Bulgaria
-
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
Candidates Chess Tournament: హంపి పరాజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్ న్యుర్గుల్ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగం నాలుగో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్ సంతోష్ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. -
Strandja Memorial Boxing: నిఖత్‌కు రజతం
సోఫియా- Amit Panghal and Sachin win Gold: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. మహిళల 50 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 2–3తో సబీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 66 కేజీల ఫైనల్లో అరుంధతి 1–4తో లి యంగ్ (చైనా) చేతిలో ఓడి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల 51 కేజీల ఫైనల్లో అమిత్ 5–0తో తష్కెంబే (కజకిస్తాన్)పై, 57 కేజీల ఫైనల్లో సచిన్ 5–0తో షఖ్జోద్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) ఓడి రజత పతకాలు గెలిచారు. Take a look at 🇮🇳's #Silver🥈& #Bronze🥉medalists of the 7⃣5⃣th Strandja Cup, 🇧🇬 *Nikhat: 🥈in 51kg weight category * Arundhati:🥈in 66kg weight category * Barun:🥈in 48kg weight category * Rajat: 🥈in 67kg weight category * Akash:🥉in 67kg weight category * Naveen:🥉in… pic.twitter.com/K0LqKHM8FT — SAI Media (@Media_SAI) February 11, 2024 -
ఇదేం పిచ్చి! పెదవులు పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి..! అన్న సామెతో ఊరికే రాలేదేమో. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతలా అంటే? వారితో ఉండే కుటుంబ సభ్యులకు సైతం ఛీ అనిపించేలా జుగుప్సకరంగా ఉంటారు. పోనీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నచ్చచెప్పి మారుద్దామన్నా వినరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా మొండిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే బల్గేరియన్ మహిళ. తాను ప్రత్యేకంగా ఉండాలనకోవడం ఓకే. కానీ మరింత విలక్షణంగా ఉండాలనుకోవడం భరించలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలానే తన పెదాలే అందరికంటే పెద్దగా ఉండాలని ఏం చేసిందో వింట్ షాకవ్వుతారు. అసలేం జరిగిందంటే..బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇవనోవా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. ఎంతలా అంటే తనను తాను పూర్తిగా మార్చుకునేంత. అంటే పూర్తిగా ఆమె ఆహార్యం సైతం మారిపోవాలనుకుంటుంది. అందుకోసం సర్జరీలు కూడా చేసుకుని మార్చేసుకుంటుంది. ఏమోందో ఏమోగానీ! ఆమె పెదాలు పెద్దగా ఉండాలనుకుంది. అదికూడా ప్రంపంచంలో అందరికంటే తన పెదాలే పెద్దగా ఉండాలనేది ఆమె కోరిక. అలా ఉంటేనే తాను అందంగా ఉంటానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకోసం 2018 నుంచి పలు క్లినిక్‌లను సంప్రదించి వాటిలో ది బెస్ట్ కాస్మెటిక్ క్లినిక్‌ని ఎంచుకుని మరీ సర్జరీ చేయించుకుంది. ఈ ప్రక్రియను ఆమె 22 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది. 2019 నాటికి పెదవులకు సంబంధించి సుమారు 15 ఇంజెక్షన్లు తీసుకుంది. అలా ఇప్పటి వరకు దాదాపు 26కు పైగా లిప్ ఇంజెక్షన్లు తీసుకోవడం గమనార్హం. ఈ బ్యూటీ సర్జరీ కోసం ఆమె సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. అంతేగాదు ఈ పెద్ద పెదాలతో చాలా సంతోషంగా ఉన్నానని, పైగా ఇప్పుడు తాను చాలా అందంగా కనిపిస్తున్నాని చెబుతుండటం విశేషం. ఇప్పుడామె ఆమె అతి పెద్ద బుగ్గలు ఉండాలనుకుంటోందట. ఆ పనిలోనే ఉన్నానని కూడా చెబుతోంది. తాను ఏ సెలబ్రెటీలా ఉండకూడదని కోరుకుంటుందట. ఎప్పటికీ తాను చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తానని అంటోంది. ఆమె ఇలా అందం కోసం తన శరీరంలో చాలా భాగాలకు ఇలానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కూడా. ఇవేం వింత కోరికలో గానీ శరీరం మొత్తం సర్జరీలతో కుళ్లబొడిపుంచుకుంటోంది. పైగా లక్షలు లక్షలు ఖర్చుపెట్టేస్తోంది. అయితే ఇదంతా ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం ఉండదట. ఇలా అందం కోసం చేస్తున్న ప్రక్రియలన్నీ ప్రాణాంతకంగా మారుతాయమోనని ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారని సమాచారం. కానీ ఇవనోవా మాత్రం ముఖ సౌందర్యం కోసం ఇలాంటి ప్రక్రియలు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి బ్యూటీ సర్జరీలు చేయించుకుంటానని అంటోంది. పైగా సోషల్ మీడియాలో తానే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు కలిగి ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. View this post on Instagram A post shared by Andrea Ivanova (@andrea88476) (చదవండి: గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!) -
అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్‌గా 'మమ్మీలా'...
ఈజిప్ట్‌లో మమ్మీఫికేషన్ మృతదేహాల గురించి చూశాం. అక్కడ రాజులు, ప్రముఖ వ్యక్తుల దేహాలు పాడవ్వకుండా కొన్ని రకాల రసాయనాలు పూసి సమాధి చేయడం గురించి విన్నాం. పురావస్తు శాఖ అధికారులు అలా మమ్మఫికేషన్ చేయబడిని వాటిని వెలికితీసి వాటిపై పరిశోధనలు చేస్తూ కొంగొత్త విషయాలను చెబుతుంటారు. కానీ ఇక్కడొక వ్యక్తి శాస్త్రవేత్తలకే సవాలు విసిరేలా అకస్మాత్తుగా మమ్మీలా మారిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకున్నారు. ఏవిధంగా చూసిన ఓ మృతదేహం మమ్మిఫికేషన్ అవ్వాలంటే కనీసం కొద్ది నెలలు పడుతుంది. మరి ఇదేంటి?.. శాస్త్రవేత్తలను ఓకింత కలవారపాటుకు గురి చేసిన ఆ అంతు పట్టని మిస్టరీ గురించే ఈ కథనం. అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 3న బల్గేరియాలోని రైల్వేలైన్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయగా మద్యానికి బానిసకావడంతో చనిపోయినట్లు తేలింది. విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆగస్టు 16 వరకు సజీవంగా ఉన్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. జస్ట్ 16 రోజుల తర్వాత మమ్మీలా మారిని అతడి శవంలా కనిపించింది. ఓ మృతదేహం మమ్మీఫికేషన్ అవ్వాలంటే కనీసం ఆరు నుంచి 12 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఆ వ్యక్తి మృతదేహం మాత్రం చాలా ఏళ్ల క్రితం నాటి మమ్మీలా ఉంది. తొలుత పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని చూసి ఏదో మమ్మీలాంటి శవం ఎప్పుడోది అనుకున్నారు. ఆ తర్వాత ఆ మమ్మీ కాస్త ఫలాన వ్యక్తి అని తేలాక ఒక్కసారిగా కంగుతిన్నారు పోలీసులు. అత్యంత విచిత్రమైన అంశం ఏంటంటే బల్గేరియాలో అంతగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండవు. కేవలం 16 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత త్వరగా మృతదేహం పొడిగా మారిపోయి ఆధునాతన మమ్మీఫికేషన్లా ఎలా అయిపోయిందనేది అర్థంకాని అంతుపట్టని మిస్టరీలా ఉంది. అటు పోలీసులు, శాస్త్రవేత్తలు బల్గేరియా రాజధాని సోఫియాలో త్వరితగతిన మమ్మిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసే వాతావరణం లేదని కరాఖండీగా చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి మృతదేహం ఎలా మమ్మీఫికేషన్గా మారిందనేది ఎవ్వరికీ అర్థంకాని చిక్కు ప్రశ్నలా మిగిలింది. (చదవండి: ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..) -
Norway chess: ఆనంద్‌కు మరో విజయం
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది. -
Putin: అన్నంత పని చేసిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. ఈ తరుణంలో.. రూబుల్స్‌లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్, బల్గేరియాలకు గాజ్ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్ప్రోమ్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్(పీజీఎన్ఐజీ), బల్గేరియా(బల్గర్గ్యాజ్)లకు పూర్తిగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్ రూపేణా బకాయిల చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కిందటి నెలలోనే పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు చాలా దేశాలు తేలికగా తీసుకున్నాయి. పైగా యూరోప్ దేశాలు తమకు రూబుల్స్ ఎలాగ ఉంటుందో కూడా తెలియదంటూ సెటైర్లు వేశాయి. ఈ తరుణంలో పుతిన్ తొలిసారి గ్యాస్ సరఫరా నిలిపివేయించడం ఇదే ప్రథమం. ఇక హంగేరీ మాత్రమే రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో.. పుతిన్ ప్రతీకారంగా ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా దేశాలకు ఇదే పరిస్థితి గనుక ఎదురైతే.. నష్టం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇది రష్యా ఆర్థికంపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని! -
బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి
సోఫియా: పశ్చిమ బల్గేరియాలోని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్ ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 45 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు, కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు. (చదవండి: కుక్కని బుక్ చేసేందుకై...మరీ అలా చేయాలా!) అంతేకాదు బస్సు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) -
బల్గేరియన్ ఓపెన్ విజేత సామియా
Samiya Samad: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖీ ఆదివారం ముగిసిన బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్ ఒజ్గె బేరక్ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన మీరాబా లువాంగ్ మైస్నమ్ 21–19, 7–21, 21–14తో ఐదో సీడ్ డానియల్ నికోలవ్ (బల్గేరియా)పై నెగ్గి టైటిల్ దక్కించుకున్నాడు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
2021: ప్రపంచం అతలాకుతలమేనట!
బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? మరేం లేదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా కాలజ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆమె ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట. మరి ఆమె 2021 సంవత్సరం గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఆమెవరో? కాలజ్ఞానిగా ఎలా మారిందో ముందుగా తెలుసుకుందాం.. (చదవండి: అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాసా) చూపు పోయింది కానీ.. బల్గేరియాకు చెందిన బాబా వంగ అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. పన్నెండేళ్ల వయసులో వచ్చిన టోర్నడో ఆమె చూపును మింగేసింది. కానీ ఆశ్చర్యంగా రానున్న కాలంలో ఏం జరగనుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పే అద్భుత శక్తిని పొందింది. దీంతో ఆమెను బల్గేరియాలో నోస్ట్రడామస్(ఫ్రెంచ్ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేవారట. ఈ క్రమంలో ఆమె చెప్పిన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం అన్నీ నిజంగానే జరిగి తీరాయి. 1996లో ఆమె మరణించేముందు 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది. (వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు) క్యాన్సర్‌కు మందు రాబోతుందా? 2021లో ప్రకృతి విధ్వంసం భారీగా జరగబోతుందని హెచ్చరించింది. జనాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని ఊహించింది. వినాశకరమైన ఘటనలతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో క్యాన్సర్ మహమ్మారి సంకెళ్లను తెంచుకుని మానవాళి బయటపడుతుందనే శుభవార్తను కూడా అందించింది. అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్‌కు నివారణ ఔషధం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. పెట్రోల్ ఉత్పత్తి ఆగిపోయి పుడమి తల్లి విశ్రాంతి తీసుకోనుందని ఉద్ఘాటించింది. ఆ సమయంలో రైళ్లు సోలార్ శక్తితో నడుస్తాయంది. కొందరు ప్రజలు రెడ్ మనీ వాడుతారంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఓ డ్రాగన్ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని, దీని ఎదుర్కొనేందుకు మూడు దిగ్గజ దేశాలు ఏకమవుతాయని చెప్పింది. అలాగే ఆ మూడు దిగ్గజాలను చైనా, ఇండియా, రష్యాగా భావిస్తున్నారు. ఇక 2341 నాటికి భూమి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుందని కూడా చెప్పింది. అయితే 2021లో ఆమె చెప్పిన శుభ శకునాలు మాత్రమే నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు జనాలు. (చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!) -
ఇక్కడ సాధన అక్కడ బోధన
కత్యా తొషేవా! బల్గేరియా పౌరురాలు. భారతీయ కళలంటే మక్కువ. తరచూ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఉంటారు. ఇక్కడ సాధన చేసిన నృత్యాలను అక్కడికెళ్లి బోధిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరులో గురు రవి శంకర్ మిశ్రా దగ్గర కథక్ నేర్చుకుంటున్నారు. విషయం తెలిసి సాక్షి ఆమెను సంప్రదించింది. ఇ–మెయిల్ ద్వారా సంభాషించింది. ఆ విశేషాలివి. ఐరోపా, ఆసియా ఖండాలకు మధ్యలో ఉండే ఓ ఒక చిన్న దేశం బల్గే రియా. అందంగా, ప్రకృతిసిద్ధం అనిపించేలా ఉంటుంది.పర్వత శ్రేణులు ఎక్కువ. నల్ల సముద్ర తీరంలో ఉంటుంది. బల్గేరియాలోని సోఫియా ఆమె స్వస్థలం. డిగ్రీ వరకు చదివారు. పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నట్లున్నారు. తొషేవాకు ఒక తమ్ముడు. అమ్మానాన్న డాక్టర్లు. భర్త పేరు రోజున్ జెన్కోవ్. ఆయనకు వాద్య పరికరాలంటే ఇష్టం. రకరకాల వాద్యాలు నేర్చుకోవటానికి ప్రయత్నించారు. చివరకు తబలా దగ్గర సెటిల్ అయిపోయారు. సంస్కృతిని, సంప్రదాయ కళల్ని ఇష్టపడేవారెవరైనా భారతదేశాన్నీ ఇష్టపడతారు. అలా ఈ దంపతులకూ ఇండియా ఇష్టమైన దేశం అయింది. యోగా వల్ల ఆసక్తి ‘‘నాట్యం నేర్చుకోవాలనే కోరిక ఎవరికైనా సహజంగానే కలగాలి’’ అంటారు తొషేవా. ‘‘నేను యోగా చేయటం ప్రారంభించాక, నాట్యం మీద ఆసక్తి కలిగింది. చివరికి నాట్యాభ్యాసం లేనిదే జీవితం లేదన్న స్థితికి చేరుకున్నారు. నాట్యం ఇప్పుడు నా ఊపిరి’’ అన్నారు తొషేవా ఓ ప్రశ్నకు సమాధానంగా. భరతనాట్యం అభ్యాసంతో ఆమె నృత్యయానం మొదలైంది. ప్రస్తుతం బెంగళూరులోని ‘సాంజలి సెంటర్ ఫర్ ఒడిస్సీ అండ్ కథక్’ లో గురు షర్మిల ముఖర్జీ దగ్గర, పండిట్ మిశ్రా దగ్గర ఒడిస్సీ కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాత్రం నాకు ప్రవేశం లేదు. గురు సరస్వతి రాజేశ్ ద్వారా తొలిసారి కూచిపూడి గురించి తెలుసుకున్నాను’’ అన్నారు తొషేవా. ఇష్టమైన వ్యాపకం భార్యాభర్తలు ఏడాదంతా బల్గేరియా, భారత్‌ల మధ్య ప్రయాణిస్తూనే ఉంటారు. బల్గేరియాలో.. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ‘ఇందిరా గాం«ధీ’ అనే పేరున్న ఒక పాఠశాలలో తొషేవా నాట్యానికి సంబంధించిన పాఠాలు బోధిస్తుంటారు. ‘ఇండియన్ డ్యాన్స్ స్కూల్ కాయా’ అని ఒక స్కూల్‌ను స్థాపించి, బల్గేరియాలోని పెద్ద పెద్ద నగరాలైన సోఫియా, ప్లొవ్డివ్లలో పిల్లలకు, పెద్దలకు నాట్యం నేర్పిస్తున్నారు. ‘‘మా అమ్మమ్మ గారి స్వగ్రామం బ్రూసెన్లో కూడా నాట్యం నేర్పిస్తున్నాను. భారతదేశం పట్ల నాకున్న ప్రేమను అందరితో పంచుకోవటం కోసం, ప్రతి నెల వర్క్‌షాపులు నిర్వహిస్తూ, ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రసంగాలు ఇవ్వడం నాకు ఇష్టమైన వ్యాపకం. గ్రీసు, సైప్రస్, స్పెయిన్, ఫ్రాన్స్, సెర్బియా దేశాలలో నా ప్రదర్శనలకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే అవి నాకు కాదు. భారతీయ సంస్కృతికి లభించినట్లుగా నేను భావిస్తాను’’ అంటారామె. రెండేళ్ల క్రితం భారత రాష్ట్రపతి బల్గేరియా సందర్శించిన సందర్భంలో ఆయన ముందు నాట్యం చేయటానికి ఆమెకు ఆహ్వానం అందింది. బల్గేరియా, ఫ్రాన్స్, సైబీరియా ప్రాంతాలలో భారత దేశ రాయబారుల ఎదుట కూడా ప్రదర్శనలిచ్చారు. వైజయంతి పురాణపండ -
పసిడి పతక పోరుకు హుసాముద్దీన్ అర్హత
స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో హుసాముద్దీన్‌కు అతని ప్రత్యర్థి మికోలా బట్‌సెంకో (ఉక్రెయిన్) నుంచి వాకోవర్ లభించింది. మికోలా చేతికి గాయం కావడంతో అతను బరిలోకి దిగలేదు. మరోవైపు మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ సోనియా లాథెర్ 2–3తో లులియా సిప్లకోవా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బుధవారం జరిగిన 51 కేజీల విభాగంలో సెవ్దా అసెనోవ (బల్గేరియా)పై విజయం సాధించింది. బౌట్ తొలి రౌండ్లోనే అసెనోవా వైదొలగడంతో నిఖత్ గెలుపు ఖాయమైంది. పురుషుల తొలి రౌండ్ బౌట్లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) 4–1తో ఎంజో గ్రౌ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పురుషుల 63 కేజీల రెండో రౌండ్ బౌట్లో శివ థాపా 5–0తో పావెల్ పొలాకోవిచ్ (పోలాండ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
బై బై బల్గేరియా
బల్గేరియాకు బై బై చెప్పి హైదరాబాద్‌కు హాయ్ చెప్పారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. బల్గేరియాలో ఇటీవల మొదలైన ఈ సినిమా షెడ్యూల్ పూర్తికావడంతో ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారట ఎన్టీఆర్. ఈ షెడ్యూల్లో ఆయన ఇంట్రడక్షన్ సీన్స్ తీశారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్ జాయిన్ అవుతారట. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
బల్గేరియా వెళ్లారయా
బల్గేరియా వెళ్లింది ‘ఆర్ఆర్ఆర్’ బృందం. నెక్ట్స్ మూడు నాలుగు వారాలు అక్కడే మకాం. ఓ పెద్ద యాక్షన్ సీన్ చిత్రీకరించుకుని రావడం ప్లాన్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ బల్గేరియాలో మొదలైంది. ఈ షెడ్యూల్లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటారని సమాచారం. చిత్రబృందం ఆల్రెడీ గురువారం బల్గేరియా బయలుదేరింది. ఈ నాలుగు వారాల షెడ్యూల్లో ఓ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు రాజమౌళి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 31న రిలీజ్ కానుంది. -
ప్రపంచ చాంపియన్‌కు సాక్షి మాలిక్ షాక్
బల్గేరియా: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్... డాన్ కొలొవ్ రెజ్లింగ్ మీట్లో తుదిపోరుకు అర్హత సాధించింది. 65 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీ సెమీఫైనల్లో సాక్షి 4–1తో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని కంగుతినిపించింది. దీంతో భారత రెజ్లర్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. నేడు పసిడి పతకం కోసం సాక్షి... హెన్నా జొహన్సన్ (స్వీడెన్)తో తలపడుతుంది. -
మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య
రూస్ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో యూరోప్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బల్గేరియన్ మహిళా జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా దారుణంగా హత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను దుండగులు అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన రూస్ పట్టణంలో చోటుచేసుకుంది. మారినోవా బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని వెలికితీసి ఒక్కసారిగా ఐరోపాను ఉలిక్కిపడేటట్టు చేశారు మారినోవా. ప్రస్తుతం మారినోవా ‘డిటెక్టర్’ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దుండగలు మారినోవాను అమానవీయరీతిలో దారుణంగా హత్య చేశారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపిన కిరాతకులు, పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్‌కు సమీపంలో పడేశారు. అయితే మారినోవా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మారినోవా మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి. మారినోవా హత్య విషయం తెలిసిన బల్గేరియా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ కూడా బల్గేరియాను కోరాయి. -
‘బ్రహాస్త్ర’ సెట్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. బాలీవుడ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. కరణ్‌జోహార్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చ్రితం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది. మూడు దేశాల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ప్రస్తుతం బల్గేరియాలో ఉన్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర షూటింగ్ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి.. బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో కలిసి బ్రహ్మాస్త్ర సెట్స్‌ని సందర్శించారు. వీరితో పాటు రామ్‌నాథ్ కోవింద్ భార్య రుమాన్ దేవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ బ్రహ్మాస్త్ర నటీనటులందరితో మాట్లాడారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ జరుగుతున్న సోషియా స్టూడియోని సందర్శించారు. ఇరు దేశాల ప్రెసిడెంట్స్ నటీనటులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమా అనేది రెండు దేశాల మధ్య బిజినెస్, కల్చరల్ లింక్ అవుతుందని ఇరుదేశాల అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం తమ ట్విట్టర్లో పేర్కొంది. #PresidentKovind and President Radev dropped in at the studio in Sofia where the Hindi film Brahmastra is being made. The Presidents met the Indo-Bulgarian crew and chatted about cinema as a business and cultural link between the two countries pic.twitter.com/8ApZq1gEJA — President of India (@rashtrapatibhvn) September 5, 2018 -
పెంకా.. బతుకుతుంది ఇంకా..
పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది. గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
మీకు పెంకా తెలుసా?
కొన్ని రోజుల క్రితం వరకు మీకే కాదు.. ఆమె యజమాని ఇవాన్‌కు తప్పిస్తే.. పెంకా అంటే ఎవరికీ తెలియదు.. ఆవులు, గేదెలు అంటే.. అలా పక్కనున్న పొలాల్లో, తోటల్లో గడ్డి మేయడం కోసం వెళ్లడం మామూలే.. పెంకా కూడా అలాగే వెళ్లింది.. అలా వెళ్లినందుకు పెంకాకు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష!! ► పెంకా ఓ ఆవు.. బల్గేరియాలోని సరిహద్దు గ్రామం కొపిలోట్సీలో ఉంటుంది.. ఓ 20 రోజుల క్రితం గడ్డి మేస్తూ.. మేస్తూ.. అలా కొంచెం దూరం వెళ్లింది.. తోడేళ్లు వెంటపడ్డాయి.. పరిగెడుతూ.. పరిగెడుతూ అనుకోకుండా సరిహద్దును దాటింది.. సెర్బియాలోకి వెళ్లిపోయింది.. పెంకా కనిపించకపోయేసరికి ఆమె యజమాని ఇవాన్, అతని కుమారులు అన్ని చోట్లా వెతికారు. సరిహద్దు భద్రత అధికారులకు విషయం తెలియజేశారు. ► కొన్ని రోజుల క్రితం.. పెంకా సెర్బియాలోని బోసిల్గ్రాడ్ గ్రామంలో ఉందని తెలిసింది.. ఇవాన్ ఆనందానికి అవధుల్లేవు.. వెంటనే బయల్దేరాడు.. బోసిల్గ్రాడ్ చేరుకున్నాడు.. దారితప్పి వచ్చిన పెంకాను అక్కడివాళ్లు బాగానే చూసుకున్నారు. పెంకా ఆరోగ్యంగానే ఉందని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని సెర్బియా పశు వైద్యుడు కూడా ధ్రువీకరించడంతో దాన్ని పట్టుకుని.. ఇవాన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ► పేపర్స్ ఏవి.. ప్రశ్నించాడు బల్గేరియాలోని సరిహద్దు భద్రతాధికారి.. పేపర్స్ ఏమిటి అన్నాడు ఇవాన్. పెంకా దారి తప్పిన విషయం చెప్పాడు.. యూరోపియన్ యూనియన్ రూల్స్ గురించి తెలియవా అంటూ çహూంకరించాడా అధికారి. బల్గేరియా ఈయూ సభ్య దేశం.. సెర్బియా కాదు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా.. ఈయూ సభ్యదేశంలోని వారు వేరే దేశానికి వెళ్లడం.. తగు పత్రాలు లేకుండా తిరిగి దేశంలోకి రావడం నిషేధం.. వాళ్ల లెక్క ప్రకారం పెంకా అక్రమంగా సరిహద్దు దాటింది.. ఇప్పుడు కూడా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటి రావాలని చూస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఆ అపరాధానికి శిక్ష.. మరణమే.. ► మరికొన్ని రోజులే.. ఇవాన్‌కు చెప్పాడు అతడి గ్రామంలోని పశువైద్యుడు. నేను చేయగలిగింది ఏమీ లేదు.. చట్టాలు అలాగున్నాయని అన్నాడు.. పెంకా అక్రమంగా సరిహద్దు దాటడమొక్కటే కాదు.. సెర్బియా నుంచి ఏమైనా రోగాలను మోసుకొచ్చిందేమోనన్న అనుమానం కూడా అధికారులకు ఉంది. అలాగని పరీక్షలు చేయలేదు. సెర్బియా వైద్యుడు పరీక్ష చేసి ఇచ్చిన పత్రాన్నీ నమ్మలేదు.పెంకాకు మరణ శిక్ష విధించడంపై తొలుత అక్కడి సోషల్‌మీడియాలో గగ్గోలు రేగింది. తర్వాత తర్వాత అది ఈయూ అంతా వ్యాపించింది. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది.. ఏమిటి హద్దు.. ఏమిటి సరిహద్దు అన్నది పశువులకు ఎలా తెలుస్తుంది? చట్టాలు కఠినమే.. కానీ కామన్సెన్స్ అన్నది కూడా ఒకటుండాలిగా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. పెంకాను రక్షించాలంటూ సంతకాల ఉద్యమమూ ఉధృతమైంది. ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతటా పెరిగింది. ► మీకో విషయం తెలుసా? పెంకా.. గర్భవతి.. రెండు, మూడువారాల్లో మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది.. మరి.. పెంకా బతుకుతుందా? మరో బుల్లి పెంకాకు బతుకునిస్తుందా? -
అయ్యో ఆలియా!
వారం రోజులు కూడా కంప్లీట్ కాలేదు. కథానాయిక ఆలియా భట్ బర్త్‌డేని హ్యాపీగా స్పెండ్ చేసి, ఈ నెల 15న 25వ వసంతంలోకి అడుగుపెట్టారామె. పాతికేళ్లల్లోకి ఎంటరైన సందర్భంగా ఫుల్‌గా పార్టీ చేసుకున్నారు. ఒక గుడ్ తర్వాత ఒక బ్యాడ్ అన్నట్లు.. వారం తిరగకుండానే ఆలియాకి చేదు అనుభవం ఎదురైంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్లో ఆలియా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన ఆలియా అభిమానులు.. ‘అయ్యో ఆలియా. ఇలా జరగకుండా ఉండాల్సింది’ అంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్న సమయంలో కాస్త బ్యాలెన్స్ తప్పి ఆలియా భట్ గాయపడ్డారు. దీంతో ఆమె 15 రోజుల పాటు షూట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటారని బాలీవుడ్ టాక్. ‘‘ఆలియా కుడిచేతికి దెబ్బ కాస్త బలంగానే తగిలింది. ఈ మంత్ ఎండింగ్ కల్లా బల్గేరియా షెడ్యూల్‌ను కంప్లీట్ చేయాలని ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ ప్లాన్ చేశారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఇతర సీన్స్‌పై చిత్రబృందం దృష్టి సారించింది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి అలియా భట్‌కు గాయాలయ్యాయి. బ్రహ్మస్త షూటింగ్లో ఆమె గాయపడినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో అలియాకు గాయాలైనట్లు సమాచారం. కుడి భుజానికి బలమైన గాయం కావటంతో ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు తెలిపారంట. దీంతో ఆమె ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2019లో విడుదల కానుంది. ఇది కాకుండా అలియా భట్ నటించిన మరో చిత్రం రాజీ విడుదలకు సిద్ధంగా ఉంది. -
2018లో మారనున్న ప్రపంచ తలరాత
బల్గేరియా : 2018లో ప్రపంచ దశ దిశను మార్చే సంఘటనలు జరగనున్నాయా?. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం వంగా బాబా. 2018లో అమెరికా ఆర్ధిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని ఆమె పేర్కొన్నట్లు బల్గేరియాకు చెందిన సూపర్ నేచురలిస్టులు పేర్కొన్నారు. వంగా బాబా ఓ మహిళ. పుట్టుకతోనే ఆమె అంధురాలు. 85 ఏళ్ల వయసు(1996)లో ఆమె మరణించారు. చనిపోయేముందు 51వ శతాబ్దం వరకూ భూమి భవిష్యత్ ఎలా ఉండబోతోందో చెప్పారు. 51వ శతాబ్దం తర్వాత భూమి అంతం అవుతుందని పేర్కొన్నారు. 2028వ సంవత్సరానికి ప్రపంచంలో ఆకలి కేకలు కనిపించవని చెప్పారు. వంగా బాబా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికే జరిగి ప్రపంచ దశ దిశలను మార్చివేశాయి. ఐసిస్ ఉద్భవించడం, అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి, యూరప్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకోవడం లాంటి సంఘటనలను వంగా బాబా 1996లోనే చెప్పారట. మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సరం 2018లో రెండు ప్రముఖ సంఘటనలు చోటు చేసుకుంటాయని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్లు చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టి చైనా అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటుంది వీనస్ గ్రహంపై పరిశోధనల్లో కొత్త శక్తిని శాస్త్రవేత్తలు కనుగొంటారు 1970 దశకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 4.1 శాతం. 2015కల్లా ఈ వాటా శాతం 15.6కు పెరిగింది. 2015లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 16.7. 2025 కల్లా అమెరికా వాటా 14.9కి పడిపోతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే, వీనస్ గ్రహంపైకి ప్రత్యేక మిషన్‌తో వెళ్తున్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఏవీ లేవు. 2256వ ఏడాదిలో మనుషులు అంగారకుడిపై కాలనీలు నిర్మించుకుంటారని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్ జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడే అణు ఆయుధాలను ఉత్పత్తి కూడా చేస్తారని వెల్లడించారు. 2341వ సంవత్సరంలో భూమిపై నివసించడం మనిషి కష్టసాధ్యం అవుతుందని పేర్కొన్నారు. -
విమానానికి బాంబు బెదిరింపు
సోఫియా: బాంబు బెదిరింపుతో పోలాండ్-ఈజిప్టు విమానం అత్యవసరంగా కిందకు దిగింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్టు 64 ఏళ్ల ప్రయాణికుడు సమాచారం అందించాడని, అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారని బల్గేరియా మీడియా తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. విమానం నుంచి ప్రయాణికులను దించేసి, సోదాలు చేపట్టారు. వార్సా నుంచి ఈజిప్టులోని రిస్టార్ట్ నగరం హర్గదాకు విమానం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబుతో పేల్చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. -
బల్గేరియా
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 110,994 చ.కి.మీ. జనాభా: 7,364,570 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: సోఫియా ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ కరెన్సీ: బల్గేరియాన్ లెవ్ అధికార భాష: బల్గేరియాన్ జాతులు: 84% బల్గేరియన్లు, 9% టర్కీలు, 5% రోమన్లు, 2% ఇతరులు సరిహద్దులు: ఉత్తరాన రోమేనియా, పశ్చిమాన సెర్బియా, మెసిడోనియా, దక్షిణాన గ్రీకు, టర్కీ దేశాలు, తూర్పున నల్ల సముద్రం ఉన్నాయి. నాగరికత: బల్గేరియా నగరికత చాలా ప్రాచీనమైనది. అనేక భిన్న సంసృ్కతుల కలయిక. ధ్రేసియన్లు, పురాతన గ్రీకులు, రోమన్లు, స్లావ్స్ల తమ సంస్కృతుల చిహ్నాలను బల్గేరియా నాగరితపై వదిలారు. దీనివల్ల బల్గేరియా దేశం ప్రపంచంలో ధనిక జానపద వారసత్వంగా రూపుదిద్దుకుంది. జెరెజన్, కుకెరి, మార్టెనిజా వంటి థ్రేసియన్ ఆచారాలు ఆధునిక బల్గేరియా సంస్కృతిని సజీవంగా ఉంచా యి. పరిశ్రమలు: రెండవ ప్రపంచ యుద్ధం ముందుగా బల్గేరియా ఆర్థికస్థితి ప్రధానంగా ఆహారం, వస్త్ర ఉత్పత్తులు వంటి లఘు పరిశ్రమలు మరియు వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. సామ్యవాద శకంలో పారిశ్రామీకరణ వల్ల భారీ పరిశ్రమలు లోహయంత్రాల ఉత్పత్తి, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు, నూనెశుద్ధి కర్మాగారాలు మొదలైన వాటి వల్ల 20 శతాబ్దం చివరలో బల్గేరియా ఆధిపత్యం కొనసాగింది. ఆహారం: బల్గేరియాలో గ్రీస్, టర్కీలలో ఉండే ఆహారం మాదిరిగా అనేక విధాలుగా ఉంటుంది. సాంప్రదాయ ఆహారం టమాటా, దోసకాయ, జున్ను, ముసాకా, రొట్టె, సగ్గుబియ్యం, వైన్ లీవ్స్ మొదలైనవి. బల్గేరియన్ వాసుల ముఖ్యమైన సంప్రదాయ వంటకాల్లో ఎక్కువగా పెరుగు, జున్ను, ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకుంటారు. చరిత్ర బల్గేరియా అధికారక నామం ‘‘రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా’’ ఐరోపా ఖండంలోని ఒక బల్గన్ దేశం. ఇది ఎంతో అందమైన, మనోహరమైన దేశం. దీనిని ‘‘గులాబీల భూమి’’ అని కూడా పిలుస్తారు. అరుదైన గులాబీ రకం ‘రోసా దమస్కేన్’ అనే మొక్క నుండి తీసే గులాబీ నూనె బల్గేరియాలోనే తయారవుతుంది. ఈ నూనెను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య మూలకాలు, సువాసన ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. ఓర్పియాస్ స్పార్టకస్కు జన్మనిచ్చిన భూమి బల్గేరియా. సుదీర్ఘమైన చరిత్ర కలిగి గ్రీకులు, స్కైతియన్లు, రోమన్లు, బైజాంటైన్, టర్కీలతో జయించి రూపుదిద్దుకుంది. బల్గేరియా మధ్యయుగాన్ని యూరోప్‌ని బల్గర్ నవాబులు పాలించిన కాలంలో ‘గోల్డెన్ యేజ్’గా పిలుస్తారు. తరువాత 500 సంవత్సరాల తరువాత క్రూరమైన టర్కిష్ ఆధిపత్యం మిగతా యూరోప్ దేశాల నుండి విముక్తిని పొందింది. పాశ్చాత్య ప్రపంచ దృష్టిలో నాలుగు శతాబ్దాల పాటు నిరంకుశ సోవియట్ దేశానికి ఒక శాటిలైట్‌గా దాని నీడలో ఉన్న బల్గేరియా తిరిగి తన ప్రాధాన్యతను పెంచుకోసాగింది. ఇందులో ఆశ్చర్యం లేదు. బల్గేరియా వాసులు తమ చరిత్రను, సంస్కృతిని సంరక్షించుకోవడంలో ఆసక్తిని కనబరుస్తారు. అందుకే ఎన్ని వ్యతిరేకతలున్నా, అసమానతలున్నా వారి సంస్కృతి ఏ మాత్రం చెదరకుండా ఉండగలిగింది. ఇది 19వ శతాబ్దంలో స్వాతంత్య్రం పొందే వరకు దీర్ఘకాలంగా బైజాంటైన్ సంస్కృతితో ప్రభావితమైన 500 సంవత్సరాలు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 20 శతాబ్దపు చివరి సంవత్సరంలో పురోగతి సాధించడం మొదలుపెట్టి ఉ్ఖ లో కొత్త సభ్యురాలిగా చేరింది. నాటోలో కూడా ఒక సభ్యదేశంగా ఉంది. బల్గేరియా రాజధాని సోఫియా. 2,400 సంవత్సరాల చరిత్రగల అతి పెద్ద నగరం. ఈ నగరం దేశంలోని పశ్చిమ భాగంలో విటొషా పర్వత పాదాల వద్ద, బాల్కన్ ద్వీపకల్పం మధ్యలో ఆక్రమించి ఉంది. సోఫియా బల్గేరియా రాజధాని అయిన సోఫియా యూరోపియన్ యూనియన్‌లో 15వ అతిపెద్ద నగరం. దాదాపు 1.3 మిలియన్ జనాభా ఉంది. ఇది గ్లోబలైజేషన్, వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్వర్క్ ద్వారా బీటీ నగరంగా గుర్తించబడింది. ఎన్నో ప్రధాన విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపారా కేంద్రాలు సోఫియా నగరంలో ఉన్నాయి. జుమాయ మసీదు ఈ మసీదు గోడలు మందపాటి రాళ్ళతో నిర్మించబడి, బలమైన గోపురాలతో కట్టబడి నిర్ణించబడి ఉంది. అంతర్గత నిర్మాణాన్ని ఒక స్మారకంగా నిర్మించారు. తొమ్మిది భారీ అంతర్గత సొరంగాలు నాలుగు చదరపు స్తంభాలతో సహాయంతో ఏర్పడ్డాయి. దీని గోడలు వివిధ రంగులతో ఆభరణాలు బొమ్మలు, ఖురాన్‌కి సంబంధించిన సూక్తులతో అలంకరించారు. 19 శతాబ్దపు కుడ్యచిత్రాలను ముస్తాఫా ఝెలెబి మసీదుపై గీశారు. ప్లిస్కా ప్లిస్కా 681-893 నుండి మొదటి బల్గేరియా సామ్రాజ్యపు రాజధానిగా ఉండేది. ప్లిస్కా మొదటి నిర్మాణం 7 శతాబ్దపు చివరి కాలంలో నిర్మించారు. వాటిని చెక్కతో వృత్తాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా చేశారు. కొన్ని నివాసాలుగా మరికొన్ని ఇతర వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు. 8వ శతాబ్దపు చివర 9వ శతాబ్దపు మొదట్లో చెక్కతో నిర్మించిన కట్టడాల స్థానంలో రాతితో కట్టడాలను ఏర్పాటు చేశారు. హన్క్రమ్ని మొట్ట మొదటి రాతి నిర్మాణంగా చెప్పుకుంటారు. కజాన్లాక్ పట్టణం కజాన్లాక్ పట్టణం బల్గేరియా మధ్యలో ఉంది. దీని జనాభా సుమారు 82,000. కజాన్లాక్ రోజెస్ లోయ, థ్రేసియన్ రాజుల భవనంతో ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద థ్రేసియన్ సమాధులు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తించింది.