గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం | Strandja Tournament: Indian boxer Nikhat Zareen to start in quarters | Sakshi
Sakshi News home page

గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం

Published Mon, Feb 21 2022 5:37 AM | Last Updated on Mon, Feb 21 2022 5:37 AM

Strandja Tournament: Indian boxer Nikhat Zareen to start in quarters - Sakshi

స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు (52 కేజీలు) తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో బరిలోకి దిగుతుంది. ఈ బౌట్‌లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం లభిస్తుంది. 2019లో ఈ టోర్నీలో నిఖత్‌ స్వర్ణం సాధించింది. ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌ నుంచి 17 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement