Online Registration
-
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై.. అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజలను కోరారు. ఈ విధానం అత్యంత సురక్షితమైంది.. పారదర్శకమైందని చెప్పారు. భౌతికంగా దస్తావేజులు ఉండవనే విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దస్తావేజులు భౌతికంగా కావాలనుకునే వారు ఇప్పుడు కూడా పొందే అవకాశం ఉందని ఆయనస్పష్టంచేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు భౌతికంగా దస్తావేజులు పొందే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి టైమ్‌స్లాట్ బుక్ చేసుకున్న వారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమకు భౌతికంగా డాక్యుమెంట్లు కావాలంటే అక్కడే వారి సంతకాలు తీసుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించామన్నారు. ఈ కొత్త విధానం గతం కంటే ఎంతో మెరుగైందని, సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డ్ 1.0 విధానం 1999లో రూపొందించారని.. అప్పట్లో ఏడాదికి రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ, భద్రత, ప్రజల సౌలభ్యం వంటి అన్ని అంశాలతో కార్డ్ 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఆటో సబ్ డివిజన్.. ఆటో మ్యుటేషన్.. కొత్త విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా అమ్మేవాళ్లు, కొనేవాళ్లు తమ వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే ఒక మోడల్ డాక్యుమెంట్ (దస్తావేజు) జనరేట్ అవుతుందన్నారు. అందులో ఇంకా అదనంగా ఏమైనా వివరాలు చేర్చాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్వే నెంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరు ఉందో చూపిస్తుందని తెలిపారు. గతంలో నాలుగు రకాల చలానాలు కట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆన్లైన్లో ఆ సర్వే నెంబర్‌కు సంబంధించి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చూపిస్తుందని.. దాన్ని వెంటనే ఆన్లైన్లోనే చెల్లించవచ్చని సాయిప్రసాద్ చెప్పారు. వ్యవసాయ భూములైతే ఈ దశలోనే సబ్ డివిజన్ అవసరమైతే ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యుటేషన్ కూడా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని, గతంలో మాదిరిగా మళ్లీ రెవెన్యూ శాఖ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో అయితే అమ్మేవాళ్లు ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలని, అప్పుడే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారని చెప్పారు. ఐటీ చట్టం మార్పుతో ఇ–సైన్లు చెల్లుబాటవుతున్నాయి ఇక గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సైతం ఇ–సైన్లు చెల్లుబాటయ్యేలా ఐటీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని సాయంప్రసాద్ గుర్తుచేశారు. ఆస్తి అమ్మేవాళ్ల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇ–సైన్ తీసుకుంటారని, సబ్ రిజిస్ట్రార్ కూడా అదే విధంగా ఇ–సైన్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను వినియోగదారులకు ఇస్తారని, అది ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా భౌతికంగా తమకు డాక్యుమెంట్ కావాలంటే వాళ్లతో సంతకాలు చేయించుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్ ఇస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేదన్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్వల్ల కూడా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని, ఐటీ రిటర్నులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్నారు. అలాగే, అనేక ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే జెనరేట్ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా అంతేనన్నారు. ఆన్లైన్ దస్తావేజులు పొందిన వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని సాయంప్రసాద్ స్పష్టంచేశారు. ఆన్లైన్ ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లూ చెయ్యొచ్చు.. ఇక గతంలో దస్తావేజులు పోతే కేసులు పెట్టి అనేక అవస్థలుపడాల్సి వచ్చేదని, కొత్త విధానంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఎప్పుడైనా ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్‌ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, భౌతికంగా దస్తావేజులు కావాలనే ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లు కూడా చేయవచ్చని, వారి స్కిల్‌ను అక్కడ కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఆటోమ్యుటేషన్ విధానం నెలరోజుల్లో మున్సిపాల్టీల్లోనూ అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కచ్చితత్వం.. పారదర్శకం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ సేవల్లో కచ్చితత్వం, పారదర్శకతను రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్లైన్ ద్వారా అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రాగా త్వరలో మరికొన్ని కీలక సేవలను ఆన్లైన్ చేయనుంది. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే వివాహ రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే నిర్దేశిత సమయంలో సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. హిందూ, ఇతర మతాల వివాహాలను ప్రత్యేకంగా రిజిస్టర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ఫీజును ఆన్లైన్లో చెల్లించి ఫాం–ఏ పూర్తి చేసి దానితో పాటుగా వెడ్డింగ్ కార్డు, వివాహ ఫొటో, ఇంటి అడ్రస్ ప్రూఫ్, దంపతుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సాక్షులతో కలిసి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్పెషల్ వివాహాల చట్టం కింద ఇతర సాంప్రదాయాల్లో జరిగే వివాహాలను ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సొసైటీలు, సంస్థల (ఫర్మ్‌లు) రిజిస్ట్రేషన్లు సులభతరం చేసి ఆన్లైన్లో వాటిని చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ‘ఈ–చిట్స్’తో మోసాలకు చెక్ చిట్‌ఫండ్ సంస్థల పేరిట జరుగుతోన్న మోసాలకు చెక్ పెట్టడానికి గాను ‘ఈ–చిట్స్’ పేరుతో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా ‘ఈ–చిట్స్’కు రూపకల్పన చేసింది. అలాగే చిట్ ఫండ్ సంస్థలు తమ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఏ చిట్‌ఫండ్ సంస్థ అయినా తమ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇప్పటికే ఉన్న చిట్‌ఫండ్ సంస్థలు కూడా తాము నిర్వహించే చిట్ గ్రూపుల సమాచారాన్ని త్వరలో ఇందులోనే అప్లోడ్ చేయనున్నారు. నోటరీల రిజిస్ట్రేషన్‌నూ ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వినతులకూ ఆప్షన్.. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ప్రజలు వినతులిచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానంలో ఎవరైనా తమ విన్నపాన్ని ఆన్లైన్లో ఉన్నతాధికారులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ వినతులను సంబంధిత విభాగాలు నిర్దేశిత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను నేరుగా ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను తామే డేటా ఎంట్రీ ద్వారా తయారు చేసుకుని, ఆన్లైన్లో అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే ఆ సమయంలో ఒక్కసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ విధానం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీలో మార్పులు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలోని లయోలా కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వీటిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లుప్రారంభమవుతున్న నేపథ్యంలో లయోలా కాలేజీలో సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన విద్యా విధానం అమలులో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులను ఒక సబ్జెక్ట్‌లో నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు మల్టీడిసిప్లినరీ విద్యను అందించేలా డిగ్రీ కోర్సులు రూపొందించామన్నారు. మేజర్ (ప్రధాన) సబ్జెక్ట్‌తో డిగ్రీలో చేరిన విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి మైనర్ (రెండో ప్రాధాన్యం) సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానిపై డిగ్రీ అనంతరం పీజీ స్పెషలైజేషన్ చేయవచ్చని తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత అనంతరం చదువు ఆపేస్తే ‘సర్టిఫికేషన్ కోర్సు’, రెండో ఏడాది తర్వాత ఆగిపోతే ‘డిప్లొమా’, మూడేళ్లు పూర్తి చేస్తే ‘డిగ్రీ’, నాలుగో ఏడాది చదివి ఉత్తీర్ణత సాధిస్తే ‘డిగ్రీ విత్ హానర్స్’ను ప్రదానం చేస్తామని వివరించారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే నాలుగో సంవత్సరం ‘రిసెర్చ్ హానర్స్’ కోర్సు చేయవచ్చని చెప్పారు. ఈ కోర్సు పూర్తిచేస్తే నేరుగా పీహెచ్డీ చేసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ పాసైన విద్యార్థులు నాలుగో ఏడాది హానర్స్ డిగ్రీని చేయవచ్చని, ఇది పూర్తిచేసిన వారు నేరుగా పీజీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మేజర్ సబ్జెక్టులు, ఇందులో 90 వరకు మైనర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డేటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ క్రైమ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, టూరిజం వంటి అనేక మైనర్ సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అభ్యసించవచ్చన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేలా డిగ్రీ కోర్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కో ర్సుల వివరాలు, సిలబస్‌ను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్–2023ను జూన్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2023 ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఫీజు చెల్లింపును మే 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేయాలి. అభ్యర్థులు https://jeeadv.ac.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. విదేశీ అభ్యర్థులు https:// jeeadv.ac.in/foreign. html ద్వారా రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు కంప్యూటరాధారితంగా నిర్వహిస్తారు. సంబంధిత పోర్టల్‌లో మాక్ టెస్టులనూ అందుబాటులో ఉంచుతారు. జూన్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచి, 11, 12 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, రిజల్స్‌ను జూన్ 18న ప్రకటిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గౌహతి సంస్థ నిర్వహించనుంది. ఈ మేరకు ఐఐటీ గౌహతి గురువారం షెడ్యూల్‌ను, సవివర బ్రోచర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు రెండు పేపర్లకూ హాజరవడం తప్పనిసరని పేర్కొంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులను (అన్ని కేటగిరీలకు సంబంధించిన వారిని) ఈ పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షలు రాసేందుకు వరుసగా రెండేళ్లు మాత్రమే అనుమతిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, తత్సమాన పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. 2021, అంతకు ముందు ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్సుడ్–2023కి దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ), రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) తదితర సంస్థలు కూడా ఈ సారి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఏపీలో పరీక్ష నిర్వహించే నగరాలు, పట్టణాలివే.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ. -
కేంద్రం తెచ్చిన స్వమిత్వ పథకం ఏంటి? ఉపయోగాలేంటి?
సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్‌గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు. పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు స్వమిత్వ పథకం అంటే... సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఉపయోగం ఏంటీ.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్.. -
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్: సీఎం జగన్
-
Covid Vaccine: సామాన్యుడికి సకాలంలో టీకా అందేనా?
‘సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ రెండో డోసు టీకా కోసం బుధవారం ఆన్లైన్లో స్లాట్‌బుక్ చేసుకున్నారు. ఆయనకు ఈ నెల ఏడో తేదీన అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీలో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో టీకా వేయనున్నట్లు ఫోన్‌కు మెస్సేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాతి రోజు బుక్ చేసుకున్న స్లాట్ కేన్సల్ అయినట్లు మళ్లీ మెస్సేజ్ వచ్చింది. సంబంధిత పీహెచ్‌సీకి వెళ్లి ఆరా తీయగా..టీకాలు స్టాక్ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. .. ఇలా శ్రీకాంత్ ఒక్కరే కాదు టీకా కోసం కోవిన్యాప్లో స్లాట్‌బుక్ చేసుకున్న అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు’. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫస్ట్ డోసు టీకా తీసుకుని, రెండో డోసు కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుంటున్న లబ్ధిదారులకు...స్లాట్‌బుకింగ్ రద్దయినట్లు మెస్సేజ్‌లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నిష్పత్తికి తగినన్ని టీకాలు పంపిణీ చేయకపోవడమే ఇందుకు కారణం. టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారు సుమారు 15 లక్షల మందికిపైగా టీకాలు వేయించుకున్నారు. వీరిలో మరో మూడు లక్షల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీ తీసుకెళ్లిన వారికి రిజిస్టర్లో పేరు నమోదు చేసుకుని టీకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది. అయితే, చాలా మందికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌పై సరైన అవగాహాన లేదు. కుంటుంబ సభ్యులకు విడివిడిగా ఫోన్లు కూడా లేవు. ఒకే నెంబర్‌తో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేస్తుండటంతో యాప్ నిరాకరిస్తోంది. ఇంటర్నెట్పై అవగాహన ఉన్న వారు స్వయంగా ఇంట్లోని కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటుండగా... అవగాహన లేని వారు సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మీసేవ నిర్వాహకులు దీన్ని అవకాశంగా తీసుకుని రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. బాధితులకు విషమ ‘పరీక్ష’ ఒక వైపు కరోనా వైరస్ నగరంలో చాపకింది నీరులా విస్తరిస్తుండగా..మరో వైపు ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కుదించడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 248 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌కు రోజుకు సగటున 150 మంది వరకు వస్తుండగా, కిట్ల కొరత వల్ల ప్రస్తుతం 50 మందికి మించి టెస్టులు చేయడం లేదు. 20 ప్రభుత్వ, 63 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా, వీటిలో రోజుకు సగటున 25 వేల టెస్టులు చేస్తున్నారు. టెస్టింగ్ కేంద్రాల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం అవుతోంది. నిజానికి 12 నుంచి 24 గంటల్లోపే ఫలితం రావాల్సి ఉన్నా...48 గంటలు దాటినా రావడం లేదు. ఫలితంగా వైరస్ సోకిన వారే కాకుండా విదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరో 1918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ( చదవండి: కరోనా వేళ.. గుంపులు గుంపులుగా జనాలు ) -
రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మే 1వ తేదీ నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. టీకా డోసు కోసం అపాయింట్మెంట్ పొందడానికి కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సెంటర్ల వద్ద రద్దీని అరికట్టడానికే రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. అయితే, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతుందని, వారు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకొని, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా వేయించుకోవచ్చని అధికారులు సూచించారు. 18–44 ఏళ్ల వయసున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ లేకుండా టీకా కోసం వస్తే అనుమతించరు. 18–44 ఏళ్లలోపు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా టీకా కోసం ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, వాటి ధర ఎంత అనే వివరాలను మే 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. అపాయింట్మెంట్ పొందే సమయంలో ఇష్టమైన టీకాను ఎంచుకోవచ్చు. 18–44 ఏళ్ల వయసువారు నిర్ణీత రుసుము చెల్లించి ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో(సీవీసీ) టీకా వేయించుకోవచ్చు. కోవిషీల్డ్ ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600 చొప్పున ధరకు విక్రయిస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక కోవాగ్జిన్ డోసును రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున ధరకు అమ్ముతామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. వయల్‌లో టీకా మిగిలిపోతే.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల రకాలు, వాటి ధరలు, నిల్వల సమాచారాన్ని ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలు కోవిన్ పోర్టల్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా అపాయింట్మెంట్ పొందినవారికే టీకా ఇవ్వాలని ప్రైవేట్ సీవీసీలకు సూచించారు. ఒక రోజులో చివరగా తెరిచిన సీసా(వయల్)లో ఇంకా డోసులు మిగిలిపోతే ఆన్సైట్ రిజిస్ట్రేషన్/అపాయింట్మెంట్లకు అనుమతి ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. ఎంతో విలువైన టీకా వృథాను కనిష్ట స్థాయికి తగ్గించాలన్నారు. -
కరోనా టీకా: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా స్వయంగా సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. 45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలని.. ధ్రువపత్రం లేనివారు రక్త పరీక్షల రిపోర్టులు, మందుల చీటీ, ఇతర ఆధారాలు చూపిస్తే.. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు అవసరమైన ధ్రువపత్రాన్ని ఇస్తారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ వేస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్సైట్లో చూడవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. చదవండి: మళ్లీ కరోనా భయం: సౌతాఫ్రికా స్ట్రెయిన్ కలకలం కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్! -
పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంతకాలంపాటు పాత పద్ధతిలోనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి స్లాట్ బుకింగ్‌తో నిమిత్తం లేకుండా పాత (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్–కార్డ్) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల విధానంలో కొత్త పద్ధతి తీసుకొచ్చాం. ఈ విధానంలో ఉన్న అనుకూలతల కారణంగా రిజిస్ట్రేషన్ల పద్ధతిలో పారదర్శకత పెరిగింది. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకొనే వీలు కల్పించాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2,599 స్లాట్లు బుక్ అవగా, 1,760 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ కోసం సేల్, మార్టిగేజ్, గిఫ్ట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్లు, జీపీఏ తదితర 23 రకాల లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాం. ఇంకో 5 రకాల సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం. బ్యాంకర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 17న బిల్డర్లు, డెవలపర్లతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో చేపట్టిన వర్క్‌షాప్‌లోనూ సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది. అయితే స్లాట్ బుకింగ్‌లను నిలిపివేయాలని, రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో ఆధార్ వివరాలు అడగొద్దని ఈ నెల 17న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని కొంతకాలంపాటు నిలిపివేస్తున్నాం. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21 నుంచి అడ్వాన్స్డ్ స్లాట్ బుకింగ్ లేకుండానే పాత పద్ధతిలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి త్వరితగతిన రిజిస్ట్రేషన్లు చేయాలి’అని శనివారం సాయంత్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయంలో సందేహాల నివృత్తి కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను సంప్రదించాలని సీఎస్ సూచించారు. 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కుగానీ, 9121220272 నంబర్‌కు వాట్సాప్ ద్వారాగానీ లేదా జటజ్ఛీఠ్చిnఛ్ఛి– జీజటటఃజీజటట. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn ను ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకొని ఉంటే... సోమవారం నుంచి కార్డ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించిన సీఎస్... ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాజా విధానం ద్వారానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్లాట్లు ఏ సమయానికి బుక్ చేసుకున్నారో ఆ సమయానికి రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను శనివారం ఉదయం నుంచే ప్రభుత్వం నిలిపివేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని కొంతకాలం నిలిపివేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించింది. దీంతో కొత్త స్లాట్ల బుకింగ్ శనివారం ఉదయం నుంచే ఆగిపోయింది. అయితే రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో శుక్రవారం వరకు బుక్ అయిన స్లాట్లకు శనివారం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు గందరగోళానికి గురికావద్దని, గతంలో బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకు వెళ్లే యోచన...! హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు శనివారమే ఉన్నతాధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ భావించినా అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆదివారం జరిగే భేటీ అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఈ కోణంలోనే హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ప్రభుత్వం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపిందని, హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని సుప్రీంకోర్టు తప్పుబట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. సర్క్యులర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ల ఐజీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శేషాద్రి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. స్లాట్ బుకింగ్‌తో అవసరం లేకుండా, ఆధార్ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ యథాతథం పాత పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ నిబంధన వర్తిస్తుందా లేదా అన్న దానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఎల్ఆర్ఎస్ నిబంధన విషయంలో మినహాయింపు లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఎల్ఆర్ఎస్ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేస్తూ సెప్టెంబర్ 8న ఆదేశాలు వచ్చాయి. అంటే సెప్టెంబర్ 8 వరకు అమల్లో ఉన్న నిబంధనలు పాటించాల్సిందే. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు ఆగస్టు 26న వచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి’అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే పాత పద్ధతి అమల్లో ఉన్నప్పుడు 6 నెలల క్రితం వరకు తీసిన చలాన్లు చెల్లుబాటు అవుతాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. -
ఆధార్ అడగొద్దు.. కులం వివరాలు కోరొద్దు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోవడంతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తెలివిగా స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ తదితర వివరాలు కోరుతోందని మండిపడింది. ఈ సమాచారాన్ని అడగబోమని హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తంచేసింది. న్యాయస్థానం పట్ల ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలని హితవు పలికింది. స్లాట్ బుకింగ్ మాన్యువల్‌లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితర వివరాలు కోరుతూ ఉన్న కాలమ్స్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అప్పటి వరకు స్లాట్ బుకింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటీఐఎన్) ఇచ్చే ప్రక్రియను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. పీటీఐఎన్ జారీకి కూడా ఆధార్ తదితర వివరాలు అడగానికి వీల్లేదని, అయితే ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి చట్టం లేకుండా ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదు చేసుకోవాలని.. అందుకు ఆధార్, కులం వివరాలు ఇవ్వాలని కోరడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, సాకేత్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. స్లాట్ బుకింగ్ కోసం 29 పేజీలను నింపాల్సి ఉందని, అందులో ఆస్తులు అమ్మే, కొనే వారి ఆధార్ తదితర వివరాలను కోరుతున్నారని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది కృతి కలగ వాదనలు వినిపించారు. ఎంతమంది ఆధార్ అడుగుతారు? ‘‘ప్రజల సౌకర్యం కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందు స్లాట్ విధానం అమలుకు అనుమతి తీసుకొని.. తప్పుడు విధానాల్లో ఆధార్, కులం వివరాలు కోరడమేంటి? రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే 29 పేజీలు నింపాల్సి వస్తోంది. ఇందులో ఆస్తులు అమ్మేవారి, కొనేవారి ఆధార్ నెంబర్లు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, కులం వివరాలు, చివరికి సాక్షుల ఆధార్ వివరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎంతమంది ఆధార్ నెంబర్లు కోరతారు? వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్, కులం వివరాలు అడగబోమని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మాన్యువల్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు 14 మంది సోదరులు ఉన్నారనుకుందాం. అందులో ఒక సోదరుడు ఆస్తి అమ్ముకోవాలంటే మిగిలిన 13 మంది ఆధార్ వివరాలు అడిగితే ఎలా? అందులో కొందరు ఇక్కడుంటారు.. ఇంకొందరు ఎక్కడో ఉంటారు. వారి వివరాలు ఇవ్వాలంటే ఎలా’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇవ్వడం ఇష్టం లేనివారి కోసం ప్రత్యామ్నాయ విధానం ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అసలు ఆధార్, కులం వివరాలు సేకరించడానికే వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఉందని చెప్పడం ఏంటంటూ ధర్మాసనం మండిపడింది. ఈ వివరాలు తొలగిస్తూ మాన్యువల్‌ను సవరిస్తామని ఏజీ హామీ ఇవ్వగా.. మీ హామీని నమ్మలేమని, సవరించిన మాన్యువల్‌ను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ధరణి వెబ్‌పోర్టల్ నిబంధనలు ఏజెన్సీ ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు వర్తించవంటూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై పిటిషనర్ తరఫు న్యాయవాది రిప్లై దాఖలు చేసేందుకు గడువునిస్తూ తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. -
నంబర్ల నారాజే అసలు సమస్య..
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధానంలో గతంలో ఉన్న విధానానికి, ప్రస్తుత విధానానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాల కారణంగానే తమ ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. గతంలో సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలు సాంకేతికంగా పెద్దగా ఇబ్బందులు పడకుండానే క్రయవిక్రయ లావాదేవీలు జరుపుకునే పరిస్థితి ఉండగా.. మారిన విధానం ప్రకారం అన్ని నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్త వుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాపర్టీ ఇండెక్స్ (టీ–పిన్) ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీ–టిన్)ల పేరిట ప్రభుత్వం అడుగుతున్న నంబర్లే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ నంబర్లతో పాటు దాదాపు 10 అంశాల్లో ఉన్న తేడాలు వారి ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ తప్పులొస్తే అంతే సంగతులు.. గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన విధానానికి, తాజాగా జరుగుతున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు చాలా తేడాలున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గతంలో డాక్యుమెంట్ రాసే క్రమంలో పొరపాటున తప్పులు జరిగినా సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేసే సమయంలో ఎడిట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి పద్ధతిలో ఒక్కసారి వివరాలు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కోసం నమోదు చేస్తే వాటిని మార్చుకునే అవకాశం లేదు. ఖాళీ స్థలాలకు ఇస్తున్న టి–పిన్, నిర్మాణాలకు ఇస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీ–టిన్)లు కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నంబర్లను గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవ్వాల్సి రావడంతో ప్రతి రిజిస్ట్రేషన్ కోసం వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ నంబర్ మంజూరు చేసే విషయంలో స్థానిక సంస్థలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసి నేరుగా ప్రభుత్వ శాఖల మధ్యనే ఈ లావాదేవీ జరిగేలా మార్పు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వారసులు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. ప్రస్తుత విధానంలో ఆ సర్టిఫికెట్ సరిపోదు. వారసులు స్థానిక సంస్థలకు వెళ్లి చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ పెట్టి టీ–పిన్ లేదా పీ–టిన్ తెచ్చుకోవాల్సిందే. ఆ నంబర్ వారసుల పేరు మీద ఉంటేనే స్లాట్ బుక్ అవుతోంది. అలాగే గతంలో రాము అనే వ్యక్తి పవన్‌కు ఆస్తి లేదా భూమి అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఆస్తి లేదా భూమి మ్యుటేషన్ కాకముందే అశోక్ అనే మూడో వ్యక్తికి అమ్ముకునే వీలుండేది. కానీ ఇప్పుడు పవన్ పేరిట రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ కూడా చేయించుకుని, అప్పుడు అశోక్‌కు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే ఉపశమనం.. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిపేందుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అధికారికంగా ఓ ఫార్మాట్ రూపొందించారు. ఆన్లైన్లో స్లాట్ బుక్కయిన తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్రంలోని ప్రజలందరికీ ఒకే విధంగా ఉండేలా రూపొందించారు. ఇక్కడే ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని గుర్తించిన అధికారులు ఈ ఒక్క విషయంలో మాత్రం ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. గతంలో స్టాంపు పేపర్ మీద డాక్యుమెంట్ రాసుకుని (ఆ డాక్యుమెంట్లో క్రయ, విక్రయదారులకు అనుకూలంగా షరతులు, నిబంధనలు పెట్టుకునే వారు) ఆ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. ఇప్పుడేమో ఆన్లైన్లో వివరాలు పూర్తి చేయాల్సి ఉన్నందున, ఆ మేర షరతులు, నిబంధనలకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ హెడ్ మీద ప్రభుత్వ లోగో ఉన్న తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తోంది. అయితే క్రయ, విక్రయదారులు కావాలనుకుంటే సొంత డాక్యుమెంట్ కూడా తయారు చేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించాలకునే వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తమకు నచ్చిన రీతిలో తెల్ల కాగితం లేదా స్టాంపు పేపర్ మీద డాక్యుమెంట్ తయారు చేసుకుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లొచ్చు. అప్పుడు ఆ డాక్యుమెంట్‌ను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ విషయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు కొంత ఉపశమనం కలిగించేలా ఉంది. తేడాలివీ.. గతంలో ఇప్పుడు ఆన్లైన్ స్లాట్ తప్పనిసరి కాదు ఆన్లైన్ స్లాట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ ఖాళీస్థలాలకు టీ–పిన్ అవసరం లేదు ఆ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్కవుతుంది నిర్మాణాలకు పీ– టిన్ అవసరం లేదు ఆ నంబర్ ఉంటేనే స్లాట్ పూర్తి తప్పొప్పులు సరిచేసుకునే అవకాశం ఉంది ఒక్కసారి డాక్యుమెంట్ వస్తే ఇక అంతే నాలా పన్ను చెల్లిస్తే సరిపోయేది నాలాతో పాటు టీ–పిన్ తప్పనిసరి చలానాకు 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యేది కాలపరిమితి ఎక్కడా చెప్పలేదు ఇంటి పన్ను, కరెంటు బిల్లు పట్టించుకునే వారు కాదు ఇప్పుడు అవి తప్పనిసరి మ్యుటేషన్ కాక ముందే ఇతరులకు అమ్ముకోవచ్చు ఇప్పుడు మ్యుటేషన్ తర్వాతే ఏదైనా జీపీఏ, ఎస్పీలు ఉండేవి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు వారసులకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉంటే చాలు వారసులకు టీ–పిన్ ఉండాల్సిందే అధికారిక లేఅవుట్లకు టీ–పిన్ అవసరం లేదు ఇప్పుడు తప్పనిసరి -
ఆధార్ వివరాలెలా అడుగుతారు?
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ వివరాలు అడగబోమంటూ ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆధార్ వివరాలను సేకరిస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మౌఖికంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈసారి సీఎస్ రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎటువంటి చట్టం లేకుండా ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల న మోదుకు కులం, ఆధార్ వివరాలు సమ ర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, సాకేత్‌లు వేర్వురుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. సబ్ కమిటీ అన్ని అంశాలపై సమీక్ష చేస్తోందని తెలిపారు. దీంతో సమీక్ష అయిన తర్వాతే ఈ పిటిషన్లను వింటామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ల దాఖలుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు. ఆధార్, కులం వివరాలు అడగరాదని ధర్మాసనం ఆదేశించినా ఇప్పటికీ ఆ వివరాలను ఇవ్వాలని ఉంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి వెల్లడించారు. అలాగే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు కోరుతున్నారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్.. మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం 100 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడ్డారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఉపసంఘం సమావేశం అనంతరం సభ్యులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో అన్ని అవరోధాలను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఇందుకోసం అధికారులను మూడు బృందాలుగా విభజించామని వెల్లడించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఓ బృందం, చట్టపరమైన ఇబ్బందులకు మరో బృందం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో బృందంగా ఏర్పడి అధికారులు పనిచేస్తారని చెప్పారు. నాలుగు కేటగిరీలుగా విభజన.. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించామని వివరించారు. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీపీఏ, ఎస్పీఏలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేల్ డీడ్లపై ఉన్న అపోహలను తొలగిస్తామని చెప్పారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు తమకు ఇబ్బంది లేని రీతిలో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. పీటీఐఎన్ అనేది యునిక్ నంబర్ అని, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, అవకతవకల్లేకుండా ఉండేందుకే దీన్ని పొందుపరిచామని చెప్పారు. ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా అన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వస్తున్న అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూసే కోణంలోనే మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ‘ఇష్యూ ట్రాకర్’ద్వారా పరిష్కరిస్తున్నామని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లే! వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశం ఇప్పట్లో తేలేలా కన్పించట్లేదు. ఈ అంశం పరిష్కారానికి సమయం పడుతుందని, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకే పరిమితం కావా లని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని అధికారులతో పేర్కొంది. సమావేశంలో భాగంగా ఎల్ఆర్ఎస్ లేని లేఅవుట్ల గురించి ప్రస్తావన రాగా, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టాలని, ఎల్ఆర్ఎస్ గురించి మరో సమావేశంలో మాట్లాడుకుందామని మంత్రులు చెప్పినట్లు సమా చారం. కాగా, ఈనెల 17న ఎంసీఆర్హెచ్ఆర్డీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వాములైన అన్ని వర్గాలతో వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లోఇబ్బందులు ఉంటాయి. వాటినిఅధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించాం. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నాతొలగిస్తాం. – వేముల ప్రశాంత్‌రెడ్డి -
ఆస్తులు రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ వరకు అన్నీ ఆన్లైన్లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది! వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సిటిజన్ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్‌కు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. ఆ తర్వాత ఫ్లాట్ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ మేర ఫీజు, మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్ అడ్వైజరీ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్సైట్ నుంచి సబ్రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్లోడ్ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్‌బుక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్హెడ్తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్‌తో పాటు మెరూన్ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ డీడ్ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది. డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు ధరణి పోర్టల్ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిస్ సంబంధిత పోర్టల్‌లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన నవంబర్ 12న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్ వేలిముద్రలు, ఐరిస్ ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలలేదు. దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఐరిస్ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్‌ను అప్డేట్ చేసుకున్నారు. అప్డేట్ చేసిన ఆధార్ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్ మ్యాచింగ్ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్ మ్యాచ్ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డీఎస్ తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82 సాక్షి, హైదరాబాద్: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్ బుక్ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ సాక్షి, నెట్వర్క్: అమావాస్య సెంటిమెంట్‌కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్‌కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్లో 1 రిజిస్ట్రేషన్ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు. అరగంటలోనే పనైంది.. నా భర్త పేరిట ఉన్న ఆర్సీసీ భవనం (బిల్డింగ్) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్ బుక్ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్‌కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు, ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ -
అమావాస్య.. ఆగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అమావాస్య కావడం, ప్రజలకు అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, అదనపు ధ్రువపత్రాలు అవసరం కావడంతో రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ తక్కువ సంఖ్య లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు 107 స్లాట్లు బుక్ కాగా, అందులో 82 మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాలతో 25 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని సమాచారం. అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని 3 నెలల తర్వాత తొలిరోజు ప్రా రంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెల్లడిస్తోంది. సర్వర్లు సహకరించలేదు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో తొలి రోజు చాలా సమస్యలు ఎదురుకావడంతో క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నా.. పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా స్లాట్ బుకింగ్ విషయంలో సర్వర్లు సహకరించలేదు. దీనికి తోడు భవనాలు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్ట్ డీడ్లకు మాత్రమే అవకాశం ఇవ్వగా, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావట్లేదు. క్రయ, విక్రయదారుల వివరాలు నమోదు చేసుకోవడం వరకే ఆగిపోయింది. స్లాట్ అప్రూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో ఉన్న ఇంటి పన్ను, కరెంటు బిల్లు నిబంధనకు తోడు పీ టిన్ పేరుతో స్థానిక సంస్థలు ఇచ్చే నంబర్‌ను నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు కన్పిస్తున్నాయి. దీంతో చాలా మంది పీ టిన్ నంబర్ లేక స్లాట్ బుక్ చేసుకోవడం కుదరలేదు. మరో సమస్య ఏంటంటే.. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరగకపోయినా.. ఆ పోర్టల్‌లో నమోదైన ఆస్తులు, భూముల వివరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ సహకరిస్తోంది. ఆ పోర్టల్‌లో నమోదు కాని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదని తొలి రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వారు చెబుతున్నారు. ఇక పాత చలాన్ల సమస్య, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి సమస్యలు, సాక్షులను మార్చుకునే అవకాశం లేకపోవడం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపు లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే డాక్యుమెంట్లు అన్నీ ఉండి, వెబ్సైట్లో పక్కాగా నమోదు చేసుకుంటే ఈ ప్రక్రియ సులభంగా ఉంటుందని, 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి ఈ–పాస్‌బుక్ కూడా చేతికి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి మరింత సరళంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరపాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం తొలి భేటీ కానుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీని ప్రభుత్వం ఆదివారమే నియమించింది. తొలి రోజుతో పాటు మంగళవారం కూడా ఎదురైన సమస్యలను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. వరుసగా నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన విధానాలను సిఫారసు చేస్తూ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితేంటి? వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు పేపర్ల అవసరం లేకపోవడంతో ఇప్పటివరకు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద డాక్యుమెంట్లు రాసుకుని జీవిస్తున్న వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఏ స్థాయిలోనూ తమ అవసరం లేకపోవడం, వివరాల నమోదు మీ సేవకు అప్పగించడంతో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిర్ణయించినట్లు సమాచారం. పాత చలాన్ చెల్లదంటున్నారు ‘రిజిస్ట్రేషన్లు నిలిచిపోకముందే నేను స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న రూ.90 వేల చలాన్ తీశాను. సెప్టెంబర్ 9 స్లాట్ ఇస్తే 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు పాత చలాన్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే అవి చెల్లవంటున్నారు. పాత చలాన్లో 10శాతం కట్ అయి ఆనుంచి 12 నెలల్లో ఆ సొమ్ము తిరిగి జమ అవుతుందని చెపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నేను రూ.90 వేలు పెట్టాలి. ఆ డబ్బులు లేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాను.’ చొక్కారపు నర్సయ్య, హన్మకొండ నా సోదరుడి వద్ద ఏడాది కిందట ఇల్లు కొన్నా. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని డాక్యుమెంట్లతో సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లా. కానీ రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇంటి నంబర్, పీటీఐ నంబర్, నల్లా, కరెంట్ బిల్లులు కావాలన్నారు. అవేమీ తీసుకువెళ్లకపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగా. – చక్కెర విజయ్‌కుమార్, సూర్యాపేట ప్రధాన సమస్యలివీ.. స్లాట్లు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి. ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతిస్తున్నారు. మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నంబర్ ఇస్తే ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. యజమాని మరణిస్తే వారి వారసుల పేర్లు నమోదు చేసే అవకాశం లేదు. బిల్డింగులు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్టు రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి. జీపీఏలకు అవకాశం ఇవ్వలేదు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వివరాలు నమోదవుతున్నా.. రిజిస్ట్రేషన్ పూర్తవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ జరగకపోతే చలాన్ మురిగి పోతోంది. గతంలో 6 నెలలు చాన్స్ ఉండేది. ఎన్వోసీ, బీఆర్ఎస్, బీపీఎస్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్, విద్యుత్‌శాఖల బిల్లు చెల్లింపుల ధ్రువ పత్రాలుంటేనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం డాక్యుమెంట్లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు. సాక్షుల పేర్లు ముందే ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తుండటంతో ఎవరైనా రాకపోతే ఇతరులను సాక్షులుగా మార్చుకొనే వీల్లేదు. పాత చలాన్లను అనుమతించట్లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్, ఈ–పాస్‌బుక్ సిటిజన్ లాగిన్‌లో కనిపించట్లేదు. -
నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న నేపథ్యంలో గత సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయగా, ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నారు. రిజిస్ట్రేషన్లు ఇలా... రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాతవెబ్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రభుత్వం కీలకమైన కొత్త అంశాలను జోడించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సబ్ రిజి స్ట్రార్ల విచక్షణాధికారాలను రద్దు చేసింది. ఆస్తి పన్నుల ఇండెక్స్ నంబర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరపనుంది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు. ఒక్కో స్లాట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 15 నిమిషాలు కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులు శని, ఆదివారాల్లో కూడా పనిచేశారు. ఎల్ఆర్ఎస్పై రాని స్పష్టత.. అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారా? లేదా ? అన్న అంశంపై స్పష్టత లేకుండానే ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునఃప్రారంభించబోతోంది. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించని అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను జరపబోమని సంబంధిత జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల విషయంలో రెండు, మూడు రోజుల్లో విధానపర నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గత శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కానీ, ఆదివారంరాత్రి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
‘ప్రైవేటు’గా సమాచార సేకరణ!
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యలు ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏకకాలంలో లక్షల కొద్దీ ఆస్తుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆలోపు ఈ పోర్టల్‌కు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న ఈ డేటాను యాప్‌లో పొందుపర్చడం గగనంగా మారింది. కొన్నిచోట్ల సిగ్నల్ అందక.. మరికొన్ని చోట్ల అసలు సిగ్నలే లేక.. ఇంకొన్ని చోట్ల బఫరింగ్‌తో యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయడం తలనొప్పిగా తయారైంది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల యాప్ నిలిచిపోయింది. యాప్ గాడినపడ్డ తర్వాత.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు పంచాయతీరాజ్‌శాఖ ‘న్యాప్’ పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చండి!) ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి కట్టడానికి సంబంధించిన డేటాను ఈ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. విజయదశమి నుంచి వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పైకప్పు ఉన్న ప్రతి కట్టడం లెక్కను సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది. అయితే, సాంకేతిక సమస్యలు చుట్టుముడుతుండడంతో నమోదు ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో యాప్‌ను పక్కనపెడుతున్న సిబ్బంది.. సమాచారాన్ని మాన్యువల్‌గా సేకరించి యాప్ గాడినపడ్డ తర్వాత దాంట్లో ఎక్కించాలని నిర్ణయించింది. యాప్ మొరాయించినందున.. ఆస్తుల నమోదును రాత్రి 9 గంటల వరకు సేకరించాలని ఎంపీవో, ఎంపీడీవోలను ఆదేశిస్తూ కొన్ని జిల్లాల కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! ఆస్తుల నమోదులో ఏ మాత్రం తప్పులు దొర్లినా కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే, ఆస్తుల నమోదుకు నిర్దేశిత గడువు సమీపిస్తుండటం.. సేకరించాల్సిన ఆస్తుల జాబితా చాంతాడంత ఉండటంతో సమాచార సేకరణకు ఇతరులను స్థానిక యంత్రాంగం రంగంలోకి దించింది. అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలేగాకుండా.. కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు వ్యక్తులను కూడా ఆస్తుల నమోదులో వినియోగించుకుంటోంది. ఇంటింటికీ వెళ్లి నిర్ణీత ఫార్మాట్లో వివరాలను సేకరిస్తున్న వీరంతా.. వాటిని కార్యదర్శులకు అందజేస్తున్నారు. కార్యదర్శులు ఆ సమాచారాన్ని యాప్‌లోకి ఎక్కిస్తున్నారు. అయితే, ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఆన్‌లైన్‌కు ‘ఆఫీసర్లు’.. లెక్క తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించిన పంచాయతీ రాజ్ శాఖ.. తాజాగా బుధవారంలోగా కొలిక్కి తేవాలని ఆదేశించింది. రివిజన్ రిజిస్టర్లో ఉన్న ఆస్తులు గాకుండా ఇప్పటి వరకు ఆస్తి పన్ను పరిధిలోకి రాని ప్రతి కట్టడం లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. గడువు కుదింపు నిర్ణయాన్ని వెల్లడించారు. (చదవండి: బడి..గుడి.. అన్నీ!) ఈ క్రమంలో గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు ఆగమేఘాల మీద ఆస్తుల లెక్క తేల్చే పనుల్లో నిమగ్నమయ్యారు. సేకరించిన ఆస్తుల వివరాలను ఇప్పటికే అందు బాటులో ఉన్న ఈ–పంచాయతీ (e-panchayat) వెబ్సైట్లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఆస్తుల ఆన్‌లైన్‌పై నాలుగైదు రోజుల్లో డీపీవోలకు శిక్షణ ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ యోచిస్తోంది. ఈ లోపు కొత్త యాప్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. పంచాయతీలకు పర్యవేక్షణాధికారులు.. ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండలాల వారీగా జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. మండల స్థాయిలోనూ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలతో కూడిన బృందాలకు గ్రామాలను కేటాయించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల ఆన్లైన్ తీరు, తప్పొప్పులు, సందేహాల నివృత్తి, డేటా సేకరణలో అనుసరిస్తున్న విధానాన్ని వీరు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. బుధవారం సాయంత్రంలోగా ఈ క్రతువును పూర్తి చేయాలని, ఎక్కడైనా ఆస్తుల నమోదు మిగిలిపోతే ఒకట్రెండు రోజులు అదనంగా తీసుకోవాలని, ఆస్తులు నమోదు కాలేదని తేలితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో చకచకా ఆస్తుల డేటా సేకరిస్తున్న కార్యదర్శులు, కారోబార్లు, పంచాయతీ కార్యాలయాల్లో కూర్చొని సమాచారాన్ని కంప్యూటీకరించడంలో తలమునకలయ్యారు. -
ప్రైవేట్ లేబొరేటరీల మాయాజాలం
♦హైదరాబాద్‌లో అదో ప్రముఖ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్. అందులో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయితే పరీక్షకు ముందు బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ చేసే పరీక్షల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు చేరడం లేదు. ♦ఖమ్మంలో ఓ ప్రైవేట్ లేబొరేటరీ ఉంది. దానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కానీ యాంటిజెన్ కిట్లను తెచ్చి పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కాపత్రం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రైవేట్ లేబొరేటరీల్లో ఇష్టారాజ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నాయి. కొన్ని కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో వాటిల్లో ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయో కూడా ప్రభుత్వ వర్గాలకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు లేవు..: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 35 డయాగ్నస్టిక్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్ నంబర్ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్సైట్లో ముందుగా అప్లోడ్ చేయాలి. తక్షణమే ఆ ఫోన్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్సైట్లో ఒక కోడ్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఆర్టీ–పీసీఆర్ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్ లేకుండా ఇచ్చే టెస్ట్ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పైగా ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారో కూడా సమాచారం బయటకు రావడంలేదు. అనుమతిలేని లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు... రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని వందలాది చిన్నాచితక లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా ప్రైౖ వేట్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అనుమతే లేదు. కానీ వాటిల్లో అక్రమంగా ఈ దందా కొనసాగుతోంది. తయారీ కంపెనీల నుంచి యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేసి పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీల్లోని కొందరు టెక్నీషియన్లకు స్వాబ్ శాంపిళ్లు తీసే శిక్షణ కూడా ఉండదు. కానీ ఏదో రకంగా శాంపిళ్లు తీసి అరగంటలోపే ఫలితం వెల్లడిస్తున్నారు. కొన్ని లేబొరేటరీలైతే ఇళ్లకు పంపించి టెస్టులు చేయిస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా నిర్వహించే కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు ప్రభుత్వ సంఖ్యలోకి రావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్ లేబొరేటరీలకు వరంగా మారింది. ఇంత జరుగుతున్నా కిందిస్థాయి వైద్య, ఆరోగ్య అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
దగ్గరుండి పని పూర్తి చేయిస్తారు..!
సాక్షి, ఆదోని: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లో పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారులకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ నెల 10న ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో 11 మంది దళారుల నుంచి రూ. 88,120, సిబ్బంది నుంచి రూ.3,100 అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకోవడం ఇందుకు అద్దం పడుతోంది. జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ఎదుట పదుల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు ప్రత్యేక దుకాణాలు తెరిచారు. వీరిలో చాలా మంది అటు అధికారులు, ఇటు క్రయ విక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ప్రమేయంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో పెద్దఎత్తున అవినీతి, అక్రమార్కులు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. అయితే.. ఈ విధానంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దాదాపు 70 శాతం రిజిస్ట్రేషన్లు మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎంతో సులువు పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సులువుగా చేసుకోవడానికి ప్రభుత్వం సరళమైన విధానం ప్రవేశ పెట్టింది. ఇంటి వద్దే సొంతంగా డాక్యుమెంట్లు రాసుకోవడానికి వీలుగా తెలుగు, ఇంగ్లిష్‌లో 16 రకాల నమూనాలను ఆన్లైన్లో ఉంచింది. ఇందులో తమకు సరిపోయే నమూనాలో వివరాలు పొందుపరిచిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టి.. రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ఇలా చేసుకోవడం వల్ల అధికారుల అవినీతికి ఆస్కారం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. ఈ కొత్త విధానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉంది. ప్రత్యేక సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు అవగాహన సదస్సులను తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. అక్రమార్జనకు బ్రేక్ పడుతుందని.. కొత్త విధానంపై ప్రజలలో అవగాహన పెరిగితే తమ అక్రమార్జనకు బ్రేక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్లే ఎక్కడా చిత్తశుద్ధితో సదస్సులు నిర్వహించలేదు. ఈ విధానం గురించి తెలియని చాలామంది క్రయవిక్రయదారులు ఇప్పటికీ దళారులను ఆశ్రయిస్తున్నారు. వారిని దళారుల అవతారమెత్తిన డాక్యుమెంట్ రైటర్లు తమ దుకాణాల్లో కూర్చోబెట్టి కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. మార్కెట్ విలువ తెలుసుకుని, బ్యాంకుకు వెళ్లి ఆ మేరకు ఫీజులు చెల్లించి చలానాలు సిద్ధం చేస్తున్నారు. డాక్యుమెంట్లు సిద్ధం చేసిన తరువాత క్రయవిక్రయదారుల సంతకాలు పెట్టించి.. కార్యాలయంలో దగ్గరుండి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయిస్తున్నారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో రాత్రికి లెక్కగట్టి..అక్రమంగా వసూలు చేసిన సొమ్మును అధికారులు, సిబ్బంది చెప్పిన చోట, వాళ్లు నియమించుకున్న వారికి అందజేస్తున్నారు. ప్రతి రిజి్రస్టేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతోంది. ప్రతి సేవకూ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అయితే ఎక్కడా నేరుగా డబ్బు తీసుకోవడం లేదు. దళారుల సాయంతోనే మొత్తం దందా సాగిస్తున్నారు. వీరి తీరు వల్ల అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి గండి పడుతోంది. -
‘నీట్’ దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) దరఖాస్తు గడువును ఈ నెల 6 వరకు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నిర్ణయించింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆరోజు రాత్రి 11.50 గంటల వరకు తెరిచి ఉంచుతామని పేర్కొంది. వాస్తవంగా 2020–21కు సంబంధించి నీట్ పరీక్ష కోసం గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ దరఖా స్తులు చేయనివారు ఇప్పుడు సమర్పించవచ్చని ఎన్టీఏ తెలిపింది. అయితే పరీక్షా షెడ్యూల్లో ఏ మార్పులూ ఉండవని తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారాలను ఈ నెల 15 నుంచి 31 వరకు సవరించుకోవచ్చు. నీట్ పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంగ్లీష్, హిందీతో సహా 11 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఎయిమ్స్, జిప్మర్ ఎంబీబీఎస్ కోర్సులలో ప్రవేశానికి కూడా నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 2,546 పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలోనూ పరీక్ష ఉంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదేస్థాయిలో విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. -
తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
యాచారం: భూరికార్డులు ధరిణి వెబ్సైట్లో నమోదు చేయడం లేదని ఓ రైతు తహసీల్దార్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైతులు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆ రైతు చేతిలో ఉన్న పురుగుల మందును లాక్కోవడంతో ప్రాణపాయం తప్పింది. యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పదేళ్ల క్రితం సర్వే నంబరు 877లో గ్రామానికి చెందిన వల్లవోతు మల్లయ్య, మైసయ్య రైతుల వద్ద ఎకరా భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ చేయించుకున్న రైతు జంగయ్య ఆన్లైన్లో నమోదు చేసుకోలేదు. కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందిస్తుండడం వల్ల ఆ డబ్బులు వస్తాయని ఆశతో ఏడాదిగా యాచారం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యవారిగూడెం రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను పలుమార్లు కలువగా స్పందన లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం సాయంత్రం రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేయడంతో రెవెన్యూ కార్యదర్శి జగదీష్ బదిలీ అయిపోతే తనకు రైతుబంధు రాదోనని ఆందోళనకు గురైన రైతు జంగయ్య శుక్రవారం ఉయం 10.30 గంటల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దే ఉన్నాడు. ఎకరా భూమి ఆన్లైన్ నమోదు చేసే విషయంలో సరైన విధంగా స్పందన లేకపోవడంతో మనుస్తాపానికి గురైన జంగయ్య సాయంత్రం 4 గంటల సమయంలో యాచారం వెళ్లి పురుగులు మందు కొనుగోలు చేసుకుని వచ్చి తహసీల్దార్ పుష్పలత ఎదుటే తన భూమి ఆన్లైన్లో నమోదు చేస్తారా... లేదా చవమంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా మూతి తీసి తాగేలోపే అక్కడే రైతులు, రెవెన్యూ సిబ్బంది గమనించి పురుగుల మందు సీసాను లాక్కొన్నారు. క్షణాల్లోనే జరిగిన సంఘటనకు ఉలికిపడిన తహసీల్దార్ రైతుపై తీవ్రంగా మండిపడుతూ చస్తారా... చస్తే భూమి ఆన్లైన్ అవుతుందా.. ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకరావాలి అంటు అన్నారు. రెండు రోజుల్లో నీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆ రైతు శాంతించి వెళ్లిపోయాడు. ఇదే విషయమై రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను సంప్రదించగా అయ్యవారిగూడెంలోని 877 సర్వే నంబరులో 10.21 ఎకరాలు భూమి ఉండగా, ఎకరా భూమి అదనంగా నమోదైందని, ఆ భూమిని తహసీల్దార్ అనుమతితో రికార్డుల నుంచి తొలగించడం కోసం ఆర్డీఓ అనుమతి కోసం పంపాను. రెండు, మూడు రోజుల్లో సరిచేస్తానని తెలియజేశాను. ఇంతలో ఆ రైతు ఆత్మహత్యయత్యానికి యత్నించడం బాదేసిందని అన్నారు. రైతు జంగయ్య రైతును ఇబ్బంది పెట్టలేదని, సాంకేతిక సమస్య వల్ల ఆన్లైన్లో ఎకరా భూమి నమోదు చేయలేదని తెలిపారు. -
నిఘా నీడలో.. ‘రిజిస్ట్రేషన్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములకు సంబంధించి రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. నిత్యం కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా.. అనే విషయాలను ఏరోజుకారోజు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుంది. జిల్లావ్యాప్తంగా 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా.. ఎవరూ మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆస్తులు అమ్మే క్రమంలో దొంగ సంతకాలు పెట్టకుండా.. నకిలీ డాక్యుమెంట్లు చూపించకుండా ఉండేందుకు.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు నిఘాను కట్టుదిట్టం చేసింది. కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు వీలు కలుగుతోంది. రాష్ట్ర శాఖకు అనుసంధానం.. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర శాఖ ఐజీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీనిద్వారా రాష్ట్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాఖలోని అధికారులు తెలుసుకునే వీలుంటుంది. ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర శాఖ కార్యాలయంలోనే పరిశీలించి.. చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల తీరును కూడా పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సీసీ పుటేజీని కూడా కట్ చేసి ఆయా వ్యక్తులకు అందజేయనున్నారు. నిత్యం నిఘా.. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండేసి చొప్పున సీసీ కెమెరాలు, ఒక టీవీ, కంప్యూటర్ను రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయించింది. టీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజీ మొత్తం ఆయా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఐజీ కార్యాలయంలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ పుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న శాఖ మరో అడుగు ముందుకేసి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. అలాగే క్రయ, విక్రయదారులు కేవైసీ(ఆధార్ నంబర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిద్వారా కంప్యూటర్లో వారి ఆధార్ నంబర్ నమోదు చేయగా.. క్రయ, విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీంతో వారు ఆ భూములు, ఆస్తులకు సంబంధించిన వారా..? కాదా..? అనే విషయాలను తెలుసుకుని రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేసే వీలు కలుగుతుంది. కేవైసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి పని పారదర్శకంగా జరిగేందుకు వీలు కలిగింది. పకడ్బందీగా నిర్వహించేందుకు.. జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాష్ట్ర శాఖ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలు కలిగింది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
ఓటరు నమోదుకు భారీగా దరఖాస్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు హక్కు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత మూడు నెలల్లో 1.90 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అందిన దరఖాస్తులే. అధికారులకు నేరుగా మరో 30వేలకు పైగా అంది ఉంటాయని అంచనా. ఈనెల 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది యువత ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అత్యధికంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి 30వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. అంతేగాక ఓటు నమోదు కోసం ఈనెల 2న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బూత్లెవల్లో క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దీని ఫలితంగానే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 80 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను (ఫారం–6) అధికారులు వడబోస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉంటున్నారా లేదా అని ఆరాతీస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఓటు హక్కు కల్పిస్తున్నారు. 1.90 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 87 వేలకుపైగా ఆమోదించారు. వీటిలో 80 వేలకుపైగా ఓటర్ల వివరాలను జాబితాలో నమోదు చేశారు. 96 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. దాదాపు ఏడు వేల దరఖాస్తులను తిరస్కరించారు. భారీగా తొలిగింపు ఓటు హక్కు తొలగింపునకు 15 వేలకుపైగా ఓటర్లు దరఖాస్తులు సమర్పించారు. పట్టణ ప్రాంత, నగర శివారు నియోజకవర్గాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చి నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఓటును జాబితా నుంచి తొలగించుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చాయని పేర్కొంటున్నారు. అంతేగాక కొందరు తమ నివాసాన్ని ఒక నియోజకవర్గం నుంచి మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మార్చి ఉండొచ్చు. ఇటువంటి వారంతా ఓటు తొలగింపునకు ఫారం–7ను అందచేశారు. ఇప్పటివరకు 10వేల పైచిలుకు ఓట్లను తొలగించారు. అలాగే పేరు, ఇంటిపేరు, నివాస చిరునామా, పుట్టిన తేదీ తదితర చేర్పులు మార్పుల కోసం 25వేలకుపైగా దరఖాస్తులు అందాయి. పోలింగ్ స్టేషన్ మార్పు కోసం 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. 22న ముసాయిదా జాబితా కొత్తగా ఓటు నమోదు, పోలింగ్ స్టేషన్ మార్పు, తొలగింపులు, చేర్పులు, మార్పుల కోసం అందిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇప్పటికే సగానికిపైగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈనెల 22న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల నాటికి జిల్లాలో 28.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరింత కొందరికి ఈ జాబితాలో చోటుదక్కే అవకాశం. ఫలితంగా జిల్లా ఓటర్ల సంఖ్య 29 లక్షల మార్క్‌ను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.