
దగ్గరివారు దూరం అవ్వటం, ఒకరిపై పెట్టుకొన్న అంచనాలు తలకిందులవ్వటం, అనుకున్నది సాధించలేకపోవటం, ఉన్నదానికంటే ఎక్కువగా కోరుకోవటం... ఇలా ఎన్నో కారణాలు మనిషి ఒత్తిడికి కారణం అవుతాయి. ఇలాంటివాటిని ఎదుర్కొనేవారు ఎలాంటి బాధలు, అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలరు. సమస్యలను సున్నితంగా పరిష్కరించగలరు. మీరు స్ట్రెస్‌ను ఎదుర్కోగలరా? అది ఎలాగో మీకు తెలుసా?
1. బయట సమస్యలను ఇంటిదాకా తెస్తారు.
ఎ. అవును బి. కాదు
2. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుంటారు.
ఎ. కాదు బి. అవును
3. స్నేహితులతో అప్పుడప్పుడూ సమయాన్ని గడుపుతారు.
ఎ. కాదు బి. అవును
4. స్పోర్ట్స్ / ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొంటారు.
ఎ. కాదు బి. అవును
5. ఒకే విషయాన్ని పదేపదే తలచుకోరు.
ఎ. కాదు బి. అవును
6. ఆధ్యాత్మికతకు మీలో చోటుంది.
ఎ. కాదు బి. అవును
7. ఆనందించాల్సిన సమయంలో మీ వర్క్ పూర్తి చేయాలనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. ఒత్తిడికి కారణమైన విషయం/వ్యక్తుల్లో పాజిటివ్ అంశాలను గుర్తిస్తారు. ఊహలకు తావివ్వరు.
ఎ. కాదు బి. అవును
9. ప్రతికూలంగా ఆలోచిం^è డాన్ని నిరోధిస్తారు.
ఎ. కాదు బి. అవును
10. ఒత్తిడిలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలు (ఆల్కహాల్, సిగరెట్) సాంత్వనను అందిస్తాయి.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఏడు దాటితే మీది ఒత్తిడిలో కూరుకుపోయే మనస్తత్వం. ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసే ప్రయత్నాన్ని మానండి. సమస్యలు సహజమని గుర్తించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఒత్తిడిని ఎదుర్కోవటం మీకు తెలుసు. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment