భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే భావి అంచనాలను చెప్పేవారికి ఎక్కడాలేనంత డిమాండ్ ఉంటుంది. మనకు బ్రహ్మంగారు ఎలాగో.. వెస్ట్రన్ కంట్రీస్‌కు బాబా వాంగా అలాగ!. ఈమె అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన ఈమె 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కానీ,
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పిన భవిష్యత్ అంచనాలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరొందిన బాబా వంగా తన పన్నెండేళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోస్యం చెప్పడాన్ని మొదలు పెట్టారు.
మార్కా డాట్ కామ్ తెలిపిన వివరాల ప్రకారం 2021 సెప్టెంబరు 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిపై బాబా వాంగా చెప్పిన అంచనా నిజమయ్యింది. రెండు లోహపు పక్షులు (విమానాలు) ట్విన్ టవర్స్‌ను ఢీకొంటాయని, అమాయకుల రక్తం ఏరులై పారుతుందని వాంగా తెలిపారు.
బాబా వాంగా తెలిపిన భవిష్యవాణులలో ముఖ్యమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో ప్రపంచం అంతం కానుంది. రాబోయే దశాబ్దాలలో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాలిలా ఉన్నాయి.
2025: ఐరోపాలో భారీ సంఘర్షణల కారణంగా ఈ ఖండంలోని జనాభా గణనీయంగా తగ్గుతుంది.
2028: నూతన శక్తి వనరులను కనుగొనే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటాడు.
2033: ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.
2076: కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది.
2130: భూలోకేతర నాగరికతలతో పరిచయం ఏర్పడుతుంది.(ఏలియన్స్‌తో కమ్యూనికేషన్)
2170: ప్రపంచవ్యాప్తంగా కరువు కమ్ముకుంటుంది.
3005: అంగారకునిపై యుద్ధం.
3797: భూమి నాశనం.. సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణం
5079: ప్రపంచం అంతం.
Comments
Please login to add a commentAdd a comment