
అమిత్ పంఘల్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్ మొర్దాజీ (మొరాకో)పై అమిత్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment