Baba Vanga
-
ఏలియన్లతో మీటింగ్.. అంగారకుడిపై యుద్ధం తప్పదా?
భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే భావి అంచనాలను చెప్పేవారికి ఎక్కడాలేనంత డిమాండ్ ఉంటుంది. మనకు బ్రహ్మంగారు ఎలాగో.. వెస్ట్రన్ కంట్రీస్‌కు బాబా వాంగా అలాగ!. ఈమె అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన ఈమె 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కానీ, చనిపోయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పిన భవిష్యత్ అంచనాలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరొందిన బాబా వంగా తన పన్నెండేళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోస్యం చెప్పడాన్ని మొదలు పెట్టారు. మార్కా డాట్ కామ్ తెలిపిన వివరాల ప్రకారం 2021 సెప్టెంబరు 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిపై బాబా వాంగా చెప్పిన అంచనా నిజమయ్యింది. రెండు లోహపు పక్షులు (విమానాలు) ట్విన్ టవర్స్‌ను ఢీకొంటాయని, అమాయకుల రక్తం ఏరులై పారుతుందని వాంగా తెలిపారు.బాబా వాంగా తెలిపిన భవిష్యవాణులలో ముఖ్యమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో ప్రపంచం అంతం కానుంది. రాబోయే దశాబ్దాలలో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాలిలా ఉన్నాయి.2025: ఐరోపాలో భారీ సంఘర్షణల కారణంగా ఈ ఖండంలోని జనాభా గణనీయంగా తగ్గుతుంది.2028: నూతన శక్తి వనరులను కనుగొనే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటాడు.2033: ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.2076: కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది.2130: భూలోకేతర నాగరికతలతో పరిచయం ఏర్పడుతుంది.(ఏలియన్స్‌తో కమ్యూనికేషన్)2170: ప్రపంచవ్యాప్తంగా కరువు కమ్ముకుంటుంది.3005: అంగారకునిపై యుద్ధం.3797: భూమి నాశనం.. సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణం5079: ప్రపంచం అంతం. -
2021: ప్రపంచం అతలాకుతలమేనట!
బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? మరేం లేదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా కాలజ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆమె ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట. మరి ఆమె 2021 సంవత్సరం గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఆమెవరో? కాలజ్ఞానిగా ఎలా మారిందో ముందుగా తెలుసుకుందాం.. (చదవండి: అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాసా) చూపు పోయింది కానీ.. బల్గేరియాకు చెందిన బాబా వంగ అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. పన్నెండేళ్ల వయసులో వచ్చిన టోర్నడో ఆమె చూపును మింగేసింది. కానీ ఆశ్చర్యంగా రానున్న కాలంలో ఏం జరగనుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పే అద్భుత శక్తిని పొందింది. దీంతో ఆమెను బల్గేరియాలో నోస్ట్రడామస్(ఫ్రెంచ్ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేవారట. ఈ క్రమంలో ఆమె చెప్పిన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం అన్నీ నిజంగానే జరిగి తీరాయి. 1996లో ఆమె మరణించేముందు 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది. (వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు) క్యాన్సర్‌కు మందు రాబోతుందా? 2021లో ప్రకృతి విధ్వంసం భారీగా జరగబోతుందని హెచ్చరించింది. జనాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని ఊహించింది. వినాశకరమైన ఘటనలతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో క్యాన్సర్ మహమ్మారి సంకెళ్లను తెంచుకుని మానవాళి బయటపడుతుందనే శుభవార్తను కూడా అందించింది. అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్‌కు నివారణ ఔషధం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోయి పుడమి తల్లి విశ్రాంతి తీసుకోనుందని ఉద్ఘాటించింది. ఆ సమయంలో రైళ్లు సోలార్ శక్తితో నడుస్తాయంది. కొందరు ప్రజలు రెడ్ మనీ వాడుతారంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఓ డ్రాగన్ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని, దీని ఎదుర్కొనేందుకు మూడు దిగ్గజ దేశాలు ఏకమవుతాయని చెప్పింది. అలాగే ఆ మూడు దిగ్గజాలను చైనా, ఇండియా, రష్యాగా భావిస్తున్నారు. ఇక 2341 నాటికి భూమి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుందని కూడా చెప్పింది. అయితే 2021లో ఆమె చెప్పిన శుభ శకునాలు మాత్రమే నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు జనాలు. (చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!) -
2018లో మారనున్న ప్రపంచ తలరాత
బల్గేరియా : 2018లో ప్రపంచ దశ దిశను మార్చే సంఘటనలు జరగనున్నాయా?. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం వంగా బాబా. 2018లో అమెరికా ఆర్ధిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని ఆమె పేర్కొన్నట్లు బల్గేరియాకు చెందిన సూపర్ నేచురలిస్టులు పేర్కొన్నారు. వంగా బాబా ఓ మహిళ. పుట్టుకతోనే ఆమె అంధురాలు. 85 ఏళ్ల వయసు(1996)లో ఆమె మరణించారు. చనిపోయేముందు 51వ శతాబ్దం వరకూ భూమి భవిష్యత్ ఎలా ఉండబోతోందో చెప్పారు. 51వ శతాబ్దం తర్వాత భూమి అంతం అవుతుందని పేర్కొన్నారు. 2028వ సంవత్సరానికి ప్రపంచంలో ఆకలి కేకలు కనిపించవని చెప్పారు. వంగా బాబా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికే జరిగి ప్రపంచ దశ దిశలను మార్చివేశాయి. ఐసిస్ ఉద్భవించడం, అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి, యూరప్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకోవడం లాంటి సంఘటనలను వంగా బాబా 1996లోనే చెప్పారట. మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సరం 2018లో రెండు ప్రముఖ సంఘటనలు చోటు చేసుకుంటాయని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్లు చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టి చైనా అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటుంది వీనస్ గ్రహంపై పరిశోధనల్లో కొత్త శక్తిని శాస్త్రవేత్తలు కనుగొంటారు 1970 దశకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 4.1 శాతం. 2015కల్లా ఈ వాటా శాతం 15.6కు పెరిగింది. 2015లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 16.7. 2025 కల్లా అమెరికా వాటా 14.9కి పడిపోతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే, వీనస్ గ్రహంపైకి ప్రత్యేక మిషన్‌తో వెళ్తున్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఏవీ లేవు. 2256వ ఏడాదిలో మనుషులు అంగారకుడిపై కాలనీలు నిర్మించుకుంటారని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్ జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడే అణు ఆయుధాలను ఉత్పత్తి కూడా చేస్తారని వెల్లడించారు. 2341వ సంవత్సరంలో భూమిపై నివసించడం మనిషి కష్టసాధ్యం అవుతుందని పేర్కొన్నారు.