ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్ ఒలింపిక్ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్ ప్రధాన ఈవెంట్ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి.
50 వేల మంది ప్రేక్షకులు
సూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్ హైలైట్‌గా నిలవగా... మయన్మార్ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ వ్యవహరించారు.
నెదర్లాండ్స్ ఖాతాలో...
ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్ పారాలింపిక్స్ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్ ట్రాక్ సీ4–5 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో నెదర్లాండ్స్ సైక్లిస్ట్ కరోలైన్ గ్రూట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment