Corona New Variant
-
Corona: మళ్లీ కోవిడ్.. భయమెంతవరకు..?
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 16 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ (గురువారం) నమోదైన కేసుల సంఖ్య 1013 గా తెలుస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 609 కేసులు నమోదైనట్లు సమాచారం. కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరణాలపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఇప్పటివరకూ చూస్తే,దేశంలో మొత్తంగా 3368 యాక్టివ్ కేసులు వున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని, కేసుల తీరును గమనిస్తే అత్యధిక కేసులు కర్ణాటకలో, అత్యల్పంగా ఉత్తరాఖండ్ లో నమోదై వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 189, కేరళలో 154 కేసులు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ వైరస్ వ్యాప్తి మొదలైంది. ఈ జె.ఎన్ -1 వేరియంట్ ను 'వేరియంట్ అఫ్ ఇంట్రెస్ట్' ప్రపంచ ఆరోగ్య సంస్థగా (WHO) అభివర్ణిస్తోంది. ఈ వేరియంట్ లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ముప్పు శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య సంస్థ ధైర్యాన్ని అందిస్తోంది. అదే సమయంలో, రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేస్తోంది.జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) నెల రోజుల క్రితం దేశంలోని మూడు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాప్తిలో వుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలకు పాకింది. దీనిని మనం గమనంలో ఉంచుకోవాలి. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే.గతంలో, కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం.ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, తగిన చర్యలు ప్రారంభించింది. కాకపోతే! చలికాలం,పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళ, కర్ణాటకలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇది మంచి పనే. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు.ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది.ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం! కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు.ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే, ప్రభుత్వం, నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు,సిబ్బంది కొరత లేకుండా చూడాలి.యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. ఐనా! యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది.అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం,భౌతిక దూరం పాటించడం,గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం,శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం,యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం,నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో వ్యక్తి మృతి
-
తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల కలకలం
-
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్‌కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
రాష్ట్రంలో మరో తొమ్మిది కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన 1,245 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా తొమ్మిది కోవిడ్ –19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 68 నమూనాలకు సంబంధించి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ప్రస్తుతం 27 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏకంగా 8 హైదరాబాద్ జిల్లాకు చెందినవి కాగా...ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదైంది. -
కోవిడ్ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్ సమీక్ష
-
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్‌వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్‌వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్‌లు అవసరం లేదు కానీ... మాస్క్‌లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
కరోనా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
-
కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్-1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. Centre issues advisory to States in view of a recent upsurge in COVID-19 cases and detection of first case of JN.1 variant in India. States urged to maintain a state of constant vigil over the COVID situation. States to report & monitor district-wise SARI and ILI cases on a… pic.twitter.com/NpS1wAQLM8 — ANI (@ANI) December 18, 2023 -
Covid-19: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. చదవండి: కోవిడ్ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే -
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
తెలంగాణలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు.. దేశంలోనే టాప్-2
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 344కి చేరుకుంది. ఈ వేరియంట్ వైరస్ అధిక వ్యాప్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీవ్రతను ఇంకా నిర్ణయించలేదని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ సోకినవారు ఇప్పటివరకు తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడేవారు మాస్‌్కలు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో మంగళవారం 5,122 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..వారిలో 23 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 52 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 190 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
Covid XBB 1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. నాలుగో వేవ్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‌ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే. ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్ -
COVID-19: చైనాలో కరోనా కేసులు ఏకంగా 90 కోట్లు!
బీజింగ్: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్–19 వైరస్ బారినపడ్డారు. పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు వర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కరోనా సోకింది. యునాన్ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్ ప్రభావానికి గురయ్యారు. చైనాలో కొత్త సంవత్సరం ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది జనం పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధుల నిపుణుడొకరు హెచ్చరించారు. కరోనా కొత్త వేవ్ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ అధిపతి జెంగ్ గువాంగ్ తెలిపారు. -
భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు లేవు.. భయాందోళన వద్దు.. కానీ..!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లేమీ వెలుగు చూడలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లు ప్రమాదకరం ఏమీ కాదని, రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాలేదని స్పష్టం చేసింది. ఈమేరకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా తెలిపారు. కరోనా వేరియంట్ల గురించి ఆందోళన లేనప్పటికీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహిరిస్తోందని అరోరా స్పష్టం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు. అందుకే ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా లేదని కేంద్రం వివరించింది. అనేక నమూనాలను పరీక్షించినా కొత్త వేరియంట్లు కన్పించలేదని చెప్పింది. వచ్చే వారం కూడా కేసులు పెరిగే సూచనలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ కరోనా జగ్రత్తలు పాటిస్తేనే మంచిదని సూచించింది. చదవండి: ఆయిల్ పైప్ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం -
40 రోజులు.. 200 కోట్ల ప్రయాణాలు
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్ యున్’లూనార్ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి మొదలైన ‘చున్ యున్’వేడుకల 40 రోజుల సమయంలో చైనీయులు దేశ, విదేశాల నుంచి సొంతూళ్లకు 200 కోట్ల ప్రయాణాలు సాగించనున్నట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5% ఎక్కువని, 2019 ప్రయాణాల్లో 70.3% అని చైనా రవాణా శాఖ తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస సందర్భంగా పేర్కొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి చైనీయులు కొత్త ఏడాది ఉత్సవాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో ఈసారి భారీగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా మొదలయ్యే లూనార్ కొత్త ఏడాది ఉత్సవాలు 40 రోజులపాటు కొనసాగుతాయి. జనమంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశం కోవిడ్‌తో సతమతమవుతుండగా, కోట్లాదిగా జనం రాకపోకలు సాగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కేసులు పెరిగితే, ఆస్పత్రుల్లో సరిపడా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేవని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కోవిడ్ పరీక్షలను నిలిపివేసి చికిత్సలు, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు బాధితులకయ్యే చికిత్స ఖర్చులో 60% తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. జనరిక్ కరోనా టీకా పాక్స్‌లోవిడ్‌ను చైనాలో తయారు చేసి, పంపిణీ చేసే విషయమై ఫైజర్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. -
బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం
బీజింగ్: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్‌లో కోవిడ్ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్‌లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్ వెంటెలేషన్తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు. జీరో కోవిడ్ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్ప్రావిన్స్లోని షావోయాంగ్ కౌంటీ, అన్హుయీ ప్రావిన్స్‌లోని షాయూగ్జియాన్ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్‌లోని క్వింగ్యాంగ్ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ బుధవారం హితవుపలికారు. -
కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7
కోల్‌కతా: చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమవుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తోంది. ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో నలుగురికి ఈ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయింది. అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చిన నలుగురి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. బీఎఫ్.7 వేరియంట్ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7 సోకిన వారిలో ముగ్గురు నదియా జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి బిహార్ నుంచి వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నాడు. ఈ నలుగురితో సన్నిహితంగా మెలిగిన 33 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి విదేశాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి పరీక్షిస్తున్నారు. గత వార కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఓ విదేశీయుడితో పాటు ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. జీనోమ్స్ సీక్వెన్సింగ్‌లో వారికి బీఎఫ్.7 సోకినట్లు తేలింది. ఇదీ చదవండి: Fact Check: భారత్‌లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? -
కరోనా XBB వేరియంట్ గుప్పిట్లో భారత్.. ముప్పు తప్పదా?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది. ‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్. ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి -
కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: చైనాలో కొత్త ఏడాదిలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరనుంది. ఈ నెల 13వ తేదీ కల్లా రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని, మరో 10 రోజుల తర్వాత రోజుకు 25 వేల కరోనా మరణాలు సంభవిస్తాయని యూకేకు చెందిన అధ్యయన సంస్థ ఎయిర్ ఫినిటీ తెలిపింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చైనాలో కరోనాతో రోజుకు 9 వేల మంది చొప్పున చనిపోతున్నారని తెలిపింది. జనవరి చివరి నాటికి చైనాలో 5,84,00 కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఏప్రిల్ కల్లా కోవిడ్‌తో మృతుల సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి మరో విడత విజృంభణతో రోజుకు 42 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. -
భారత్‌లోకి సూపర్ వేరియెంట్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్‌లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలికేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది. అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే అమెరికాలో గత అక్టోబర్‌లో న్యూయార్క్‌లో ఈ వేరియెంట్ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్‌వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్‌బీబీ.1.5ని సూపర్ వేరియెంట్ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’ అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్ హెచ్చరించా రు. సింగపూర్‌లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి. ఏమిటీ ఎక్స్‌బీబీ.1.5? ఒమిక్రాన్‌లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచ్చింది. బీక్యూ, ఎక్స్‌బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్‌బీబీ.1.5 వచ్చింది. ఎక్స్‌బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్‌తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు. మనకు ముప్పు ఎంత? ఎక్స్‌బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్ మోడల్లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది. లక్షణాలివే..! ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి. -
పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా?
వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5(సూపర్ వేరియంట్) ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ సూపర్ వేరియంట్ కారణమవుతున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్7తో పాటు ఎక్స్‌బీబీ.1.5 సూపర్ వేరియంట్‌పై ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం ఎక్స్‌బీబీ వేరియంట్‌గా పేర్కొన్నారు మిన్నేసోటా వర్సిటీ నిపుణులు డాక్టర్ మిచెల్ ఓస్టెర్హోమ్. అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలోని 7 రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో బీఏ.2, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ1.5ల కారణంగా 44.1 శాతం కేసులు నమోదయ్యాయి. తొలికేసు భారత్‌లోనే.. ఎక్స్‌బీబీ వేరియంట్‌ను తొలుత భారత్‌లోనే ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. కొద్ది రోజుల్లోనే భారత్‌తో పాటు సింగపూర్‌లో ఈ వేరియంట్ వేగంగా విస్తరించింది. ఇది ఎక్స్‌బీబీ.1, ఎక్స్‌బీబీ1.5 వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు వేరుగా ఉన్నాయని, దీంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు జాన్ హోప్కిన్స్ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఎక్స్‌బీబీ.1.5 వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? ఎక్స్‌బీబీ1తో పోలిస్తే ఎక్స్‌బీబీ1.5 శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకోవటమే కాదు, రోగనిరోధక శక్తిని దాటుకుని కణాల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలాగే కీలక గ్రాహకాల ద్వారా కణాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుని హెచ్చరించారు. ఎక్స్‌బీబీ ఉప రకాలు పుట్టుకస్తున్న కొలది ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గిపోతుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో పాటు ఒకసారి సోకినవారికి సైతం మళ్లీ సులభంగా అంటుకుంటుందని వెల్లడించారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 ఇదీ చదవండి: భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్ -
వైరస్ అలర్ట్: భారత్‌లోకి డేంజరస్ XBB.1.5 వేరియంట్ ఎంట్రీ
కరోనా వేరియంట్ల కారణంగా ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడ్డాడు. దీంతో, వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ XBB.1.5 వేరియంట్‌ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. కాగా, XBB.1.5 వేరియంట్‌ను సూపర్ వేరియంట్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. XBB.1.5 వేరియంట్ గత వేరియంట్ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరిక పరిశోధకులు చెబుతున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఈ వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లో ఎంతో మంది ఈ వైరస్ బారినపడినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. దీని విస్తరణ క్రిస్మస్ కంటే ముందుగానే ప్రారంభమైందని తెలిపారు. సింగపూర్‌లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక.. XBB.1.5 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల అమెరికాలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ వివరాలను బహిర్గతం చేయడంలేదని చైనాకు చెందిన ఎరిక్ కామెంట్స్ చేశారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 -
New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నయా సాల్ వైపు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హుషారుగా సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త సంవత్సరారంభంలోనే పాత శత్రువు నేనున్నానంటూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో గతానుభవాలను మర్చిపోకుండా స్వాగత సంబరాలను ఆస్వాదించడం అవసరం అంటున్నారు నిపుణులు. గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా జీతమిచ్చే పని దగ్గర నుంచీ జీవితాన్ని రంజింపజేసే వేడుకల దాకా అన్నింటికీ ఇల్లే చిరునామాగా మారింది. కోవిడ్ పుణ్యమాని ఇంట్లో గడిపే సమయంతో పాటు ఇంట్లోనే విందు వినోదాలు చేసుకునే అలవాటు పెరిగింది. కాబట్టి వీలున్నంత వరకూ బంధుమిత్రులను కలుపుకొని ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మంచిది. అవుట్ డోర్.. నగరంలోని హోటల్స్, పబ్స్, క్లబ్స్ వంటి చోట్ల న్యూ ఇయర్ ఈవెంట్లు చాలా వరకూ నాలుగు గోడల మధ్యనే జరుగుతాయి. పూర్తి ఎయిర్ కండిషన్డ్ హాల్స్, అంతంత మాత్రం వెంటిలేషన్ తప్పదు. అంతేకాకుండా సామర్థాన్ని మించి అతిథులు కిక్కిరిసిపోయే అవకాశాలూ ఎక్కువ. అలాంటి చోట్ల వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకూ అవుట్ డోర్ ఈవెంట్లనే ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలున్న 60ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు.. ఈ భారీ సమూహాలతో జరిగే ఈ వేడుకలకు దూరంగా ఉండాలి. నిర్వాహకులూ.. జాగ్రత్తలూ.. తాము తీసుకోవడంతో పాటు 2 డోస్‌ల వ్యాక్సినేషన్, అలాగే బూస్టర్ డోస్ కూడా తీసుకున్న సిబ్బందినే వేడుకల నిర్వాహకులు అతిథుల కోసం వినియోగించడం మంచిది. రద్దీ, తోపులాటల నివారణకు గాను ఒకటి కంటె ఎక్కువగా బహుళ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. హాజరయ్యేవారు తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి. దీని కోసం నో మాస్్క, నో ఎంట్రీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈవెంట్లకు దగ్గరలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచడం కూడా మంచిదే. పరిమితాహారం.. అమితారోగ్యం.. అవసరాన్ని బట్టి మాస్‌్కలు, శానిటైజర్స్ వెంట తీసుకువెళ్లాలి. సాధ్యమైనంత వరకూ సామాజిక దూరం పాటించాలి. వైరస్ ఇన్ఫెక్షన్కు గురి కాకుండా ఉండేందుకు రోగనిరోధకతను కోల్పోకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. దీనికోసం ఇలాంటి వేడుకల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మితాహారం తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే మద్యం తీసుకునే అలవాటు ఉంటే కూడా నియంత్రించుకోవాల్సిన అవసరముంది. ఇటీవల చాలా మందికి ఫుడ్ ఎలర్జీలు బాగా పెరిగాయి. ఫుడ్ ఎలర్జీలు చాలా చేటు చేస్తాయి. కాబట్టి విభిన్న రకాల ఆహారపదార్ధాలు వడ్డిస్తారు. ఏది పడితే అది తినకుండా ఉండడం మేలు. – డా.బి.గౌరీశంకర్, ఎస్ఎల్జీ ఆసుపత్రి కూల్ వెదర్.. టేక్ కేర్... ఇప్పుడు నగరంలో బాగా చల్లటి వాతావరణం ఉంది. దీనివల్ల ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు నగరవాసుల్ని వెంటాడుతున్నాయి. దీనికి తోడుగా కొత్త కరోనా వేరియంట్ వస్తోంది అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. వీలైనంత వరకూ భారీ సమూహాలు ఉండే చోటికి వెళ్లకపోవడం మంచిది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి భారీ జనసమూహాలకు దూరంగా ఉండడం మంచిది. అవసరాన్ని బట్టి డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. వైరస్ ముక్కు నుంచే వెళుతుంది కాబట్టి కొత్తగా వచి్చన ముక్కు ద్వారా తీసుకునే వైరస్ నిరోధక డ్రాప్స్ వాడడం చాలా మేలు చేస్తుంది. -డా.కె.శివరాజు, కిమ్స్ ఆసుపత్రి చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్ -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
