ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్
దోహ: భారత యువ వెయిట్ లిఫ్టర్ జ్యోష్న సబర్ ఆసియా యూత్ చాంపియన్‌సిప్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఖతర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్‌లో జ్యోష్న 40 కేజీల విభాగంలో రికార్డు బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
జ్యోష్న 135 కేజీలు ఎత్తి ఆసియా రికార్డు బద్దలు కొట్టడంతో పాటు... వరల్డ్ రికార్డుకు ఒక కేజీ దూరంలో నిలిచింది. స్నాచ్‌లో 60 కేజీలు ఎత్తిన జ్యోష్న, క్లీన్ అండ్ జెర్క్‌లో 75 కిలోలు ఎత్తింది. 45 కేజీల విభాగంలో పాయల్ 155 కేజీల (70 స్నాచ్+85 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్య పతకం కైవసం చేసుకుంది.
బాలుర 49 కేజీల విభాగంలో బాబులాల్ 197 కేజీల (88 స్నాచ్+109 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్యం గెలుచుకున్నాడు. 45 కేజీల బాలికల విభాగంలో ఆకాంక్ష వ్యవహారె (151 కేజీలు) ఐదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment