కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’ లక్షణాలివే.. | Covid New Variant BF7 Has Come To India Here Are The Symptoms | Sakshi
Sakshi News home page

కరోనా కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’ లక్షణాలివే..

Published Thu, Dec 22 2022 8:33 PM | Last Updated on Thu, Dec 22 2022 9:19 PM

Covid New Variant BF7 Has Come To India Here Are The Symptoms - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 చైనాను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందిని చుట్టేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ భారత్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌గా ఉన్నప్పటికీ చైనా పరిస్థితులను చూస్తే ఈ కొత్త వేరియంట్‌ అంశం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 లక్షణాలేంటి? ఆ వైరస్‌ సోకితే ఎలా గుర్తించాలి?

భారత్‌లో కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 కేసులు నాలుగు వెలుగుచూశాయి. గుజరాత్‌లో మూడు, ఒడిశాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. 

► బీఎఫ్‌.7 ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై దాడి చేస్తుంది. ఛాతి పైభాగం, గొంతుకు దగ్గరగా ఉండే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

► జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

► కొంత మందిలో పొట్ట సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. వాంతులు, విరేఛనాల వంటివి కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

► బీఎఫ్‌.7 వేరియంట్‌ విషయంలో తీవ్రంగా అనారోగ్యానికి గురుకావటం అనేది జరగటం లేదు. లక్షణాలు లేకుండానే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌ నుంచి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

► కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7ను చైనా, భారత్‌తో పాటు అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ దేశాల్లోనూ గుర్తించారు. చైనా మినహా ఇతర దేశాల్లో ఈ వేరియంట్‌ ప్రభావం అంతంత మాత్రమే ఉండటం ఊరటనిస్తోంది.

ఇదీ చదవండి: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు నమూనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement