సాక్షి, అమరావతి: కరోనా వైరస్ తాజాగా ఒమిక్రాన్ బీఎఫ్–7 వేరియంట్ రూపంలో వివిధ దేశాల్లో వ్యాపిస్తోంది. మన దేశంలోనూ కొన్ని చోట్ల ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ నమోదైన కరోనా వేరియంట్‌లను ఓసారి పరిశీలిస్తే.. డెల్టా, దాని ఉప వేరియంట్ కేసులే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 9న నమోదైంది.
ఇలా ఇప్పటి వరకూ 23.39 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్‌లను పసిగట్టడం కోసం పాజిటివ్ వ్యక్తుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2021 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించిన 11,498 నమూనాల సీక్వెన్సింగ్ చేపట్టారు.
ఈ నేపథ్యంలో అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు నమోదైనట్టు తేలింది. ఈ వేరియంట్‌లలో డెల్టా దాని ఉపరకం కేసులే అత్యధికంగా 6,635 ఉన్నాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ బీ.1.1.529 వేరియంట్ కేసులు 1,669, ఒమిక్రాన్ ఉప రకాలకు సంబంధించిన వేరియంట్‌ల కేసులు 1,646 వెలుగు చూశాయి.
అలాగే అల్ఫా వేరియంట్ కేసులు 1,097 ఉండగా, బీటా వేరియంట్ కేసులు 9 వెలుగు చూశాయి. ఈ రెండు వేరియంట్‌లు కూడా 2021లో మాత్రమే వెలుగు చూశాయి. ఈ ఏడాది వీటికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
అవి ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవి..
తాజాగా 48 నమూనాలను జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షించగా.. అన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవిగా వెల్లడైంది. బీఎఫ్–7 వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, వైద్య పరీక్షలు మొదలు పెట్టింది.
అంతర్జాతీయ విమానాల్లోని రెండు శాతం మంది ప్రయాణికుల నుంచి శాంపిళ్లు తీసుకుని పరీక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా తేలితే.. ఆ నమూనాలను తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సిందిగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
ఏపీలో డెల్టా కేసులే అధికం
Published Fri, Dec 30 2022 5:40 AM | Last Updated on Fri, Dec 30 2022 7:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment