టోక్యో: 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... మహిళా వెయిట్‌లిఫ్టర్ హిదిలిన్ దియాజ్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్ మొత్తం 224 కేజీల (స్నాచ్‌లో 97+క్లీన్ అండ్ జెర్క్‌లో 127) బరువెత్తి కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. దాంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
లియావో కియున్ (చైనా–223 కేజీలు) రజతం, జుల్ఫియా చిన్‌షాన్లో (కజకిస్తాన్–213 కేజీలు) కాంస్యం సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో దియాజ్ రజత పతకాన్ని సాధించింది. 1924 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment