
సాక్షి, అమరావతి: హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా స్వయంగా సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. 45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలని.. ధ్రువపత్రం లేనివారు రక్త పరీక్షల రిపోర్టులు, మందుల చీటీ, ఇతర ఆధారాలు చూపిస్తే.. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు అవసరమైన ధ్రువపత్రాన్ని ఇస్తారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ వేస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
చదవండి:
మళ్లీ కరోనా భయం: సౌతాఫ్రికా స్ట్రెయిన్ కలకలం
కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!
Comments
Please login to add a commentAdd a comment