చెన్నైః ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అవినీతిని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగేందుకు కొత్త అన్ లైన్ సాఫ్ట్ వేర్ ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఆన్ లైన్ సేవల ద్వారా ప్రజలు తమ ఆస్తులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడినుంచైనా రిజిస్టర్ చేసుకునే సదవకాశాన్ని కల్పిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తెస్తోది. రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి, గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, మధ్యవర్తులకు లంచాలు చెల్లించాల్సిన పని లేకుండా.. స్వయంగా డాక్యుమెంట్లను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు ఆన్ లైన్ లోనే పంపే విధానాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. అందుకోసం రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విధానం పూర్తిగా కంప్యూటరీకరించడంతోపాటు, టెస్ట్ రన్ కోసం 20 వరకూ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశ పెట్టినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను తమిళనాడులోని అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రవేశ పెట్టనున్నట్లు ఆమె తెలిపారు.
కొత్త సాఫ్ట్ వేర్ లోని టెంప్లెట్ ద్వారా ప్రజలు స్వయంగా డాక్యుమెంట్లు తయారు చేసుకొని, సంబంధిత రిజిస్టర్ ఆఫీసులకు పంపించవచ్చు. పార్టీల వేలిముద్రలు, ఆధార్, మొబైల్ ఫోన్ నెంబర్లు రిజిస్టర్ ఆఫీసులకు పంపించడం ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను, తప్పుడు రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని ఆమె తెలిపారు. డాక్యుమెంట్లను సమర్పించడంతోపాటు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ లోనే చెల్లించిన అనంతరం సర్టిఫైడ్ కాపీలను పొందవచ్చని అన్నారు. ఈ కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా, ఆస్తి హక్కులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వివరాలు సైతం తెలుసుకోవచ్చన్నారు. దీనికి తోడు 228 కమర్షియల్ టాక్స్ ఆఫీసుల్లో వినియోగదారులు తమ టాక్స్ సంబంధిత పత్రాలను ఉచితంగా అప్ లోడ్ చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆన్ లైన్ లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్..
Published Wed, Aug 31 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
Advertisement
Advertisement