సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు నెలల గ్యాప్ తర్వాత.. దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 800 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి.
కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 841 కేసులు నమోదయ్యాయి. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. కరోనా మరణాలపైనా గణాంకాలను పరిశీలిస్తే..
జార్ఖండ్,మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణం నమోదు కాగా, కేరళలో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 4.46 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి.
(చదవండి: పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!)
Comments
Please login to add a commentAdd a comment