Tamil Nadu Government
-
ప్రభుత్వ స్వాధీనమైన జయలలిత ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
జయలలిత వస్తువుల అప్పగింత షురూ!
సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్‌లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ ఇన్ వన్ టేప్రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్‌ల పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. -
గౌరవం నిలపాలి!
తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది. -
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
Savitha Rao: నిశ్శబ్దానికి రక్షకులు కావాలి
ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.నో హారన్ ప్లీజ్రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.నిశ్శబ్దం మన హక్కు‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.అనారోగ్య మెట్రోలు‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
నీట్ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు.అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.కాగా, నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్, నీట్-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
తమిళనాడు పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
‘అందుకే కేరళ స్టోరీ ప్రదర్శన ఆగిపోయింది’: తమిళనాడు సర్కార్
ఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధాజ్ఞాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్రనిర్మాతలు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ నడుస్తోంది. అయితే గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని బెంచ్.. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు అందించగా.. ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిచిపోయిందే తప్ప.. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘‘మే7వ తేదీ నుంచి జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమా థియేటర్లకు భద్రత కల్పించడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేద’’ని అఫిడవిట్లో పేర్కొంది. అంతేకాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేకపోవడమో/ అందులోవాళ్ల నటన బాగా లేకపోవడమో.. ఏ కారణాలవల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని అభిప్రాయపడింది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ థియేటర్ యజమానులపై, మల్టీప్లెక్స్ నిర్వాహకులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. సినిమా ఆగిపోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా ఏం లేదు అని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను సైతం అఫిడవిట్లో పొందుపర్చింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: ప్రధానికి అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు -
స్టాలిన్ సర్కార్‌కు షాకిచ్చిన గవర్నర్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తున్న ఆన్లైన్ గేమింగ్ బిల్లును వెనక్కి తిప్పి పంపారాయన. ఆన్లైన్ జూదంపై నిషేధంతో పాటు ఆన్లైన్ గేమ్స్‌పై నియంత్రణ కోసం స్టాలిన్ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే నెలల తరబడి ఆ బిల్లును పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ రవి.. ఇప్పుడు దానిని వెనక్కి పంపారు. తమిళనాడులో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా.. పదుల సంఖ్యలో ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయి (ఆ సంఖ్య 44కి చేరుకుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది). ఇంతకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వ సమయంలోనూ ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి సంబంధించి ఒక చట్టం చేసింది. అయితే ఆ సమయంలో కోర్టు దానిని కొట్టేసింది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మాజీ జడ్జి జస్టిస్ కే చంద్రు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది. ఆయన ప్రతిపాదనల మేరకు ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించింది స్టాలిన్ సర్కార్. కిందటి ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది కూడా. ఆపై బిల్లును రాజ్‌భవన్‌కు పరిశీలనకు పంపింది. అయితే గవర్నర్ రవి ఆ బిల్లుకు (మొత్తం 20 బిల్లుల దాకా పెండింగ్‌లోనే ఉంచారాయన) క్లియరెన్స్ ఇవ్వకపోగా.. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్షాలు సైతం గవర్నర్ తీరును తప్పుబట్టాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు.. బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి బిల్లును తిప్పి పంపించారు. దీంతో అధికార డీఎంకే మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 20 బిల్లుల్లో యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలనే బిల్లు సైతం ఉండడం గమనార్హం. మరోపక్క గవర్నర్ తీరును ప్రభుత్వం ఏకిపారేస్తోంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ.. బీజేపీ, ఆరెస్సెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శిస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్ సైతం గవర్నర్ తీరును నిరసిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన. అయితే ఎన్ని విమర్శలు చెలరేగినా.. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తానని గవర్నర్ రవి తేల్చేశారు. -
అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్
పొంగల్‌కు విడుదలవుతున్న వారీసు, తుణివు చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలు బుధవారం తెరపైకి రానున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యం స్పెషల్ షోలకు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా అజిత్ నటించిన తుణివు చిత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆటల ప్రదర్శనకు, విజయ్ చిత్రం వారీసు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ చిత్రాలకు ప్రభుత్వం 11, 12 తేదీల వరకే స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చింది. ఆ తరువాత పండుగ సందర్భంగా 13 నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి ప్రత్యేక ఆటలకు అనుమతి లేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా థియేటర్ల ముందు భారీ కటౌట్లును ఏర్పాటు చేయడం, పాలాభిõÙకాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.7 లక్షలతో అజిత్ కటౌట్ తమ అభిమాన నటులను ఆరాధించడం సహజమే. కర్ణాటకకు చెందిన నటుడు అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున తుణివు చిత్రంలోని కటౌట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం
తల్లిదండ్రులైన మరుసటి రోజే సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులకు షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన నయన్-విఘ్నేశ్‌లు ఐదు నెలల తిరక్కుండానే తల్లిదండ్రులు అయ్యారు. తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామంటూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్ ఈ సందర్భంగా వారిద్దరు చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయాడు విఘ్నేశ్. దీంతో సరోగసి(అద్దే గర్భం ద్వారా పిల్లలను కనడం) ద్వారానే నయన్-విఘ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నటి కస్తూరి సరోగసి ద్వారా నయన్ తల్లి కావడంపై పరోక్షంగా స్పందించింది. సరోగసీని దేశంలో నిషేధించారని, ఈ ఏడాది దీనిపై ఉత్తర్వులు కూడా వచ్చాయంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి? నటి కస్తూరితోపాటు చాలామంది అదే అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నయన్ దంపతులు వ్యవహరించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే.. నయన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు తల్లిదండ్రులు అయిన తీరుపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందిందించింది. ఈ మేరకు సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అంతేకాదు సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
బ్రహ్మణేతర అర్చకులు.. స్టాలిన్ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా.. నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, బ్రహ్మణేతరులను ఆలయ అర్చుకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే.. ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తండ్రి కరుణానిధిలాగే.. తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ‘‘స్టాలిన్.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్ 2014లో సభనాయాగర్ నటరాజ్ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదీ చదవండి: ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఆజాద్ ఆవేదన -
వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆది నుంచి గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. సోమవారం కీలకమైన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల నియామకంలో అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు గవర్నర్ పరిధిలో ఉన్న వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ తరహాలోనే తమిళనాడులో సైతం వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. గవర్నర్ వద్ద ఈ అధికారులుంటే వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే తగిన మార్పులతో కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మొత్తం 13 వర్సిటీలు విద్యాబోధనలో చారిత్రాత్మకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీసీల నియమించే అధికారం లేకపోవడం వల్ల వర్సిటీల పనితీరులో అవకతవకలతో ప్రశ్నార్థకంగా మార్చివేసిందని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే.. అంతకు ముందు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్ముడి తమిళనాడు యూనివర్సిటీల సవరణ చట్టం –2022 బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టగా ఆమోదించారు. బిల్లు ప్రవేశపెడుతున్న దశలోనే బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నకాలంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర ఉన్నతవిద్యశాఖకు సంబంధించి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలకు వైస్ చాన్స్లర్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ కేవలం ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉందని డీఎంకే ప్రభుత్వం అంటోంది. అయితే అన్నాడీఎంకే హయాంలో గవర్నర్ భన్వారీలాల్ వీసీల నియామకం పూర్తి చేయడం వల్లనే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విబేధాలు మొదలైనాయని డీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లే అన్నావర్సిటీ వీసీ సూరప్పపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ బదిలీ కాగా ఆర్ఎన్ రవి ఆ తరువాత బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్ సైతం భన్వారీలాల్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నట్లు డీఎంకే భావిస్తోంది. అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తమిళనాడు వీసీలుగా నియమించడం చర్చకు దారితీసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం స్టాలిన్ ప్రకటించారు. అనేక రాష్ట్రాల్లో వీసీల నియామకం ప్రభుత్వమే చేస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అదే అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కొసమెరుపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన తమిళనాడులోని అన్ని యూనివర్సిటీల వీసీలు, విభాగాధిపతుల మహానాడు నీలగిరి జిల్లా ఊటీలో ‘నవ ప్రపంచలో భారత్ భాగస్వామ్యం’ అనే అంశంపై సోమవారం జరిగింది. ఈ మహానాడు జరుగుతున్న సమయంలో గవర్నర్ అధికారాలను కత్తిరిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం. బీజేపీ వాకౌట్ వీసీల నియామకం వ్యవహారంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా, అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, మరో అంశంపై వాకౌట్ చేశారు. -
సుప్రీం కోర్టులో సీఎం స్టాలిన్‌కు ఎదురు దెబ్బ...
-
స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది బెంచ్. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం స్టాలిన్ ప్రభుత్వం 2021లో ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల(MBC) కోసం 20 శాతం కోటా ఉండగా.. అందులో 10.5 శాతం వన్నియార్ కమ్యూనిటీకి వర్తింపజేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో అభ్యంతరాలు వ్యక్తంకాగా.. తమిళనాడు యాక్ట్ 2021ను కొట్టేస్తూ ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఎల్ నాగేశ్వరావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. MBCలలో వన్నియార్లను ప్రత్యేక సమూహంగా పరిగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్ పేర్కొంది. -
తమిళనాడు: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వ్యక్తులను అర్చకులుగా నియమించింది. మొత్తం 24 మందికి సీఎం స్టాలిన్ శనివారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అర్చకులుగా నియమితులైన వారు పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లో చేరారని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని కులాల వారికి దేవాలయ అర్చకుల విధుల్లో భాగం కల్పిస్తామని సీఎం స్టాలిన్ ఇచ్చిన ఎన్నిక హామీ దీంతో నెరవేరినట్లయింది. ఆగస్టు 14కు స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు అయిన నేపథ్యంలో ఈ నియామకాలు జరగడం గమనార్హం. 24 మంది అర్చకులతో పాటు పలు విభాగాలకు సంబంధించి మొత్తం 208 మంది నియామకం జరిగింది. వీరిలో భట్టాచార్యులు (వైష్ణవ పూజారులు), ఒధువార్లు (శైవ సంప్రదాయ నిపుణులు) ఇద్దరూ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యతో మాజీ సీఎం కరుణానిధి కల నెరవేరిందని స్టాలిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ సహా పలువురు స్వామీజీలు, మఠాధిపతులు స్వాగతించారు. -
అదే జరిగితే పీహెచ్‌సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
తగ్గని కరోనా ఉధృతి: లాక్డౌన్ పొడగింపు
చెన్నె: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగించారు. అయితే మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జూన్ 14వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం జూన్ 14 వరకు పొడగించింది. ఆంక్షలు.. సడలింపులు వంటివి ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పొడగించినా 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించారు. ఆ జిల్లాల్లో (కోయంబత్తూరు, నీలగిరిస్, తిరుపూర్, ఈరోడు, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మాయిలదుతూరై) కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 21,95,402 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 463 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. కరోనా కట్టడి కోసం ఎంకే స్టాలిన్ చర్యలు చేపడుతూనే లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు. -
కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు వచ్చి చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు, సామాజిక సంస్థలు, భారీ పరిశ్రమల యాజమాన్యాలను ఉద్దేశించి సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రజల జీవనా«ధారం దెబ్బతినిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కుంటువండిందని పేర్కొన్నారు. సహాయ చర్యల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఆర్థికంగా పునరుత్తేజం పొందడానికి ప్రభుత్వం అనేక అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. ప్రజా బాహుళ్యంలోని సంఘాలు, సంస్థలు తోచిన రీతిలో సహాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళాలు, ఖర్చు వివరాలను వెబ్సెట్లో పొందుపరుస్తామని తెలిపారు. దాతల విరాళాలపై 80 (జీ) కింద వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐల నుంచి పొందే విరాళాలపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చని వివరించారు. ఆన్లైన్, బ్యాంకు అకౌంట్ ద్వారా విరాళమిచ్చి రసీదు పొందవచ్చని తెలిపారు. దాత లు తమ విరాళాలను నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే సమరి్పంచాలని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా విరాళం ఇచ్చే దాతలు, సంస్థల పేర్లను వార్తాపత్రికల్లో ప్రచురిస్తామని వెల్లడించారు. ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కరోనా నివారణ చర్యల కోసం మాత్రమే వినియోగిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్: చేజారనున్న ‘పెద్దరికం’ చదవండి: కలుపుగోలు సీఎం: స్టాలిన్ కొత్త సంప్రదాయం -
అన్‌లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్ అన్నింటినీ అన్‌లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..
సాక్షి, చెన్నై: ప్రైవేటు స్కూళ్లలో ఇదివరకు చదువుకుని ఉన్న పక్షంలో, ఆ విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వెసులుబాటను విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల ఒత్తిడి తీసుకొస్తుండడంతో చర్యలు తప్పవని విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరించారు. కరోనా కష్టాలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిప్పి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనేక మంది ప్రస్తుతం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలల్లో అడ్మిషన్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇది వరకు తమ పిల్లలు చదువుకున్న పాఠశాలలు టీసీలు ఇవ్వడంలో జాప్యం చేయడం, ఫీజులు చెల్లిస్తేనే టీసీ అంటూ వేధిస్తున్నట్టుగా విద్యాశాఖకు ఫిర్యాదులు పెరిగాయి. అదే సమయంలో ఒక తరగతి నుంచి మరో తరగతిలో చేరాలంటే ప్రభుత్వ పాఠశాలలో టీసీ సమర్పించాల్సి ఉంది. అయితే, ప్రైవేటు విద్యా సంస్థలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు హోరెత్తాయి. దీంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ సమర్పించకుండానే అడ్మిషన్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తిరుచ్చి విద్యాశాఖ అధికారి శాంతి పేర్కొంటూ ఫిర్యాదులను పరిగణించి టీసీ లేకున్నా అడ్మిషన్లపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులను ఈరోడ్‌లో శాలువతో సత్కరించి మరీ ఉపాధ్యాయులు ఆహ్వానిస్తుండడం విశేషం. ఇక, అడ్మిషన్లను పరిగణించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చర్యలు తప్పవు.. ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యాశాఖా మంత్రి సెంగోట్టయన్ హెచ్చరికలు జారీ చేశారు. ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని వేధిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తే, ఆయా విద్యా సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఒకటో తరగతిలో లక్షా 72 వేల మంది కొత్తగా చేరారని, సెప్టెంబరులోనూ అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో సాగుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలన్నీ సిద్ధంగానే ఉన్నాయని, కొత్తగా చేరే విద్యార్థులకు 14 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు తగ్గ చర్యలపై సీఎంతో సమీక్షించనున్నామన్నారు. ఇదిలాఉండగా వివిధ కళాశాల్లో చదువుతూ అరియర్స్ రాయడం కోసం ఫీజులు కట్టిన విద్యార్థులందరూ ఆల్‌పాస్ అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దృష్ట్యా, వీరిని కూడా పాస్ చేయాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. -
త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. -
‘ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించలేదు’
కరోనాకు సంబంధించి వాస్తవాలను వెల్లడించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆరోపించారు. ఈయన గత కొద్ది కాలంగా ప్రభుత్వ విధానాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మరోసారి లాక్డౌన్ విధించడాన్ని కమల్ తప్పు పట్టారు. దీని గురించి ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆది నుంచి కరోనా టెస్టులను అధికారులు ఎక్కువగా నిర్వహించలేకపోయారని.. అదే ఇప్పుడు ఆర్థిక లాక్ డౌన్‌కు కారణమవుతోందని పేర్కొన్నారు. సుమారు మూడు నెలలుగా లాక్ డౌన్ అమల్లో ఉండగా మళ్లీ ఇప్పుడు నాలుగు జిల్లాలకు ప్రత్యేకంగా లాక్ డౌన్ ఎందుకని ప్రశ్నించారు. సకాలంలో చర్యలు తీసుకోలేని ప్రభుత్వంలో మనం ఉన్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందన్నారు. ఆదిలోనే విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయంలోనే టెస్ట్‌లు నిర్వహించి ఉంటే ఈ కరోనా ప్రభావం ఇంతగా ఉండేది కాదని పేర్కొన్నారు. (చదవండి: కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం ) -
జయలలిత నివాసంపై కీలక నిర్ణయం
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితన నివాసాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నివాసానికి సంబంధించి చట్టబద్ధమైన వారసులకు పరిహారం అందజేయకపోవడంతో తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు చెప్పారు. వారసులకు కేటాయింపుల కోసం రూ. 66 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ఈ ట్రస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సమచార శాఖ మంత్రి కె రాజు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, జయలలిత బతికి ఉన్న కాలంలో వేద నిలయం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఈ బంగ్లా నుంచే చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తర్వాత వేద నిలయానికి సంబంధించి వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. -
మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మద్యం షాపులు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాపులు తెరవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మే 17 దాకా లిక్కర్ షాపులు మూసివేయాలని గతంలో మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో తెల్లవారు జామునుంచే మద్యం షాపులు ముందు పాదరక్షలు, హెల్మెట్లు, గొడుగులు దర్శన మిచ్చాయి. భౌతిక దూరం పాటిస్తూ.. టోకన్ సిస్టమ్ అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో మద్యం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. కాగా.. రోజుకు ఒక్కో షాపు కేవలం 500 టోకెన్లు జారీ చేసి వాటికి మాత్రమే మద్యం అమ్మేలా చూడాలని ఆదేశించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడవనున్నాయి. వీటిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చెన్నై, తిరువళ్లూర్, ఇతర కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగలిన ప్రాంతాల్లో మాత్రమే మద్యం షాపులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు మద్యం షాపులుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ.. షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,108కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,599 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 7,435 యాక్టివ్ కేసులున్నాయి. అటు చెన్నైలో శుక్రవారం 309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,947కి చేరింది. చదవండి: మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే -
రాజీవ్ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..!
