International boxing tournament
-
ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు షాకిచ్చిన తెలంగాణ బాక్సర్
Nikhat Zareen Enters Finals Of Strandja Memorial Boxing: బల్గేరియా వేదికగా జరుగుతున్న 73వ ఎడిషన్ స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (25) పంజా విసిరింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ బుసె నాజ్ కకిరోగ్లు (టర్కీ)పై 4-1 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ పోరులో ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్.. తనదైన పంచ్‌లతో విరుచుకుపడి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ చివరిసారిగా 2019లో ఈ టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో నీతు గంగాస్ (హర్యానా) కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. నీతు.. సెమీస్‌లో ఉక్రెయిన్ బాక్సర్, 2018 వరల్డ్ ఛాంపియన్షిప్స్ రజత పతక విజేత హన్నా ఒఖోతాను చిత్తుగా ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. నీతు పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి రెండో రౌండ్లో కుప్పకూలిపోయింది. ఇక ఇదే టోర్నీలో యూత్ ప్రపంచ ఛాంపియన్ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో, పర్వీన్ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం -
గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం
స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు (52 కేజీలు) తొలి రౌండ్లో ‘బై’ లభించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగుతుంది. ఈ బౌట్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం లభిస్తుంది. 2019లో ఈ టోర్నీలో నిఖత్ స్వర్ణం సాధించింది. ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి 17 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి
మాంట్రియల్: ఓ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియల్లో జరిగిన జీవైఎం గాలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికోకు చెందిన వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా గత శనివారం షెడ్యూలైన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్లో ప్రత్యర్థి మేరీ పియర్ హౌల్ విసిరిన పంచ్‌లకు జెన్నెట్ నేలకూలింది. ఐదో రౌండ్ బెల్ మోగాక కూడా ఆమె తేరుకోకపోవడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిని అనంతరం గురువారం ఆమె కన్నుమూసినట్లు ఫైట్ నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు -
భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరుల్లో అమిత్ 3–0తో రెనె అబ్రహం (అమెరికా)పై... సోహెబ్ బౌఫియా (అమెరికా)పై సంజీత్ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో జోసెఫ్ జెరోమ్ హిక్స్ (అమెరికా)తో ఆశిష్ కుమార్ తలపడాల్సి ఉండగా... గాయం కారణంగా జోసెఫ్ వైదొలిగాడు. అయితే 57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్ బౌట్లో కవీందర్ సింగ్ బిష్త్ 1–2తో సామ్యుల్ కిష్టోరి (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా (63 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (+91 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
పసిడి పతక పోరుకు హుసాముద్దీన్ అర్హత
స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో హుసాముద్దీన్‌కు అతని ప్రత్యర్థి మికోలా బట్‌సెంకో (ఉక్రెయిన్) నుంచి వాకోవర్ లభించింది. మికోలా చేతికి గాయం కావడంతో అతను బరిలోకి దిగలేదు. మరోవైపు మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ సోనియా లాథెర్ 2–3తో లులియా సిప్లకోవా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బుధవారం జరిగిన 51 కేజీల విభాగంలో సెవ్దా అసెనోవ (బల్గేరియా)పై విజయం సాధించింది. బౌట్ తొలి రౌండ్లోనే అసెనోవా వైదొలగడంతో నిఖత్ గెలుపు ఖాయమైంది. పురుషుల తొలి రౌండ్ బౌట్లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) 4–1తో ఎంజో గ్రౌ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పురుషుల 63 కేజీల రెండో రౌండ్ బౌట్లో శివ థాపా 5–0తో పావెల్ పొలాకోవిచ్ (పోలాండ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
నిఖత్ శుభారంభం స్ట్రాండ్జా స్మారక బాక్సింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 51 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ 5–0తో యాస్మీన్ ముతాకి (మొరాకో)పై ఘనవిజయం సాధించింది. ఇదే టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగంలో భారత బాక్సర్ శివ థాపాకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మరోవైపు సెర్బియాలో ముగిసిన నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోరీ్నలో భారత్‌కు నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మీనా కుమారి (54 కేజీలు), రితూ గ్రెవాల్ (51 కేజీలు), మోనిక (48 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు నెగ్గగా... సెమీస్‌లో ఓడిన బసుమతారి (64 కేజీలు), పవిత్ర (60 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
పసిడికి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నిఖత్, సిమ్రన్‌జిత్, సుమీత్ సాంగ్వాన్, వహ్లిమ్‌పుయా సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకోగా... ముగ్గురు బాక్సర్లు శివ థాపా (63 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లో సనా కవానో (జపాన్) చేతిలో... 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ కజకిస్తాన్ బాక్సర్ రిమ్మా వొలోసెంకో చేతిలో ఓడిపోయారు.పురుషుల విభాగం 91 కేజీల సెమీఫైనల్స్‌లో ఐబెక్ ఒరాల్‌బే (కజకిస్తాన్) చేతిలో సుమీత్ సాంగ్వాన్... 75 కేజీల విభాగంలో యుటో మొరివాకా (జపాన్) చేతిలో వహ్లిమ్‌పుయా ఓటమి చవిచూశారు. ఇతర సెమీఫైనల్స్‌లో దైసుకె నరిమత్సు (జపాన్)పై శివ థాపా; బీట్రిజ్ సోరెస్ (బ్రెజిల్)పై పూజా రాణి; హిరోయాకి కిన్‌జియో (జపాన్)పై ఆశిష్ గెలిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. -
నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు
బ్యాంకాక్: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్ సింగ్ (48 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్లాండ్లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ సింగ్ 0–5తో మిర్జాఖెమెదోవ్ నోదిర్‌జోన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... బ్రిజేశ్ యాదవ్ 1–4తో అనావత్ థోంగ్‌క్రాటోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్ 5–0తో కిమ్ జిన్జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తొమ్మిది స్వర్ణాలపై గురి... ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు), అంకుశ్ (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. -
భారత బాక్సర్ల పసిడి పంట
గువాహటి: సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో మేరీకోమ్ 5–0తో భారత్‌కే చెందిన వన్లాల్ దువాటిపై గెలిచింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో సరితా దేవి 3–2తో సిమ్రన్‌జిత్ కౌర్ (భారత్)పై, జమున 5–0తో సంధ్యారాణి (భారత్)పై, నీరజ 5–0తో మనీషా (భారత్)పై గెలిచారు. 48 కేజీల విభాగం ఫైనల్లో మోనిక (భారత్) 2–3తో గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో, లవ్లీనా (భారత్) 2–3తో అసుంతా (ఇటలీ) చేతిలో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్ (49 కేజీలు), అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 4–1తో సచిన్ సివాచ్ (భారత్)పై, దీపక్ 5–0తో గోవింద్ (భారత్)పై, ఆశిష్ 4–1తో దుర్యోధన్ (భారత్)పై, శివ థాపా 5–0తో మనీశ్ (భారత్)పై విజయం సాధించారు. ఫైనల్లో ఓడిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), కవిందర్ (56 కేజీలు) రజత పతకాలను దక్కించుకున్నారు. -
నిఖత్, ప్రసాద్‌లకు కాంస్యాలు
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పురుషుల 52 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ 4–1తో నిఖత్‌ను ఓడించగా... లలితా ప్రసాద్ 0–5తో ఆసియా చాంపియన్ అమిత్ పంఘల్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 31 పతకాలు... మహిళల విభాగంలో 26 పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి. పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌తో భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ తలపడతాడు. సెమీస్‌లో సచిన్ 5–0తో గౌరవ్ సోలంకిపై గెలిచాడు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన శివ థాపా (భారత్), మనీశ్ కౌశిక్ (భారత్) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో శివ థాపా 5–0తో క్రిస్టియన్ జెపాన్‌స్కీ (పోలాండ్)పై, మనీశ్ 5–0తో అంకిత్ (భారత్)పై విజయం సాధించారు. పురుషుల 49 కేజీల విభాగంలోనూ ఇద్దరు భారత బాక్సర్లు దీపక్, గోవింద్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో కరోలో పాలమ్ (ఫిలిప్పీన్స్) నుంచి దీపక్‌కు వాకోవర్ లభించగా... తషీ వాంగ్డి (భూటాన్)పై గోవింద్ నెగ్గాడు. 56 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో కవిందర్ బిష్త్ 4–1తో మదన్ లాల్ (భారత్)పై, చాట్‌చాయ్ డెచా (థాయ్‌లాండ్) 5–0తో గౌరవ్ బిధురి (భారత్) పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేశ్, మనీశ్ పవార్ (81 కేజీలు) ఫైనల్‌కు చేరారు. -
