Paris Paralympics 2024
-
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
పారా షట్లర్లకు రూ. 50 లక్షలు నజరానా
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఐదుగురు పారా షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల జరిగిన దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత షట్లర్లు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణం గెలిచిన నితీశ్ కుమార్‌కు రూ. 15 లక్షలు, రజత పతకాలు గెలిచిన సుహాస్ యతిరాజ్ (పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)లకు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5లో కాంస్యం నెగ్గిన మనీషా రామదాస్, ఎస్‌యూ5లో కాంస్యం సాధించిన నిత్యశ్రీకి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత పారా షట్లర్లకు నగదు బహుమతి అందించాలని నిర్ణయించాం. పారాలింపిక్స్‌లో సాధించిన పతకాలకు ఇది గుర్తింపు లాంటిది. మరిన్ని పతకాలు సాధించేందుకు పారా షట్లర్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అని బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు. -
కాలితో సంతకం చేసిన శీతల్.. ప్రధాని మోదీకి జెర్సీ
పారాలింపిక్స్ క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పారా విశ్వక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన బృందాన్ని కొనియాడారు. భారత పారాలింపిక్స్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్కును సెట్ చేశారంటూ అభినందించారు. కాగా పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి.నేలపై కూర్చున్న మోదీఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్ పతకాల(19) రికార్డు బ్రేక్ అయింది. ఈ నేపథ్యంలో పారిస్ నుంచి పతకాలతో తిరిగి వచ్చిన పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపియన్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని వారిని అభినందించారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్ కోరగా... ప్రధాని వెంటనే పెన్ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)కాలితో సంతకం చేసిన శీతల్అదే విధంగా.. షూటర్ అవని లేఖరా, జూడో ప్లేయర్ కపిల్ పర్మార్, ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. ఇక ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ శుక్రవారం.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.చదవండి: అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి India's Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI— Narendra Modi (@narendramodi) September 13, 2024 -
అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి
చిన్న చిన్న సమస్యలకే భయపడి జీవితాన్ని ముగించే యువత ఉన్న నేటి రోజుల్లో.. తనకు రెండు చేతులు లేకపోయినా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది శీతల్ దేవి. పదిహేడేళ్ల వయసులోనే పారాలింపిక్స్ పతకం గెలిచి సత్తా చాటింది. తనను కన్న తల్లిదండ్రులతో పాటు దేశం మొత్తం గర్వపడేలా పారా విశ్వక్రీడ వేదికపై కాంస్యంతో మెరిసింది. అయితే, తన ప్రయాణమేమీ సజావుగా సాగలేదని.. పారా ఆర్చర్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాని చెబుతోంది శీతల్.విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి‘‘మొదట్లో నాకు క్రీడల గురించి అసలేమీ తెలియదు. అయితే, మా గ్రామంలో చాలా మంది కర్రలతో విల్లులు తయారు చేస్తారు.వాటితో ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం. అలా విలువిద్యపై దృష్టి సారించాను.అయితే, విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి నా మనసులో ఒకే ఆలోచన ఉండేది. నేను నా దేశ జెండాను క్రీడా వేదికపై రెపరెపలాడిస్తే ఎంతో బాగుంటుంది కదా అనిపించేది. ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేశాను.నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయిత్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు నేను ఏదైనా సాధించగలనని ఎవరూ నమ్మలేదు. నాపై ఎవరికీ విశ్వాసం లేదు. అయితే, అప్పుడు ఎవరైతే నన్ను తక్కువగా చూశారో.. ఇప్పుడు వాళ్లే స్వయంగా నా తల్లిదండ్రులకు మిఠాయిలు తినిపిస్తున్నారు’’ అని శీతల్ దేవి గర్వంగా చెప్పింది. సలాం శీతల్అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తే గెలుపు జెండా ఎగర వేయవచ్చునని తన సంకల్ప బలాన్ని ఉదాహరించింది. ఈ మేరకు శీతల్ దేవి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. సలాం శీతల్ అంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.శీతల్ దేవి.. తనే ఒక అద్భుతంకశ్మీర్లోని కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం శీతల్ స్వస్థలం. ఆమె తండ్రి మాన్ సింగ్. తల్లి శక్తిదేవి. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాన్ సింగ్ రైతు కాగా.. కుటుంబ పోషణలో భర్తకు సాయంగా ఉండేందుకు శక్తి దేవి గొర్రెలు సాకుతోంది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో శీతల్ అందరికంటే పెద్దది. అయితే, ఫొకోలిమా అనే డిజార్డర్ కారణంగా పుట్టుకతోనే ఆమెకు చేతులు ఏర్పడలేదు. అయినప్పటికీ శీతల్ తల్లిదండ్రులు కుంగిపోలేదు. మిగతా ఇద్దరు పిల్లల మాదిరే ఆమెనూ పెంచారు. ఆత్మవిశ్వాసం ఇనుమడించేలా ధైర్యం నూరిపోశారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చేతులతో చేయాల్సిన పనులు కాళ్లతోనే చేయడం అలవాటు చేసుకుంది శీతల్. భారత ఆర్మీ కోచ్‌ల శిక్షణలోఈ క్రమంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీయింగ్ యు సంస్థ తనకు విలువిద్యలో శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో రెండు చేతులు లేకుండానే విల్లు ఎక్కుపెట్టిన తొలి పారా ఆర్చర్‌గా శీతల్ ఎదిగింది. భారత ఆర్మీకి చెందిన కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్దీప్ వధ్వాన్ శిక్షణలో రాటుదేలింది.పసిడి వెలుగులువారి ఆధ్వర్యంలో ట్రెయినింగ్ మొదలుపెట్టిన కేవలం 11 నెలల వ్యవధిలోనే 2023 ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న శీతల్ స్వర్ణం గెలిచి ఔరా అనిపించింది. వ్యక్తిగత కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచింది. అదే విధంగా మహిళల డబుల్స్ విభాగంలో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. అరుదైన ఘనతఈ క్రమంలో పారా ఆర్చర్ కాంపౌండ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగిన శీతల్.. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లోనూ స్వర్ణ పతకం గెలిచింది. ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న శీతల్ దేవి.. ప్యారిస్ పారాలింపిక్స్-2024లో రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. 17 ఏళ్లకే ఘనత సాధించి.. అత్యంత పిన్న వయసులో పారాలింపిక్ మెడల్ గెలిచిన భారత తొలి పారా ప్లేయర్‌గా నిలిచింది.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలుSheetal Devi - What a Star 💫 Credits Mrityuu Dev Insta pic.twitter.com/YQpS6tANE7— ISH PARA Sports (@ISHsportsmedia) September 10, 2024 -
మీకు హ్యాట్సాఫ్: పారాలింపియన్స్కు జగన్ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: పారిస్ పారాలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ నిజంగా గొప్పది. అంతేకాదు.. స్ఫూర్తిదాయకం కూడా. పతక విజేతలతో పాటు పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న అందరికీ అభినందనలు. మీకు హ్యాట్సాఫ్.. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అని జగన్ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు.The dedication and talent of Paralympians are truly remarkable and inspirational. Congratulations and hats off to all the participants and medal winners! The nation is proud of you.#Paralympics2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2024పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలైన పారాలింపిక్స్ సెప్టెంబర్ 8వ తేదీతో ముగిశాయి. మొత్తం 84 మంది అథ్లెట్లు.. అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది. ఫలితంగా.. భారత్ రికార్డు స్థాయిలో తొలిసారి పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించింది. -
సరికొత్త చరిత్ర.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్‌లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.సరికొత్త చరిత్రఅమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు. కాగా పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్‌తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది. ఇక ప్యారిస్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్‌గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.ప్యారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లుఅవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1(పారా షూటింగ్)నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3(పారా బ్యాడ్మింటన్)సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024 -
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో 25వ పతకం
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పురుషుల జూడో 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ జూడోలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో పర్మార్.. బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివియెరాపై విజయం సాధించాడు. Kapil paaji tussi chha gaye! 💯🙌Defeating WR 2 Elielton De Oliveira, Kapil Parmar secures India's first-ever Paralympic medal in Judo! 🔥#ParalympicGamesParis2024 #ParalympicsOnJioCinema #JioCinemaSports #Judo pic.twitter.com/HrnycLbP4I— JioCinema (@JioCinema) September 5, 2024కపిల్ ఒలివియెరాపై కేవలం 33 సెకెన్లలో విజయం సాధించడం విశేషం. కపిల్ కాంస్యంతో భారత్ కాంస్య పతకాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. -
స్వర్ణం గెలవలేకపోయా: ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్
వరుసగా రెండు పారాలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్... విశ్వక్రీడల్లో స్వర్ణం గెలవలేకపోవడం నిరాశగా ఉందని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో పరాజయం పాలై రజతం దక్కించుకున్న 41 ఏళ్ల ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్... మూడేళ్ల క్రితం టోక్యోలోనూ రెండో స్థానంలోనే నిలిచారు.‘పసిడి పతకం సాధించాలని ఎంతో శ్రమించా. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో విశ్వ క్రీడలకు రావడంతో అంచనాల భారం కూడా పెరిగింది. రజతం దక్కడం కూడా ఆనందంగానే ఉన్నా... ఏదో వెలితి అనిపిస్తోంది. బంగారు పతకం చేజారిందనే బాధ ఒకవైపు... పారాలింపిక్స్ వంటి అత్యుత్తమ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గాననే భావన మరో వైపు ఉంది. గత కొంతకాలంగా దేశంలో క్రీడా సంస్కృతి పెరిగింది. గతంలో క్రికెట్‌కే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అన్ని క్రీడలకు ఆదరణ దక్కుతోంది. పారా అథ్లెట్లకు కూడా మంచి తోడ్పాటు లభిస్తోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించగలరు’ అని సుహాస్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన సుహాస్ 2007 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సుహాస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాంతీయ రక్షక్ దళ్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం -
మిఠాయిలకు దూరం...‘బంగారం’తో సంబరం
పారిస్ పారాలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్... తాజా పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్ జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్నెస్తో లేకుండానే పారిస్ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు. -
తనొక అద్భుతం: ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి చిన్నబోయింది (ఫొటోలు)
-
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎప్ఎల్-3 ఈవెంట్లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో నితేశ్.. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బేతెల్పై 21-14, 18-21, 23-21 తేడాతో విజయం సాధించాడు. NITESH KUMAR - THE GOLD MEDAL MOMENT. 👌- One for the History of India in Paralympics. pic.twitter.com/kmhLrZAAV2— Johns. (@CricCrazyJohns) September 2, 2024ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం. ఈ రోజే పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. -
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం గెలుచుకున్నాడు. కథూనియా తన తొలి ప్రయత్నంలోనే డిస్క్స్ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. కథూనియాకు పారాలింపిక్స్‌లో ఇది వరుసగా రెండో రజత పతకం. గత (టోక్యో) పారాలింపిక్స్‌లోనూ కథూనియా రజతం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్ ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించగా.. బ్రెజిల్‌కు చెందిన క్లౌడిని బటిస్ట డోస్ శాంటోస్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో బటిస్టకు ఇది వరుసగా మూడో స్వర్ణం. నేటి ఈవెంట్లో బటిస్ట్ తన ఐదో ప్రయత్నంలో డిస్కస్‌ను 46.86 మీట్లర దూరం విసిరాడు. ఇది పారాలింపిక్స్ రికార్డు. ఈ కేటగిరీలో గ్రీస్‌కు చెందిన కాన్స్టాంటినోస్ జోయునిస్ 41.32 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. యోగేశ్ కథూనియా సాధించిన రజతంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి (ఒక స్వర్ణం, 3 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. -
Paralympics: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో నాలుగో రోజు కూడా మనోళ్ల జోరు కొనసాగింది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పురుషుల హైజంప్ టీ46 ఈవెంట్లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించగా.. మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ కాంస్యంతో మెరిసింది. కాగా ప్రీతీ 100 మీ. టీ35 పరుగు పందెంలో కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఇక ఇప్పటివరకు పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 7కు చేరింది.అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. అదే విధంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
Paralympics: తొలి స్వర్ణం నెదర్లాండ్స్ ఖాతాలో...
ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్ ఒలింపిక్ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్ ప్రధాన ఈవెంట్ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. 50 వేల మంది ప్రేక్షకులుసూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్ హైలైట్‌గా నిలవగా... మయన్మార్ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ వ్యవహరించారు. నెదర్లాండ్స్ ఖాతాలో...ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్ పారాలింపిక్స్ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్ ట్రాక్ సీ4–5 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్లో నెదర్లాండ్స్ సైక్లిస్ట్ కరోలైన్ గ్రూట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. -
నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం
పారిస్: యావత్ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసిన సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌కు తెరలేవనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారిస్ క్రీడల్లో మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్‌ను జోడించారు. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరం... ఇప్పుడు పారాలింపిక్స్‌ను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది. పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్ క్రీడాంశాల్లో మెడల్ ఈవెంట్స్ జరగనున్నాయి. సమ్మర్, వింటర్ పారాలింపిక్స్‌లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఒక్సానా మాస్టర్స్ హ్యాండ్ సైక్లింగ్‌లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టగా.. పారాలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్ పారా పవర్‌లిఫ్టర్ షరీఫ్ ఉస్మాన్ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నాడు.భారీ అంచనాలతో భారత్..మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పారిస్‌లో అడుగు పెట్టారు. ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.గత కొంతకాలంగా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ సుమిత్ అంటిల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు. చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్ శీతల్ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ ప్లేయర్ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది. -
Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్ తదితర వివరాలు
పారిస్‌లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్ 28 నుంచి పారిస్ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ తొలిసారి సమ్మర్ పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 8న జరిగే క్లోజింగ్ సెర్మనీతో ముగుస్తాయి.2021 టోక్యో పారాలింపిక్స్లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్ జనాలు లేకుండా సాగాయి.ఈసారి పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్‌కు పంపుతుంది.ఈసారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్ ఒలింపిక్స్ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్ సందర్భంగా అథ్లెట్లు పారిస్‌లోనే ఐకానిక్ ల్యాండ్‌మార్క్స్ చుట్టూ మార్చ్ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్ పోటీలు ఆగస్ట్ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి.పారిస్ పారాలింపిక్స్‌లోని క్రీడా విభాగాలు..బ్లైండ్ ఫుట్బాల్పారా ఆర్చరీపారా అథ్లెటిక్స్బోసియాగోల్బాల్పారా బ్యాడ్మింటన్పారా కనోయ్పారా సైక్లింగ్పారా ఈక్వెస్ట్రియాన్పారా తైక్వాండోపారా ట్రయథ్లాన్పారా టేబుల్ టెన్నిస్సిట్టింగ్ వాలీబాల్వీల్చైర్ బాస్కెట్బాల్వీల్చైర్ ఫెన్సింగ్వీల్చైర్ రగ్బీవీల్చైర్ టెన్నిస్పారా స్విమ్మింగ్షూటింగ్ పారా స్పోర్ట్పారాలింపిక్స్లో ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్‌లో భారత్ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత్ అథ్లెట్లు..పారా ఆర్చరీ (6)హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పారా అథ్లెటిక్స్ (38)దీప్తి జీవన్జీ - మహిళల 400మీ -టీ20సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34మను - పురుషుల షాట్ పుట్ - F37పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53పారా బ్యాడ్మింటన్ (13)మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4తరుణ్ - పురుషుల సింగిల్స్ S4మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3మన్దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6పారా కనోయ్ (3)ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పారా సైక్లింగ్ (2)అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్బ్లైండ్ జూడో (2)కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1కోకిల: మహిళల -48కిలోల జె2పారా పవర్ లిఫ్టింగ్ (4)పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకుఅశోక్ - పురుషుల 63 కేజీల వరకుసకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళలకస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళలపారా రోయింగ్ (2)అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xనారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xపారా షూటింగ్ (10)అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1నిహాల్ సింగ్: P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1సిద్ధార్థ బాబు: R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1పారా స్విమ్మింగ్ (1)సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై - S7పారా టేబుల్ టెన్నిస్ (2)సోనాల్‌బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10పారా తైక్వాండో (1)అరుణ- మహిళల కే44- 47 కేజీలుపారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్ గత పారాలింపిక్స్‌లోనే 19 పతకాలు సాధించింది.1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్బర్గ్ 1972 ( స్విమ్మింగ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )2. భీమ్రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్‌పుట్ L6లో రజతం)5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)9. మరియప్పన్ తంగవేలు - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)10. వరుణ్ సింగ్ భాటి - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)11. దేవేంద్ర ఝఝరియా- రియో 2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)12. దీపా మాలిక్ - రియో 2016 (మహిళల షాట్‌పుట్ F53లో రజతం)13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)20. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)27. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం)