ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడి(ఎడమ), బాబా వంగా(మధ్యలో), ఐసిస్ ఉగ్రవాది(కుడి)
బల్గేరియా : 2018లో ప్రపంచ దశ దిశను మార్చే సంఘటనలు జరగనున్నాయా?. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం వంగా బాబా. 2018లో అమెరికా ఆర్ధిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని ఆమె పేర్కొన్నట్లు బల్గేరియాకు చెందిన సూపర్ నేచురలిస్టులు పేర్కొన్నారు. వంగా బాబా ఓ మహిళ. పుట్టుకతోనే ఆమె అంధురాలు. 85 ఏళ్ల వయసు(1996)లో ఆమె మరణించారు. చనిపోయేముందు 51వ శతాబ్దం వరకూ భూమి భవిష్యత్ ఎలా ఉండబోతోందో చెప్పారు.
51వ శతాబ్దం తర్వాత భూమి అంతం అవుతుందని పేర్కొన్నారు. 2028వ సంవత్సరానికి ప్రపంచంలో ఆకలి కేకలు కనిపించవని చెప్పారు. వంగా బాబా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికే జరిగి ప్రపంచ దశ దిశలను మార్చివేశాయి. ఐసిస్ ఉద్భవించడం, అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి, యూరప్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకోవడం లాంటి సంఘటనలను వంగా బాబా 1996లోనే చెప్పారట. మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సరం 2018లో రెండు ప్రముఖ సంఘటనలు చోటు చేసుకుంటాయని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్లు చెబుతున్నారు.
- అమెరికాను వెనక్కు నెట్టి చైనా అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటుంది
- వీనస్ గ్రహంపై పరిశోధనల్లో కొత్త శక్తిని శాస్త్రవేత్తలు కనుగొంటారు
1970 దశకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 4.1 శాతం. 2015కల్లా ఈ వాటా శాతం 15.6కు పెరిగింది. 2015లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 16.7. 2025 కల్లా అమెరికా వాటా 14.9కి పడిపోతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే, వీనస్ గ్రహంపైకి ప్రత్యేక మిషన్‌తో వెళ్తున్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఏవీ లేవు.
2256వ ఏడాదిలో మనుషులు అంగారకుడిపై కాలనీలు నిర్మించుకుంటారని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్ జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడే అణు ఆయుధాలను ఉత్పత్తి కూడా చేస్తారని వెల్లడించారు. 2341వ సంవత్సరంలో భూమిపై నివసించడం మనిషి కష్టసాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment