Omicron BF 7
-
అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ వస్తూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఆల్ఫా, డెల్టా అంటూ తీవ్రమైన వేరియెంట్ల రూపంలో అనేక మంది ఉసురు తీశాయి. మూడో వేవ్‌గా వచ్చిన ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదుగానీ ఇంతలోనే ఒమిక్రాన్ తాలూకు మరో సబ్–వేరియెంట్ అయిన ఎక్స్‌బీబీ 1.5 వచ్చి అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. భారత్‌లోని ఇంటికొకరు చొప్పున అమెరికాలో నివాసముంటూ... రోజూ కొన్ని లక్షల మంది యూఎస్ నుంచి ఇండియాకీ, ఇక్కణ్ణుంచి మళ్లీ యూఎస్‌కు వెళ్తూ వస్తూ, పెద్ద ఎత్తున ప్రయాణాలు సాగిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఈ సబ్ వేరియెంట్ ప్రమేయం (రెలవెన్స్) ఏమిటీ, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి జీవీ తన మనుగడ కోసం కొత్త మ్యూటేషన్స్‌తో ముందుకంటే మరింత సమర్థమైన జీవిగా పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఒమిక్రాన్ సబ్–వేరియెంట్ కూడా జన్యుపరమైన మార్పులను చేసుకుంటూ 500 కంటే ఎక్కువ రూపాలను సంతరించుకుంది. ఈ ఎక్స్‌బీబీ 1.5 కూడా ఇలాంటి ఓ కొత్త సబ్–వేరియెంటే! ఎక్స్‌బీబీ 1.5 అనే ఈ తాజా సబ్–వేరియెంట్... రెండు రకాల వేరియంట్స్ కలిసినందువల్ల, మరో కొత్త వేరియంట్ గా మారింది. అంటే... బీజే–1 (బీఏ.2.10.1.1) అనే ఒక వేరియంటూ, అలాగే బీఏ.2.75 (బీఏ.2.75.3.1.1.1) మరో వేరియెంట్ల కలయిక వల్ల ‘ఎక్స్‌బీబీ’ అనే ఈ సబ్–వేరియంట్ పుట్టుకొచ్చింది. అది మరొక మ్యుటేషన్‌కి గురికావడంతో తాజాగా తన ప్రభావం చూపిస్తున్న ఈ ‘ఎక్స్‌బీబీ – 1.5’ తయారయింది. ఈ సబ్–వేరియెంట్ పుట్టుకకు కారణమైన మ్యుటేషన్‌ని ‘ఎఫ్486పీ’ అని పిలుస్తున్నారు. దీనికి ఓ ముద్దుపేరూ ఉంది... ఎక్స్‌బీబీ 1.5కి ఓ ముద్దు పేరూ ఉంది. ‘క్రాకాన్’ అన్నది దీని పెట్‌నేమ్. అంటే ‘సముద్ర భూతం’ అని అర్థం. అయితే... ఈ నిక్–నేమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇవ్వలేదు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనికా పేరు పెట్టారు. ఇందుకో కారణం కూడా ఉంది. అదేమిటంటే... ఒమిక్రాన్‌కు ఉన్న అనేక వేరియంట్ల కంటే కూడా... ఈ ‘ఎక్స్‌బీబీ–1.5’ అన్నది మానవ వ్యాధినిరోధక వ్యవస్థను (ఇమ్యూనిటీని) తప్పించుకోవడంలో దిట్ట అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఎక్స్‌బీబీ 1.5’ సబ్–వేరియెంట్... మునుపటి వేరియంట్ల కంటే మరింత తేలిగ్గా, మరింత బలంగా ‘ఏసీఈ2 రిసెప్టార్’లతో అనుసంధానితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే వారు ఈ సబ్–వేరియంట్‌కు ‘క్రాకన్’ అనే నిక్–నేమ్ ఇచ్చారు. మనదేశంలో ఎక్స్‌బిబి 1.5 వ్యాప్తికి అవకాశమెంత? ఇప్పుడు ప్రపంచంలోని ఓ మూల నుంచి మరో మూల వరకు రాకపోకలు మామూలైపోయాయి. ప్రపంచమో పల్లెటూరుగా మారినందుకే ఇప్పుడు భూగోళాన్ని ‘గ్లోబల్ విలేజ్’ అంటూ అభివర్ణిస్తున్నారు. పెద్ద ఎత్తున పెరిగిన రవాణా, రాకపోకలూ, వలసల వంటి వాటివల్ల ఈ కొత్త వేరియంట్ అమెరికా నుంచి అన్ని ప్రాంతాలకూ, ఆ మాటకొస్తే మన దేశానికి సైతం పాకే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఒకసారి భారత్‌కు వచ్చాక మన దేశవాసులు ఈ ఎక్స్‌బిబి 1.5 తో ఎలాంటి ఇబ్బందులకు లోనవుతారనే విషయాన్ని అంచనా వేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడానికి లేదు. ఒమిక్రాన్ కారణంగా మన దేశవాసుల్లో కరోనా పట్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా వచ్చింది. అందువల్ల వేగంగా విస్తరించినప్పటికీ ఈ ‘ఎక్స్ బి బి 1.5’ మన దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పవచ్చు. అందుకే ఈ వేరియంట్ వల్ల మనదేశవాసులంతా భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ వ్యాధినిరోధక శక్తి కాస్తంత తక్కువగా ఉన్నవారు, ఇతరత్రా వ్యాధులతో ఇప్పటికీ బాధడుతున్నవారు మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? అమెరికాలోని వ్యాధుల నిపుణురాలు (ఎపిడిమియాలజిస్టు) అయిన మేరియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన అన్ని కరోనా వైరస్ల కన్నా ఈ ఎక్స్‌బీబీ 1.5 చాలా ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. అంతేకాదు ప్రస్తుతం దీని ప్రభావం అమెరికాతో పాటు మరో 29 దేశాలలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘అందువల్ల అమెరికా మాత్రమే కాకుండా మిగతా అన్ని దేశాల ప్రజలతో పాటు అమెరికా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల ప్రజలూ, విమాన ప్రయాణీకులందరూ మునపటిలాగే మాస్కులు ధరించడం వంటి నివారణ చర్యలు చేపట్టడం అవసరం’’ అంటూ ఆమె (మేరియా) పేర్కొన్నారు. ఇక గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం బూస్టరు డోసులు తీసుకోవాలంటూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచిస్తోంది. నిర్ధారణ పరీక్షలు గతంలో మాదిరిగానే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గాని రాపిడ్ టెస్టుల్లో గాని ఈ వేరియంట్ కూడా తక్కిన ఒమిక్రాన్ వేరియంట్లలా బయటపడుతుంది. ఈ వేరియంట్ లక్షణాలేమిటి? మిగతా కరోనా వేరియెంట్లు, ఒమిక్రాన్ మాదిరిగానే ఎక్స్‌బిబి 1.5 కూడా... జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు కలగజేస్తుంది. వృద్ధుల్లోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి (ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్)లోనూ, ఇప్పటికే ఇతరత్రా తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న(కో–మార్బిడిటీ)వారిలో ఈ వేరియెంట్ కాస్తంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉండవచ్చు. అంతే తప్ప మిగతా వారందరిలో ఇదో చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తగ్గిపోయే అవకాశాలే చాలా ఎక్కువ. మందులేమిటీ/ నివారణ ఏమిటి? ఈ వేరియెంట్‌కు ‘మోనోక్లోనల్ యాంటీ బాడీ’ ఇంజక్షన్లు పనిచేయవు. ఇప్పటికే భారతదేశంలో అనుమతి పొందిన ‘పాక్స్ లోవిడ్’ ట్యాబ్లెట్లు ఈ సబ్–వేరియంట్‌కి కాస్తంత సమర్థంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బై వాలెంట్ కరోనా వ్యాక్సిన్లు దీని నుంచి రక్షణ కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గతంలో మాదిరిగానే మాస్కులు ధరించడం, సబ్బుతోగానీ, శ్యానిటైజర్లతోగానీ చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఇంటినీ, పరిసరాలను డిస్–ఇన్ఫెక్టెంట్లతో తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాల్లోకి, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వేళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలను పాటిస్తే చాలు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7
కోల్‌కతా: చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమవుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తోంది. ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో నలుగురికి ఈ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయింది. అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చిన నలుగురి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. బీఎఫ్.7 వేరియంట్ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7 సోకిన వారిలో ముగ్గురు నదియా జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి బిహార్ నుంచి వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నాడు. ఈ నలుగురితో సన్నిహితంగా మెలిగిన 33 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి విదేశాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి పరీక్షిస్తున్నారు. గత వార కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఓ విదేశీయుడితో పాటు ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. జీనోమ్స్ సీక్వెన్సింగ్‌లో వారికి బీఎఫ్.7 సోకినట్లు తేలింది. ఇదీ చదవండి: Fact Check: భారత్‌లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? -
