Corona Cases In India
-
Corona: మళ్లీ కోవిడ్.. భయమెంతవరకు..?
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 16 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ (గురువారం) నమోదైన కేసుల సంఖ్య 1013 గా తెలుస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 609 కేసులు నమోదైనట్లు సమాచారం. కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరణాలపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఇప్పటివరకూ చూస్తే,దేశంలో మొత్తంగా 3368 యాక్టివ్ కేసులు వున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని, కేసుల తీరును గమనిస్తే అత్యధిక కేసులు కర్ణాటకలో, అత్యల్పంగా ఉత్తరాఖండ్ లో నమోదై వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 189, కేరళలో 154 కేసులు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ వైరస్ వ్యాప్తి మొదలైంది. ఈ జె.ఎన్ -1 వేరియంట్ ను 'వేరియంట్ అఫ్ ఇంట్రెస్ట్' ప్రపంచ ఆరోగ్య సంస్థగా (WHO) అభివర్ణిస్తోంది. ఈ వేరియంట్ లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ముప్పు శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య సంస్థ ధైర్యాన్ని అందిస్తోంది. అదే సమయంలో, రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేస్తోంది.జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) నెల రోజుల క్రితం దేశంలోని మూడు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాప్తిలో వుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలకు పాకింది. దీనిని మనం గమనంలో ఉంచుకోవాలి. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే.గతంలో, కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం.ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, తగిన చర్యలు ప్రారంభించింది. కాకపోతే! చలికాలం,పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళ, కర్ణాటకలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇది మంచి పనే. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు.ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది.ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం! కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు.ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే, ప్రభుత్వం, నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు,సిబ్బంది కొరత లేకుండా చూడాలి.యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. ఐనా! యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది.అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం,భౌతిక దూరం పాటించడం,గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం,శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం,యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం,నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
India: టెన్షన్ పెడుతున్న జేఎన్-1 వేరియంట్.. భారీగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది. A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources — ANI (@ANI) January 9, 2024 కర్ణాటక గవర్నర్‌కు కరోనా ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్‌భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్‌భవన్‌లోనే క్వారంటైన్లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. -
బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు
ఢిల్లీ: కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 కారణంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ కారణంగా రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, దేశంలో కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో నలుగురు మృతిచెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఇక, ప్రస్తుతం కర్ణాటకలో 1,240 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారీగా పెరిగిన జేఎన్-1 కేసులు.. ఇదిలా ఉండగా.. దేశంలో జేఎన్-1 పాజిటివ్ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో జేఎన్-1 వేరియంట్ కేసులు 541 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణ 2, ఒడిషా, హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మిజోరం, త్రిపుర, చండీఘర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్‌లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్ కేసులు కూడా లేవని వైద్యారోగ్యశాఖ తెలిపింది. -
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1
-
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
కరోనా డేంజర్ బెల్స్.. మరోసారి 12 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్‌కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది. కాగా.. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు. చదవండి: అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది? -
11 కరోనా కేసుల నమోదు
మహారాణిపేట: విశాఖలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 251 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. 31 మంది హోం ఐసోలేషన్ ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మాధవధారలోని లవ్ అండ్ కేర్ సెంటర్లో అనాథ పిల్లలకు కోవిడ్ సోకడంతో భయాందోళన నెలకొంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 21 ఏళ్ల మానసిక దివ్యాంగుడికి ఈ నెల 17న రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా.. కోవిడ్ నిర్ధారణ అయింది. వెంటనే అతన్ని కేజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అప్పటికే ఈ యువకుడికి న్యూమెనియా, ఇతర వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. అదే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మంగళవారం చనిపోయాడు. అప్పటికి ఆర్టీపీసీఆర్ నివేదిక రాకపోవడంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన రిపోర్టులో నెగిజిట్ అని తేలిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆ యువకుడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇదే ఆశ్రమానికి చెందిన ఓ బాలికకు పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్ వచ్చిందన్నారు. కానీ ఇతర వ్యాధుల కారణంగా బాలిక ఆరోగ్యం కూడా విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. -
కోవిడ్ గుప్పిట్లో దేశ రాజధాని.. ఏకంగా 430 శాతం పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. కొత్త కేసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మూడు వారాల లోపే కేసుల సంఖ్య ఏకంగా 430 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది. మార్చి 30న ఢిల్లీలో 4,976 కేసులు ఉండగా.. ఏప్రిల్ 17నాటికి ఆ సంఖ్య 13,200కు చేరింది. తాజాగా బుధవారం మరో 1,537 కేసులు వెలుగుచూశాయి. మరో ఐదుగురు వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,25,781కి చేరింది. మృతుల సంఖ్య 26,572గా ఉంది. దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు.. మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగి మళ్లీ 10వేల మార్కును దాటాయి. మంగళవారం 7,633 కేసులు వెలుగుచూడగా.. బుధవారం ఆ సంఖ్య 10,542కు పెరిగింది. మరో 38 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,31,190కి చేరింది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
Covid-19: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్‌కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 6,313 రికవరీలు జరగగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,35,772కి చేరుకుంది. గత కొద్ది రోజలుగా పెరుతున్న కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే తాజగా నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక గత 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్‌బీ1.16 వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దేశంలో పదిరోజుల వరకు ఇలానే కొనసాగుతుందని తదనంతరం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు) -
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
Covid-19: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్‌కు చేరువై 49,622గా ఉంది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోజువారి పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారు మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల్లో వృద్ధి నమోదవుతున్న కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే కార్యాలయాల్లో శానిటైజేషన్ చేసి పరిశుభ్రత పాటించాలని, కరోనా లక్షణాలు కన్పించిన ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని తెలిపింది. చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..! -
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
మాక్‌డ్రిల్‌తో భారత్ అప్రమత్తం.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 5,676 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్ కేసులు ఉండగా, కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా – 1,928, కర్ణాటక – 1,673, ఉత్తర్ ప్రదేశ్‌లో 1,282 కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త కోవిడ్ మాక్‌డ్రిల్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం కోవిడ్ మాక్‌డ్రిల్ జరిగింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ సన్నద్ధతను పరిశీలించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. వివిధ విభాగాధిపతులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్‌డ్రిల్‌కు భారీ స్పందన లభించింది. ఆరోగ్య శాఖల మంత్రులు ఆస్పత్రుల్లో సన్నద్ధత, సౌకర్యాలపై సమీక్షలు జరిపారు’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో? త్వరలో అందుబాటులోకి కోవోవ్యాక్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారీ కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవోవ్యాక్స్ ధర రూ. 225గా ఉంటుందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేయించుకున్న పెద్దలు కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవోవ్యాక్స్‌ను ఇప్పటికే డీసీజీఐ, డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించిందని గుర్తు చేశాయి. -
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు..కేంద్ర అలర్ట్
-
కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతవారం దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో మాండవియా మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మాండవియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుతున్నాయని అన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. అంతేగాదు ఆస్పత్రిలో సంరక్షణ ఏర్పాట్లు, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని కూడా తెలిపారు. అలాగే పెరుగుతున్న ఈ కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చివరి కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐతే ఈ ఉప వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని చెప్పారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్' అనే కోవిడ్ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ సిద్దంగా ఉందని చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడమేగాక మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం. ముందుజాగ్రత్తగా హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలుబహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే హర్యానలోని పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేయడమే గాక ఉత్తరప్రదేశ్‌లో 'అధిక ప్రాధాన్యత' పేరుతో విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. (చదవండి: మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి) -
10, 11 తేదీల్లో ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10, 11 తేదీల్లో కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లపై పరిశీలన చేసే నిమిత్తం మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు గురువారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. వార్డుల్లో పడకలు, ఆక్సిజన్ వసతి, ఐసీయూలు, టెస్టింగ్ కిట్ల నిల్వ, మందులు వంటి వాటిపై ఈ డ్రిల్ ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయో లేదో మాక్ డ్రిల్‌లో పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరిదిద్దుతారు. కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతారు. మిషన్లు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ప్లాంట్లు తదితర వాటి పనితీరును పరిశీలిస్తారు. మాక్ డ్రిల్ కోసం ప్రతి జిల్లాకు ఒక నోడల్ఆఫీసర్ను నియమిస్తారు. మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారంటే.. అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి అనేది తనిఖీ చేస్తారు. దీంతో పాటు ఆయా ఆసుపత్రులు, అనుబంధ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఆశాలు, అంగన్వాడీలు ఎంత మంది ఉన్నా రు? అనే వివరాలు సేకరిస్తారు. కరోనా నియంత్రణకు శిక్షణ కలిగిన సిబ్బంది ఉన్నారా? లేదా? అనే వివరాలను కూడా సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటారు. దీంతోపాటు అంబులెన్స్‌లు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితిఎలా ఉంది? అనే అంశాలను తనిఖీ చేస్తారు. కాగా, మాక్‌డ్రిల్ నివేదికను జిల్లా వైద్యాధికారులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమో దు చేయాలని శ్రీనివాసరావు ఆదేశించారు. -
మరోసారి భారీగా కరోనా కేసులు.. గడిచిన 5 నెలల్లో ఇదే తొలిసారి
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కు చేరుకుంది. గత అయిదు నెలల్లో(163 రోజులు) ఇంత భారీస్థాయిలో కేసులు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.పేర్కొంది. తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 4,41,79,712 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రికవరి రేటు 98.76కాగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నాలుగు మరణాలు సంభవించగా, చత్తీస్‌గఢ్‌్, ఢిల్లీ, గుజరాత్ , హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్తాన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదయ్యాయి. (చదవండి: ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు! గులాం నబీ అజాద్) -
Coronavirus: వరుసగా రెండో రోజు భారీగా కేసులు
గత కొన్ని వారాల నుంచి కరోనా ఉధృతి మళ్లీ కనిపిస్తోంది. దేశంలో నిన్న ఒక్క రోజులోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో క్రియశీలక కేసుల సంఖ్య 15,208కి చేరినట్లయ్యింది. ఇప్పటి వరకు సుమారు 1396 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. గత 24 గంట్లో తాజా కేసులతో రికవరి రేటు 98.78% తగ్గింది. మరణాల రేటు 1.19%గా ఉంది. కొద్ది రోజులుగా కేసులు అనుహ్యంగా పెరడం ప్రారంభించాయి. గత మార్చి 30నే దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 50% పెరుగుదల కనిపించింది. కాగా, మహారాష్ట్రలో కొత్తగా 694 కొత్త కేసులు, కేరళలో 765 కేసులు నమోదయ్యాయి India reports 3,095 fresh cases of COVID-19 in the last 24 hours, active cases stand at 15,208. — ANI (@ANI) March 31, 2023 (చదవండి: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్) -
మళ్లీ బుసలు కొడుతున్న కరోనా వైరస్...
పాలమూరు: ప్రజలను రెండేళ్ల పాటు ముప్పు తిప్పలు పెట్టి.. ఆర్థికంగా ఎంతో నష్టం చేకూర్చిన కరోనా మళ్లీ కోరలు చాచుతుందా అనే సందేహాలు వ్య క్తమవుతున్నాయి. కరోనా పలు ద శలుగా మార్చుకొని విస్తరిస్తోంది. కొత్తగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌తో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరికి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొ ప్పిసమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా కరోనా కే సుల పెరుగుదల అధికంగా లేనప్పటికీ.. ముందు జా గ్రత్త చర్యలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా హెచ్ 3 ఎన్2తో విస్తరిస్తోందని, ప్రతిఒక్కరు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించాలని చెబుతున్నారు. 822 మందికి పరీక్షలు జిల్లాలో పది రోజులుగా 164 ఆర్టీపీసీఆర్, 658 మందికి ర్యాట్ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో 13 మంది కరోనా పాజిటి వ్ నిర్ధారణ అయింది. ఇందులో నలుగురు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండగా మరో 9 మంది ఇంటి దగ్గర ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో 500 పడకలు ఆక్సిజన్ పడకలతోపాటు 80 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో పెట్టారు. దీంతోపాటు రెండు ఆక్సిజన్ ట్యాంకర్స్, కావాల్సిన పరికరాలు సిద్ధం చేసుకోవడం జరిగింది. వీరు జాగ్రత్తగా ఉండాలి కొత్త వేరియంట్‌తో భయపడాల్సిన అవసరం లేదు. అయితే అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలు కొందరిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయి. కొత్త రకం వైరస్ పట్ల దీర్ఘకాలిక రోగులు, పెద్ద వయస్సు వారు, పిల్లలు, గర్భిణులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని, జనంలోకి వెళ్తే తప్పకుండా మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. పరీక్షలు చేస్తున్నాం.. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వైరస్‌లో దగ్గు, జలుబు, జ్వరంతోపాటు కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, మోషన్స్ వంటి లక్షణాలు అధికంగా ఉంటున్నాయి. ఎవరూ కూడా పరిస్థితి విషమించే వరకు నిర్లక్ష్యం చేయరాదు. ఏదైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవడం లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడి దగ్గర చికిత్స తీసుకోవడం మంచిది. ప్రస్తుతం రద్దీ సీజన్ వల్ల పెళ్లిళ్లు, జాతరలు అధికంగా ఉన్నాయి. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో చాలా వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. అత్యవసరమైన వారికి మాత్రమే ర్యాటీ పరీక్షలు చేస్తున్నాం. – రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు నెలల గ్యాప్ తర్వాత.. దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 800 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 841 కేసులు నమోదయ్యాయి. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. కరోనా మరణాలపైనా గణాంకాలను పరిశీలిస్తే.. జార్ఖండ్,మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణం నమోదు కాగా, కేరళలో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 4.46 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. (చదవండి: పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!) -
20 లక్షల కరోనా వ్యాక్సిన్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అవసరమైన 20 లక్షల కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయాలంటూ కేంద్రానికి విన్నవిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. కరోనా కేసుల పెరుగుదల, కేంద్రం అప్రమత్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని హరీశ్ చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించనున్నారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత వారంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో గత వారంలో 132 కరోనా కేసులు నమోదు కాగా, మార్చి 15తో ముగిసిన వారంలో ఆ సంఖ్య 267కి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణకు సూచించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం కూడా ఉన్నట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో గురు వారం 27 కరోనా కేసులు నమోద య్యాయి. అంతకుముందు రోజు బుధ వారం ఏకంగా 54 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది. -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్‌గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం ఇదే!
ఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోందా?. తాజాగా భారత్‌లో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో 97 రోజుల తర్వాత 300కి పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 2,686కిపైగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో ఒకే రోజు 334 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 5,30,775కి పెరిగింది. దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 4.46 కోట్లు, కాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 0.00 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,54,035కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.63 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. కాగా, మళ్లీ కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే కారణమా?. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని నిపుణులు చెబుతున్నా కానీ, మాస్క్‌లు పెట్టుకోకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో మార్కెట్లుల్లో కూడా చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా -
కరోనా కేసుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక్క రోజులో 3,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశా రు. కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రోజూ కేసులు నమోదయ్యే వని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు గరిష్టంగా ఒక రోజులో 15 కేసులు నమోదు కాగా, తాజాగా కనిష్టంగా జీరో కేసులు నమో దయ్యాయని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8.41 కరోనా కేసులు నమోదైనట్లయింది. అందులో 8.37 లక్షల మంది కోలుకున్నా రు. ఒక రోజులో 10,405 మంది కరోనా టీకా వేసుకున్నారు. వారిలో 9,800 మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. -
జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్‌లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విదేశీయులను ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచగా.. మయన్మార్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
దేశంలో మరో లాక్డౌన్ అక్కర్లేదు: ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
న్యూఢిల్లీ: పొరుగు దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. మన దగ్గర మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. అయితే.. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ తరుణంలో.. ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ గనుక విజృంభిస్తే.. భారత్‌లో మరోసారి లాక్డౌన్ విధిస్తారా? అనే చర్చ తెర మీదకు వచ్చింది. అఫ్కోర్స్.. కేంద్రం ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చనే సంకేతాలను ఇప్పటికే పంపింది కూడా. ఈ తరుణంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, భారత్‌లో కరోనా కల్లోలాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. భారత్‌లో కరోనా ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో.. లాక్డౌన్ పెట్టడంగానీ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడం లాంటి చర్యలు అసలు అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత అనుభవాలను పరిశీలిస్తే.. విమానాల నిషేధం ఎలాంటి ప్రభావం చూపించలేదు. వైరస్ వ్యాప్తిని ఆ నిర్ణయం అడ్డుకోలేకపోయింది. అన్నింటికి మించి చైనాను కుదిపేస్తున్న వేరియెంట్.. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది కూడా. ఒకవేళ.. భారత్‌లో అత్యధికంగా కేసులు నమోదు అయినా, ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ అధికంగా నమోదు అయ్యింది. అలాగే.. వైరస్ సోకి తగ్గిపోయిన జనాభా కూడా అధికంగానే ఉంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగింది అని పల్మనాలజిస్ట్ అయిన గులేరియా తెలిపారు. ఇలాంటి పరిస్థితులన్నింటిని గనుక పరిగణనలోకి తీసుకుంటే లాక్డౌన్ ప్రస్తావనే అక్కర్లేదు అని అన్నారు. మరోవైపు చైనా సహా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న దేశాల నుంచి వస్తున్న విమానాలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాకపోతే.. ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఎయిర్ సువిధా ఫామ్‌లో ఆరోగ్య స్థితిని తెలియజేయడంతో పాటు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్ -
పండగల సీజన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
-
మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరి: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిడ్ కొత్త వేరియెంట్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్.. వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచిస్తూనే.. న్యూఇయర్ వేడుకలు, పండుగల సీజన్ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ నెల 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపింది. MoHFW directs all States/UTs to focus on 'Test-Track-Treat &Vaccination' and adherence of COVID19 appropriate behaviour of wearing mask, maintaining hand hygiene and physical distancing, considering the upcoming festival season and new year celebrations pic.twitter.com/YiNrXKe6mW — ANI (@ANI) December 23, 2022 -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు