చైనాతో పాటుగా పలు దేశాల్లో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం అందుతోనూ చైనా నుంచి వచ్చిన వారు కరోనా బారినపడటం ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా, తాజాగా దుబాయ్, చైనా నుంచి వచ్చిన నలుగురుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. తమిళనాడు చెందిన నలుగురు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది.
చైనా నుండి శ్రీలంక మీదుగా మధురై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ లంక విమానం చేరుకుంది. అందులో 70 మంది ప్రయాణీకులు ఉండగా.. ఎయిర్‌పోర్టులో వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లీ(39), కూతురు(6)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.
A woman and her 6 y/o daughter in #Tamilnadu have been tested positive for covid-19 . Recently they arrived in Tamil nadu from #china via Srilanka #India #CovidIsNotOver #COVID19 pic.twitter.com/A21JRhEi6S
— Backchod Indian (@IndianBackchod) December 28, 2022
మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment