న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్‌కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు.
కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది.
ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు
Comments
Please login to add a commentAdd a comment