భారత్‌లోకి సూపర్ వేరియెంట్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్‌లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలికేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది. అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే అమెరికాలో గత అక్టోబర్‌లో న్యూయార్క్‌లో ఈ వేరియెంట్ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్‌వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్‌బీబీ.1.5ని సూపర్ వేరియెంట్ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’ అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్ హెచ్చరించా రు. సింగపూర్‌లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి. ఏమిటీ ఎక్స్‌బీబీ.1.5? ఒమిక్రాన్‌లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచ్చింది. బీక్యూ, ఎక్స్‌బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్‌బీబీ.1.5 వచ్చింది. ఎక్స్‌బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్‌తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు. మనకు ముప్పు ఎంత? ఎక్స్‌బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్ మోడల్లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది. లక్షణాలివే..! ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి. -
వైరస్ అలర్ట్: భారత్‌లోకి డేంజరస్ XBB.1.5 వేరియంట్ ఎంట్రీ
కరోనా వేరియంట్ల కారణంగా ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడ్డాడు. దీంతో, వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ XBB.1.5 వేరియంట్‌ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. కాగా, XBB.1.5 వేరియంట్‌ను సూపర్ వేరియంట్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. XBB.1.5 వేరియంట్ గత వేరియంట్ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరిక పరిశోధకులు చెబుతున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఈ వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లో ఎంతో మంది ఈ వైరస్ బారినపడినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. దీని విస్తరణ క్రిస్మస్ కంటే ముందుగానే ప్రారంభమైందని తెలిపారు. సింగపూర్‌లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక.. XBB.1.5 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల అమెరికాలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ వివరాలను బహిర్గతం చేయడంలేదని చైనాకు చెందిన ఎరిక్ కామెంట్స్ చేశారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 -
Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి. 2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం... మాంద్యం... ముంచుకొస్తోంది! రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది! యుద్ధం... వెన్ను విరుస్తోంది! నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది. ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది. క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు. దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది. కరోనా... వణికిస్తోంది! గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్లో చైనా మళ్లీ కొత్త వేరియంట్‌తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్‌కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది! -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
ఏపీలో డెల్టా కేసులే అధికం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ తాజాగా ఒమిక్రాన్ బీఎఫ్–7 వేరియంట్ రూపంలో వివిధ దేశాల్లో వ్యాపిస్తోంది. మన దేశంలోనూ కొన్ని చోట్ల ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ నమోదైన కరోనా వేరియంట్లను ఓసారి పరిశీలిస్తే.. డెల్టా, దాని ఉప వేరియంట్ కేసులే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 9న నమోదైంది. ఇలా ఇప్పటి వరకూ 23.39 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్లను పసిగట్టడం కోసం పాజిటివ్ వ్యక్తుల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2021 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించిన 11,498 నమూనాల సీక్వెన్సింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు నమోదైనట్టు తేలింది. ఈ వేరియంట్లలో డెల్టా దాని ఉపరకం కేసులే అత్యధికంగా 6,635 ఉన్నాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ బీ.1.1.529 వేరియంట్ కేసులు 1,669, ఒమిక్రాన్ ఉప రకాలకు సంబంధించిన వేరియంట్ల కేసులు 1,646 వెలుగు చూశాయి. అలాగే అల్ఫా వేరియంట్ కేసులు 1,097 ఉండగా, బీటా వేరియంట్ కేసులు 9 వెలుగు చూశాయి. ఈ రెండు వేరియంట్లు కూడా 2021లో మాత్రమే వెలుగు చూశాయి. ఈ ఏడాది వీటికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అవి ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవి.. తాజాగా 48 నమూనాలను జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షించగా.. అన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవిగా వెల్లడైంది. బీఎఫ్–7 వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, వైద్య పరీక్షలు మొదలు పెట్టింది. అంతర్జాతీయ విమానాల్లోని రెండు శాతం మంది ప్రయాణికుల నుంచి శాంపిళ్లు తీసుకుని పరీక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా తేలితే.. ఆ నమూనాలను తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సిందిగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. -
చైనా నుంచి వస్తే నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి. ఆ ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది. చైనా ప్రయాణికులపై అమెరికా సైతం.. 72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు. -
భయం లేదు... భయం లేదు...
చైనాలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు ప్రపంచానికి తంటాగా మారింది. ప్రత్యామ్నాయ వ్యూహ మేదీ లేకుండానే లోపభూయిష్ఠమైన కఠోర జీరో కోవిడ్ విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తేయడం అందరికీ తలనొప్పి తెచ్చిపెడుతోంది. చైనాలో వేలల్లో వస్తున్న కోవిడ్ కేసుల ఫలితంగా జనవరిలో భారత్‌లో కరోనా విజృంభణ తప్పకపోవచ్చనీ, రానున్న 40 రోజులు మన దేశానికి అత్యంత కీలక మనీ కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొనడాన్ని ఆ దృష్టితో చూడాలి. ఈ ప్రకటన ప్రజలూ, పాలకులూ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తోంది. అయితే, భారీ సంఖ్యలో కేసులు బయటపడ్డా దేశంలో నాలుగోవేవ్ రాకపోవచ్చనీ, వచ్చినా ఆస్పత్రి పాలవడాలు, మరణాలు తక్కువగానే ఉండవచ్చనీ ఆరోగ్య శాఖ చెప్పడం ఒకింత ఊరట. అలాగని చైనాలో పరిస్థితులు, జపాన్‌లో బుధవారం ఒక్కరోజులో 415 మరణాలు మనల్ని అజాగ్రత్త పనికిరాదంటున్నాయి. గత రెండు రోజుల్లో దేశంలోని వివిధ నగరాల్లో ర్యాండమ్ శాంపిల్ టెస్టింగ్‌లోనే 39 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులు పాజిటివ్‌గా తేలడం లాంటి ఘటనలు పారాహుషార్ చెబుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల ఏ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, ఇతర దేశాలు అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షించుకోక తప్పదు. చైనా వార్తలతో మన దేశంలోనూ ఉన్నత స్థాయి సమావేశాలు, అన్ని రాష్ట్రాల్లో ముందుజాగ్రత్తగా మాక్ డ్రిల్స్ చేసింది అందుకే. చైనా, జపాన్ తదితర 6 దేశాలల నుంచి భారత్‌కు వచ్చే యాత్రికులకు 72 గంటల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీకాకరణ జోరు పెంచాలి. రెండు ప్రాథమిక డోసులే వేసుకున్నవారు మూడోదైన ముందుజాగ్రత్త డోస్ (బూస్టర్ డోస్) వేసుకోవాలని వైద్యుల సూచన. ప్రపంచంలో సగటున ప్రతి 100 మందిలో 30 మందికి పైగా బూస్టర్ వేసుకున్నా, మన దగ్గర ఆ సంఖ్య 16 చిల్లరే కావడం పెరిగిన అలక్ష్యానికి చిహ్నం. కొత్తగా ముక్కులో చుక్కలుగా వేసే టీకా (భారత్ బయోటెక్ వారి ఇన్కోవాక్)కు బూస్టర్‌గా కేంద్రం అత్యవసర అనుమతి నిచ్చింది. జనవరి చివర నుంచి అలా మరో అస్త్రం చేతికి అందినట్టే! ఇప్పటికే దేశంలో అధిక శాతం మందికి గతంలో కరోనా సోకడంతో సహజ వ్యాధినిరోధకత ఉంది. టీకాలు తెచ్చిన వ్యాధినిరోధకత దానికి జత కలసి, హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చినట్టయింది. అలాగే, కరోనా మొదటి వేవ్ నాటితో పోలిస్తే ఇప్పుడు చికిత్సలో అనుభవం, కనీసం 7 టీకాలు వచ్చాయి. అప్పట్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నీ కరోనా బహిర్గతం చేయడంతో, ప్రభుత్వాల తప్పనిసరి కృషితో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వసతులు, వ్యవస్థ మునుపటి కన్నా గణనీయంగా మెరుగయ్యాయి. అందుకే, ఇప్పుడు అతిగా ఆందోళన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. చైనా దెబ్బకు మళ్ళీ టెస్టులు పెరిగే ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య కన్నా ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను కీలకమైన లెక్కగా పరిగణించాలి. అలాగే, పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టి, వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలు దేశంలోకి వస్తున్నాయేమో ఓ కంట కనిపెట్టడం, వస్తే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడమే అతి ముఖ్యం. కోవిడ్ కథ కంచికి చేరలేదు... ఇప్పుడప్పుడే చేరే అవకాశమూ లేదు. కరోనా వైరస్‌లో ఎప్పుడు ఏ కొత్త వేరియంట్ వస్తుందో ఏ శాస్త్రవేత్తలూ చెప్పలేరు కాబట్టి ఓ మాదిరి నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్లు వస్తూ, పోతూ ఉండవచ్చు. కాబట్టి ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స చేయించుకుంటూ, ప్రాథమికమైన ముందు జాగ్రత్తలతో కోవిడ్ అనారోగ్యం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. చైనాలో ఇప్పుడు కాకరేపుతున్న బీఎఫ్.7 ఒమిక్రాన్ ఉప–వేరియంట్ ఉద్ధృతి కొద్దివారాల్లో ముగిసిపోతుందని అంచనా. అలా చైనాలోని తాజా కరోనా వేవ్ ముగిసిపోతే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సామాన్య జలుబు, జ్వరం దశకు వస్తుందని శాస్త్రవేత్తల ఆశాభావం. కరోనాతో సహజీవనం తప్పదన్న మాటలను ఒకప్పుడు వెటకారం చేసినా, అది అనివార్యమని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ సుదీర్ఘకాల సహజీవనంలో ప్రపంచంలో ఏ మూల ఎప్పు డైనా కొత్త కేసులు వెల్లువెత్తవచ్చు. తాజా వేవ్‌లు విరుచుకుపడవచ్చు. ఆ ముప్పును గమనంలో ఉంచుకొని, ముందుకు సాగాలి. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ తగు సంసిద్ధతతో ఉండడమే ప్రస్తుత కర్తవ్యం. అంతేతప్ప, పొరుగునున్న మరో దేశంలో కరోనా వేవ్ వచ్చిందని వార్త వచ్చినప్పుడల్లా బెంబేలెత్తిపోతే ఉపయోగం లేదు. శాస్త్రీయ ధోరణితో కరోనాపై చర్యలు ముఖ్యం. వెరసి వ్యూహాల పునఃసమీక్షా సమయం ఇది. కేంద్రం ఎప్పటికప్పుడు చైనాలో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. పుకార్లు వ్యాపించకుండా ప్రజలకు సమాచారం అందిస్తూ, చైతన్యం తేవాలి. ప్రపంచానికి కరోనా పరిచయమై సరిగ్గా మూడేళ్ళయింది. ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న కరోనా వ్యూహాలను ఇప్పుడు ఆగి, పరిశీలించుకోవాలి. గత అనుభవాల ఆధారంగా శాస్త్రీయంగా, సాక్ష్యాధారాలపై ఆధారపడి చర్యలు చేపట్టాలి. తాజా పరిస్థితులకు తగ్గట్టు సాక్ష్యాధారాలపై ఆధారపడ్డ కరోనా పోరాట ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేసుకోవాలి. పరిశోధన, అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి టీకాలు సహా ఆరోగ్యరంగంలో బలోపేతం కావాలి. గత మూడేళ్ళుగా పాలకులు పక్కనబెట్టిన టీబీ సహా ఇతర వ్యాధుల నియంత్రణపైనా చర్యలకు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలేమో కరోనాపై స్వీయ నియంత్రణతో మాస్క్ ధారణ సహా జాగ్రత్తలను పాటించాలి. అప్రమత్తత వల్ల ఎప్పుడూ ఎంతో కొంత లాభమే. ఎంతైనా మన జాగ్రత్తే మనకు రక్ష కదా! -
జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
పీక్స్‌లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!
బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చైనా బుకింగ్ వెబ్సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. అంతమయ్యే లక్షణాలే! చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు. -
తైవాన్‌లో చైనా బల ప్రదర్శన.. చైనాలో కరోనా కరాళ నృత్యం
తైవాన్‌లో చైనా బల ప్రదర్శన.. చైనాలో కరోనా కరాళ నృత్యం -
కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే..
కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వేరియంట్లు విరుచుకుపడుతూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు వేరియంట్లు చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విజృంభించి భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి. కాగా, వైరస్ దాడి ఫోర్త్ వేవ్ రూపంలో భారత్‌పై కూడా ప్రభావం చూపనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కానున్నా.. లైట్ తీసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెనుగండం ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నదని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. గతంలో కోవిడ్ విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి మాసం మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కాబట్టి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరుతూనే కోవిడ్ రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. విదేశాల నుంచి భారత్‌లో వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ బారినపడుతున్న పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 39కి చేరింది. మొత్తం 498 విమానాల నుంచి 1780 మంది శాంపిల్స్ సేకరించారు. అందులో 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 'Month of January is critical for India', Health Minister Mansukh Mandaviya flags rise in the number of COVID cases in the country.#COVID19 #MansukhMandaviya pic.twitter.com/52CuXyaFQv — TIMES NOW (@TimesNow) December 28, 2022 -
తమిళనాడులో కరోనా టెన్షన్.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్
చైనాతో పాటుగా పలు దేశాల్లో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం అందుతోనూ చైనా నుంచి వచ్చిన వారు కరోనా బారినపడటం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, తాజాగా దుబాయ్, చైనా నుంచి వచ్చిన నలుగురుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. తమిళనాడు చెందిన నలుగురు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. చైనా నుండి శ్రీలంక మీదుగా మధురై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ లంక విమానం చేరుకుంది. అందులో 70 మంది ప్రయాణీకులు ఉండగా.. ఎయిర్‌పోర్టులో వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లీ(39), కూతురు(6)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు. A woman and her 6 y/o daughter in #Tamilnadu have been tested positive for covid-19 . Recently they arrived in Tamil nadu from #china via Srilanka #India #CovidIsNotOver #COVID19 pic.twitter.com/A21JRhEi6S — Backchod Indian (@IndianBackchod) December 28, 2022 మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. -
కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్లు, పబ్‌లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక -
కరోనా నియంత్రణకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా నియంత్రణపై రాష్ట్ర వైద్యశాఖ ముందుజాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇదే క్రమంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. మాక్‌డ్రిల్ నిర్వహణ, కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, నియంత్రణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించుకోవడమే ఈ మాక్ డ్రిల్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం. మాక్ డ్రిల్‌లో భాగంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆస్పత్రులు ఉన్నాయా.. లేదా.. అని పరిశీలిస్తారు. ఆయా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకల సామర్థ్యం, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్‌లలో కరోనా పరీక్షల సామర్థ్యం, ఆర్టీపీసీఆర్, ఆర్ఏటీ కిట్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని చూస్తారు. తప్పనిసరి మందులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు, ఇతర మందులు, సర్జికల్స్ నిల్వలను పరిశీలిస్తారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఆక్సిజన్ నాణ్యత, పైప్‌లైన్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తారు. జీనోమ్ ల్యాబ్‌కు విదేశీ ప్రయాణికులకు నమూనాలు ప్రతి అంతర్జాతీయ విమానంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న జిల్లాల డీఎంహెచ్‌వోలకు సోమవారం వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించింది. ర్యాండమ్ పరీక్షల నుంచి 12ఏళ్లలోపు పిల్లలను మినహాయించింది. రాష్ట్రంలోని గన్నవరం, విశాఖపట్నం, రేణిగుంట, కర్నూల్, కడప, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను కరోనా నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్‌లో ఉంచాలంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని, లేదా 104కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు, సూచనలు తీసుకోవాలని తెలిపింది. -
విజ్ఞానమే పరిష్కారం! చిట్కాలు కావు!
చైనాలో బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయనీ, 20 లక్షల మంది చనిపోవచ్చనీ అమెరికా నుంచి వార్తలు వండుతున్నారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ఎత్తి వేయాలని గగ్గోలు పెట్టినవాళ్లే, ఆ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ఎత్తిపొడుస్తున్నారు. నిజానికి ప్రజల ఆరోగ్య భాగ్యాలే ప్రాధాన్యతగా చైనా వ్యవహరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఒక్క చైనీయుడూ చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమైనంత తొందరలో వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడమే ఆ దేశ విధానమని ‘లాన్సెట్’ చెబుతోంది. కాబట్టి విమర్శకులు ముందు తమ ఇంటిని చూసుకోవాలి. ‘‘ఏ ప్రజా సమస్యల విషయంలోనైనా మన దృష్టిలో ఉండవలసింది ప్రజలు, వారి ఆరోగ్య భాగ్యాల సమస్య. ఈ తాత్విక దృక్కోణం ఆధారంగానే చైనా ప్రభుత్వం వ్యవహరించింది. విదేశాల నుంచి చైనా సందర్శనకు వచ్చిపోయే ఆగంతుకుల నుంచి చైనాలో ‘కోవిడ్–19’ వైరస్ వ్యాపిం చింది. అయినా కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నిరోధానికీ, నిర్మూలనకూ చైనా అన్ని చర్యలూ తీసుకుంది. ఫలితంగా ఈ విషయంలో చైనా ప్రభుత్వం వుహాన్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతిని నిలువరించి గణనీయమైన క్రియాశీల ఫలితాలు సాధించింది.’’ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రీయేసస్ ‘‘చైనాలో వైరస్ వ్యాధి విస్తరణ వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రపంచంలోనే తక్కువ. కోవిడ్–19 వైరస్ మహమ్మారి వల్ల ప్రపం చంలో అదనంగా చనిపోయినవారి సంఖ్య 1 కోటి 82 లక్షలని అంచనా. ప్రపంచవ్యాపితంగా చూస్తే ఈ వైరస్ మూలంగా ప్రతి లక్షమంది ప్రజలకు 120 మరణాలు నమోదు కాగా, అందులో 179 మరణాలు అమెరికాలో నమోదైతే – చైనాలో కేవలం 0.6 మరణాలు మాత్రమే నమోదైనాయి. చైనా అనుసరిస్తున్న విధానం ఒక్క చైనీయుడు కూడా ఈ మహమ్మారి వల్ల చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమై నంత తొందరలో కోవిడ్–19 వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడం. తద్వారా కోటానుకోట్లమంది ఆరోగ్యాన్ని, సాధారణ జీవితాన్ని, సరకులు ఉత్పత్తి క్రమాన్ని సాధ్యమై నంత వేగంగా తిరిగి నెలకొల్పడం. పశ్చిమ పసిఫిక్ ప్రాంత ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సహితం చైనా కృషిని కొనియాడారు.’’ – సుప్రసిద్ధ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘లాన్సెట్’ ‘‘కరోనా కేసుల సంఖ్యపై చైనా గోప్యత. రోజువారీ కేసుల వివరా లను ఇకనుంచీ వెల్లడించబోవటం లేదని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన 20 రోజుల్లోపే 25 కోట్ల మంది ప్రజలకు కరోనా సోకింది. దేశంలో ఆస్పత్రులలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లన్నీ కొత్తగా సోకిన బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయి. 2023వ సంవత్సరంలో చైనాలో 20 లక్షల మంది కోవిడ్‌తో చనిపోవచ్చని ఒక అంచనా. ఒక మున్సిపాలిటీలో ఒక్క రోజులోనే 5.3 లక్షల కేసులు నమోదైనట్టు సమాచారం. ఆ లెక్కల్ని ఆన్లైన్లో అధికారులు తొలగించేశారు.’’ – అమెరికా నుంచి విడుదలైన (25.12.22) ఒక వార్త ఇలాంటి ‘వార్తలు’ ఇలా విడుదలవుతూ ఉండగానే సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ ఈనాటి భారత పాలకులు విడుదల జేస్తున్న కొన్ని ఆంక్షలపై ఒక చరుపు చరుస్తూ కార్టూన్ (26.12.22) వేశాడు. ‘అక్కర్లేదు. నేవెడుతున్నది ఒక పెళ్లి కార్యక్రమానికి గానీ, నోరు మూసుకుని పడుండే పార్లమెంటుకు కాదు సుమా’ అని వ్యంగ్యాస్త్రం విసిరాడు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ టెక్నికల్ సలహా సంఘ అధినేత ఎన్.కె. అరోరా ‘భారతదేశంలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు ‘అదుపు’లోనే ఉన్నాయి గానీ, అప్రమత్తత మాత్రం అవసర’మని చెబుతూ, ‘ఇలాంటి అంటువ్యాధుల్ని అరికట్టడం అసలు సాధ్యమా? వ్యాక్సిన్లు పని చేస్తున్నట్టా, లేనట్టా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే గాదు, ‘ఇలాంటి మహమ్మారిని అరికట్టడం అసాధ్యం. ఫలితంగా కొన్ని చోట్ల వ్యాధి తీవ్రత ఎక్కువ కావొచ్చు, మరికొన్ని చోట్ల తక్కు వగా ఉండొచ్చు, అంతే తేడా’ అని అరోరా అన్నారు. ఆధునిక శాస్త్ర వైజ్ఞానిక దృష్టితో వైరస్ క్రిములను అరికట్టే విధానాన్ని జయప్రదమైన ప్రయోగాలతో నిరూపించిన శాస్త్రవేత్త, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ భౌతికవాద శక్తి లూయీ పాశ్చర్! ఇంతటి వైజ్ఞానిక ప్రగతి బాటల్ని విస్మరించి పాలకులూ, కొన్ని వ్యాపార పత్రికలూ ఏ అమెరికా నుంచో విడుదలయ్యే చౌక బారు కథనాలను భుజాన వేసుకుని ప్రజా బాహు ళ్యాన్ని గందరగోళపర్చడం ఒక ఆనవాయితీగా మారింది. అంతేగాదు, ఏనాడో భారతదేశంలో దేశ వైద్య పరిషత్ ఖరారు చేసిన శాస్త్రీయ నిర్ణయాలను, ఆదేశాలను పక్కనపెట్టి, వ్యాపార సరళిలో ప్రయివేట్ మందుల కంపెనీలతో మిలాఖత్ అయ్యి, భారత మెడికల్ కౌన్సిల్ అప్పజెప్పిన సాధికారిక ఆదేశాలను పెక్కుమంది వైద్యులు, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు విస్మరించడంవల్ల – దేశ ఆరోగ్య వ్యవస్థే ప్రయివేట్ వ్యాపార ధోరణికి అలవాటు పడి పోయింది. అందుకే భారత మెడికల్ అసోసియేషన్, దేశీయ డాక్టర్లకు వంద రకాల ప్రశ్నలను సంధించి, సుమారు 81 శాతం మంది డాక్టర్ల నుంచి సమాధానాలు రాబట్టింది. వారిలో 37 శాతం మంది మెడికల్ కంపెనీల ప్రతినిధులతో వారానికి ఒకసారి సంభాషిస్తామని చెప్పగా, 25.9 శాతం మంది నెలకు రెండుసార్లయినా చర్చిస్తామని చెప్పారు. కాగా, 69.1 శాతం మంది డాక్టర్లు మాత్రం ప్రయివేట్ వైద్య కంపెనీల ప్రతినిధులు తమకు ఇవ్వజూపే మందుల ప్రయోజనాలను అతిగా చూపుతూ, సదరు కంపెనీల మందులవల్ల కలిగే ఇబ్బందుల్ని గురించి తక్కువగా చెబుతున్నామని తెలిపారు. ఇటు 63 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ కంపెనీల నుంచి తమకు స్టేషనరీ సామాను, మందుల శాంపిల్స్, కంపెనీల తాలూకు జర్నల్స్ ఉచితంగా అందుతున్నాయని వెల్లడించగా, ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో గానీ, వాటి ప్రతినిధు లతోగానీ మాట్లాడే సందర్భాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి భారత వైద్య పరిషత్ నిర్ణయించిన జాగ్రత్తలను, హెచ్చరికలను 70.4 శాతం డాక్టర్లు బొత్తిగా చదవలేదని రుజువైంది. ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో చర్చల్లో వైద్యులు పాటించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఎదుర్కోవలసిన శిక్షలు కూడా వైద్యులకు తెలియక పోవడం మరీ ఆశ్చర్యకరం. 2014 నాటికే భారత వైద్యమండలి నిర్ణ యించిన నైతిక ప్రమాణాలు, ఫార్మా కంపెనీలతో పాలకుల లోపాయి కారీ ఒప్పందాల ఫలితంగా మరింత దిగజారిపోతూ వచ్చాయి. కాగా, ఇంత దిగజారుడు ప్రవర్తన మధ్య కూడా 58 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రలోభాలకు లొంగడం ‘అనైతిక ప్రవర్తన’గా ప్రకటించడం సంతోషకరం. అర్ధ సత్యాలతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితులలో గమనించ వలసిన విషయం ఏమిటంటే, కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ‘ఎత్తి వేయాలని’ గగ్గోలు పెట్టిన విదేశీ పాలకులే (భారతదేశం సహా), ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ‘ఎత్తిపొడుపు’ మాటలు వల్లించడం ఎలాంటి ‘నీతో’ సంతృప్తికరంగా వివరించ గలగాలి. లూయీ పాశ్చర్ అన్నట్టు ‘మానవ ఆరోగ్య రక్షణకూ, క్రిముల సంహారానికీ ప్రాథమిక గ్యారంటీ – శాస్త్ర విజ్ఞా నమేగానీ చిట్కాలు కావు’! అందుకే కవి పెరుగు రామకృష్ణ అంటాడు: ‘‘జీవితమే వ్యాపా రమై పోయిన వ్యవస్థలో/ రోజూ మరణించడం/ మళ్లీ రోజూ బతకడం/స్నానమయ్యాక గుడ్డలు తొడుక్కున్నట్టే!’’ ఎందుకీ పరిస్థి తుల వైపు మన దేశం పరుగెడుతోందన్న ప్రశ్నకు నివృత్తిగా విశ్వకవి టాగూర్ ప్రార్థనను మరొక్కసారి విందాం: ‘నన్ను ప్రార్థించనీ/ ప్రమాదాల నుంచి రక్షించమని కాదు/ ధైర్య సాహసాలతో ఎదుర్కొనే శక్తిని/ కలిగించమని ప్రార్థించనీ/ నన్ను కోరుకోనీ/ నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు/ కష్టనష్టాలను అతి తేలిగ్గా భరించగల/ శక్తిని కోరుకోనీ/ నన్ను ఆశించనీ, నా జీవిత పోరాటంలో మిత్రుల సహకారాన్ని/ దిగ్విజయం పొందడానికి నా సొంత శక్తిని ఆశించనీ/ నన్ను అర్థించనీ/ ఆతు రతతో భయపడి రక్షణ కోసం కాదు/ నేను నా స్వాతంత్య్రాన్ని సిద్ధించుకోవడానికి శక్తి సామర్థ్యాలు అర్థించనీ/ ఓ ప్రభూ!/ నాకు కలిగే దిగ్విజయాలలో మాత్రం నీ కరుణా/ కటాక్షాలను స్మరించే పిరికివానిగా చేయకు/ పరాజయాలలో నీ చేయూత అర్థించనీ!’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు Abkprasad2006@yahoo.co.in -
రికవరీకి అవకాశాలు
ముంబై: గతవారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, ట్రేడింగ్‌కు సంబంధించి ఈ ఏడాదికి ఇదే ఆఖరి వారం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. కావున భారీ లాభాలైతే కనిపించకపోవచ్చు. ప్రపంచ పరిణామాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చైనాతో పాటు పలుదేశాల కోవిడ్ కేసుల నమోదు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో గతవారంలో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ‘సాధారణంగా ప్రతి ఏడాది చివరి రోజుల్లో ఫండ్ మేనేజర్లు ఖాతాల్లో సర్దుబాట్లు చేస్తుంటారు. అందులో భాగంగానే గతవారంలో లాభాల స్వీకరణ జరిగింది. సూచీలు భారీగా దిగివచ్చిన నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చు. రికవరీ జరిగితే నిఫ్టీకి 18,000 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,700 స్థాయిలో తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోతే 17400 వద్ద మరో మద్దతు స్థాయి లభించొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7 ఆందోళనలు చైనాతో పాటు పలు కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసుల నమోదు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్‌పై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ.., కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లపై ఈ రకం వేరియంట్ కేసలు నమోదు ప్రభావం స్వల్పకాలం పాటు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ► ఆర్థిక గణాంకాలు చైనా, జపాన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వరుస మంగళ, బుధవారాల్లో విడుదల కానున్నాయి. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం, భారత నవంబర్ ద్రవ్యలోటు శుక్రవారం వెల్లడి కానున్నాయి. అదేరోజున ఆర్బీఐ డిసెంబర్ 23 తేదీన ముగిసి వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 16వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ► ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(డిసెంబర్ 30న) నిఫ్టీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,500–17,800 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ► రెండు లిస్టింగులు, రెండు పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది ఆఖరి వారంలో రెండు ఐపీఓలు రాను న్నాయి. అలాగే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న రెండు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నా యి. గతవారంలో (23న) ప్రారంభమైన రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ మంగళవా రం ముగిస్తుంది. షాలీ పాలీమర్స్ ఇష్యూ డిసెంబర్ 30–జనవరి 22 తేదీల మధ్య జరగనుంది. కేఫిన్ టెక్నాలజీస్ లిస్టింగ్ గురువారం ఉండగా, ఎలిన్ ఎలక్ట్రానిక్స్ షేర్ల లిస్టింగ్ శుక్రవారం ఉంది. -
కొత్త వేరియంట్ ప్రభావం భారత్‌పై తక్కువే
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు. గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. -
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. రెండు రోజుల్లో ఎంత మందిని కలిశాడు!
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వైరస్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో, అధికారులు సదరు వ్యక్తికి టెస్టులు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న భారత్‌కు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, బాధితుడు చైనా నుంచి రావడంతో సదరు ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది వెంనే ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు.. సదరు యువకుడి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా అయితే నిర్ధారణ అయ్యింది కానీ.. వారికి యువకుడికి ఏ వేరియంట్ సోకిందో తెలియదు. దీంతో, అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
China: కరోనా కల్లోలం.. చైనాలో 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా
బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం నానాటికీ ఉగ్ర రూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి జీరో కొవిడ్ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటి నుంచీ ఒమిక్రాన్ వేరియంట్లు దేశమంతటా కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. డిసెంబర్ 1–20 తేదీల మధ్య కనీసం 25 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి లీకైన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది! దాంతో రోగులతో ఆస్పత్రులు, శవాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. వాటిపై భారం తగ్గించేందుకు ఇంటర్నెట్ ఆస్పత్రి సేవలను ప్రభుత్వం అనుమతించింది. వీలైనంత వరకూ ఆన్లైన్లో వైద్య సాయం పొందాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసర కరోనా మందులకు చాలాచోట్ల తీవ్ర కొరత నెలకొంది. దాంతో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి! సిబ్బందికీ కరోనా! చైనాలో పలు నగరాల్లో సగటున రోజుకు లక్షకు పై చిలుకు చొప్పున కేసులు వెలుగు చూస్తున్నాయి! తూర్పున షాన్డాంగ్ ప్రావిన్సులో క్విండావో నగరంలోనైతే రోజుకు ఏకంగా 5 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారని నగర హెల్త్ కమిషన్ చీఫ్ బో తావో చెప్పారు! మున్ముందు పరిస్థితి మరింత విషమించేలా కన్పిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. దక్షిణాదిన గువాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో డాంగువాన్ నగరంలోనూ రోజుకు 3 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో చాలావరకు వృద్ధులేనని తెలుస్తోంది. మరోవైపు చాలాచోట్ల వైద్య సిబ్బంది కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డట్టు సమాచారం. అయినా ఒకవైపు చికిత్స తీసుకుంటూనే వారంతా విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
మళ్లీ కరోనా ఆంక్షలు పెట్టిన కేంద్రం
మళ్లీ కరోనా ఆంక్షలు పెట్టిన కేంద్రం -
China Corona: అంత్యక్రియలకు కూడా చోటు లేక..
కరోనా పుట్టుకకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేల.. ఇప్పుడు అదే వైరస్‌తో మరణమృదంగాన్ని చవిచూస్తోంది. వైరస్ బారిన పడి జనాలు కోకొల్లలుగా మరణిస్తున్నారు. ఐసీయూలన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అయినవాళ్ల అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో కాకి లెక్కలు చెప్తోంది!. దేశంలో ఇప్పటిదాకా నమోదు అయిన కరోనా కేసులు.. 3,97,195. మరణాల సంఖ్య 5,241. కోలుకున్న వాళ్ల సంఖ్య 3,50,117. ఇది చైనా ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కలు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో మూడేళ్ల పాటు.. వైరస్‌ను కట్టడి చేయగలిగిన చైనా, జన జీవనంతో ఆటాడుకుంది. అయితే ఆ పాలసీ బెడిసి కొట్టింది. వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టకపోవడం, అందుకు సంబంధించిన పరిశోధనలు సజావుగా సాగకపోవడంతో.. కొత్త వేరియెంట్లు విరుచుకుపడ్డాయి. చివరికి.. చేసేది లేక చేతులెత్తేసింది ప్రభుత్వం. ప్రపంచానికి ఘనంగా పరిచయం చేసుకున్న జీరో కొవిడ్ పాలసీ ఘోరంగా బెడిసి కొట్టింది. అధికారంగా ఫస్ట్ వేవ్‌ను ఎదుర్కొంటోంది ఆ దేశం. అదీ ప్రపంచంలో ఏ దేశం కరోనాతో ఇంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొలేనంత దారుణంగా!. అత్యధిక జనాభా ఉన్న దేశంలో.. కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్ప్రతుల్లో కరోనా బాధితులకు బెడ్స్ దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లకు చికిత్స అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్తున్న ఆంబులెన్స్‌లు.. ఆస్పత్రుల నిరాకరణతో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరణాలూ సంభవిస్తున్నాయి. బీజింగ్ నైరుతి భాగంతో పాటు నగరాలు, పలు పట్టణాల్లో ఎమర్జెన్సీ వార్డులు ఇసుకేస్తే రాలనంత జనం క్యూకడుతున్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటిదాకా కేవలం ఏడుగురు మాత్రమే కరోనాతో చనిపోయారని ప్రకటించుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ, పేషెంట్లు కిక్కిరిసిపోవడంతో పాటు మరణాలు అంతే వేగంగా సంభవిస్తున్నాయని అక్కడి ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కథనాలు ప్రచురిస్తున్నారు. కరోనా సోకిన వాళ్లు న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తేనే.. అది కరోనా మరణం కిందకు వస్తుందంటూ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఇదంతా మరణాల లెక్కలను దాచేందుకు చేస్తున్న ప్రయత్నం అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వైరస్ సోకి.. చికిత్సలో మరణిస్తున్నా కూడా అది కరోనా మరణాల కిందకు రావడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు కూడా. కేవలం ఆక్సిజన్ సరఫరాకు మాత్రమే కాదు.. కరెంట్ సరఫరా కూడా కొరత నడుస్తోంది చైనాలోని పలు ప్రావిన్స్‌లో. చైనా ప్రకటించుకున్న మరణాల లెక్క తప్పని చెప్పే మరో ఉదాహరణ. జువోజూ ప్రావిన్స్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని గావోబెయిడియాన్‌లోని స్మశానానికి.. బీజింగ్ నుంచి శవాల వాహనాలు క్యూ కడుతున్నాయి. కానీ, నిర్వాహకులు మాత్రం పది రోజుల పాటు వేచి చూడాలని చెప్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో.. వాహనాల్లోనే ఐస్‌బాక్సుల్లో శవాలను ఉంచుతున్నారు. ఎంతో మంది చనిపోతున్నారని చెప్తున్నాడు ఆ వాటికలోనే పని చేసే జావో యోంగ్షెంగ్ అనే వ్యక్తి. రాత్రింబవలు పని చేస్తున్నా.. తమ పనిని పూర్తి చేయలేకపోతున్నామని వాపోతున్నాడతను. చైనాలో అత్యధిక జనాభా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంది. కరోనా సోకదనే ధైర్యం.. ఒకవేళ సోకినా రోగనిరోధక శక్తి ద్వారా ఎలాగోలా నెట్టుకు రావొచ్చు.. అన్నింటికి మించి ప్రభుత్వం కఠినంగా అమలు చేసిన లాక్డౌన్ వల్ల నానా ఇబ్బందులు వాళ్లను తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ‘‘ఈ దశలో మనం(భారత్) ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, చైనా తీవ్రత చూసైనా మేలుకుందాం. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉందాం. అత్యవసరంగా వ్యాక్సినేషన్లో పాల్గొనండి. మాస్క్ ధరించడం, అనవసర ప్రయాణాలను తప్పించడం.. తగు జాగ్రత్తలు పాటిస్తేనే.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అంతా సురక్షితంగా ఉండొచ్చు అని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా చెప్తున్నారు. -
దేశంలో మరో లాక్డౌన్ అక్కర్లేదు: ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
న్యూఢిల్లీ: పొరుగు దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. మన దగ్గర మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. అయితే.. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ తరుణంలో.. ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ గనుక విజృంభిస్తే.. భారత్‌లో మరోసారి లాక్డౌన్ విధిస్తారా? అనే చర్చ తెర మీదకు వచ్చింది. అఫ్కోర్స్.. కేంద్రం ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చనే సంకేతాలను ఇప్పటికే పంపింది కూడా. ఈ తరుణంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, భారత్‌లో కరోనా కల్లోలాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. భారత్‌లో కరోనా ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో.. లాక్డౌన్ పెట్టడంగానీ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడం లాంటి చర్యలు అసలు అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత అనుభవాలను పరిశీలిస్తే.. విమానాల నిషేధం ఎలాంటి ప్రభావం చూపించలేదు. వైరస్ వ్యాప్తిని ఆ నిర్ణయం అడ్డుకోలేకపోయింది. అన్నింటికి మించి చైనాను కుదిపేస్తున్న వేరియెంట్.. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది కూడా. ఒకవేళ.. భారత్‌లో అత్యధికంగా కేసులు నమోదు అయినా, ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ అధికంగా నమోదు అయ్యింది. అలాగే.. వైరస్ సోకి తగ్గిపోయిన జనాభా కూడా అధికంగానే ఉంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగింది అని పల్మనాలజిస్ట్ అయిన గులేరియా తెలిపారు. ఇలాంటి పరిస్థితులన్నింటిని గనుక పరిగణనలోకి తీసుకుంటే లాక్డౌన్ ప్రస్తావనే అక్కర్లేదు అని అన్నారు. మరోవైపు చైనా సహా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న దేశాల నుంచి వస్తున్న విమానాలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాకపోతే.. ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఎయిర్ సువిధా ఫామ్‌లో ఆరోగ్య స్థితిని తెలియజేయడంతో పాటు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్ -
Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్‌కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
కోవిడ్ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
Covid-19 Fourth Wave: చైనాలో కరోనా కల్లోలం.. ‘మనకు ముప్పు లేదు’
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎఫ్.7 చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తూండడంతో కేంద్రం అప్రమత్తమై కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే చైనాతో పోల్చుకుంటే మనకు ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్‌ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు. మనకి ఫోర్త్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం... కరోనా వ్యాక్సినేషన్ భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా జరిగింది. కరోనా సోకిన తొలి రోజుల్లో కేంద్రం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూసింది. అత్యధికులు రెండు డోసుల్ని తీసుకుంది. అక్టోబర్ నాటికి 220 కోట్ల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. మనం అధికంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎక్కువ మంది తీసుకుంటే, చైనా అచేతన వైరస్‌తో తయారు చేసిన కరోనా వాక్, సినోఫామ్ వ్యాక్సిన్లు ఇచ్చింది. కరోనా వేరియెంట్లను ఎదుర్కోవడంలో ఇవి విఫలమవుతున్నాయని అంటున్నారు. అత్యధికులకు కరోనా కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి భారత్‌లో ఇప్పటి వరకు 4.5 కోట్ల కేసులు నమోదయ్యాయి. కరోనాలో ఉన్న అన్ని వేరియెంట్లు దాదాపుగా భారత్‌లో వ్యాపించడంతో ప్రజలందరిలోనూ ఈ వేరియెంట్లను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి బలపడింది. అదే చైనాలో ఇప్పటివరకు ఏ వేరియెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో అధిక శాతం ప్రజల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు ఉత్పన్నం కాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ సెప్టెంబర్ నుంచే బీఎఫ్.7 కేసులు మన దేశంలో ఒమిక్రాన్ ఉపవేరియెంట్ బీఎప్.7 కేసులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చాయి. కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పటికే భారత్‌లో తొలి వేవ్ 2020 ఆగస్టు–సెప్టెంబర్‌లో సార్స్–కోవ్–2తో చాలా ఇబ్బందులు పడ్డాం. 2021 ఏప్రిల్–మే నెలల్లో సెకండ్‌వేవ్‌లో డెల్టా వేరియెంట్ దేశాన్ని వణికించింది. మందులకి, ఆక్సిజన్‌కి కరువు వచ్చి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావాన్నే చూపించింది. అందుకే ఈ సబ్ వేరియెంట్ ఏమంత ప్రభావం చూపించదని ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసులు ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించారు. జనాభాలో 28% మందివరకు బూస్టర్ డోసులు తీసుకున్నట్టు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. చైనాలో 50% మంది బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది తీసుకోలేదు. వారికే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. మన దేశంలో ప్రజలు కూడా బూస్టర్ డోసులు తీసుకుంటే మంచిదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంత్ సూచించారు. బూస్టర్ డోసు వేరే కంపెనీది తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితేమిటి? మన దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి సగటున 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదే మిగిలిన ప్రపంచ దేశాల్లో రోజుకి సగటున 5.9 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వేరియెంట్లు అన్ని దేశాలపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఎక్స్ఎక్స్బీ వేరియెంట్‌తో మన దేశంలో కేసులు 8% నుంచి ఒకానొక దశలో 69శాతానికి చేరినప్పటికీ ఆ తర్వాత వ్యాప్తి తగ్గిపోయింది. నవంబర్ 10న అత్యధికంగా 4,500 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వేరియెంట్ కూడా ప్రమాదకరం కాదని తేలిపోయింది. -
పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అప్పటివరకు జాగ్రత్తలు పాటిస్తే మార్చి నుంచి ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ మేరకు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి మహమ్మారి (పాండెమిక్) దశ నుంచి స్థానికంగా సోకే (ఎండెమిక్) వ్యాధి దశకు తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే అది కొన్ని దేశాల్లోనే వెలుగుచూస్తోందని, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని పాటించారని... సుమారు 70 శాతం మందికి టీకాలు వేయలేదని... వ్యాక్సినేషన్లో చైనా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు పాటి స్తే సురక్షితంగా ఉండొచ్చన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో ప్రజలు మాస్క్‌లు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. దేశంలో కేవలం 28 శాతం మందే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలినవారు వెంటనే తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్ తీసుకోవాలని, ఏడాదైనా పరవాలేదని.. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. వరుసగా మూడేళ్లపాటు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్నారు. బీఎఫ్–7 ప్రమాదకరం కాదు... ‘దేశంలో ఒమిక్రాన్ రకానికి చెందిన ఎక్స్‌బీబీ వైరస్ 80 శాతం ఉంది. బీఎఫ్–7 వేరియంట్ అక్టోబర్‌లోనే భారత్‌లోకి వచ్చింది. కానీ 10 కేసులే నమోదయ్యాయి. అది పెద్దగా మనపై ప్రభావం చూపలేదు. హైదరాబాద్‌లో ఎక్స్‌బీబీ వైరస్ కేసులు 60 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్‌లో బీఎఫ్–7 కేసులు ఎక్కువగా ఉన్నాయి. బీఫ్–7 వైరస్ ఒకరికి వస్తే వారి ద్వారా 10 మందికి వ్యాపిస్తుంది. అదే ఒమిక్రాన్ ఒకరికి వస్తే ఐదుగురికి వ్యాపిస్తుంది. బీఎఫ్–7 డెల్టా అంత ప్రమాదకరమైంది కాదు. బీఎఫ్–7 రకం వైరస్ గొంతు, నోటి వరకే వెళ్తుంది. రోగనిరోధకశక్తి తక్కువున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ వెళ్లే ప్రమాదముంది. వారికి సీరియస్ అయ్యే అవకాశముంది’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్... ‘దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. రెండు కోవాగ్జిన్... ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. మూడోది కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్. ఇది పెపిటైట్ ఆధారిత టీకా. ఈ ఏడాది జనవరిలోనే కార్బెవ్యాక్స్ వచ్చింది. జూన్‌లో దానికి బూస్టర్‌గా అనుమతి లభించింది. కార్బెవ్యాక్స్ చాలా సురక్షితమైనది. వ్యాక్సిన్లను దశలవారీగా వేర్వేరు కంపెనీలవి వేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ వేసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనిపై మేం అధ్యయనం చేశాం. కార్బెవ్యాక్స్ 95 శాతం సామర్థ్యంతో కూడినది. దీన్ని వేసుకుంటే కరోనా గురించి మనం మరిచిపోవచ్చు. ఇతర వ్యాక్సిన్లతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
చరిత్రలో అతిపెద్ద వైరస్ సంక్షోభం తలెత్తనుందా?
ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ సంక్షోభానికి చైనా వేదిక కానుందా?.. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అవుననే అంటున్నారు అంతర్జాతీయ వైద్య నిపుణులు. ఒక్క రోజులో మూడున్నర కోట్ల మంది వైరస్ బారిన పడొచ్చని భావిస్తున్నారు. అదీ ఈ వారంలోనే సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక దేశంలో.. ఒక్కరోజులో ఈ స్థాయిలో వైరస్ కేసులు నమోదు అయ్యింది లేదు. తద్వారా.. అతిపెద్ద వైరస్ వ్యాప్తికి డ్రాగన్ కంట్రీ వేదిక కానుందన్నమాట. ఇక చైనాలో కరోనా కల్లోలం ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. జీరో కోవిడ్ పాలసీ దారుణంగా బెడిసి కొట్టి.. జనాలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే 24 కోట్ల మందికిపైగా (అంటే దేశ జనాభాలో 18 శాతం) గత ఇరవై రోజుల్లోనే వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు చైనా జాతీయ హెల్త్ కమిషన్ బుధవారం నిర్వహించిన అంతర్గత సమావేశం ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ నుంచి ప్రమాదకరమైన వేరియెంట్లు పొక్కుతుండడంతో.. సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు అక్కడి జనం ప్రయత్నిస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌లో ఇప్పటికే సగం జనాభా వైరస్ బారిన పడింది. రాజధాని బీజింగ్ సైతం కరోనా కేసులో అల్లలాడిపోతోంది. -
పండగల సీజన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
-
మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరి: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిడ్ కొత్త వేరియెంట్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్.. వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచిస్తూనే.. న్యూఇయర్ వేడుకలు, పండుగల సీజన్ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ నెల 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపింది. MoHFW directs all States/UTs to focus on 'Test-Track-Treat &Vaccination' and adherence of COVID19 appropriate behaviour of wearing mask, maintaining hand hygiene and physical distancing, considering the upcoming festival season and new year celebrations pic.twitter.com/YiNrXKe6mW — ANI (@ANI) December 23, 2022 -
Covid Variant BF.7: కరోనా కొత్త వేరియంట్‌తో వారికే ముప్పు ఎక్కువ!
కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ.. ఆ మహమ్మారి మళ్లీ జడలు విప్పనుందా? అనే ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్– 7 సబ్ వేరియంట్ పాజిటివ్ కేసులు గుజరాత్, ఒడిశాల్లో నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. – గాంధీఆస్పత్రి ►రాష్ట్రంలో ఈ కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవచ్చనే అవగాహన ప్రజల్లో కలి్పంచేందుకు వైద్య, ఆరోగ్య శాఖలు సన్నద్ధమవుతున్నాయి. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెబుతున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్– 7ను.. బీ అంటే బీకేర్‌ఫుల్.. ఎఫ్ అంటే ఫాస్ట్‌గా వ్యాపించేది అనే అర్థంతో సరిపోల్చుతున్నాయి. బీఎఫ్ వేరియంట్ ప్రభావం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు ఇలా వివరించారు. ►రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిపై బీఎఫ్– 7 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు, రుగ్మతలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ►చిన్నారుల్లో ఎక్కువగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధకశక్తి ) శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లను అడ్డుకుని వాటిని నాశనం చేస్తుంది. నిలోఫర్ ఆస్పత్రిలో ఇటీవల జరిపిన సర్వేలో చిన్నారుల్లో యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయిదేళ్ల లోపు చిన్నారులకు మాస్క్ వినియోగించకూడదు. మాస్క్ వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గే అవకాశం ఉంది. ►పోస్ట్ కోవిడ్ రుగ్మతలైన బ్లాక్‌ఫంగస్, పక్షవాతం, అవయవాలు సరిగా పని చేయకపోవడం వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుల సలహా మేరకే యాంటీబయోటిక్ మందులు వాడాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం, హ్యాండ్ శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధనలు, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొవచ్చు. బీఎఫ్– 7 వైరస్ లక్షణాలు ఇవే.. ఒమిక్రాన్ బీఎఫ్– 7 సబ్ వేరియంట్ లక్షణా లను వైద్య నిపుణులు స్పష్టం చేశారు. జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, కాళ్లు, చేతులు గుంజడం, తలనొప్పి, నీరసం, డీహైడ్రేషన్, ఆ యాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. గ్రేటర్లో బూస్టర్ డోస్ డౌన్‌ఫాల్.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం. మూడు జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 2.11 కోట్ల మంది కోవిడ్ వ్యా క్సిన్ తీసుకున్నారు. వీరిలో 99.2 లక్షల మంది ఫస్ట్‌డోస్, 89.4 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోగా, కేవలం 23 లక్షల మంది మాత్రమే బూస్టర్‌డోస్ తీసుకోవడం గమనార్హం. బూస్టర్‌డోస్ తప్పనిసరి వ్యాక్సిన్ ప్రభావం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది, రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలి. రోజులు పెరుగుతున్న కొద్ది వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోతుంది. శరీరంలోని యాంటిబాడీస్ ప్రొటెక్ట్ చేయకపోవడంతో వైరస్ ప్రవేశిస్తుంది. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు మరింత అప్రమత్తంగా ఉండాలి –రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి తొంభై శాతం చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధకశక్తి ఉంది. మొదటి మూడు వేవ్స్‌లో డెల్టా, ఒమిక్రాన్ వైరస్లు చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయిదేళ్లలోపు చిన్నారులకు ఫీవర్‌కు పారాసిటమాల్, కోల్డ్‌కు నాజిల్ డ్రాప్స్, అయిదేళ్లు దాటితే కాఫ్ సిరప్లు ఇవ్వవచ్చు. పుట్టుకతోనే పలు రకాల రుగ్మతలున్న చిన్నారుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. – ఉషారాణి, నిలోఫర్ సూపరింటెండెంట్ -
చైనాలో కరోనా బీభత్సం .. రోజుకి 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు !
బీజింగ్: చైనాలో జీరో కోవిడ్ విధానం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్.7 విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో ప్రస్తుతం ప్రతి రోజూ 10 లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయని, 5 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది. ఈ సంఖ్య రానురాను మరింతగా పెరిగిపోతుందని జనవరిలో రోజువారీ కేసులు 37 లక్షలకు చేరుకుంటాయని, మార్చి నాటికి కరోనా మరింతగా కోరలు చాచి ప్రతీ రోజూ 42 లక్షల కేసులు నమోదవుతాయని ఎయిర్ఫినిటీ సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది. చైనాలో వివిధ ప్రావిన్స్‌ల నుంచి వస్తున్న కేసుల వివరాలకు జిన్‌పింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకు పొంతన లేదని ఎయిర్ఫినిటీ సంస్థ విమర్శించింది. జిన్‌పింగ్ ప్రభుత్వం కరోనా కేసుల్ని బాగా తక్కువ చేసి చూపిస్తోందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో రోజుకి 14 లక్షల కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు చైనాలో రోజుకి 30 లక్షలు కేసులు నమోదు కావడం సాధారణమేనని ఆ నివేదిక గుర్తు చేసింది. చైనా ప్రభుత్వం లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3 వేల కేసులు నమోదైతే, ఒక్కరు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోలేదు. మరోవైపు చైనాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయని, కరోనా పరీక్షలు చేయడం కూడా సాధ్యం కాక ప్రభుత్వం చేతులెత్తేసిందని బ్లూమ్‌బర్గ్ వంటి మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరేవారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉంటున్నారు. వైద్య సిబ్బంది కరోనాతో బాధపడుతూనే తమ విధుల్ని నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఒ ఆందోళన చైనాలో కరోనా పరిస్థితిపై జిన్‌పింగ్ ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జ్వరం మందులకి కూడా కొరత ఏర్పడిందని తెలిపింది. చైనా ఇప్పటికైనా కచ్చితమైన డేటా వెల్లడించి కరోనా కట్టడికి పరిష్కార మార్గాలు చూడాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయేసస్ హితవు పలికారు. కరోనా రోగులకు మందులు కూడా దొరకకపోవడంతో వారంతా సహజసిద్ధమైన చికిత్స విధానాలపై మళ్లుతున్నారని, నిమ్మకాయలు, విటమిన్ సి అధికంగా ఉన్న పళ్లు తింటూ ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
కోవిడ్ కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ లక్షణాలివే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 చైనాను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందిని చుట్టేస్తోంది. ఈ కొత్త వేరియంట్ భారత్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌గా ఉన్నప్పటికీ చైనా పరిస్థితులను చూస్తే ఈ కొత్త వేరియంట్ అంశం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ బీఎఫ్.7 లక్షణాలేంటి? ఆ వైరస్ సోకితే ఎలా గుర్తించాలి? ► భారత్‌లో కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నాలుగు వెలుగుచూశాయి. గుజరాత్లో మూడు, ఒడిశాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ► బీఎఫ్.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఛాతి పైభాగం, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► కొంత మందిలో పొట్ట సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. వాంతులు, విరేఛనాల వంటివి కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ► బీఎఫ్.7 వేరియంట్ విషయంలో తీవ్రంగా అనారోగ్యానికి గురుకావటం అనేది జరగటం లేదు. లక్షణాలు లేకుండానే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ నుంచి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7ను చైనా, భారత్‌తో పాటు అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ గుర్తించారు. చైనా మినహా ఇతర దేశాల్లో ఈ వేరియంట్ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం ఊరటనిస్తోంది. ఇదీ చదవండి: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు -
ఇక ఆఫీసుల్లోనూ మాస్క్‌లు తప్పనిసరి!
బెంగళూరు: చైనా నుంచి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ భారత్‌లో విజృంభించే అవకాశాల నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దాదాపుగా అంతటా మాస్క్ తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పలు దేశాల్లో ప్రధానంగా పొరుగు దేశం చైనాలో కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. బీఎఫ్.7 ప్రభావంతో కరోనా కేసులు, మరణాలతో చైనా ఆగం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక కర్ణాటక ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండోర్ లొకేషన్స్, క్లోజ్డ్ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఏసీ గదులున్న ప్రాంతాల్లోనూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లు, ఆఫీసుల్లోనూ మాస్క్ మస్ట్ కానుంది. అలాగే.. జలుబు లక్షణాలు కనిపించినా, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తినా.. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక వైద్యారోగ్య శాఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి.. సీఎం బొమ్మైకి నివేదిక సమర్పించింది. పాజిటివ్ పేషెంట్ల శాంపిల్స్‌ను జీనోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. -
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. కొత్త వేరియంట్‌పై అనుమానాలు!
గాంధీనగర్: చైనాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 విజృంభణపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే, మూడు రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్తకు పాజిటివ్‌గా తేలగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. అతడి నమూనాలను గాంధీనగర్‌లోని పరిశోధన కేంద్రానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. భావ్‌నగర్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ తన వ్యాపార నిమిత్తం ఇటీవలే చైనాకు వెళ్లారు. డిసెంబర్ 19 భారత్‌కు తిరిగివచ్చారు. కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ ఆదేశించారు. దీంతో భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. చైనాతో పాటు విదేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని రెండ్రోజుల క్రితం లేఖ రాశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. కోవిడ్ మార్గదర్శకాలను పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించటం, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలన్నారు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
చైనాలో భయానక పరిస్థితులు.. జిన్‌పింగ్ సర్కార్ కీలక నిర్ణయం!
డ్రాగన్ కంట్రీ చైనాను కరోనా వైరస్ వేరియంట్స్ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో చైనాలో ఆసుప్రతులు పూర్తిగా పేషెంట్స్‌తో నిండిపోయాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ను అడ్డుకుని, పేషెంట్స్ రికవరీ కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు.. పలు సిటీల్లో ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ అందిస్తున్నారు. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోవడంతో స్పెషల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడంతో పాలుగా మందుల తయారీ, సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఇక, వైరస్ వ్యాప్తితో బీజింగ్, వుహాన్, షెంజెన్, షాంఘై నగరాల్లో స్ధానిక ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి. మరోవైపు.. జీరో కోవిడ్ పేరుతో కఠిన నియంత్రణలను సడలించిన అనంతరం చైనాలో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చైనా ఆసుపత్రుల్లో శవాల గుట్టలు పేరుకుపోయాయనే వార్తలు బయటం రావడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా.. చైనా ప్రభుత్వం, మీడియా మాత్రం దేశంలో కోవిడ్ మరణాలు సంభవించలేదని అధికారికంగా పేర్కొంది. దీంతో, కరోనా తీవ్రత, మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చైనాలో క్రిస్మస్, న్యూ వేడుకల నేపథ్యంలో పాజిటివ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, మంగళవారం చైనాలో 3,89,306 కేసుల్లో కరోనా లక్షణాలు గుర్తించామని అధికార వర్గాలు తెలిపాయి. Emergency room of a hospital in #Tianjin City of China… #COVID #chinacovid #COVID19 #coronavirus #China #CovidIsNotOver #CovidIsntOver pic.twitter.com/SC24pnmDZO — Jyot Jeet (@activistjyot) December 22, 2022 -
కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!
జెనీవా: చైనాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభణతో వచ్చే మూడు నెలల్లో దేశ జనాభాలోని 60 శాతం మంది వైరస్‌బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు సూచించారు. వైరస్ బారినపడే అవకాశం ఉన్న వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వారాంతంలో నిర్వహించే మీడియో సమావేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కోవిడ్ విజృంభణతో చైనాలో తలెత్తుతున్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, ఐసీయూల అవసరం వంటి వివరాలు సమర్పించాలి. దేశవ్యాప్తంగా వైరస్ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా నిలుస్తుంది. క్లినికల్ కేర్, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు మా మద్దతు కొనసాగుతుంది.’ - డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ 2020 నుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది చైనా. జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది. అయితే, ప్రజాగ్రహంతో ఎలాంటి ప్రకటన చేయకుండానే డిసెంబర్ తొలినాళ్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది బీజింగ్ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: Lockdown: కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ.. -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు