Gold Medal
-
జాతీయ స్కూల్ చెస్ విజేత సంహిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. కాకినాడలోని పెద్దాపురంలో జరిగిన ఈ టోర్నీలో సంహిత అండర్–11 బాలికల విభాగంలో చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత సంహిత, రిషిత (ఆంధ్రప్రదేశ్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సంహితకు టైటిల్ దక్కగా... రిషిత రన్నరప్‌గా నిలిచింది. ఏడు గేముల్లో నెగ్గిన సంహిత... ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అండర్–11 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన శ్యామల్ నిధిశ్ (7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అండర్–7 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన శ్రేయాంశ్ (7.5 పాయింట్లు) రజతం సాధించగా... ఓం ఈశ్ (7 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నాడు. అండర్–9 బాలికల విభాగంలో అరవ విశ్వాణి (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం సాధించింది. అండర్–9 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన తిప్పర్తి శ్రేయాన్ (8.5 పాయింట్లు) చాంపియన్‌గా నిలువగా...తిమ్మరాజు వెంకట సాత్విక్ (7.5 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. అండర్–13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మోదిపల్లి దీక్షిత (8 పాయింట్లు) స్వర్ణ పతకం నెగ్గగా, వి.త్రిపురాంబిక (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) రజతం సొంతం చేసుకుంది. అండర్–13 బాలుర విభాగంలో సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ (ఆంధ్రప్రదేశ్; 8 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు. అండర్–15 బాలికల విభాగంలో గోర్లి నైనా (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం... అండర్–17 బాలికల విభాగంలో చీదెళ్ల శర్వాణి (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) రజతం... అండర్–17 బాలుర విభాగంలో జ్ఞాన సాయి సంతోష్ (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) స్వర్ణం... మజ్జి రాంచరణ్ తేజ (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
షూటింగ్లో ‘స్వర్ణ’ సురుచి
న్యూఢిల్లీ: హరియానా టీనేజ్ షూటర్ సురుచి జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల్ని అవలీలగా సాధిస్తోంది. ఈ టోర్నీలో ఆమె నాలుగో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర షూటింగ్ జోడీ నేలవల్లి ముకేశ్– ద్వారం ప్రణవి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో మూడు స్వర్ణాల్ని క్లీన్‌స్వీప్ చేసిన సురుచి శనివారం 10 మీటర్ల యూత్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. సామ్రాట్ రాణాతో జోడీ కట్టిన ఆమె ఫైనల్లో 16–2తో ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ దేశ్వాల్–యశస్వీ జోషి జోడీపై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి ద్వయం కనీసం ఖాతా తెరువకముందే సురుచి–సామ్రాట్ జంట 14–0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని చలాయించింది. కాంస్య పతక పోరులో కర్నాటకకు చెందిన జొనాథన్ గెవిన్ ఆంథోని–అవంతిక మధు 17–13తో జస్వీర్ సింగ్ సాహ్ని–సైనా భర్వాణిలపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ముకేశ్–ప్రణవి జోడీ 12–16తో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్–సేజల్ కాంబ్లి జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రవీందర్, సేజల్లకు స్వర్ణ పతకం లభించింది. -
జ్యోష్న ‘రికార్డు’ పసిడి
దోహ: భారత యువ వెయిట్ లిఫ్టర్ జ్యోష్న సబర్ ఆసియా యూత్ చాంపియన్సిప్లో పసిడి పతకంతో మెరిసింది. ఖతర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్‌లో జ్యోష్న 40 కేజీల విభాగంలో రికార్డు బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. జ్యోష్న 135 కేజీలు ఎత్తి ఆసియా రికార్డు బద్దలు కొట్టడంతో పాటు... వరల్డ్ రికార్డుకు ఒక కేజీ దూరంలో నిలిచింది. స్నాచ్‌లో 60 కేజీలు ఎత్తిన జ్యోష్న, క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కిలోలు ఎత్తింది. 45 కేజీల విభాగంలో పాయల్ 155 కేజీల (70 స్నాచ్+85 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్య పతకం కైవసం చేసుకుంది. బాలుర 49 కేజీల విభాగంలో బాబులాల్ 197 కేజీల (88 స్నాచ్+109 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్యం గెలుచుకున్నాడు. 45 కేజీల బాలికల విభాగంలో ఆకాంక్ష వ్యవహారె (151 కేజీలు) ఐదో స్థానంలో నిలిచింది. -
చాంపియన్స్ ధీరజ్, దీపికా కుమారి
జంషెడ్పూర్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ధీరజ్ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‡్ష చౌధరిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అతుల్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి చాంపియన్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో తన సహచర ఆర్చర్ అకింత భకత్‌పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్‌జీత్ కౌర్‌కు కాంస్యం దక్కింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్‌తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్‌పీబీ 6–2తో పంజాబ్ టీమ్‌పై విజయం సాధించింది. -
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్‌లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్‌తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్‌కు సంబంధించిన పజిల్స్‌ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్‌కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్‌షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్‌కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్‌లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్‌కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్‌లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్‌ను గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
భవ్‌తేగ్ సింగ్ గిల్‌కు స్వర్ణం
ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ భవ్‌తేగ్ సింగ్ గిల్(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్ విభాగంలో 21 ఏళ్ల భవ్‌తేగ్ సింగ్ గిల్ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్‌తేగ్ సింగ్... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ భవ్‌తేగ్ సింగ్ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్ ఎంగ్లెజోడిస్ (సిప్రస్)కు రజతం, భారత షూటర్ అభయ్ సింగ్‌కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్‌తేగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్ ఈవెంట్లో అభయ్ సింగ్ షెఖాన్ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్‌లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్ (34 పాయింట్లు; ఫ్రాన్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు. -
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్‌కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్‌పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్‌లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
క్రిష వర్మ పసిడి పంచ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. -
చిరాగ్ చికారా ‘పసిడి’ పట్టు
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కు ఏకైక స్వర్ణ పతకం దక్కింది. అల్బేనియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ చిరాగ్ చికారా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దీమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో జరిగిన ఫైనల్లో చిరాగ్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (2022లో) తర్వాత ప్రపంచ అండర్–23 చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ రెజ్లర్‌గా చిరాగ్ గుర్తింపు పొందాడు. -
వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది. వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది. -
Paris Paralympics 2024: గతంకంటే ఘనంగా...
పారిస్: కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో ‘పారిస్’ బయలుదేరిన భారత దివ్యాంగ క్రీడాకారులు లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మెరిసిన నవ్‌దీప్... శనివారం భారత్‌కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో భారత అథ్లెట్ నవ్‌దీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెగ్ బీట్ సాయె జావెలిన్‌ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్‌కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు.సాదెగ్ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్ల టి12 (దృష్టిలోపం) కేటగిరీలో సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్‌తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. -
సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో గోల్డ్ వచ్చి చేరింది. నవదీప్ సింగ్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే నవదీప్ సింగ్‌కి ఈ గోల్డ్ మెడల్ అనూహ్యంగా దక్కింది. శనివారం ఆర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 47.32 మీటర్ల త్రో విసిరిన నవదీప్ సింగ్.. తొలుత రెండో స్ధానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇదే విభాగంలో ఇరాన్ కు చెందిన అథ్లెట్ సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. అయితే అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సదేగ్ బీత్పై అనర్హత వేటు పడింది. ఈవెంట్లో రెండు సార్లు అతడు ఎల్లో కార్డ్ అందుకున్నాడు. ఫలితంగా ఆఖరికి రెండ్ కార్డ్‌తో పతకానికి అనర్హుడయ్యాడు. అనూహ్యంగా అతనిపై వేటు పడటంతో.. ఆ తరువాత స్థానంలోగా నిలిచిన నవదీప్ సింగ్ రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది.కాగా పారాలింపిక్ కమిటీ 8.1 నియమం ప్రకారం.. క్రీడలో అథ్లెట్ల దురుస ప్రవర్తన, తమ జాతీయ జెండాను తప్పించి మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఈ నిబంధనలను అథ్లెట్లు ఉల్లంఘిస్తే రెండు పసుపు కార్డులు అందుకుంటారు. ఫలితంగా రెడ్ కార్డు(అనర్హత) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్లో సదేగ్ బీత్ సయా తమ జాతీయ జెండా బదులుగా నల్ల జెండాను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై పారాలింపిక్ కమిటీ వేటు వేసినట్లు సమాచారం. ఇక పారాలింపిక్స్ ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. -
ప్రవీణ్ ‘పసిడి’ వెలుగులు
టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు ఐదు స్వర్ణాలు సాధించారు. ఇప్పుడు దానిని మన బృందం అధిగమించింది. 21 ఏళ్ల భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి ఆరో పసిడి పతకాన్ని అందించాడు. హైజంప్‌లో అతను ఈ మెడల్‌ను గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్‌కు స్వర్ణానందం దక్కగా.. ఇతర ఈవెంట్లలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకంతో సత్తా చాటిన భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఈ సారి మరింత బలంగా పైకి లేచాడు. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ – టి64 ఈవెంట్లో ప్రవీణ్‌కు స్వర్ణపతకం దక్కింది. 2.08 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఆసియా రికార్డుతో అతను పసిడిని గెలుచుకున్నాడు. అమెరికాకు చెందిన డెరెక్ లాసిడెంట్ (2.06 మీ.) రజతం గెలుచుకోగా, తెమూర్బెక్ గియాజోవ్ (ఉజ్బెకిస్తాన్ – 2.03 మీ.)కు కాంస్యం దక్కింది. ముందుగా 1.89 మీటర్ల ఎత్తుతో మొదలు పెట్టిన ప్రవీణ్ తన ఏడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు తర్వాత భారత్ తరఫున హైజంప్‌లో పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా ప్రవీణ్ నిలిచాడు. కస్తూరికి ఎనిమిదో స్థానం... మహిళల పవర్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో భారత ప్లేయర్ కస్తూరి రాజమణికి నిరాశ ఎదురైంది. మూడు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ కాగా, అత్యుత్తమంగా 106 కిలోల బరువు మాత్రమే ఎత్తిన కస్తూరి ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల కనోయింగ్ ‘వా’ సింగిల్ 200 మీ. హీట్స్‌లో రాణించిన ప్రాచీ యాదవ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. కనోయింగ్ ‘కయాక్’ సింగిల్ 200 మీ. కూడా భారత ప్లేయర్ పూజ ఓఝా సెమీస్‌కు చేరింది. పురుషుల ‘కయాక్’ సింగిల్ 200 మీ.లో యష్ కుమార్ కూడా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్ 54 కేటగిరీలో భారత అథ్లెట్ దీపేశ్ కుమార్ అందరికంటే చివరగా ఏడో స్థానంతో ముగించాడు. అతను జావెలిన్‌ను 26.11 మీటర్ల దూరం విసిరాడు.పురుషుల 400 మీ. – టి47 ఈవెంట్ తొలి రౌండ్ హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి దిలీప్ గవిట్ ముందంజ వేశాడు. మహిళల 200 మీ.–టి12 పరుగు సెమీ ఫైనల్లో రాణించిన సిమ్రన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల జావెలిన్ త్రో –ఎఫ్ 46లో భావనాబెన్ చౌదరి 39.70 మీటర్లు జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగితే పతకం ఖాయమే!ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పుట్టుకతోనే వికలాంగుడు. అతని ఎడమ కాలు పూర్తిగా ఎదగకుండా చిన్నగా ఉండిపోయింది. చిన్నతనంలో కొందరు హేళన చేయడం అతడిని తీవ్రంగా బాధపెట్టేది. దీనిని మర్చిపోయేందుకు అతను ఆటలపై దృష్టి పెట్టాడు. వైకల్యం ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడేవాడు. అయితే అనూహ్యంగా ఒక సారి సాధారణ అథ్లెట్లు పాల్గొనే హైజంప్‌లో అతనికీ అవకాశం దక్కింది. దాంతో అథ్లెటిక్స్‌తో తనకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌కు అర్థమైంది. సత్యపాల్ సింగ్ అనే పారా అథ్లెటిక్స్ కోచ్ అతనిలో ప్రతిభను గుర్తించి హైజంప్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేశాడు. అన్ని రకాలుగా ప్రవీణ్‌ను తీర్చిదిద్దాడు.అనంతరం పారా క్రీడల్లో పాల్గొంటూ అతను వరుస విజయాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం, ఇప్పుడు స్వర్ణంలతో పాటు ప్రవీణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో ఒక రజతం, ఒక కాంస్యం కూడా గెలిచాడు. పారిస్ క్రీడలకు ముందు గజ్జల్లో గాయంతో బాధపడిన అతను సరైన సమయానికి కోలుకొని సత్తా చాటాడు. -
సరికొత్త చరిత్ర.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్‌లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.సరికొత్త చరిత్రఅమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు. కాగా పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్‌తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది. ఇక ప్యారిస్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్‌గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.ప్యారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లుఅవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1(పారా షూటింగ్)నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3(పారా బ్యాడ్మింటన్)సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024 -
ధరమ్వీర్ ధమాకా
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు. ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్లో భారత్‌కు చెందిన ధరమ్వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్వీర్ ప్రకటించాడు. క్లబ్ త్రో ఈవెంట్‌కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జూడోలో కపిల్‌కు కాంస్యం... పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు. ఆర్చరీలో చేజారిన కాంస్యం... భారత ఆర్చరీ మిక్స్డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్రింక్–ఫ్యాబ్‌సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు. హరియాణాలోని సోనేపట్ ధరమ్వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ధరమ్వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు. ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్‌లో ‘విజన్ ఇంపెయిర్మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు. -
శెభాష్ ధరంబీర్.. భారత్ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.తద్వారా పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్లో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్.. సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.చదవండి: ‘టోక్యో’ను దాటేసి... -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
మిఠాయిలకు దూరం...‘బంగారం’తో సంబరం
పారిస్ పారాలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్... తాజా పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్ జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్నెస్తో లేకుండానే పారిస్ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు. -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
గ్రేట్! ఎత్తు 4.4 అడుగులు.. 7 ఒలింపిక్ స్వర్ణాలు
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ అదగొడుతున్నారు. షాట్‌పుట్ ఎఫ్41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా ఐదో పారాలింపిక్స్‌లో ఆమె పసిడి పతకం గెలవడం విశేషం. ఓవరాల్‌గా ఆమెకు ఇది ఏడో ఒలింపిక్ స్వర్ణం. దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్‌పుట్‌లో, ఇటు డిస్కస్‌లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. కాగా 34 ఏళ్ల తిలీ ఎత్తు 4.4 అడుగులే కావడం విశేషం. -
Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..
పారిస్‌లోని నేషనల్ స్టేడియం.. అథ్లెటిక్స్‌లో ఆ రోజుకు మిగతా అన్ని ఈవెంట్లూ ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80 వేల మంది ప్రేక్షకులు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్‌ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్ ఫైబర్ పోల్ సహాయంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన అతను ఆకాశంలోకి దూసుకెళ్లినట్లుగా అనిపించింది. అక్కడినుంచి బార్ మీదుగా అవతలి వైపు ప్యాడింగ్ వైపు పడే లోపే కొత్త ప్రపంచ రికార్డు.. ఒలింపిక్ మెడల్ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆ ఆటగాడే ఆర్మండ్ డుప్లాంటిస్.ఒకటి, రెండు, మూడు.. ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతోందే వరల్డ్ రికార్డులు నెలకొల్పడానికి అన్నట్లుగా ఉంది పరిస్థితి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇలా ఏకంగా అతను 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో రెండు ఒలింపిక్ స్వర్ణాలు అతని ఖాతాలో చేరాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త వరల్డ్ రికార్డుతో సాధించిన స్వర్ణం ఈ క్రీడలో డుప్లాంటిస్ స్థాయిని శిఖరానికి చేర్చింది. ఒలింపిక్ పతకం గెలిచిన రెండు వారాలకే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ పోటీల్లోనూ అలవోకగా అగ్రస్థానంలో నిలిచాడు.క్రీడాకారుల కుటుంబం నుంచి..తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలూ క్రీడాకారులే! అలా ఇంట్లో అంతా క్రీడా వాతావరణమే. డుప్లాంటిస్ కూడా సహజంగానే క్రీడల వైపు మళ్లాడు. అమెరికా జాతీయుడైన తండ్రి గ్రెగ్ పోల్‌వాల్టర్ కాగా, స్వీడన్‌కు చెందిన తల్లి హెలెనా హెప్టాథ్లాన్ ప్లేయర్. పెద్దన్నయ్య కూడా పోల్‌వాల్ట్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరగా, రెండో అన్న పోల్వాల్ట్తోనే మొదలుపెట్టినా ఆ తర్వాత బేస్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయి వరకు ఆడాడు. తండ్రి బాటలోనే డుప్లాంటిస్ నాలుగేళ్ల వయసులోనే పోల్‌వాల్ట్‌పై ఆసక్తి చూపించాడు.ఏడేళ్ల వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతను పదేళ్ల వయసులో 3.86 మీటర్లు ఎగిరి పోల్‌వాల్ట్‌లో తాను ఏ స్థాయికి చేరగలడో చూపించాడు. ఒక దశలో 7 నుంచి 13 ఏళ్ల వయసు వరకు అన్ని వయో విభాగాల్లో ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రదర్శనలన్నీ డుప్లాంటిస్ పేరు మీదే ఉండటం విశేషం. అమెరికాలోనే పుట్టి, అక్కడే ప్రా«థమిక విద్యాభ్యాసం చేసినా, అమ్మ పుట్టిల్లు స్వీడన్పైనే ఆర్మండ్కు అభిమానం ఎక్కువ. అందుకే క్రీడల్లో స్వీడన్‌కే అతను ప్రాతినిధ్యం వహించాడు.రికార్డుల హోరు..16 ఏళ్ల వయసులో డుప్లాంటిస్ తొలిసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. కొలంబియాలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పాడు. ఆ వెంటనే అండర్–16 స్థాయిలోనూ కొత్త వరల్డ్ రికార్డు నమోదైంది. ఆపై వరల్డ్ జూనియర్ రికార్డు కూడా దరి చేరింది. 18 ఫీట్ల ఇండోర్ పోల్‌వాల్ట్ ఈవెంట్లో పోటీ పడిన తొలి స్కూల్ విద్యార్థిగా డుప్లాంటిస్ నిలిచాడు. అండర్–20 విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచాక అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సీనియర్ టోర్నీ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈ టోర్నీలో తొలిసారి 6 మీటర్ల ఎత్తును అధిగమించిన అతనిపై అందరి దృష్టీ పడింది.ఆపై ఎదురు లేకుండా దూసుకుపోయిన డుప్లాంటిస్ కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలు ఉన్నాయి. యూరోపియన్ జూనియర్లో స్వర్ణం, వరల్డ్ యూత్‌లో స్వర్ణం, వరల్డ్ జూనియర్లో స్వర్ణ, కాంస్యాలతో అతని జూనియర్ కెరీర్లో కీలక మైలురాళ్లు. సీనియర్ స్థాయికి వచ్చే సరికి యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, యూరోపియన్ ఇండోర్‌లో స్వర్ణంతో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాడు. వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మరో రెండు పసిడి పతకాలు అందుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లలో గెలుచుకున్న స్వర్ణాలు అతని కెరీర్‌ను సంపూర్ణం చేశాయి.ఒక్కో సెంటీ మీటర్ దాటుతూ..తొమ్మిది ప్రపంచ రికార్డులను నెలకొల్పడంలో డుప్లాంటిస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రతిసారీ ఒక్కో సెంటీ మీటర్ మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన కోపర్నికస్ కప్‌లో 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి అతను తొలిసారి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్పటి నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు ఇది మెరుగవుతూ వచ్చింది. వరుసగా 6.18, 6.19, 6.20, 6.21, 6.22, 6.23, 6.24, 6.25 మీటర్లతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.ఉక్రెయిన్ దిగ్గజం సెర్గీ బుబ్కా తర్వాత పోల్‌వాల్ట్ స్థాయిని పెంచి, దానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన ఆటగాడిగా డుప్లాంటిస్ నిలిచాడు. అమెరికాను కాదని తాను ఎంచుకున్న స్వీడన్ కూడా అన్ని రకాలుగా అతనికి అండగా నిలిచింది. అన్నింటికి మించి తన తల్లి స్వస్థలం ఎవెస్టా మునిసిపాలిటీలో డుప్లాంటిస్ గౌరవ సూచకంగా ప్రభుత్వం ఒక పోల్ వాల్ట్ బార్‌ను ఏర్పాటు చేయడం అతడిని అన్నింటికంటే ఎక్కువగా భావోద్వాగానికి గురి చేసింది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: బడిని గుడి చేసిన గురుదేవుళ్లు.. -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్లో భారత్‌కు స్వర్ణం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారుపతకం సాధించింది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్ధానంలో నిలిచిన అవని.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా పారా ఒలింపిక్స్‌లో అవనీకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 22 ఏళ్ల అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఆమె తన పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా అవని చరిత్ర సృష్టించింది.కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్..ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she's still on top!📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR— The Bharat Army (@thebharatarmy) August 30, 2024 -
Paralympics: తొలి స్వర్ణం నెదర్లాండ్స్ ఖాతాలో...
ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్ ఒలింపిక్ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్ ప్రధాన ఈవెంట్ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. 50 వేల మంది ప్రేక్షకులుసూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్ హైలైట్‌గా నిలవగా... మయన్మార్ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ వ్యవహరించారు. నెదర్లాండ్స్ ఖాతాలో...ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్ పారాలింపిక్స్ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్ ట్రాక్ సీ4–5 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్లో నెదర్లాండ్స్ సైక్లిస్ట్ కరోలైన్ గ్రూట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.