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు దారులన్నీ మూసుకున్న నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎదురు చూపులకు దారితీశాయి. ఇందుకు తగ్గట్టుగా రాజ్‌భవన్ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురి ఉరిశిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నిందితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్‌భవన్‌కే పరిమితమైంది. తమను విడుదలచేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తులు సుబ్బయ్య, పొంగియప్పన్ బెంచ్ ముందుకు గత నెల విచారణకు వచ్చింది. ఈ సమయంలో కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురిచేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరించారు. ఆ తీర్మానం విలువను ‘సున్న’గా పరిగణించాలని వాదించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సిఫారసు చేసి ఉన్నట్టుగా పేర్కొనడంతో విచారణను ముగించే విధంగా, రాజీవ్ హంతకుల ఆశలు అడియాశలు అయ్యే రీతిలో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వీరి విడుదలకు అన్నిదారులు మూసుకున్నట్టే అన్నది స్పష్టం కావడంతో తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. మంత్రి వ్యాఖ్యలతో కాస్త ఊరట నళిని పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఇతర నింధితులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి మున్ముందు రోజుల్లో తిరస్కరించే అవకాశాలు ఎక్కువే అన్న సంకేతాల నేపథ్యంలో న్యాయశాఖామంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎక్కడో కాస్త ఊరట కల్గించేలా ఉండడం గమనార్హం. అసెంబ్లీలో కొంగు ఇలంజర్ పేరవై ఎమ్మెల్యే తనియరసు సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం స్పందించారు. ఏడుగుర్ని విడుదల చేయాలన్న తపనతో తామూ ఉన్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్ చేతిలో ఉందని, తాము ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు తగ్గట్టుగా సిఫారసులు చేసి ఉన్నామని వివరించారు. చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు! రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. ఇందుకు రాజ్ భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి సమాధానం పంపించి ఉన్నారని వివరించారు. రాజీవ్ హత్య కేసు, కుట్ర విషయంగా సీబీఐ, ఐబీలతో పాటుగా పలు విచారణ బృందాలతో పర్యవేక్షణ కమిటీ నియమించి ఉన్నట్టు ప్రకటించారు. ఆ కమిటీ కోర్టుకు ఇచ్చే నివేదిక మేరకు తదుపరి ప్రభుత్వ సిఫారసు మీద నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొని ఉన్నారని మంత్రి ప్రకటించడంతో ఈ నివేదిక ఎలా ఉంటుందో, ఈ దారి రూపంలో నైనా వారి విడుదలకు మార్గం లభించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
తమిళనాడు ప్రభుత్వంపై రజనీ ప్రశంసలు
సాక్షి,చెన్నై : కరోనావైరస్( కోవిడ్-19)ను కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి చేయడంపై ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్ వేదికగా తమిళ ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించారు. ‘కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను మనం అభినందించాలి. మనందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ.. కరోనావైరస్ను తరిమి కొట్టాలి’ అని రజనీకాంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కరోనావైరస్ వల్ల జీవనోపాధి దెబ్బతిన్న వారికి ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందించాలని, అది వారికెంతో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశారు. కాగా, తమిళనాడులో గురువారం నాటికి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 2635 మందిని గృహ నిర్భంధంలో ఉన్నారు. వీరుగాక మరో 24మంది ఆస్పత్రిల్లో ప్రత్యేక వైద్య నిఘాలో ఉన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను బంద్ చేసింది. జైళ్లలో ఖైదీలను కలుసుకనే ములాఖత్‌లపై నిషేదం విధించింది. ప్రముఖ పర్యాటక క్షేత్రం మహాబలిపురంలో పర్యాటకుల రాకను నిషేధించింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
సిరిసిల్లకు సంక్రాంతి శోభ
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు పక్కరాష్ట్రాల నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొం గల్ (సంక్రాంతి) కోసం ఇక్కడ చీరలు తయారవుతు న్నాయి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు పం డగ కానుకగా చీరలు, పంచెలు పంపిణీ చేస్తోంది. ఆ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. దీంతో ఇక్కడి వస్త్రపరిశ్రమలో తమిళనాడు చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా 95 లక్షల చీరలకు అవసరమైన 6 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకుమెరుగైన ఉపాధి లభించింది. ఆ ఆర్డర్లు పూర్తి కాగానే.. ఇప్పుడు కొత్తగా తమిళనాడు ఆర్డర్లు రావడంతో నేత కార్మికుల ఉపాధికి మరో దారి లభించింది. సిరిసిల్లకు పండుగ శోభ ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నాయి. ఈసారి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. డిసెంబరు నెలాఖరు వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, దోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72 కోట్ల పంచె లు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండటంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి వస్త్రాల ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో 2 వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారైన చీరలు, దోవతులను కేరళకు ఎగుమతి చేస్తున్నారు. ఓనం పండగకు సిరిసిల్ల చీరలను, పంచెలను సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాలలు, దోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. నూలు అందించి, బీములు పోసి ఇస్తుండటంతో మెరుగైన ఉపాధి సమకూరుతుంది. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలీ దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే గుడ్డ ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇస్తోంది. పని బాగుంది మొన్నటి వరకు బతుకమ్మ చీరలతో మంచి ఉపాధి లభించింది. ఇప్పుడు తమిళనాడు చీరల ఆర్డర్లు వస్తున్నాయి. పనిబాగుంది. పాలి స్టర్ కంటే కార్మికులకు, ఆసాములకు చీరల ఆర్డర్లతో బతుకుదెరువు బాగుంది. ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి. – వెల్ది హరిప్రసాద్, ఆసామి బతుకమ్మ ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి కూలీ వచ్చింది. వారానికి రూ.5 వేలు సంపాదించిన. ఇప్పుడు మళ్లీ వారానికి రూ.2 వేలు వస్తుంది. తమిళనాడు చీరల ఆర్డర్లతో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్డర్లు వస్తేనే బాగుంటుంది. అందరికీ పని ఉంటుంది. పాలిస్టర్ కంటే తమిళనాడు చీరలు నయమే. – మహేశుని ప్రసాద్, కార్మికుడు -
‘జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు’
చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న వాదనలను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. జయలలిత తన జీవితకాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారయణ్ ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు. అదే విధంగా అమృత, జయలలిత కూతురని చెప్పాడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. పిటిషనర్ కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ఒకవేళ అమృత జయలలిత కూతురు అయితే ఆమెతో ఒక్క ఫొటో కూడా ఎందుకు దిగలేకపోయారో చెప్పాలన్నారు. అమృత ఫిర్యాదులో 1980 తను జన్మించినట్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రాస్తావించారు. ఆమె పుట్టిన తేదీకి నెల రోజుల ముందు ఓ అవార్డు కార్యక్రమంలో జయలలిత పాల్గొన్న వీడియోలను ఆయన కోర్టుకు అందజేశారు. ఆ వీడియోల్లో జయలలిత గర్భంతో ఉన్నారని అనడానికి ఎటువంటి అనవాళ్లు లేవని కోర్టుకు విన్నవించారు. అమృత కోరినట్టు డీఎన్ఏ టెస్ట్ కావాలంటే.. జయలలిత బంధువులు ఉన్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా తను జయలలిత కూతురిని అని నిరూపించుకోవాలంటే ఆమె పార్ధీవదేహాన్ని వెలికితీసి డీఎస్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత కోరిన సంగతి తెలిసిందే. -
మీకు న్యాయం చేస్తాం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోవట్లేదని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘తమిళనాడుకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని భరోసా ఇచ్చింది. ‘తమిళనాడు సమస్య మాకు అర్థమైంది. కావేరీ జలాల విషయంలో సత్వర న్యాయం జరిగేలా చూస్తాం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటును కోరుతూ గతకొన్ని రోజులుగా తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఈ అంశంపై కేంద్రం స్పందిస్తూ... ‘ఇది చాలా సున్నితమైన అంశమని.. పైగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నామని’ సుప్రీంకోర్టుకు నివేదించింది. కాగా, ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కావేరీ జల వివాదంపై తీర్పునిస్తూ.. తమిళనాడు వాటాను తగ్గించి, కర్ణాటక రాష్ట్రానికి అధిక వాటాను కేటాయించింది. బెంగుళూరు సిటీ అవసరాల దృష్ట్యా ఈ తీర్పునిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆ సమయంలో పేర్కొన్నారు. -
రెండుసార్లు వేలం వేసినా స్పందించరేం?
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములు తమవంటూ ఇప్పుడు ముందుకొచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సదావర్తి భూముల వ్యవహారంలో పిల్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సదుద్దేశాన్ని నిరూపించుకునేందుకు తమ ఆదేశాల మేరకు డిపాజిట్ చేసిన రూ.27.44 కోట్లను తిరిగి చెల్లించే విషయంలో వచ్చే సోమవారం వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న అత్యంత విలువైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. రెండుసార్లు వేలం నిర్వహించినప్పుడు స్పందించ కుండా ఆ తర్వాత ఆ భూములు తమవని చెప్పడంలో అర్థమేంటని తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరయిన న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆ ప్రకటనలు ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు. -
మిస్టరీ.. హిస్టరీ!
32 ఏళ్లలో 19 విచారణ కమిషన్లు అన్నీ అవాంఛనీయ సంఘటనలకు ఇదే మంత్రం తాజాగా జయలలిత మృతిపైనా మరో విచారణ కమిషన్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది. 32 ఏళ్లలో ఇప్పటివరకు 19 విచారణ కమిషన్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీని ఛేదించేందుకంటూ ఎడపాడి ప్రభుత్వం మరో కమిషన్‌ను ప్రకటించడం గమనార్హం. సాక్షి, చెన్నై: దాడులు, పోరాటాలు, తుపాకీ కాల్పులు, తొక్కిసలాటలో దుర్మరణాలు ఇలా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల ఏకైక మంత్రంగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కమిషన్ ఏర్పాటుతో కన్నీళ్లు తుడవడం మాత్రం షరామామూలుగా మారింది. ఇప్పటి వరకు ఏర్పాటైన 19 విచారణ కమిషన్ల వల్ల బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనే ప్రధాన అంశాలు మాత్రం (ఏవో ఒకటి రెండు మినహా) వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తాజాగా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించి ఈ సంఖ్యను 20 కి పెంచారు. 1995 నుంచి 2017 ఆగస్టు వరకు రాష్ట్రంలో ఏర్పాటైన విచారణ కమిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. - దక్షిణాది జిల్లాల్లో 1995 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చోటు చేసుకున్న జాతి కలవరాలపై న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్. - చెన్నై సెంట్రల్ జైల్లో 1999 నవంబర్‌లో జరిగిన ఘర్షణలో డిప్యూటీ జైలర్ జయకుమార్ సజీవ దహనం కాగా, ఈ సందర్భంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో 11 మంది ఖైదీలు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - మాంజోలైలో తేయాకు తోటల కార్మికుల కూలీల సమస్యపై నిర్వహించిన ఊరేగింపులో ఘర్షణలు చోటు చేసుకోగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలో తామరభరణి చెరువులో మునిగిపోయి 17 మంది మృత్యువాతపడ్డారు. దీనిపై 1999లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ లా కళాశాల హాస్టల్లోకి 2001లో పోలీసులు చొరబడి దాడికి పాల్పడిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని 2001లో అర్ధరాత్రి అరెస్టు చేయడంపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అరెస్టును నిరసిస్తూ 2001 ఆగస్టులో నిర్వహించిన ర్యాలీలో ఐదుగురు మరణించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసాలపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - సమ్మెకు దిగిన 1,70,241 మంది ప్రభుత్వ ఉద్యోగులను 2001లో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తొలగించడంపై ముగ్గురు రిటైర్డు న్యాయమూర్తులచే విచారణ కమిషన్ - మదురై మేలూరు ప్రభుత్వ కళాశాలలో 2002లో విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్. ఈ విచారణ కమిషన్ మాత్రమే పోలీసులను తప్పుపట్టడంతో పాటు, కళాశాలనే మరో చోటుకు మార్చాలని సిఫార్సు చేసింది. - అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో వెంకటేశ పన్నయార్ అనే వ్యక్తి పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందడంపై న్యాయమూర్తి రామన్ నేతృత్వంలో విచారణ కమిషన్. - కుంభకోణం పాఠశాలలో దారుణ అగ్నిప్రమాదంపై న్యాయమూర్తి నేతృత్వంలో 2004లో విచారణ కమిషన్. - చెన్నై ఎంజీఆర్ నగర్లో 2005 ఆఖరిలో వరద నివారణ పంపిణీలో తొక్కిసలాట జరిగి 42 మంది మృతి చెందిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - చెన్నై ప్రభుత్వ న్యాయకళాశాలలో 2008లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - జయలలిత విశ్రాంతి కోసం నిర్మాణం చేసిన సిర్ధాఊరు బంగళా నిర్మించిన స్థలం అన్నాదురై పాలన కాలంలో దళితులకు పంపిణీ చేసిన పట్టా భూమి అని, అప్పట్లో కమ్యూనిస్టులు పోరాడారు. దీనిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - సేలంలోని ఓమలూరు పాతిమా పాఠశాలలో సుకన్య అనే విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - టెలిఫోన్లో ఓట్ల ప్రచారంపై 2010లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - కొత్త సచివాలయం నిర్మాణం గురించి విచారణ కోసం 2011లో ఏర్పాటైన కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి నియామకమయ్యారు. - మౌళివాక్కంలో 2014 జూన్‌లో బహుళ అంతస్థుల అపార్ట్మెంట్ కూలిపోయిన దుర్ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - తమిళనాడులో ఇసుక క్వారీల దోపిడీపై హైకోర్టు ఆదేశాల ప్రకారం 2014లో ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్ - 2017 జనవరిలో జరిగిన జల్లికట్టు పోరాటం, ఆందోళనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. జయ మరణ మిస్టరీపైనా విచారణ కమిషన్ గత ఏడాది సెప్టెంబరు 22 వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్ వల్ల స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జయ కోలుకున్నారు, నేడో రేపో డిశ్చార్జ్ అంటూ అపోలో వైద్యులు, అన్నాడీఎంకే వర్గాలు నెలల తరబడి ప్రకటిస్తూ వచ్చాయి. అయితే 74 రోజుల పాటు చేసిన ప్రకటనలకు పూర్తి భిన్నంగా.. జయలలిత కన్నుమూసినట్లుగా డిసెంబర్ 5వ తేదీన చావుకబురు చల్లగా చెప్పారు. అభిమానులు, ప్రజలు, ప్రతిపక్షాలు అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. న్యాయవిచారణ, సీబీఐ విచారణ కోరుతూ డిమాండ్లు చేశారు. ఎవరెంత గీ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకం కావాలని ప్రధాని ఒత్తిడి, శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం షరతు, పార్టీపై పట్టు కోసం టీటీవీ దినకరన్ దూకుడు పెంచి ప్రభుత్వ మనుగడకే ముప్పువాటిల్లే తరుణంలో జయ మరణంపై రిటైర్డు న్యాయమూర్తిచే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ప్రకటించడం గమనార్హం. జయ మరణంలో చోటుచేసుకున్న అనుమానాలను నివృత్తి కోసమేనా లేదా రాజకీయ ప్రయోజనాలకా అనే ప్రశ్నకు సమాధానం కోసం కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
తమిళ ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు
చెన్నై: రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న రూ. 55 వేలను 90.91 శాతం పెంచి రూ.1,05,000కు చేర్చింది. సీఎం పళణిస్వామి అసెంబ్లీలో ఈమేరకు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్. పాండి, మాజీ ఎమ్మెల్యేల వినతితో జీతాలను సీఎం భారీగా పెంచారు. ఎమ్మెల్యేలందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని స్పీకర్ ధనపాల్ అన్నారు. సీఎం, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విపక్ష నేత, ప్రభుత్వ చీఫ్ విప్ల అలవెన్సులు కూడా పెరిగాయి. పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పులు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్న రాష్ట్ర రైతులు తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సర్కారుకు షాక్!
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్త న్యాయ కళాశాలల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న చట్టాన్ని కోర్టు రద్దు చేసింది. కొత్త కళాశాలలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, ఇందుకుగాను వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతుల నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఇరవై వేలు జరిమానా విధించడం గమనార్హం. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ పలు కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తరచూ అక్షింతలు, మొట్టికాయలు, జరిమానాలు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో మారు అక్షింతలు వేయడంతో పాటు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ఏకంగా స్థానిక ఎన్నికలకు తగ్గ ఉత్తర్వుల్నే రద్దు చేస్తే, ప్రస్తుతం న్యాయ కళాశాలలకు మోకాలొడ్డే విధంగా ఉన్న చట్టాన్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేయడం న్యాయ శాస్త్రం చదువుకోవాలన్న ఆశతో ఎదురు చూపు ల్లో ఉన్న యువతకు ఆనందమే. పిటిషన్ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబేద్కర్వర్సిటీ పరిధిలో పది న్యాయ కళాశాలలు ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్య ఐదు వేలలోపే. ప్రైవేటు విద్యా సంస్థలు న్యాయశాస్త్రం బోధించే విధంగా కొత్త కళాశాలలకు ముందుకు వచ్చినా ప్రభుత్వ చట్టం అడ్డంకిగా మారక తప్పడం లేదు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సమూహ నీధి పేరవై నేత బాలు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో న్యాయ శాస్త్రం చదువుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే, సీట్ల సంఖ్య మరీ తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలను ఆశ్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలోని న్యాయ కళాశాలల్లో చదువుకుని, ఇక్కడ న్యాయవాదులుగా ప్రాక్టీసు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందుకు కారణం, రాష్ట్రంలో కొత్తగా న్యాయ కళాశాలల ఏర్పాటుకు తగ్గ అనుమతులు లేక పోవడమేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం మేరకు ఇక్కడ ప్రైవేటు న్యాయ కళాశాలలకు అనుమతులు లేదు అని, ఆ చట్టాన్ని రద్దు చేస్తే, కొత్త కళాశాలలు ఏర్పాటు అవుతాయని, ఇక్కడి విద్యార్థులకు న్యాయ శాస్త్రం మరింత దగ్గరగా అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే, వన్నియర్ ట్రస్టు నేతృత్వంలో పీఎంకే అధ్యక్షుడు జీకే మణి న్యాయ కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుని ఎనిమిదేళ్లు అవుతున్నా,ప్రభుత్వంలో స్పందన లేదని పేర్కొంటూ, మరో పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ల మీద విచారణ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వచ్చింది. గత వారం విచారణ ముగిసింది. తీర్పును బెంచ్ వాయిదా వేసింది. చట్టం రద్దు : బుధవారం న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చే తీర్పును ఇవ్వడంతోపాటుగా రూ. 20 వేలు జరిమానా విధించారు. రాష్ట్రంలో న్యాయ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కొత్త కళాశాలలు, ప్రైవేటు న్యాయ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎనిమిది సంవత్సరాలుగా దరఖాస్తును పరిశీలనలో ఉంచి, జాప్యం చేసినందుకు గాను రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని వన్నియర్ విద్యా ట్రస్టుకు చెల్లించాలని సూచించారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు తగ్గ దరఖాస్తులను పరిశీలించి, అన్ని రకాల సౌకర్యాలు, విద్యా పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల మేరకు అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
ఆన్ లైన్ లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్..
చెన్నైః ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అవినీతిని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగేందుకు కొత్త అన్ లైన్ సాఫ్ట్ వేర్ ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఆన్ లైన్ సేవల ద్వారా ప్రజలు తమ ఆస్తులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడినుంచైనా రిజిస్టర్ చేసుకునే సదవకాశాన్ని కల్పిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తెస్తోది. రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి, గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, మధ్యవర్తులకు లంచాలు చెల్లించాల్సిన పని లేకుండా.. స్వయంగా డాక్యుమెంట్లను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు ఆన్ లైన్ లోనే పంపే విధానాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. అందుకోసం రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విధానం పూర్తిగా కంప్యూటరీకరించడంతోపాటు, టెస్ట్ రన్ కోసం 20 వరకూ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశ పెట్టినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను తమిళనాడులోని అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రవేశ పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. కొత్త సాఫ్ట్ వేర్ లోని టెంప్లెట్ ద్వారా ప్రజలు స్వయంగా డాక్యుమెంట్లు తయారు చేసుకొని, సంబంధిత రిజిస్టర్ ఆఫీసులకు పంపించవచ్చు. పార్టీల వేలిముద్రలు, ఆధార్, మొబైల్ ఫోన్ నెంబర్లు రిజిస్టర్ ఆఫీసులకు పంపించడం ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను, తప్పుడు రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని ఆమె తెలిపారు. డాక్యుమెంట్లను సమర్పించడంతోపాటు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ లోనే చెల్లించిన అనంతరం సర్టిఫైడ్ కాపీలను పొందవచ్చని అన్నారు. ఈ కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా, ఆస్తి హక్కులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వివరాలు సైతం తెలుసుకోవచ్చన్నారు. దీనికి తోడు 228 కమర్షియల్ టాక్స్ ఆఫీసుల్లో వినియోగదారులు తమ టాక్స్ సంబంధిత పత్రాలను ఉచితంగా అప్ లోడ్ చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
కాటి కాపరికి కల్పనా చావ్లా అవార్డు
కేకే.నగర్(చెన్నై): పురుషులే పనిచేయడానికి భయపడే విద్యుత్ దహన వాటికలో ఆపరేటర్‌గా చేరింది ఆమె. ఇప్పటి వరకు 2,800 మృతదేహాలను దహనం చేసింది. కుటుంబ పరిస్థితే తనకు భయాన్ని పోగొట్టిందని సగర్వంగా చెబుతోంది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం కల్పనాచావ్లా అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే ‘తమిళనాడులోని నామక్కల్ సమీపంలోని కూలి పట్టి మా సొంత ఊరు. పట్టుగురుకల్ బ్రాహ్మణ కులానికి చెందిన మా నాన్న కూలి పట్టి సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజారి. కూలిపట్టిలోని ప్రైవేటు, నామక్కల్ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాను. నామక్కల్ కలింజ్ఞర్ రామలింగ పిళ్లై కళాశాలలో ఆర్థిక విభాగంలో ఎంఏ పట్టభద్రురాలు అయిన తరువాత వాసుదేవకి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పూటగడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో ప్రైవేటు ట్రస్టు తర ఫున విద్యుత్ దహన వాటికలో యంత్రాన్ని నడిపే ఆపరేటర్‌గా వచ్చిన అవకాశాన్ని స్వీకరించాను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలాంటి పనికి వెళ్లకూడదని అత్త, మామ, భర్త తెలిపారు. కుటు ంబ పరిస్థితి నాలో భయాన్ని పోగొట్టింది. చనిపోయిన వా రు దైవంతో సమానం అనుకుని ధైర్యం తెచ్చుకున్నాను. నేను ఈ పని చేస్తానని చె ప్పినప్పుడు ట్రస్టు నిర్వాహకులు నమ్మలేదు. నెల జీతం తీసుకోకుండా పని చేశావంటే నీ మీద మాకు నమ్మకం కుదురుతుంది.. అప్పడు పర్మనెంట్ చేసి జీతం ఇస్తామని చెప్పారు. నెల రోజులు నేను శ్రమించిన దానికి ఫలితంగా ప్రస్తుతం అదే సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందాను. రాష్ట్ర ప్రభుత్వం నన్ను కల్పనాచావ్లా అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు జయంతి. -
ఇవేం పరువు దావాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నేతలపై తమిళనాడు ప్రభుత్వం వరుసగా దాఖలు చేస్తున్న పరువునష్టం దావాలపై సుప్రీంకోర్టు విస్తుపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు, మరేరాష్ట్రంలో లేని విధం గా ఇవేం పరవునష్టం దావాలు బాబోయ్ అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఎన్ని పరవునష్టం దావాలు వేసారో రెండువారాల్లోగా జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, సతీమణి ప్రేమలతపై తిరుపూరు కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది నవంబరులో తిరుపూరులో జరిగిన డీఎండీకే బహిరంగసభలో అన్నాడీఎంకే ప్రభుత్వ ఉచిత వస్తువుల పంపిణీపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పేరు ప్రతిష్టలకు భంగకరమని పేర్కొంటూ విజయకాంత్, ప్రేమలతలపై తిరుపూరు కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ఈ దావాతోపాటూ తమపై పెట్టిన పరువునష్టం కేసులన్నీ కొట్టివేయాల్సిందిగా కోరుతూ విజయకాంత్, ప్రేమలతలు డీఎండీకే తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే దాఖలు చేసిన పరువునష్టం దావా తిరుప్పూరు కోర్టులో ఈనెల 26వ తేదీన విచారణకు వచ్చింది. విజయకాంత్, ప్రేమలత కోర్టుకు హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. దీంతో డీఎండీకే డిల్లీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాదైన జీఎస్ మణి బుధవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ముందు హాజరయ్యారు. అన్నాడీఎంకే తమ వారిపై వేసిన అన్ని పరువునష్టం దావాలకు సుప్రీంకోర్టు గతంలోనే స్టే మంజూరు చేసి ఉన్న స్థితిలో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. తమ పిటిషన్‌ను స్వీకరించి తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, రోకింగ్టన్ గురువారం విచారణకు స్వీకరించారు. తమిళ నాడు ప్రభుత్వ తరఫు న్యాయవాది యోగేష్‌ఖన్నా, పసంద్, జీఎస్ మణి హాజరైనారు. సుప్రీం కోర్టులో స్టే విధించి ఉండగా తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్‌ను ఎలాజారీ చేస్తుందని జీఎస్ మణి వాదించారు. పరువునష్టం దావాలపై సుప్రీం కోర్టు స్టే విధించలేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. పరువునష్టం కేసులు తమిళనాడులోనే.. ఈ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మధ్యలో కలుగజేసుకుని తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదు. తమిళనాడులో మాత్రమే ఎందుకు ఇన్ని పరువునష్టం కేసులు దాఖలవుతున్నాయి. ఇంతవరకు తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై పరువునష్టం దావాలు వేశారో మొత్తం జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విజయకాంత్, ప్రేమలతలపై జారీచేసిన పీటీ వారెంట్‌పై స్టేను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసును సెప్టెంబరు 21వ తేదీకి వాయిదావేశారు. -
ఆ ప్రభుత్వానికి మూర్ఖత్వం తగదు
తమిళనాడులో 92 వేల మంది తెలుగు విద్యార్థులకు అగచాట్లు హైకోర్టు, కేంద్ర మైనార్టీ కమిషన్ ఉత్తర్వులు తుంగలోకి: యార్లగడ్డ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళనాడు ప్రభుత్వం తెలుగు విద్యార్థుల పట్ల మూర్ఖంగా వ్యవహారిస్తోందని సాహితీవేత్త, కేంద్ర హిందీ భాషా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో జారీచేసిన ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని తెలుగు, మలయాళం, కన్నడం, ఉర్దూ భాషలకు చెందిన 2.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. తమిళనాడులో చదువుతున్న 92 వేల మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు మాతృభాషగా చదివిన విద్యార్థులు మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలో తొలి భాషగా తమిళంలోనే పరీక్షలు రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తగదన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి: కేంద్ర మైనారిటీ క మిషన్ అక్టోబరు 2015లో మాతృభాషలో పరీక్షలు రాసే విద్యార్థుల హక్కులను భంగం కలిగించవద్దని ఉత్తర్వులు ఇచ్చినా తమిళ సర్కారు పెడచెవిన పెట్టిందన్నారు. మద్రాసు హైకోర్టు సైతం ఈ ఏడాదికి విద్యార్థుల డిక్లరేషన్లు తీసుకుని పరీక్షలు రాసేలా ఆదేశించిందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: తమిళనాడు గవర్నర్ కోణిజేటి రోశయ్య తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. రాజ్యాంగ అధిపతిగా భాషా అల్పసంఖ్యాక వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి ఆర్టికల్ 50 ప్రకారం రక్షణ కల్పించాలని కోరారు. తెలుగు, అల్పసంఖ్యాక విద్యార్థుల హక్కులను కాపాడాలన్నారు. -
ఇదెక్కడి దౌర్భాగ్యం!
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది తమిళనాడు ప్రభుత్వ పాలన. గ్రామీణ ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో పలువురు గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తళి నియోజకవర్గంలోని దాసరపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు ఏడు గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలల వేళకు బస్సు సౌకర్యం లేదు. దీంతో గంటల తరబడి రోడ్డుపక్కనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో బడిలో చదువులు వల్లె వేయాల్సిన విద్యార్థులు రోడ్డుపక్కనే బారులుదీరి కూర్చొని పాఠాలు చదువుకోవడం ప్రారంభించారు. పాఠశాల వేళకు ఓ బస్సు ఏర్పాటు చేస్తే ఈ విద్యార్థుల వెతలు తీరుతాయని పలువురు అంటున్నారు. -
తమిళనాడు భేష్
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు ప్రభుత్వం ద్వారా అందుతున్న వైద్యసేవలు భేషుగ్గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఈ రాష్ట్రంలోని వైద్యసేవలను ఏపీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన కోసం మంగళవారం చెన్నైకి వచ్చిన కామినేని నగరంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్)లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఇంతటి ఉన్నత స్థాయిలో వైద్యసేవలు అందించడం సాధ్యమా అని ఆశ్చర్యపడే రీతిలో తమిళనాడు ఆసుపత్రులు పనిచేస్తున్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం కూడా చక్కగా ఉందని అన్నారు. వైద్యసేవల పరంగా గుజరాత్లో కూడా సందర్శించానని, అక్కడి మెడికల్ కాలేజీల పనితీరు గొప్పగా ఉందని చెప్పారు. మంచి ఏరాష్ట్రంలో ఉన్నా ఏపీలో అమలుచేసేందుకు సిద్దంగా ఉన్నామని, పొరుగు రాష్ట్రాల నుండి అనుకరణలో తమకు ఎటువంటి భేషజాలు లేవని అన్నారు. తెలంగాణ విభజన వల్ల ఆరోగ్యశాఖాపరంగా ఏపీ తీవ్రస్థాయిలో వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చినా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు (పీహెచ్సీ) నిర్లక్ష్యానికి గురైనాయని విమర్శించారు. అన్నిరకాల వైద్యసేవలు హైదరాబాద్‌లో కేంద్రీకృతమై అవస్థలు పడాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏపీలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గత ఏడాది బడ్జెట్లో వైద్యశాఖకు రూ.4,400 కోట్లు కేటాయించగా, ఈఏడాది రూ.5,700 కోట్లకు పెంచామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా కాక వ్యక్తిగా ఆరోగ్యశాఖ కోసం పాటుపడుతున్నారని అన్నారు. చెన్నైలో కామినేని ః మంగళవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ఏపీ వైద్యమంత్రి కామినేని శ్రీనివాస్ ఉదయం 11.30 గంటలకు తమిళనాడు గవర్నర్ కే రోశయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని అనేక విభాగాలను సందర్శించారు. రోగుల వార్డు, పౌష్టికాహార తయారీ విభాగం, అత్యాధునిక యంత్రాల పనితీరు, ఒక రోగికి శస్త్రచికిత్స జరుగుతున్న దృశ్యాన్ని తిలకించారు. తమిళనాడు ప్రభుత్వ పరంగా జరుగుతున్న వైద్యసేవలు, సిబ్బంది, భవన సదుపాయ వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అక్కడి నుండి సెంట్రల్ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరగంటపాటు గడిపారు. తమిళనాడు వైద్యశాఖా మంత్రి సి విజయభాస్కర్, వైద్యకార్యదర్శి జే రాధాకృష్ణన్ తదితర వైద్యాధికారులు మంత్రి కామినేనికి స్వాగతం పలికి ఆయన వెంట పర్యటించారు. -
పన్నీరు ప్రభుత్వం త్వరలో డిస్మిస్
సాక్షి, చెన్నై: మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ జోస్యం చెప్పారు. మంత్రుల అవినీతి బండారాలతో కూడిన ఆధారాల చిట్టా తమ చేతిలో ఉందని ధీమా వ్యక్తం చే శారు. దీనిని రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించగానే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని పేర్కొన్నారు. టీఎంసీ అంటే ఏమిటి...అలాంటి పార్టీ రాష్ట్రంలో ఉందా..? అని ఎద్దేవా చేశారు. నాగర్ కోవిల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు అయింది. దీనిని ఈవీకేఎస్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈవీకేఎస్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై, తమిల మానిల కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకు పోయిందని ఆరోపించారు. సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులందరూ అవినీతి పరులేనని పేర్కొంటూ, అందుకు తగ్గ ఆధారాల చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలతో చిట్టా సిద్ధం అయిందని, దీనిని గవర్నర్‌కు సమర్పించబోతున్నామన్నారు. ఆధారాల చిట్టా గవర్నర్ చేతికి అందగానే, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం ఖాయం అని జోస్యం చెప్పారు. జాలర్ల జీవనాధారం మీద ప్రభావం చూపించే మీనాకుమారి కమిషన్సిఫారసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లకు నిషేదం కాలంలో కంటి తుడుపు చర్యగా రూ. రెండు వేలు నివారణ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, రూ. ఐదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిషేద కాలంలో జాలర్లకు రూ. 5500గా నిర్ణయించి ఉన్నదని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో సాగుతున్నదని అసమర్థ పాలన అని, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల సంక్షేమం మీద కన్నా, విదేశీ పర్యటనల మీదే మోజు ఎక్కువగా ఉందని విమర్శించారు. మణిముత్తారు నీటిని సక్రమంగా విడుదల చేయని దృష్ట్యా, తిరునల్వేలి, తూత్తుకుడిల్లోని అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కొక్ కంపెని తమను స్థలం అడగ లేదని, అనుమతి కోసం సంప్రదించ లేదని మంత్రి తోపు వెంకటా చలం అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థకు ఇచ్చిన అనుమతుల్ని ఏ విధంగా రద్దు చేశారో వివరించాలని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన తోపు వెంకటాచలం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, జికే వాసన్నేతృత్వంలోని తమిల మానిల కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ గురించి ప్రస్తావిస్తూ, టీఎంసీ రాష్ట్రంలో ఉందా..? దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కాంగ్రెస్‌కు ఉందని, తాము రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, తమ మద్దతుతోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఎవరితోనన్నది ఎన్నికల సమయంలో తెలుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రుల అవినీతి, రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలు, నేరాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాల్ని ఉధృతం చేయనున్నామన్నారు. -
అసెంబ్లీలో భవన దుమారం
తిరువారూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ భవనం కూలిపోయిన ఘటన సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. దీనిపై మాట్లేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.డీఎంకేతో కలిసి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:వన్నిలం సమీపంలోని నెలకుడిలో కూలిపోయిన సెంట్రల్ వర్సిటీ భవనం విషయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృత్యువాతపడిన విషయం విదితమే. ప్రశ్నోత్తరాల సమ యం ముగియగానే డీఎంకే సభ్యులు స్టాలిన్ ఈ విషయమై మాట్లాడటం ప్రారంభించగానే స్పీకర్ ధనపాల్ అడ్డుకున్నారు. భవన ప్రమాదంపై డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఉన్నందున ముఖ్యమంత్రి సమాధానం చెబుతారని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మృతులకు ప్రభుత్వం తలా రూ.5లక్షలను నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత డీఎంకే సభ్యులు దురైమురుగన్ మాట్లాడుతూ భవన ప్రమాదం మాత్రమే కాదు అనేక ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ సమావేశాలకు మరో రెండు రోజులే గడువు ఉందని అన్నారు. మళ్లీ స్పీకర్ కలుగజేసుకుంటూ ఈ విషయాలన్నీ తనకు తెలుసునని, అనవసర చర్చలను అనుమతించేది లేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దురైమురుగన్‌కు, మంత్రులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణాల్లో నిర్లక్ష్యం పేద కార్మికుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదని వ్యాఖ్యానించారు. వేలూరు కలెక్టర్ కారు కిందపడి యువకుడు మరణించిన ఘటనపై మాట్లేడేందుకు దురైమురుగన్ కోరగా స్పీకర్ నిరాకరించారు. డీఎంకే సభ్యుల విమర్శలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే, తదితర నాలుగు పార్టీల సభ్యులు అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కెప్టెన్ కలకలం.. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వ్యవహరిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ సోమవారం అకస్మాత్తుగా సచివాలయానికి హాజరై కలకలం సృష్టించారు. ఉదయం 11.25 గంటలకు సచివాలయానికి చేరుకుని అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేసి వెంటనే వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మళ్లీ వచ్చారు. నోటికి నల్లగుడ్డలు ధరించి అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బహిష్కృత డీఎండీకే సభ్యులను పరామర్శించారు. జయ మార్గదర్శకంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, దీని అర్థం అక్రమార్జనతో కోర్టులో దోషిగా నిరూపితమైన జయ నేతృత్వంలో ప్రవేశపెట్టడమా అంటూ మీడియా వద్ద విజయకాంత్ ఎద్దేవా చేశారు. ‘ఇది కూడా ఒక అసెంబ్లీనా వచ్చేయండి పోదాం’ అంటూ ధర్నాలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని వెళ్లిపోయారు. భవనం కేసులో నలుగురి అరెస్ట్.. భవనం కూలిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ భవన నిర్మాణ కాంట్రాక్టు పొంది ఉన్న టీఈఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ జనరల్ మేనేజర్ ఆనంద్ (26)తో పాటు తిరుచ్చికి చెందిన ఆంథోనీ అమల్ ప్రభు (31), మయిలాడుదురైకి చెందిన మేస్త్రీ అయ్యనార్ (32), కురుంగుళంకు చెందిన సూపర్వైజర్ సతీష్‌కుమార్ (25)ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. మృతుల కుటుంబాలకు తలా రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నేడు అప్పీలు
ఐదుగురు తమిళ జాలర్లకు కొలంబో కోర్టు ఉరిశిక్ష విధించిన కేసుపై సోమవారం అప్పీలు దాఖలు కానుంది. కోర్టు తీర్పుతో కుంగిపోయిన జాలర్ల కుటుంబాలు అప్పీలుపైనే ఆశలు పెట్టుకున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశా ల నుంచి భారత్ అనేక సవాళ్లతో సతమతం అవుతుండగా, తమిళనాడు శ్రీలంక నుంచి గడ్డుపరిస్థితినే ఎదుర్కొం టోంది. శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోరుతున్న తమిళుల డిమాండ్లకు తమిళనాడు ప్రజలు మద్దతుగా నిలవడంతో వైరం మొదలైంది. శ్రీలంక యుద్ధం సమయం లో అక్కడి సైనికులు వందలాది ఈలం తమిళుల మాన ప్రాణాలను హరిం చ డం, నిర్దయగా ఊచకోత కోయడం, వేలాది మందిని నిరాశ్రయులను చేయ డం వంటి పరిణామాలతో బద్దశత్రుత్వానికి దారితీసింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను యుద్ధోన్మాదిగా ఐక్యరాజ్యసమితి ముందు నిలబెట్టాలని తమిళనాడు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో తమిళ జాలర్లపై లంక కసి తీర్చుకుంటోంది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై దాడులకు దిగడం, జైళ్లలోకి నెట్టడం, పడవలు ధ్వంసం చేయడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లు హెరాయిన్ రవాణా చేరవేస్తున్నారని అభియోగం మోపి, 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. 2012 మార్చి 21వ తేదీన దాఖలైన బెయిల్ పిటిషన్‌ను అదే ఏడాది జూన్ 11న కోర్టు కొట్టివేసింది. నాలుగేళ్లుగా ఐదుగురు జాలర్లు శ్రీలంక జైల్లోనే మగ్గుతున్నారు. అరుుతే వీరికి శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఉదంతం తమిళనాడు ప్రజలను మరింత రెచ్చగొట్టింది. శ్రీలంక కు, భారత్‌లోని ఒక రాష్ట్రానికి (తమిళనాడు) మధ్య రోజు రోజుకూ పెరుగుతున్న వైరం కేంద్ర ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. అధికార అన్నాడీఎంకే మొదలుకుని అన్ని పార్టీలు ఐదుగురు జాలర్లకు అండగా నిలిచాయి. అనేక సంఘాలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నాయి. మోదీపై ఒత్తిడి ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించేలా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అంతేగాక అప్పీలుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెబుతూ రూ.20 లక్షలు మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి, రాష్ట్ర బీజేపీ శాఖ రాయబారాలు, రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలతో ఎట్టకేలకూ అంగీకరించిన కేంద్రం అప్పీలుకు మార్గం సుగమం చేసింది. రైల్‌రోకో శ్రీలంక కోర్టులో శిక్షపడిన ఐదుగురు జాలర్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ మక్కల్ ఇయక్కం వారు అదివారం రైల్‌రోకో చేపట్టారు. చెన్నై లోకల్ రైల్వే స్టేషన్లో ఉదయం 11 గంటల సమయంలో రైళ్లను ఆపివేసి పట్టాలపై బైఠాయించారు. 70 మంది నిరసనకారులను అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే, అంబేద్కర్ న్యాయకళాశాల విద్యార్థులు సోమవారం తరగతులను బహిష్కరించి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
వడ్డన వద్దేవద్దు!
సాక్షి, చెన్నై: విద్యుత్ చార్జీల వడ్డన పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. వడ్డన వద్దే వద్దన్న నినాదాన్ని ప్రజలు అందుకున్నారు. చెన్నైలో శుక్రవారం జరిగిన అభిప్రాయ సేకరణ లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత బయలు దేరడంతో తదుపరి తిరునల్వేలి వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ చేయూలని . అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చా క విద్యుత్ రంగ సంస్థల బలోపేతమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. దీన్ని ఎత్తి చూపుతూ ఓ మారు చార్జీలను వడ్డించిం ది. అయినా, విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేదెప్పుడోనన్నది ప్రశ్నగానే మిగిలిపోయి. ఈ నేపథ్యంలో మళ్లీ చార్జీల వడ్డనే లక్ష్యంగా కసరత్తుల్లో పడ్డారు. ఇటీవల జయలలిత సీఎంగా ఉన్న సమయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చార్జీల వడ్డన నిర్ణయాన్ని సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు. వడ్డనకు కార్యాచరణ : ప్రతి ఏటా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నేతృత్వంలో విద్యుత్ రంగ సంస్థల్లో లాభ నష్టాలను సమీక్షించడం ఆనవాయితీ. 2014-15లో రూ.39,818 కోట్ల మేరకు విద్యుత్ సంస్థలపై వెచ్చించాల్సి ఉంది. అయితే ప్రస్తుత చార్జీల తీరును బట్టి రూ.32,964 కోట్లు మాత్రమే లభిస్తుందని అంచనా వేశారు. దీంతో ఆ లోటును పుడ్చుకోవడం లక్ష్యంగా చార్జీల వడ్డనకు నిర్ణయాలు తీసుకున్నారు. చార్జీల్ని పెంచిన పక్షంలో మరో రూ.6,805 కోట్లు లభించగలదని అంచనా వేశారు. ఈ మేరకు పారిశ్రామిక వాడలకు ఒక యూనిట్‌కు రూ.5.50 నుంచి రూ.7.22కు, ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలకు యూనిట్ రూ.4.50 నుంచి రూ.7.22, ప్రై వేటు విద్యాసంస్థలకు రూ.5.50 నుంచి 7.22కు పెంచాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు. అలాగే వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.7.00 నుంచి రూ.8.05 , తాత్కాలిక వినియోగానికి రూ.9.50 నుంచి రూ.11గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక, గృహ వినియోగంపై రూ. 2.60 నుంచి రూ.3, గుడిసెలకు రూ.1 నుంచి రూ.1.20గా వడ్డీంచేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత బయలు దేరుతుందోనన్న విషయాన్ని ప్రభుత్వం పసిగట్టింది. చార్జీల వడ్డనకు ముందుగా ఓ మారు ప్రజాభిప్రాయానికి సిద్ధం అయింది. అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని కోసం ఆయా డివిజన్లలో ప్రజాభిప్రాయానికి శ్రీకారం చుట్టింది. వద్దే..వద్దు : విద్యుత్ రెగ్యులటరీ కమిషన్ చైర్మన్ అక్షయ్ కుమార్, సభ్యులు నాగ స్వామి, రాజగోపాల్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణకు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం చెన్నై బ్రాడ్ వేలోని రాజా అన్నామలై మండ్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పేద, మధ్య తరగతి వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులు, వర్తకులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ఇలా అన్ని వర్గాల వారు ఈ అభిప్రాయ సేకరణకు హాజరయ్యారు. ప్రభుత్వం చార్జీల వడ్డనకు సిద్ధం అవుతోందన్న వివరాల్ని, చార్జీల పెంపు అనివార్యం గురించి అక్షయ్ కుమార్ వివరించారు. అయితే, చార్జీల వడ్డనకు ముక్త కంఠంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని, మరింత భారం వేయొద్దని నినదించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని, అనేక గ్రామాలు కోతలతో అంధకారంలో మునగాల్సిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేస్తూ, చార్జీలను వడ్డించొద్దని సూచించారు. అనంతరం ఒక్కో సంస్థ, సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ, చార్జీల వడ్డన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, చార్జీల వడ్డన వద్దే వద్దంటూ తమ అభిప్రాయాన్ని నమోదు చేయించారు. చిన్న తరహా విడి భాగాల తయారీ సంస్థల సంఘం నాయకుడు మాణిక్య రావు మాట్లాడుతూ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పథకాలు సక్రమంగా ప్రజల దరి చేరలేదని వివరిస్తూ, చార్జీల వడ్డన ప్రయత్నాన్ని మానుకుంటే మంచిదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు గోపాల కృష్ణన్ మాట్లాడుతూ, ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఇప్పటికే ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల నెత్తిన మరింత భారం వేయడం భ్యావం కాదని హితవు పలికారు. ప్రజల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వేళ పెంపు అనివార్యమైనప్పుడు ఇటీవల కర్ణాటక తరహాలో అత్యంత తక్కువగా చార్జీల్ని పెంచాలని, లేని పక్షంలో పెంపు నిర్ణయాన్ని వీడాలని డిమాండ్ చేశారు. చెన్నైలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది వడ్డన వద్దే వద్దు అని స్పష్టం చేయడంతో తదుపరి 28న తిరునల్వేలి వేదికగా, 31న ఈరోడ్ వేదికగా ఈ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. -
బస్సులన్నీ ఫుల్
చెన్నై, సాక్షి ప్రతినిధి: దీపావళి పండుగకు ఇంకొక్క రోజే గడువుండగా ప్రధాన నగరాల్లోని బస్టాండ్ల నుంచి సోమవారం బయలుదేరిన బస్సులన్నీ కిటకిటలాడాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ పండుగకు ప్రత్యేకంగా ఈ సారి 9088 బస్సులను సిద్ధం చేసింది. వీటిల్లో టికెట్ల రిజర్వేషన్‌కు 25 ప్రత్యేక బుకింగ్ కేంద్రాలను తెరిచింది. ఒక్క ఆన్లైన్ ద్వారానే 2 లక్షల మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. 300 కిలోమీటర్ల దూరాన్ని దాటి ప్రయాణించేవారి కోసం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. 2011లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా గత దీపావళికి రూ.3.98 కోట్ల వసూలు కాగాఈ ఏడాది దీపావళికి (సోమవారం నాటికి) టికెట్ల బుకింగ్ రూపేణా రూ.4.9 కోట్లు వసూలైంది. సోమవారం ఒక్కరోజే 35 వేల మంది అన్‌రిజర్వుడు, ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్నవారు 1.5 లక్షల మంది వస్తారని ఆశించిన రవాణాశాఖ సీఎంబీటీ బస్‌స్టేషన్ వద్ద అదనంగా 1400 బస్సులను సిద్ధం చేసింది. ఇవిగాక కోయంబేడు మార్కెట్ వద్ద విశాలమైన ఖాళీ ప్రాంగణాన్ని సిద్దం చేసి మరో వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా ప్రయాణికులు బస్సుల కొరతను ఎదుర్కొంటున్నారు. బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆమ్నీ దోపిడీ ప్రభుత్వ బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోవడంతో ఆమ్నీ (ప్రైవేటు) బస్సు యజమానులు ఇదే అదనుగా టికెట్ల దోపిడీ ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఎగ్మూరు, తాంబరం, పెరుంగళత్తూరు, చెంగల్పట్టు, తిరుచ్చిరాపల్లీ, మదురై, సేలం, ఈసీఆర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలకు 13 స్క్వాడ్ బృందాలు ఏర్పాటయ్యూయి. టోల్గేట్లు, ప్రధాన కూడళ్ల వద్ద నిఘా వేసిన అధికారులు రేయింబవళ్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న 22 ఆమ్నీ బస్సులను సీజ్ చేశారు. బస్సు యజమానులకు సంజాయిషీ నోటీసులు పంపారు. అధికచార్జీల వసూలుకు సరైన సంజాయిషీ ఇవ్వని పక్షంలో వారి బస్సుల పర్మిట్లను రద్దుచేస్తామని అధికారులు తెలిపారు. బస్సుస్టేషన్లలో రద్దీని అవకాశంగా తీసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎంబీటీ బస్‌స్టేషన్‌లో 16 సీసీ కెమెరాలు, 32 వాకీ టాకీలతో 28 నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. రవాణాశాఖా మంత్రి సెంథిల్ బాలాజీ ఆది,సోమవారాల్లో 16 గంటల పాటు స్వయంగా బస్‌స్టేషన్‌లో ఉంటూ పర్యవేక్షించడం విశేషం. బస్సు చార్జీల దోపిడీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంటూ 16 చోట్ల రవాణాశాఖ బ్యానర్లు కట్టింది. టికెట్ల దోపిడీపై 044-24794709, 26744445, 2474900 నంబర్లకు ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. -
పరిహారం.. పరిహాసం!
తమిళనాడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము వచ్చేసింది. మీరంతా జిల్లా కేంద్రానికి వచ్చేయండి.. చెక్కులు ఇచ్చేస్తాం.. ఈ నెల 16న జిల్లా అధికార యంత్రాంగం తరఫున హడావుడిగా పిలుపు,.. అదే విషయమై పత్రికా ప్రకటనలు జారీ.. ఈ నెల 17న.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ చేతుల మీదుగా బాధితుల తరఫున వచ్చిన వారికి చెక్కుల పంపిణీ.. ఇదంతా జరిగింది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బాధితుల పరామర్శకు వచ్చిన రోజే.. ఆయన వెళ్లే సమయానికి బాధితులు ఇళ్ల వద్ద ఉండకుండా చేయాలన్న దురుద్దేశంతోనే అధికార టీడీపీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా హడావుడిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇప్పుడు జరిగింది చూస్తే.. ఆ విమర్శలు.. టీడీపీ కుట్రలు నిజ మేనని తేటతెల్లమవుతోంది. హడావుడిగా ఇచ్చిన ఆ చెక్కులు చెల్లని చిత్తు కాగితాల్లా తిరిగివచ్చాయి. కొత్తూరు: బాధితులను పరామర్శించడాన్ని.. నష్టపరిహారం పంపిణీని సైతం అధికార టీడీపీ రాజకీయం చేస్తోందనడానికి చెన్నై బాధితులకు హడావుడిగా ఇచ్చిన చెక్కులు చెల్లని ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. గత నెల చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలినదుర్ఘటనలో మృతి చెందిన జిల్లాకు చెందిన 14 మంది కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నెల 17న జిల్లా కేంద్రానికి బాధిత కుటుంబీకులను ప్రత్యేకంగా రప్పించి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంతకంతో ఉన్న చెక్కులను అదరాబాదరాగా అందజేశారు. ఇందులో భాగంగా కొత్తూరు మండలానికి చెందిన అమలాపురం రమేష్, రాజేష్‌ల తరఫున వారి తండ్రి అమలాపురం సూర్యారావుకు రెండు చెక్కులు, కిమిడి సుబ్బయ్య భార్య కిమిడి శశిమ్మ పేరిట ఒక చెక్కు అందజేశారు. ఈ చెక్కులను సూర్యారావు స్థానిక ఏపీజీవీబీలో ఉన్న తన ఖాతాలో వేశారు. కలెక్షన్ కోసం వాటిని కొత్తూరు ఎస్బీఐకి పంపగా చెక్కులో పేర్కొన్న ఖాతా(నెం. 11152302687)లో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు వెనక్కి వచ్చాయి. శనివారం బ్యాంకుకు వెళ్లిన సూర్యారావుకు ఏపీజీవీబీ మేనేజర్ వినోద్ ఈ విషయం చెప్పి చెక్కులను తిరిగి ఇచ్చేశారు. కాగా కిమిడి శశిమ్మ తన చెక్కును స్థానిక ఎస్బీఐలో జమ చేయగా, అది కూడా చెల్లకుండా పోయింది. చెక్కులో సూచించిన ఖాతాలో బ్యాలెన్స్ లేనందున చెక్కు ఇంకా మారలేదని ఎస్బీఐ మేనేజర్ ప్రకాశరావు తెలిపారు. ఖాతాలో డబ్బులు వేసిన వంటనే శశిమ్మ ఖాతాకు చెక్కు మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. కాగా చెక్కులు చెల్లకపోవడంతో లబోదిబోమన్న సూర్యారావు వాటిని తీసుకెళ్లి తాహశీల్దార్‌కు చూపించారు. వెంటనే ఆయన కలక్టరేట్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం నాటికి అకౌంట్లో డబ్బులు వేస్తారని.. అ రోజు చెక్కులు తీసుకొని బ్యాంకుకు వెళ్లాలని కలెక్టరేట్ అధికారులు సూచించినట్లు తహశీల్దార్ పీవీ శ్యామ్‌సుందరావు తెలిపారు. కాగా పాలకొండ తదితర ప్రాంతాల్లోని బాధితులకు ఇదే అనుభవం ఎదురైనట్లు సమాచారం. వికటించిన పన్నాగం ప్రతిపక్ష నేత పర్యటనను విఫలం చేయాలన్న దురుద్దేశంతో అధికార పార్టీ పన్నిన పన్నాగం.. ఖాతాలో నిధులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా హడావుడిగా చెక్కులు రూపొందించి ఇవ్వడం వల్లే ఈ చిక్కులు వచ్చాయి. అధికార పార్టీ రాజకీయాల కారణంగా బాధితులు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారని ముందే తెలిసినా.. టీడీపీ నాయకులు జగన్ పరామర్శించే సమయానికి బాధితులు ఇంటి వద్ద లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అకౌంట్లో డబ్బులు లేకపోయినా చెక్కులు బ్యాంకు నిబంధనలకు నీళ్లొదిలారు. తీరా ఇప్పుడు చెక్కులు బౌన్స్ కావడంతో తీరిగ్గా సోమవారం నిధులు జమ అవుతాయి.. అప్పుడు వెళ్లి తీసుకోండని చెబుతున్నారంటేనే.. అప్పుడు చేసిందంతా ఆర్భాటమేనని.. బాధితులను పావులుగా చేసుకొని ఆడిన రాజకీయ నాటకమేనని వేరే చెప్పాలా!.. -
‘చిదంబర’ రహస్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ఆ పార్టీ చేసిన ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకించడమే సిద్ధాంతం’ అనే రాజకీయసూక్తిని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలూ అవకాశం చిక్కినపుడల్లా అమలుచేస్తూనే ఉంటాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణపై సర్వహక్కులు వంశపారంపర్య దీక్షితులదేనంటూ సుప్రీం కోర్టు తీర్పు, కేసు వ్యవహారంలో అధికారపార్టీ వైఖరి ఆయా పార్టీల సిద్ధాంతాన్ని మరోమారు గుర్తుచేసింది. ఆలయంలో అనాదిగా దేవారం భక్తిగీతాలు పాడే కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి(90)కి ఆలయ ప్రధాన అర్చకులకు మధ్య రేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో అప్పటి డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రస్టీలను ఏర్పాటుచేసి దేవాదాయ కమిషనర్‌ను నియమించిం ది. ప్రభుత్వ జోక్యం సరికాదంటూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో అర్చకులు సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ పోరాట దశలోనే డీఎం కే స్థానంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే హయాం నుంచి నడుస్తున్న కేసు కావడంతో అన్నాడీఎంకే పెద్దగా ఆసక్తిచూపలేదు. ఈ క్రమంలో ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేశారు. ప్రజాకోర్టులో తేల్చుకుంటాం: చిదంబరం ఆల యంపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని మాన వ హక్కుల కేంద్రం (చెన్నై) కన్వీనర్ ఎస్ జిమ్రాజ్ మిల్టన్ తెలిపారు. పలు భాషా సంఘాల ప్రతినిధులతో చెన్నై కొత్త సచివాలయం నుంచి సోమవారం ర్యాలీ చేశారు. అనంతరం పెరియార్ విగ్రహం ముందు ధర్నా చేసి, బీజేపీ అగ్రనేత సుబ్రమణ్యస్వామి చిత్రాలను తగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 40 ఎకరాల విస్తీర్ణంలోని ఆలయం, 27 ఎకరాల స్థలం, కొన్ని కోట్లరూపాయల విలువైన ఆలయ ఆభరణాలు అర్చకుల పరమైపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కేసు గెలవాలనే దిశగా సీఎం జయలలిత ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, పైగా దీక్షితులకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. కరుణ ఖండన: చిదంబరం కేసు సమయంలో సీఎంగా ఉండిన డీఎంకే అధినేత కరుణానిధి ఘాటుగా స్పందించారు. 1987లో ఎంజీఆర్ సీఎంగా, ఆర్ఎం వీరప్పన్ దేవాదాయ మం త్రిగా ఉన్నపుడే ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీ నం చేసుకుందన్నారు. దీక్షితులు ఆరోజుల్లోనే కోర్టుకెళ్లారని చెప్పారు. ప్రభుత్వ చర్య సమర్థనీయమంటూ 2009లో హైకోర్టు తీర్పు చెప్పిం దని గుర్తు చేశారు. ప్రధాన అర్చకులు లేదా వారి పూర్వీకులు ఆలయాన్ని నిర్మించలేదని తాము రుజువుచేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం చొరవ చేసుకోనందునే సుప్రీం తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దీక్షితులకు అనుకూలంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. -
రైట్ రైట్
సాక్షి, చెన్నై:చెన్నైలో పెద్ద బస్సులు వెళ్లలేని మార్గాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మినీబస్సులు నడపనున్నామని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతగా 50 బస్సులు సిద్ధమయ్యూయి స్మాల్బస్ పేరుతో వీటిని నగరంలోని చిన్నచిన్న ప్రాంతాల్ని కలుపుతూ నడిపేందుకు చర్య లు తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో 610 బస్సుల్ని కొనుగోలు చేశారు. వీటిని బుధవారం ఉదయం నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకలో జయలలిత ప్రారంభించారు. డీఎంకే హయూం నుంచి నేటి వరకు ఉద్యోగ విరమణ పొందిన 61,746 మందికి రూ.257 కోట్లతో పింఛన్ అందజేశారు. స్మాల్బస్ రూట్లు ఎస్1:పల్లావరం రైల్వేస్టేషన్-తిరుశూలం శక్తినగర్ మధ్య రెండు, ఎస్2: క్రోంపేట - మేడవాక్కం మధ్య మూడు, ఎస్3: క్రోంపేట-మాడంబాక్కం మధ్య మూడు, ఎస్4: క్రోంపేట-మేడవాక్కం మధ్య మూడు, ఎస్5: పెరుంగళత్తూర్-అరుంగాల్ మధ్య రెండు, ఎస్11: గిండి ఆసార్ కానా - కీల్కట్టాలై మధ్య మూడు, ఎస్12 : గిండి ఆసార్ కానా - ఎన్జీవో కాలనీ మధ్య రెండు, ఎస్13: గిండి - వేళచ్చేరి మధ్య రెండు నడవనున్నాయి. అలాగే ఎస్14 : ఎస్ఆర్పీ టూల్స్-మేట్టుకుప్పం మధ్య మూ డు, ఎస్21:రామాపురం-పోరూర్ మధ్య రెం డు, ఎస్22:పోరూర్-పట్టూర్ మధ్య రెండు, ఎస్23: అయ్యప్పన్‌తాంగల్-కుమరన్ చావడి మధ్య మూడు, ఎస్24: అయ్యప్పన్‌తాంగల్ - తిరువేర్కాడు మధ్య మూడు, ఎస్25: మధురవాయల్ - వలసరవాక్కం మధ్య రెండు, ఎస్31 : వడపళణి - కోయంబేడు బస్సుస్టాండు మధ్య నాలుగు, ఎస్ 32 వడపళణి - తిరువికా పార్కు మధ్య రెండు, ఎస్ 33: అశోక్ పిల్లర్ - మెహతా నగర్ మధ్య రెండు, ఎస్41: అంబ త్తూర్ ఓటీ - మురుగప్పా పాలిటెక్నిక్ మధ్య రెండు, ఎస్ 61: మాధావరం - రెట్టేరి కూడలి మధ్య మూడు, ఎస్ 62: మూలకడై - మనలి మధ్య మూడు స్మాల్ బస్సుల్ని నడపనున్నారు. ఆయా ప్రాంతాల మధ్య ఉన్న చిన్నచిన్న కాలనీ, నగర్లను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయని జయలలిత పేర్కొన్నారు. ఈ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్‌తో సహా 27 మంది పయనించేందుకు వీలు ఉంది. కనిష్ట చార్జీగా రూ.ఐదు, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు. 610 బస్సులు కొత్తగా కొనుగోలు చేసిన 610 బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ విభాగానికి -19, విల్లుపురం డివిజన్‌కు 104 , సేలం డివిజన్‌కు 52, కోయంబత్తూరు డివిజన్‌కు 84, కుంభకోణం డివిజన్‌కు 203, మదురై డివిజన్‌కు 103, తిరునల్వేలి డివిజన్‌కు - 45 బస్సులు కేటాయించారు. అభివృద్ధి మా ఘనతే నెహ్రూ స్టేడియంలో జరిగిన బస్సుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగించారు. రవాణా సంస్థను గత డీఎంకే ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని ధ్వజమెత్తారు. వారి హయూంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ సంస్థ దివాల దశకు చేరుకుందని ఆరోపించారు. అప్పట్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ సైతం మంజూరు చేయకపోవడాన్ని బట్టి చూస్తే సంస్థను ఏ మేరకు భ్రష్టు పట్టించారో అర్థం చేసుకోవచ్చని మండి పడ్డారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక రవాణా సంస్థ బలోపేతమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నానని వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు అమ్మ మినరల్ వాటర్ బాటిళ్లను రూ.పదికే విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మరింతగా చేరువయ్యే రీతిలో స్టాల్స్ సంఖ్య పెంచనున్నామని ప్రకటించారు. ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా మరో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నామని జయలలిత వెల్లడించారు.