ఫైనల్లో హుసాముద్దీన్
హెల్సింకి (ఫిన్లాండ్): గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పోరుకు అర్హత సాధించాడు. పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో హుసాముద్దీన్ 3–2తో జన్బోలత్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కే చెందిన కవీందర్ బిష్త్‌తో హుసాముద్దీన్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో కవీందర్ 4–1తో జోర్డాన్ రోడ్రిగెజ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. 49 కేజీల విభాగంలో గోవింద్, 60 కేజీల విభాగంలో శివ థాపా కూడా ఫైనల్ చేరారు. సెమీస్‌లో గోవింద్ 5–0తో సోజన్ (రష్యా)పై, శివ థాపా 5–0తో వర్లమోవ్ (రష్యా)పై గెలిచారు. 91 కేజీల విభాగం సెమీఫైనల్లో సుమీత్ (భారత్) 0–5తో చెవోన్ క్లార్క్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. -
పసిడి పోరుకు ప్రసాద్
చబహార్ (ఇరాన్): కొత్త సీజన్‌లోని రెండో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ మక్రాన్ కప్‌లోనూ భారత బాక్సర్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఏకంగా ఆరుగురు బాక్సర్లు ఈ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ బాక్సర్, ప్రస్తుత జాతీయ చాంపియన్ పొలిపల్లి లలితా ప్రసాద్ (52 కేజీలు)తోపాటు దీపక్ సింగ్ (49 కేజీలు), సంజీత్ (91 కేజీలు), దుర్యోధన్ సింగ్ నేగి (69 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో వైజాగ్‌కు చెందిన ప్రసాద్ 5–0తో మార్విన్ తొబామో (ఫిలిప్పీన్స్)ను చిత్తుగా ఓడించాడు. నిర్ణీత మూడు రౌండ్లలోనూ ప్రసాద్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇతర సెమీఫైనల్స్‌లో మనీశ్ కౌశిక్ 4–1తో అష్కన్ రెజాయ్పై, సతీశ్ 5–0తో ఇమాన్ రమజాన్‌పై, దీపక్ 5–0తో మాలిక్ అమారిపై, సంజీత్ 5–0తో పుర్యా అమీరిపై, అలీ మొరాదీపై దుర్యోధన్ సింగ్ విజయం సాధించారు. అయితే రోహిత్ టొకాస్ (64 కేజీలు), మంజీత్ సింగ్ పంగల్ (75 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. గతవారం బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచారు. -
బాక్సర్ నిఖత్‌కు కేటీఆర్ అభినందన
సాక్షి, హైదరాబాద్: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్) అభినందించారు. సోమవారం హైదరాబాద్ చేరుకున్న నిఖత్ తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసింది. తాను గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని ఆయనకు చూపించింది. నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని, పట్టుదలను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్‌లో అద్బుతమైన ప్రతిభాపాటవాలతో యువతకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నావని నిఖత్‌ను ప్రశంసించారు. నిఖత్ జరీన్‌కు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అందిస్తున్న సహకారం పట్ల ప్రభుత్వానికి, కేటీఆర్‌కు నిఖత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
పసిడి పోరుకు నిఖత్
సోఫియా (బల్గేరియా): స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కేజీలు), అమిత్ పంగల్ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు) స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ 3–2తో సాండ్రా డ్రాబిక్ (పోలాండ్)పై... అమిత్ 3–2తో సైద్ మొర్తాజీ (మొరాకో)పై గెలిచారు. ఇతర బౌట్స్‌లో ఎమి మారి తొడొరోవా (బల్గేరియా)పై మంజు రాణి... ఎకతెరీనా సిచెవా (రష్యా)పై మీనా విజయం సాధించారు. మరోవైపు ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లో పరాజయం పాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
నిఖత్ పసిడి పంచ్
సాక్షి, హైదరాబాద్: బెల్గ్రేడ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెర్బియాలో శనివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ 3–0తో ఐకతెరిని కుట్‌సోజియోర్‌గోపులు (గ్రీస్)పై విజయం సాధించింది. సెమీ ఫైనల్లో నిఖత్ 3–0తో నీనా రాడోవనోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ంచింది. -
అమిత్ ‘పసిడి’ పంచ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్ మొర్దాజీ (మొరాకో)పై అమిత్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
భారత్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ చాటుకున్నారు. గురువారం ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మన బాక్సర్లు మొత్తం 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు. పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0–5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీకోమ్ 4–1తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్)ను ఓడించింది. మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), పూజ (69 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో దినేశ్ (69 కేజీలు), దేవాన్‡్ష జైస్వాల్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), సల్మాన్ షేక్ (52 కేజీలు) రజత పతకాలు గెలుపొందారు. -
శ్యామ్ కుమార్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3–0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4–1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు. రన్నరప్ భారత్ న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–15 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 0–1 గోల్‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరఫున షమ్సున్ నహర్ 41వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. -
క్వార్టర్స్‌లో బాక్సర్ నిహారిక
ఇస్తాంబుల్ (టర్కీ): అహ్మద్ కామెర్ట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 75 కేజీల విభాగం తొలి రౌండ్లో లౌరా మమెద్కులియెవా (రష్యా)పై నిహారిక గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 57 కేజీల విభాగంలో ఓల్గా వాజ్నియాక్ (ఉక్రెయిన్)పై శశి చోప్రా నెగ్గగా... 51 కేజీల విభాగంలో జాన్సాయా అబోరైమోవా (కజకిస్తాన్) చేతిలో దీపా కుమారి ఓడిపోయింది. టర్కీ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వరంలో ప్రతి ఏడాదీ జరిగే ఈ టోర్నీలో వివిధ దేశాల అగ్రశ్రేణి బాక్సర్లు పాల్గొంటారు. ఈసారి ఆతిథ్య టర్కీతోపాటు భారత్, రష్యా, కజకిస్తాన్, టర్కీ, మంగోలియా, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, తజికిస్తాన్, అర్మేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియాల నుంచి 90 మంది మహిళా బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
ఫైనల్లో మనోజ్
న్యూఢిల్లీ: ఉస్తీ నాద్ లాబెమ్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ (69 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మనోజ్‌తోపాటు సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో క్రిస్టియన్ చోలిన్స్కీ (చెక్ రిపబ్లిక్)పై మనోజ్; ఆడమ్ కొలారిక్ (చెక్ రిపబ్లిక్)పై సతీశ్; కామిల్ హలాడ్కీ (చెక్ రిపబ్లిక్)పై మనీశ్ గెలిచారు. అయితే భారత్‌కే చెందిన ఆశిష్ కుమార్ (64 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అర్తెమ్ హరుతున్యాన్ (జర్మనీ) చేతిలో ఆశిష్ ఓడిపోయాడ -
థాయ్‌లాండ్ బాక్సింగ్ టోర్నీకి శ్యామ్, హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్ హుస్సాముద్దీన్‌లకు చోటు లభించింది. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ టోర్నీలో ఏడు వెయిట్ కేటగిరీలలో బౌట్లు ఉంటాయి. ఒలింపియన్ బాక్సర్లు దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృషన్‌లు కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. గతంలో ‘కింగ్స్ కప్’గా వ్యవహరించిన ఈ టోర్నీలో 2015లో శ్యామ్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇటీవలే బల్గేరియాలో ముగిసిన స్ట్రాండ్జా కప్‌లో హుస్సాముద్దీన్ రజత పతకాన్ని గెలిచాడు. వీసాలు రాకపోవడంతో... మరోవైపు ఈనెల 13 నుంచి 18 వరకు జర్మనీలో జరిగే కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి భారత బాక్సర్లు వెళ్లడం లేదు. నిర్ణీత సమయానికి వీసాలు రాకపోవడంతో ఈ టోర్నీకి భారత బాక్సర్లు దూరమయ్యారు. భారత బాక్సింగ్ జట్టు: కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు), మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), రోహిత్ టొకాస్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). -
శ్యామ్ పసిడి పంచ్
న్యూఢిల్లీ : థాయ్‌లాండ్ అంతర్జాతీయ ఆహ్వానిత బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 49 కేజీల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో శ్యామ్ 3-0 తేడాతో సురాజిత్ థోంగ్ ఆనంద్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రోహిత్ (60 కేజీలు), మంజిత్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు.