంది అభ్యర్థులు పోటీలు ఉన్నా కూడా ప్రధానంగా ముగ్గురు మధ్యే పోటీ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థుల గెలుపు మాత్రం సంఘాలపైనే ఆధారపడి ఉండడం గమనర్హం. -
వందశాతం వారు చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ: అగ్రరాజ్య ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే జోస్యం చెప్పారు. అయితే అప్పట్లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు సరికదా... అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అయితే సర్వేలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఓటింగ్ ముందు రోజు వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం ఖాయమని పలు సర్వేలు చెప్పాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో అమెరికన్ ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్ జోస్యం నిజమైంది. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్పినప్పటికీ.. అలాన్ మాత్రం ట్రంప్ గెలుస్తారని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. లిచట్మన్ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు. రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే విజయం సాధిస్తారని అలాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రంప్ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్‌హౌస్ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో నమ్మకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ అమెరికా ఆక్టోపస్ జోస్యం నిజమైందనుకుంటున్నారు. హెల్మట్ నార్పోత్ మోడల్ ప్రకారం... అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారంటూ.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్పోత్ కూడా తెలిపారు. ఆయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు. ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి. చెన్నై చాణక్య జోస్యం... మరోవైపు ట్రంప్ గెలుపుపై చెన్నై 'చాణక్య' చెప్పిన జోస్యం కూడా నిజమైంది. ఈ చాణక్య.. మనిషి అనుకుంటే పొరపాటు. చాణక్య అంటే బుల్లి చేప. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచగా, అది ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని జోస్యం చెప్పింది. రెండు రోజుల క్రితం చాణక్య చెప్పిన జోస్యంపై గురి కుదరకపోయినా తాజా ఫలితాలతో అది వాస్తవమని తేలింది. గతంలోనూ ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. అలాగే 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. ట్రంప్ ఘన విజయంతో చాణక్య మరోసారి వార్తల్లో నిలిచింది. -
మోదీ గురించి నోస్ట్రాడామస్ ఏమన్నారంటే...
న్యూఢిల్లీ: ‘భారత దేశాన్ని 2014 నుంచి 2026 వరకు సమర్థుడైన నాయకుడు పాలిస్తాడు. తొలుత ఆ నాయకుడిని ప్రజలు ద్వేషిస్తారు. కానీ ఆయన అనతి కాలంలోనే భారత దేశ దుస్థితిని, దిశను మార్చివేయడాన్ని గమనించి ప్రజలంతా ఆయన్ని ఎంతోగానే ప్రేమిస్తారు. ఆ సమర్థుడైన నాయకుడు భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే బంగారు భవిష్యత్తు తీసుకొస్తాడు. అనేక దేశాలు భారత్ కింద తలదాచుకుంటాయి. ఫ్రెంచ్ బ్రహ్మ నోస్ట్రాడామస్ అన్న మాటలివి. ఇవి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి చేసినవే’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు గురువారం రాత్రి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి 1555లో వేసిన అంచనాలని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో పార్టీల బలాబలాల్లో దాగున్న 13వ సంఖ్య గురించి ప్రస్తావించారు. లోక్ సభలో బీజేపీకి 283 సీట్లు ఉన్నాయని, వీటిని 2+8+3 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, అలాగే ఎన్డీయేకు వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 337 అని, వీటిని 3+3+7 అని కూడితే 13 సంఖ్య వస్తుందని, యూపీఏకు వచ్చిన సీట్లు 58 అని, వీటిని 5+8 అని కూడినా 13 సంఖ్య వస్తుందని, అలాగే ఇతర పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్య 148 అని, వీటిని కూడా 1+4+8 కూడినా 13 సంఖ్య వస్తుందని అన్నారు. ఈ సంఖ్యలకు 455 ఏళ్ల క్రితం నోస్ట్రోడామస్ అంచనాలకు లింకేమిటో మాత్రం మన మంత్రి రిజీజు వివరించలేదు. పైగా పాశ్చాత్యుల విశ్వాసం ప్రకారం 13వ సంఖ్య అనర్థదాయకం. రిజీజు ఫేస్ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటారు. తాను పాల్గొన్న సభలు, సమావేశాలను సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఫేస్ బుక్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఆయనకు 36,409 ఫాలోవర్స్ ఉన్నారు. -
అంకెలు భళా... నిధులు కల!
ఏటా పెరుగుతున్న అంచనాలు సరిగా అందని నిధులు ఇదీ జీహెచ్ఎంసీ బడ్జెట్ తీరు అంకెలు... అవసరాలు.. ఆకాశంలో... నిధులు పాతాళం లో... ఇదీ జీహెచ్ఎంసీ బడ్జెట్ స్వరూపం. అందుకే లక్ష్యాలను అందుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఏటా భారీ బడ్జెట్ రూపకల్పనతో ముందుకెళుతున్న జీహెచ్ఎంసీ... నిధుల సాధనలో ఆమడ దూరంలో ఆగిపోతోంది. ఫలితంగా ప్రగతి రథం పరుగు పెట్టలేక పోతోంది. సిటీబ్యూరో: భారీ అంచనాలు... అంతే స్థాయిలో కనిపించే అంకెలు. వీటిని చూసిన వారిలో ఎన్నో ఆశలు...ఏడాది చివరిలో చూస్తే మొత్తం తారుమారు...ఇదీ జీహెచ్ఎంసీ బడ్జెట్ తీరు. ఏటా రూ.వేల కోట్లతో భారీ ఎత్తున బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ... ఆశించిన మేరకు నిధులు అందడం లేదు. జీహెచ్ఎంసీ ఆదాయ వనరులతో పాటు రాష్ట్రం ఇచ్చే నిధులు, కేంద్ర గ్రాంట్లను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కూడా ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదు.దీంతో సగం బడ్జెట్ మాత్రమే అమలవుతోంది. బడ్జెట్ జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదని... అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో.. ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో దాదాపు రూ. 2,500 కోట్లతో ఉన్న జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను మూడేళ్లుగా ఏటికేడు పెంచుతూ పోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ రూ.5,550 కోట్లతో రూపొందించినప్పటికీ... అందులో సగం మాత్రమే అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016-17) మరో రూ.50 కోట్లు పెంచి రూ.5,600 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ... ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అసలు రంగు బయట పడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్నే పరిగణనలోకి తీసుకుంటే... కేంద్రం నుంచి రాగలవనుకున్న దాదాపు రూ. 800 కోట్లలో ఇప్పటి వరకు రూ.300 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వృత్తి పన్ను వాటాగా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా.. ఇంతవరకూ జాడే లేదు. హెచ్ఎంఆర్ కింద రావాల్సిన రూ.250 కోట్లలో రూ.100 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇలా అంచనాలకు... వాస్తవానికి వ్యత్యాసం ఉండటంతో బడ్జెట్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అందాల్సిన నిధుల్లో ముఖ్యమైన కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే..రెవెన్యూ రాబడి, క్యాపిటర్ రాబడి, రెవెన్యూ గ్రాంట్లకు సంబంధించి ముఖ్యమైన అంశాల్లో మొత్తం రూ.4141 కోట్లు అందగలవని భావించి బడ్జెట్‌ను రూపొందించగా... ఇప్పటి వరకు అందిన నిధులు రూ.1178 కోట్లు మాత్రమే. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే రూ.3,200 కోట్లకుగాను ఇప్పటి వరకు వచ్చింది దాదాపు రూ.1600 కోట్లు. రానున్న దాదాపు 40 రోజుల్లో ఆస్తిపన్ను ద్వారా మరో రూ.400 కోట్లు, ఇతరత్రా మరో రూ.600 కోట్లు వచ్చినా... మొత్తం రూ.2,600 కోట్లు అవుతుంది. అంటే.. రూ.5,550 కోట్ల బడ్జెట్లో దాదాపు సగమే.రాబోయే బడ్జెట్‌ను వాస్తవిక దృష్టితో, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ చట్టం మేరకు జనవరిలోనే ప్రభుత్వానికి బడ్జెట్‌ను అందజేయాల్సి ఉన్నందున పంపించారు. మూస పద్ధతిలోనే రూ.5600 కోట్లతో రూపొందిం చారు. వీలుంటే పునః పరిశీలించి వాస్తవంగా రూపొందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుదరని పక్షంలో అక్టోబర్‌లో బడ్జెట్‌ను రివైజ్ చేసే తరుణంలోనైనా వాస్తవాలకు దగ్గరగా రూపొందిస్తే.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని నగర ప్రజలు భావిస్తున్నారు. -
'రుతుపవనాల రాక పై భయం వద్దు'
ఢిల్లీ: జీఎస్టీ అమలుకు సంబంధించి రాష్ట్రాల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం ఎంపవర్డ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. 'రుతుపవానాలు ఆర్థిక వ్యవస్థ పై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం దేశంలో ఈ ఏడాది వర్షపాతం మమూలుగానే నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే తగినంతగా నిల్వలు ఉండటంతో రుతుపవనాల ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం ఉండకపోవచ్చు. రుతుపవనాల అంచనాలపై భయపడాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం రుతుపవనాల రాక ఆలస్యం అయినా..ప్రభుత్వం ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయగలిగింది'. అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.