
తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్
స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో హుసాముద్దీన్‌కు అతని ప్రత్యర్థి మికోలా బట్‌సెంకో (ఉక్రెయిన్) నుంచి వాకోవర్ లభించింది. మికోలా చేతికి గాయం కావడంతో అతను బరిలోకి దిగలేదు. మరోవైపు మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ సోనియా లాథెర్ 2–3తో లులియా సిప్లకోవా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment