సాక్షి, ఢిల్లీ: కొవిడ్ కొత్త వేరియెంట్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్.. వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మాస్క్‌లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచిస్తూనే.. న్యూఇయర్ వేడుకలు, పండుగల సీజన్ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపింది.
ఇక ఈ నెల 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపింది.
MoHFW directs all States/UTs to focus on 'Test-Track-Treat &Vaccination' and adherence of COVID19 appropriate behaviour of wearing mask, maintaining hand hygiene and physical distancing, considering the upcoming festival season and new year celebrations pic.twitter.com/YiNrXKe6mW
— ANI (@ANI) December 23, 2022
Comments
Please login to add a commentAdd a comment