తమిళనాడులో కరోనా టెన్షన్.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్
చైనాతో పాటుగా పలు దేశాల్లో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం అందుతోనూ చైనా నుంచి వచ్చిన వారు కరోనా బారినపడటం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, తాజాగా దుబాయ్, చైనా నుంచి వచ్చిన నలుగురుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. తమిళనాడు చెందిన నలుగురు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. చైనా నుండి శ్రీలంక మీదుగా మధురై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ లంక విమానం చేరుకుంది. అందులో 70 మంది ప్రయాణీకులు ఉండగా.. ఎయిర్‌పోర్టులో వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లీ(39), కూతురు(6)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు. A woman and her 6 y/o daughter in #Tamilnadu have been tested positive for covid-19 . Recently they arrived in Tamil nadu from #china via Srilanka #India #CovidIsNotOver #COVID19 pic.twitter.com/A21JRhEi6S — Backchod Indian (@IndianBackchod) December 28, 2022 మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. -
కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్లు, పబ్‌లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక -
కొవిడ్ అప్రమత్తతపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
-
చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు!
బీజింగ్: చైనాలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్7 విజృంభిస్తోంది. రోజుకు లక్షల మందికి సోకుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచానికి కేసులు, మరణాలు తెలియనీయకుండా డ్రాగన్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా.. సోషల్ మీడియాల్లో బయటపడుతున్న వీడియోలు హృదయాలను కలచివేస్తున్నాయి. వందల మంది మరణిస్తుండడంతో శ్మశానాల ముందు అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య నిపుణులు ఎరిక్ ఫైగిల్ డింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద క్యూలైన్లో నిలుచుని మృతదేహాలను తీసుకెళ్తున్న హృదయవిదారక వీడియో వైరల్‌గా మారింది. ‘శ్మశానవాటికల్లో పెద్ద క్యూలైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారి అంత్యక్రియల కోసం క్యూలైన్లలో వేచి ఉండటమే కాదు, ఆ సమయంలో వారిని మోసుకెళ్లాల్సి వస్తుందని ఊహించుకోండి. భయంకరమైన కోవిడ్ 19 చైనాను చుట్టివేయడంపై సానుభూతి చూపుదాం.’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి ఓ డాక్యుమెంట్ లీక్ కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి 20 మధ్య దేశంలోని సుమారు 17.56 శాతం మంది 25 కోట్ల మందికి వైరస్ సోకింది. రోజుకు లక్షల మంది వైరస్ బారినపడుతున్నారు. 35) Epic long lines at crematoriums… imagine having to not just wait for hours to cremate you loved ones, but have to do it carrying their deceased bodies for all those hours… let’s have empathy for the horrific #COVID19 wave 🌊 crashing into China. 🙏 pic.twitter.com/aQcmmjuCTC — Eric Feigl-Ding (@DrEricDing) December 26, 2022 ఇదీ చదవండి: Dalai Lama Bodh Mahotsav Event: దలైలామా ఈవెంట్ వేళ కరోనా కలకలం.. నలుగురు విదేశీయులకు పాజిటివ్ -
ఏపీ: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. రెండు రోజుల్లో ఎంత మందిని కలిశాడు!
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వైరస్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో, అధికారులు సదరు వ్యక్తికి టెస్టులు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న భారత్‌కు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, బాధితుడు చైనా నుంచి రావడంతో సదరు ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది వెంనే ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు.. సదరు యువకుడి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా అయితే నిర్ధారణ అయ్యింది కానీ.. వారికి యువకుడికి ఏ వేరియంట్ సోకిందో తెలియదు. దీంతో, అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
China: కరోనా కల్లోలం.. చైనాలో 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా
బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం నానాటికీ ఉగ్ర రూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి జీరో కొవిడ్ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటి నుంచీ ఒమిక్రాన్ వేరియంట్లు దేశమంతటా కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. డిసెంబర్ 1–20 తేదీల మధ్య కనీసం 25 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి లీకైన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది! దాంతో రోగులతో ఆస్పత్రులు, శవాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. వాటిపై భారం తగ్గించేందుకు ఇంటర్నెట్ ఆస్పత్రి సేవలను ప్రభుత్వం అనుమతించింది. వీలైనంత వరకూ ఆన్లైన్లో వైద్య సాయం పొందాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసర కరోనా మందులకు చాలాచోట్ల తీవ్ర కొరత నెలకొంది. దాంతో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి! సిబ్బందికీ కరోనా! చైనాలో పలు నగరాల్లో సగటున రోజుకు లక్షకు పై చిలుకు చొప్పున కేసులు వెలుగు చూస్తున్నాయి! తూర్పున షాన్డాంగ్ ప్రావిన్సులో క్విండావో నగరంలోనైతే రోజుకు ఏకంగా 5 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారని నగర హెల్త్ కమిషన్ చీఫ్ బో తావో చెప్పారు! మున్ముందు పరిస్థితి మరింత విషమించేలా కన్పిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. దక్షిణాదిన గువాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో డాంగువాన్ నగరంలోనూ రోజుకు 3 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో చాలావరకు వృద్ధులేనని తెలుస్తోంది. మరోవైపు చాలాచోట్ల వైద్య సిబ్బంది కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డట్టు సమాచారం. అయినా ఒకవైపు చికిత్స తీసుకుంటూనే వారంతా విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
పండగల సీజన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
-
మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరి: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిడ్ కొత్త వేరియెంట్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్.. వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచిస్తూనే.. న్యూఇయర్ వేడుకలు, పండుగల సీజన్ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ నెల 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపింది. MoHFW directs all States/UTs to focus on 'Test-Track-Treat &Vaccination' and adherence of COVID19 appropriate behaviour of wearing mask, maintaining hand hygiene and physical distancing, considering the upcoming festival season and new year celebrations pic.twitter.com/YiNrXKe6mW — ANI (@ANI) December 23, 2022 -
కోవిడ్ కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ లక్షణాలివే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 చైనాను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందిని చుట్టేస్తోంది. ఈ కొత్త వేరియంట్ భారత్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌గా ఉన్నప్పటికీ చైనా పరిస్థితులను చూస్తే ఈ కొత్త వేరియంట్ అంశం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ బీఎఫ్.7 లక్షణాలేంటి? ఆ వైరస్ సోకితే ఎలా గుర్తించాలి? ► భారత్‌లో కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నాలుగు వెలుగుచూశాయి. గుజరాత్లో మూడు, ఒడిశాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ► బీఎఫ్.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఛాతి పైభాగం, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► కొంత మందిలో పొట్ట సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. వాంతులు, విరేఛనాల వంటివి కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ► బీఎఫ్.7 వేరియంట్ విషయంలో తీవ్రంగా అనారోగ్యానికి గురుకావటం అనేది జరగటం లేదు. లక్షణాలు లేకుండానే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ నుంచి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ► కొత్త వేరియంట్ బీఎఫ్.7ను చైనా, భారత్‌తో పాటు అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ గుర్తించారు. చైనా మినహా ఇతర దేశాల్లో ఈ వేరియంట్ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం ఊరటనిస్తోంది. ఇదీ చదవండి: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు -
ఇక ఆఫీసుల్లోనూ మాస్క్‌లు తప్పనిసరి!
బెంగళూరు: చైనా నుంచి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ భారత్‌లో విజృంభించే అవకాశాల నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దాదాపుగా అంతటా మాస్క్ తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పలు దేశాల్లో ప్రధానంగా పొరుగు దేశం చైనాలో కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. బీఎఫ్.7 ప్రభావంతో కరోనా కేసులు, మరణాలతో చైనా ఆగం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక కర్ణాటక ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండోర్ లొకేషన్స్, క్లోజ్డ్ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఏసీ గదులున్న ప్రాంతాల్లోనూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లు, ఆఫీసుల్లోనూ మాస్క్ మస్ట్ కానుంది. అలాగే.. జలుబు లక్షణాలు కనిపించినా, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తినా.. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక వైద్యారోగ్య శాఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి.. సీఎం బొమ్మైకి నివేదిక సమర్పించింది. పాజిటివ్ పేషెంట్ల శాంపిల్స్‌ను జీనోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. -
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. కొత్త వేరియంట్‌పై అనుమానాలు!
గాంధీనగర్: చైనాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 విజృంభణపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే, మూడు రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్తకు పాజిటివ్‌గా తేలగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. అతడి నమూనాలను గాంధీనగర్‌లోని పరిశోధన కేంద్రానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. భావ్‌నగర్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ తన వ్యాపార నిమిత్తం ఇటీవలే చైనాకు వెళ్లారు. డిసెంబర్ 19 భారత్‌కు తిరిగివచ్చారు. కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ ఆదేశించారు. దీంతో భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. చైనాతో పాటు విదేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని రెండ్రోజుల క్రితం లేఖ రాశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. కోవిడ్ మార్గదర్శకాలను పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించటం, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలన్నారు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
చైనాలో భయానక పరిస్థితులు.. జిన్‌పింగ్ సర్కార్ కీలక నిర్ణయం!
డ్రాగన్ కంట్రీ చైనాను కరోనా వైరస్ వేరియంట్స్ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో చైనాలో ఆసుప్రతులు పూర్తిగా పేషెంట్స్‌తో నిండిపోయాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ను అడ్డుకుని, పేషెంట్స్ రికవరీ కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు.. పలు సిటీల్లో ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ అందిస్తున్నారు. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోవడంతో స్పెషల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడంతో పాలుగా మందుల తయారీ, సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఇక, వైరస్ వ్యాప్తితో బీజింగ్, వుహాన్, షెంజెన్, షాంఘై నగరాల్లో స్ధానిక ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి. మరోవైపు.. జీరో కోవిడ్ పేరుతో కఠిన నియంత్రణలను సడలించిన అనంతరం చైనాలో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చైనా ఆసుపత్రుల్లో శవాల గుట్టలు పేరుకుపోయాయనే వార్తలు బయటం రావడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా.. చైనా ప్రభుత్వం, మీడియా మాత్రం దేశంలో కోవిడ్ మరణాలు సంభవించలేదని అధికారికంగా పేర్కొంది. దీంతో, కరోనా తీవ్రత, మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చైనాలో క్రిస్మస్, న్యూ వేడుకల నేపథ్యంలో పాజిటివ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, మంగళవారం చైనాలో 3,89,306 కేసుల్లో కరోనా లక్షణాలు గుర్తించామని అధికార వర్గాలు తెలిపాయి. Emergency room of a hospital in #Tianjin City of China… #COVID #chinacovid #COVID19 #coronavirus #China #CovidIsNotOver #CovidIsntOver pic.twitter.com/SC24pnmDZO — Jyot Jeet (@activistjyot) December 22, 2022 -
కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!
జెనీవా: చైనాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభణతో వచ్చే మూడు నెలల్లో దేశ జనాభాలోని 60 శాతం మంది వైరస్‌బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు సూచించారు. వైరస్ బారినపడే అవకాశం ఉన్న వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వారాంతంలో నిర్వహించే మీడియో సమావేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కోవిడ్ విజృంభణతో చైనాలో తలెత్తుతున్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, ఐసీయూల అవసరం వంటి వివరాలు సమర్పించాలి. దేశవ్యాప్తంగా వైరస్ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా నిలుస్తుంది. క్లినికల్ కేర్, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు మా మద్దతు కొనసాగుతుంది.’ - డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ 2020 నుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది చైనా. జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది. అయితే, ప్రజాగ్రహంతో ఎలాంటి ప్రకటన చేయకుండానే డిసెంబర్ తొలినాళ్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది బీజింగ్ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: Lockdown: కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ.. -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు