
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్‌కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు.
కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment