voice
-
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్‌కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
గ్రామీణ విద్యకు వాయిస్ టెక్నాలజీ దన్ను
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (అలెక్సా) ఆర్ఎస్ దిలీప్ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్ ఎకో స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్ పేర్కొన్నారు. వాయిస్ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
అదరగొడుతున్న చాట్‌జీపీటీ కొత్త ఫీచర్స్ - వీడియో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికె ప్రపంచ దేశాల్లో అత్యంత పాపులర్ అయిన ఏఐ చాట్‌జీపీటీలో ఇప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం చాట్‌జీపీటీ ఇకపై వినటమే కాదు ఫోటోల రూపంలో సలహాలను కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓపెన్ఏఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు టెక్స్ రూపంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. అయితే మధ్యలో ఏదైనా అడగాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఇది కూడా సాధ్యమవుతుంది. అంటే చాట్‌జీపీటీ ఏదైనా సమాధానం చెప్పే సమయంలో మధ్యలో మనం కల్పించుకోవచ్చు, దానికి కూడా చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది. ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్న అడగాలంటే మొత్తం టెక్స్ట్ రాయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సమస్యకు సంబంధించిన ఫోటో షేర్ చేసి సమస్య చెబితే దానికి చాట్‌జీపీటీ సమాధానం చెబుతుంది. ఇక్కడ కనిపించే వీడియోలో మీరు గమనించినట్లయితే సైకిల్ సీటు తగ్గించడానికి ఏమి చేయాలి అని ఫోటో అప్లోడ్ చేసి అడిగితే చాట్‌జీపీటీ దానికి ఆన్సర్ చెబుతుంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ కొత్త ఫీచర్స్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే వాయిస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఫోటో ఫీచర్ అనేది అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ChatGPT can now see, hear, and speak. Rolling out over next two weeks, Plus users will be able to have voice conversations with ChatGPT (iOS & Android) and to include images in conversations (all platforms). https://t.co/uNZjgbR5Bm pic.twitter.com/paG0hMshXb — OpenAI (@OpenAI) September 25, 2023 -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా?
నేటి రోజుల్లో గూగుల్ మ్యాప్ తెలియనివారు, వినియోగించనివారు ఎవరూ ఉండరు. ఎవరైనా సరే తాము తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ తప్పకుండా ఫాలో అవుతారు. అయితే గూగుల్ మ్యాప్‌లో రూట్లు చెప్పేటప్పుడు సుమధురమైన ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. అయితే ఈ గొంతు ఎవరిది? ఆమె పేరు ఏమిటి? ఎక్కడుంటుంది? చాలామందికి ఈ విషయాలు తెలియదు. అందుకే దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్ వెనుక గొంతు వినిపించే మహిళ పేరు కరెన్ జాకబ్సెన్. పూర్తి పేరు కరెన్ ఎలిజబెత్ జాకబ్సెన్.ఈమె ఆస్ట్రేలియాకు చెందినది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటోంది. ఆమె వృత్తి రీత్యా వాయిస్ ఓవర్ ఆర్టిస్టు. అంతేకాకుండా సింగర్, కంపోజర్, ఇన్ఫ్లుయెన్సర్గానూ రాణిస్తోంది. కరెన్‌ను పలు పురస్కారాలు వరించాయి. గూగుల్ మ్యాప్ కారణంగా ఆమె గొంతును ప్రపంచంలోని నలుమూలల జనాభా వింటున్నారు. దీనితో పాటు కరెన్ గొంతు 2011 నుంచి 2014 వరకూ ఆపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్, ఐపేడ్స్ తదిర అప్లికేషన్లలో వినియోగించారు. రెండు పుస్తకాలను కూడా రచించి.. ఆమె ఒక ఫిమేల్ ఎంటర్టైనర్ అయిన కారణంగా వన్ ఉమెన్ షోలను ప్రజెంట్ చేస్తుంటుంది. వీటిలో ది ట్రయాడ్, ది లారీ బీచ్మన్ థియేటర్ అండ్ పబ్లిక్ థియేటర్, ది డ్యూప్లెక్స్, ది బిట్టర్ ఎండ్ మొదలైనవి ఉన్నాయి. జాకబ్సెన్ రెండు పుస్తకాలను కూడా రచించింది. అవి రీకాలుక్యులేట్- డైరెక్షన్ ఫర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ సక్సెస్, ది జీపీఎస్ గర్ల్స్ రోడ్ మ్యాప్ ఫర్ ధేర్ ఫ్యూచర్. కరెన్.. డాన్సెన్స్ ఫ్రీక్ కోసం సౌండ్ ట్రాక్ కూడా రూపొందించింది. ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర -
మైక్రోసాఫ్ట్, మేక్మైట్రిప్ జట్టు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) ద్వారా భారతీయ భాషల్లో వాయిస్ ఆధారిత బుకింగ్ సర్వీసులు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో సందర్భం, బడ్జెట్, కాల వ్యవధి, యాక్టి విటీలు మొదలైన వివరాలను ప్రయాణికులు తెలియజేస్తే .. వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. పోర్టల్‌లో ఈ సాంకేతికతను పొందుపర్చారు. ప్రస్తుతం ఫ్లయి ట్లు, హాలిడేస్ కస్టమర్ల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మాగో తెలిపారు. మేక్మైట్రిప్ అనుభవం, తమ ఏఐ సామర్థ్యాలతో దేశీయంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ఈడీ సంగీతా బవి వివరించారు. -
బీజేపీ వాయిస్ లో నాయిస్..!
-
రష్మిక లైవ్.. మధ్యలో విజయ్ వాయిస్
-
Manju Warrier: వాటిని ఎంజాయ్ చేస్తున్నా.. అభిమానానికి థ్యాంక్స్!
మాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి మంజువారియర్. ఈమె తమిళంలో అజిత్ సరసన నటిస్తున్న చిత్రం తుణివు. హెచ్ వినోద్ కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని జీసినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదలై అజిత్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అందులో ఒకటి కాసేదాన్ కడవులడా పల్లవితో సాగే పాట. ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్‌తో కలిసి నటి మంజు వారియర్ పాడటం విశేషం. అయితే ఇటీవల విడుదలైన ఈ పాటలో నటి మంజువారియర్ సెట్ కాలేదని కోరస్లో కలిసిపోయిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన ఆమె తుణివు చిత్రంలో తాను పాడిన పాటలో తన గొంతు బాగోలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని, తన గొంతు బాగోలేదని మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని, తాను వీడియో వెర్షన్ కోసమే పాడినట్లు పేర్కొన్నారు. ట్రోలింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మంజువారియర్ పేర్కొన్నారు. -
హే ‘సిరి’ పేరు మారుతోంది!
అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ ‘హే సిరి’ని..‘సిరి’గా మార్చనుంది. తద్వారా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని మరింత వేగవంతంగా ఇవ్వొచ్చని యాపిల్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే తన వాయిస్ అసిస్టెంట్ పేరును కుదిస్తుంది. ఈ చిన్న పేరును మార్చేందుకు యాపిల్ కఠినంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ చేయబోతున్న మార్పులపై బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్ చెప్పినట్లుగా దివెర్జ్ కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ గత కొన్ని నెలలుగా సిరి ఫీచర్‌పై హార్డ్ వర్క్ చేస్తోందని, వచ్చే ఏడాది లేదా 2024లో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేయొచ్చుని గుర్మాన్ పేర్కొన్నారు. అదే జరిగితే ఐఫోన్ వినియోగదారులు సిరి అని పిలవాల్సి ఉంటుందని అన్నారు. హే’ను తొలగించడానికి కారణం యాపిల్ సంస్థ అమెజాన్, మైక్రోసాఫ్ట్,గూగుల్ సంస్థల తరహాలో వాయిస్ అసిస్టెంట్ మరింత సులభం మార్చేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ హే అలెక్సా, మైక్రోసాఫ్ట్ హే కోర్టానా, గూగుల్ హే గూగుల్ ఇలా రెండు అక్షరాలతో వాయిస్ అసిస్టెంట్ పనిచేసేలా ఫీచర్‌ను బిల్డ్ చేశాయి. క్రమేపీ యూజర్ల ఈ వాయిస్ అసిస్టెంట్‌ను సిరి అని పిలించేందుకు ఇష్టపడుతున్నారు. వారి కోసం హే అనే పదాన్ని తొలగించి అలెక్సా, కోర్టానా అని జోడించాయి. ఇప్పుడు ఆ సంస్థల తరహాలో యాపిల్ సైతం తన వాయిస్ అసిస్టెంట్ హే సిరిని కాస్తా.. సిరిగా మార్చనుంది. -
భావోద్వేగ క్షణం: 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమ్మగొంతు విని....
ఒక్కక్షణం నిశబ్దం చాలా భరించలేని విధంగా ఉంటుంది. అలాగని గందరగోళంగా ఉన్నా భరించలేం. కానీ కొంతమంది పుట్టుకతో వినపడని వాళ్లు ఉంటారు. వాళ్లు ఆ నిశబ్దాన్నిఎలా భరించగలుగుతారో తెలియదు. ఆ నిశబ్దం కారణంగా వారు ఏమి గ్రహించలేక మాటలు కూడా నేర్చుకోవడం అసాధ్యంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి చిన్నప్పుడే ఒక ఆరోగ్య సమస్యతో వినికిడి శక్తిని కోల్పోయాడు. అలాంటి వ్యక్తి తొలిసారిగా తన తల్లి గొంతు వినగానే ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఎడ్వర్డో అనే వ్యక్తి మెనింజైటిస్ అనే వ్యాధి కారణంగా వినకిడి శక్తిని కోల్పోయాడు. దీంతో అతను దశాబ్దాలుగా నిశబ్దంలోనే గడిపాడు. ఎట్టకేలకు నిశబ్దాన్ని చీల్చుకుని ఒక చిన్న మైనర్ సర్జరీ తదనంతరం తొలిసారిగా తల్లి గొంతును విన్నాడు. 35 ఏళ్ల నిశబ్ద అనంతరం తొలిసారిగా తన అమ్మ గొంతు విని ఒక్కసారిగా భావోద్వేగంతో కళ్లు చెమ్మగిల్లాయి. ఈ మేరకు ఎడ్వర్డో తల్లి తన పక్కనే కూర్చిని పదేపదే తన కొడుకును పేరుతో పిలిస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉన్న మిగతా బంధువులంతా ఆ అద్భుత క్షణాన్ని చూస్తూ భావోద్వేగం చెందారు. సదరు వ్యక్తి తన చెవులు వినిపిస్తున్నందుకు ఆనందంతో తన కూతురు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎడ్వర్డో అమ్మ మీతో మాట్లాడుతోందని ఒకరు, ఇది హార్ట్ టచ్ చేసే ఘటన అని మరోకరు రకరకాలుగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...) -
ఫీచర్ ఫోన్ యూజర్లకు ఊరట: వాయిస్‌తో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ సేవల్లో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు బహుళ భాషల్లో వాయిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీటిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ , బెంగాలీ భాషల్లోఇది అందుబాటులోఉంది. ఈ సేవ త్వరలో గుజరాతీ, మరాఠీ,పంజాబీ వంటి ఇతర భాషలలో అందుబాటులోకి రానుంది. ఎన్ఎస్డీఎల్పేమెంట్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో టోన్‌ట్యాగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ దేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులను వాయిస్ ద్వారా చెల్లింపు సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తుంది యూపీఐ పేమెంట్స్ స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఏడాది మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ఫీచర్ ఫోన్వినియోగదారులకు 'యూపీఐ 123పే' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం వారికి లభించింది. ఇప్పుడు, VoiceSe అనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేసి, తమ ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి చేసుకోవచ్చు, నిధులను బదిలీ చేయలేరు. టోన్‌ట్యాగ్ సహ వ్యవస్థాపకుడు, ల్యాబ్స్ డైరెక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 100 శాతం డిజిటల్ అక్షరాస్యత లేదా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడని డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించేందుకు, సిరి , అలెక్సాలకు మించిన వాయిస్ టెక్నాలజీని పరిశీలిస్తున్నామన్నారు. -
మాటను బట్టి మనిషిని చిత్రిస్తుంది
ఫొటో అప్లోడ్ చేస్తే డేటాబేస్‌లో పరిశీలించి ఎవరో గుర్తించడం ఇదివరకు చూశాం కానీ.. మాట్లాడితే ఆ ధ్వనిని బట్టి మాట్లాడిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో గీసేయడం చూశారా? అది కూడా డేటాబేస్‌లో ఆ ధ్వని ఎవరిదో పరిశీలించకుండా! ‘మాట్లాడితే ఆడో, మగోచెప్పొచ్చు కానీ.. ఏ మనిషని ఎలా గుర్తిస్తాం?’ అనుకోవచ్చు. కానీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు మాత్రం ‘మాటలు చాలు’.. మనిషెవరో పసిగట్టేస్తామంటున్నారు. ఇలాంటి పని చేయగల ‘స్పీచ్2ఫేస్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్‌వర్క్‌ను వీళ్లు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏఐ.. మనుషుల మాటలను బట్టి వాళ్ల ముక్కు, చెంప ఎముకలు, దవడ ఆకారాన్ని గీసేస్తుంది. మనుషులు మాట్లాడే విధానం వాళ్ల ముక్కు, ఇతర ముఖం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుందనే సూత్రంపై ఆధారపడి ఇది పని చేస్తుంది. అయితే ఈ ఏఐ ఇంకా ప్రాధమిక దశలో ఉంది. కొన్నిసార్లు ముఖాలను తప్పుగా కూడా గీస్తోంది. ఉదాహరణకు హై పిచ్ గొంతున్న మగ వారిని ఈ ఏఐ ఆడవారిగా గుర్తిస్తోంది. ఆడవాళ్లకు డీప్ వాయిస్ ఉంటే మగవారని చెబుతోంది. ఆసియా ప్రజలు ఇంగ్లిష్ బాగా మాట్లాడితే కాస్త పశ్చిమ దేశాల ప్రజల ముఖాలను పోలినట్టు చూపిస్తోంది. ఈ ఏఐలో కొన్ని లోపాలు కనిపిస్తున్నా.. ఇది అద్భుతాలు చేస్తోందని, మున్ముందు పరిశోధనలకు ఇది ఊతమిస్తోందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ
కాందహార్: అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం మొదలైంది. టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. కాగా, ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు.. రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video : సముద్ర తీరంలో అద్భుతం! -
ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ 'అలెక్సా' కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
మాట్లాడితే చాలు ట్వీట్ పడిపోతుంది
చిట్టి చిట్టి మాటలు.గట్టి సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2021 ఏప్రిల్ నెల నాటికి ట్విట్టర్‌కి ప్రపంచ వ్యాప్తంగా 199మిలియన్ యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. అయితే వారి సంఖ్యను పెంచేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ ట్వీట్ ను డెవలప్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఐఓఎస్ లిమిటెడ్ యూజర్లకు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. కానీ, ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ట్విట్టర్ ప్రకటించలేదు. కాకపోతే ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు వాయిస్ ట్వీట్ ఆప్షన్ అందుబాటులోకి తేవడంతో ఆండ్రాయిడ్, డెస్క్ టాప్ యూజర్లు వినియోగించేందుకు త్వరలోనే ఈఫీచర్ పూర్తి స్థాయిలోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్, ఐ పాడ్ వినియోగదారులు ఈ వాయిస్ ట్వీట్ ఆప్షన్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ ,ఐప్యాడ్ యూజర్లు రెండు నిమిషాల 20 సెకన్ల వాయిస్ ట్వీట్లను మాత్రమే రికార్డ్ చేసే సదుపాయం ఉంది. వాయిస్ ట్వీట్‌ను పోస్ట్ చేయడానికి, వినియోగదారులు ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అనంతరం కంపోజ్ ట్వీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వాయిస్ ట్వీట్ చేసే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అదే ఆప్షన్ లో వేవ్ లెంగ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాయిస్ ట్వీట్ ను రికార్డ్ చేయాలి. పూర్తయిన తర్వాత డన్ అని క్లిక్ చేసే మీ వాయిస్ ట్వీట్ షేర్ అవుతుంది. చదవండి : ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్ -
నెలలుగా మూగబోయిన గొంతు.. చివరకు
లండన్: తలకు బలమైన గాయం తగలడంతో ఓ మహిళ కొన్ని నెలల తరబడి మాట్లాడలేకపోయింది. అయితే అనూహ్యంగా ఆమె ఇప్పుడు నాలుగు యాసల్లో గలగల మాట్లాడేస్తోంది. యూకేకు చెందిన ఎమిలీ ఈగన్ అనే మహిళ ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమె తల(మెదడు)కు గాయమైంది. అప్పటినుంచి ఆమె నోరు మూగబోయింది. గొంతు నుంచి మాట పెగిలేదే కాదు. అలా కొన్ని నెలలు గడిచాక ఆమె తిరిగి మామూలు మనిషైంది. పెదాలు కదిలిస్తూ మాట్లాడగలుగుతోంది. నిజం చెప్పాలంటే అంతకు ముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా మాట్లాడుతోంది. దీంతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంభాషించింది. (30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..) ఆమె నోటి పలుకులు వినగానే వారు ఓ క్షణం సంతోషించినా మరో క్షణం అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఆమె తన అసలైన యాసలో మాట్లాడకపోవడమే. అంతకుముందు మాట్లాడే ఎస్సెక్స్ యాస ఇప్పుడామెకు పలకడానికే రావట్లేదు, కానీ ఎంతో కష్టమైన ఈస్టర్న్ యూరోపియన్ యాసల్లో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ యాసల్లో సులువుగా మాట్లాడుతోంది. దీన్ని వైద్యులు "ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్"గా గుర్తించారు. ఇక ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మాటల్లోనే కాదు, రాతలోనూ తేడా వచ్చింది. ఇప్పుడు నేను కొత్తకొత్త పదాలను కూడా ఉపయోగిస్తున్నాను. అంతేకాదు, ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది" అని తెలిపింది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) -
ట్విటర్లో మరో కొత్త ఫీచర్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో మరో సరికొత్త ఫీచర్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. యూజర్లు తమ వాయిస్‌ని ఉపయోగించి ట్వీట్ చేసేలా కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించామని ట్విటర్ ప్రకటించింది. ఒకే ట్వీట్లో 140 సెకన్ల వరకు ఆడియోను కూడా జోడించేందుకు ఈ వాయిస్ ఫీచర్ అవకాశం కల్పించనుంది. ట్విటర్ ప్రొడక్ట్ డిజైనర్,సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాయప్యాటర్సన్, రెమి బౌర్గైన్ బ్లాగులో ఈ విషయాన్ని వెల్లడించారు. తమ తాజా ఫీచర్ ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తికరమైన విషయాలతోపాటు, బ్రేకింగ్ న్యూస్ ను కూడా వాయిస్ ట్వీటింగ్ ద్వారా షేర్ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు 280 అక్షరాల ఇబ్బంది ఉండదని, అలాగే అనువాద చిక్కులు కూడా తొలగిపోతాయన్నారు. ప్రస్తుతానికి ఐఓఎస్ లో ప్రయోగ దశలో ఉన్న ఆ వాయిస్ ఫీచర్ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఐఓఎస్ వినియోగదారుడికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ట్విటర్ హోమ్‌పేజీ లోని కొత్త వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా వినియోగదారులు ఈ వాయిస్ ట్వీట్ చేయవచ్చు. సాధారణ ట్వీట్ల మాదిరిగానే యూజర్లు రీట్వీట్ చేయవచ్చు. వినవచ్చు. వాటికి ప్రత్యుత్తరం కూడా ఇవ్వవచ్చు. ట్వీట్ కంపోజ్ చేసేటప్పుడు, కెమెరా ఐకాన్ పక్కన వేవ్‌లెన్త్స్ చిహ్నం కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అనంతరం దిగువన ఉన్న రికార్డ్ బటన్ క్లిక్ చేసి 140 సెకన్ల వరకు వాయిస్‌ని రికార్డ్ చేయవచ్చు. రికార్డింగ్ పూర్తి అయ్యాక.. రికార్డింగ్‌ను ఆపివేయడం మర్చిపోకూడదని ట్విటర్ సూచించింది. కాగా ఇన్స్టాగ్రామ్ మాదిరిగా ఫ్లీట్స్ అనే కొత్త ఫీచర్‌ను ఇటీవల రూపొందించింది. అయితే దీనికి మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ వాయిస్ ఎవరిదో తెలిసిపోయిందా ?
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఏంటంటే బిగ్‌బాస్. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో నిర్వాహకులు ఇటీవలే రెండో సీజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆకట్టుకొనే వాటిలో బిగ్‌బాస్ వాయిస్ ఒకటి. అయితే ఇప్పటి వరకూ బిగ్‌బాస్ ఎవరో ఎవరికీ తెలియదు. సీజన్ మారింది. కంటెస్టంట్లు మారిపోయారు. హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నానీ వచ్చేశారు. కానీ బిగ్‌బాస్ ఎవరు, గంభీరంగా ఉండే స్వరం మాత్రం ఎవరిదో ఎవరికీ తెలియదు. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. బిగ్‌బాస్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ బిగ్‌బాస్‌గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్ ఏంచేస్తారంటే.. కంటెస్టంట్లకు టాస్క్ ఇవ్వడం, ఆదేశాలను జారీచేయడం, బిగ్‌బాస్ నియమనిబంధలను తెలియచెప్పడం వంటి పనులు చేస్తారు. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పేశారు!
-
జియో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పేశారు!
జియో యూజర్లకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పేశారు. జియో సిమ్‌పై అందిస్తున్న ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ ప్రకటనను వెలువరిచారు. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం జియో సిమ్‌ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు. కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకొచ్చాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ జియో ఉచిత సేవలను పొడిగిస్తామని చెప్పారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్‌వర్క్‌లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులతో పాటు ఇతరాత్ర ఉచిత సేవలు డిసెంబర్ 3తో ముగియనున్న సంగతి తెలిసిందే. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు జియో అందిస్తున్న సేవలన్నింటిన్నీ ఉచితంగా వాడుకోవచ్చని ముఖేష్ అంబానీ గురువారం తెలిపారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు : సీపీఎం
విజయవాడ : ఈ నెల 23వ తేదీన జరిగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని, ప్రతిపక్షాల గొంతునొక్కే చర్యలను అధికార పక్షం మానుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కోరారు. ఆయన సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రస్తావిస్తున్న సమయంలో ప్రతిపక్షాల మైక్‌లు నిలుపుదల చేయడం, మాట్లాడే ప్రతిపక్ష నాయకులను నిలువరించే ప్రయత్నం చేయడం, అడ్డుపడటం వంటి చర్యలకు మేయర్ పాల్పడుతున్నారని, అవి తగవని సూచించారు. నగర మేయర్‌గా వ్యవహరించాలే తప్ప, తెలుగుదేశం పార్టీ నేతగా కాదని హితవుపలికారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారనికి ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్‌ను, పూల మార్కెట్‌ను తరలించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ మార్కెట్లను తరలించి సింగ్‌నగర్‌లో ఎక్స్‌ల్‌ప్లాంట్ స్థలంలో 4 ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. నగరంలో ప్రబలిన విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులపై కౌన్సిల్ సమావేశంలొ చర్చించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
ఢిల్లీ నాయకుడి గల్లీ మాటలు
హన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్న సభతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమిత్‌షా రాకతో వరంగల్ రూపు రేఖలు మారుతాయని ఆశించామన్నారు. ఆయన జిల్లా అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు ప్రకటించకుండానే వెళ్లిపోయారన్నారు. ఇది రాష్ట్ర బీజేపీ నాయకుల వైఫల్యమన్నారు. ఢిల్లీ స్థాయి నాయకుడు వచ్చి, గల్లీ మాటలు మాట్లాడటం దారుణమన్నారు. ఇందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన ముందుకు కదలడం లేదన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటును కేంద్రం మరిచిందన్నారు. వరంగల్ నగరాన్ని నర్మ్, హృదయ్ పథకాల్లో చేర్చినా ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా విదిల్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వడం లేదన్నారు. అయినా రూ.వేల కోట్లు ఇచ్చామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. బీజేపీలో ఉన్న నలుగురిలోనే సఖ్యత లేదని, వీరితో పార్టీ బలపడుతుందా అని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, ఎల్లావుల లలితా యాదవ్, మరుపల్లి రవి, చేవెళ్ల సంపత్, జోరిక రమేష్, వాసుదేవరెడ్డి, కోల జనార్దన్, పద్మ పాల్గొన్నారు. -
కాషాయ దళం.. ‘విమోచన’ గళం
వరంగల్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోరాట క్రమాన్ని గుర్తు చేసుకుంటూ సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా యాత్ర ముగింపు సభ వరంగల్‌లో శనివారం జరిగింది. ఇదే వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలువురిని ఈ సభలో సన్మానించగా.. కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ పోరాట నృత్యరూపకం ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం హన్మకొండ : తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు వోడపల్లి వెంకట్రాం నర్సయ్య, ఒద్దుల చంద్రారెడ్డి, అడవయ్య, పాశికంటి వీరస్వామితో పాటు బత్తిని మొగిలయ్య కుమారుడు బత్తిని బాబును శాలువా కప్పి సన్మానించారు. వీరితో పాటు మరో 50 మందిని పార్టీ నాయకులు సన్మానించారు. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం హన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాకతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. 2019 సంవత్సరంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు అమిత్‌షా రాష్ట్రంలో మూడోసార్లు పర్యటించడం గమనార్హం. ఇంతకు ముందు సూర్యాపేట, హైదరాబాద్‌లలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆమిత్షాతో పాటు కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్ గంగారం అహిర్, బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు, నాయకుడు సోదన్సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు శాసన సభాపక్ష ఉప నేతలు రాంచంద్రారెడ్డి, వి.వి.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నెహ్రూ యువ సంఘటన్ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, ఒటేరు జయపాల్, వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, రావు అమరేందర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.' అమిత్‌షాకు సన్మానం వరంగల్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు శాలువా కప్పి అమిత్‌షాను సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. ఆయన తలకు టోపీ ధరింపజేసి కరవాలం, గదను అందజేశారు. ‘చరిత్రను మరిచిన టీఆర్ఎస్’ న్యూ శాయంపేట : టీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయంలోపడి తెలంగాణ చరిత్రను మర్చిపోయే స్థితికి దిగజారిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో జాతీయ పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు పాల్గొని, అమరులకు నివాళులు అర్పించడం అభినందనీయమన్నారు. విశ్వకర్మ దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం మూడూ ఇదే రోజు జరగడం విశేషమన్నారు. సెప్టెంబర్ 17 చరిత్రను ఎవరు మరువలేరన్నారు. తెలంగాణ పోరాటం అజరామరం హన్మకొండ : నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ ప్రజానీకం స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగిడిన రోజు సెప్టెంబర్ 17 అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో శనివారం బీజేపీ తిరంగా యాత్ర ముగింపు సభ జరిగింది. ఇదే వేదికగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు సంబంధించి చారిత్రక ప్రాధాన్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో నిజాం అరాచక పాలనకు తెరపడిందన్నారు. తెలంగాణతో ఉక్కు మనిషి వల్లాభాయ్ పటేల్‌కు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలనే డిమాండ్‌తో ముందుకెళ్తున్న రాష్ట్ర బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మద్దతు ప్రకటించడం పట్ల కోవ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. మజ్లిస్‌తో ఉన్న సత్సంబంధాల వల్లే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడానికి సీఎం కేసీఆర్ సాహసించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం 2019 సంవత్సరంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తెలంగాణ విమోచణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. అమరుల త్యాగాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఉద్యమం అంతం కానిదని, ఆరంభం మాత్రమేనన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వబోమన్నారు. -
కుమారుడు మాట వినడం లేదని రైతు ఆత్మహత్య
రేగొండ: తన కుమారుడు వ్యవసాయ పనికి రావడం లేదని మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడవటంచలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బాషబోయిన పోషాలు(55) కొన్నేళ్ల క్రితం గణపురం నుంచి కొడవటంచలోని అత్తవారింటి వద్దకు వచ్చాడు. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. నిత్యం తానే వ్యవసాయ పనులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నానని, తన కుమారుడు ప్రశాంత్‌ను కూడా వ్యవసాయ పనుల్లో సాయపడాలని కోరాడు. ప్రశాంత్ సహకరించకపోవడంతో అతడిని భయపెట్టాలన్న ఉద్దేశంతో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో పోషాలు పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో చుట్టుపక్కలవారు గమనించి భార్య స్వరూపకు సమాచారమిచ్చారు. అతడిని చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిSభార్య స్వరూప, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. -
మన మాటలు కుక్కలకి అర్థమవుతాయట!
లండన్: మనుషులు మాటలను కుక్కలు అర్థం చేసుకుంటాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో ఇటీవల ఒక అధ్యయనంలో తేలినట్లు హంగేరిలోని ఒట్వాస్ లోరాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అటిల్లా అండిక్స్ వెల్లడించారు. కుక్కలను పెంచుకునే యజమానులు తరచూ వాడే పదాలను శునకాలు గుర్తుపెట్టుకుంటాయని, మనిషి మాట్లాడే మాటల ఉచ్ఛారణ, వారి హావాభావాల ఆధారంగా కుక్కలు ఆ పదాల అర్థాలను పసిగడతాయని తమ అధ్యయనంలో స్పష్టమైనట్లు తెలిపారు. -
రెండేళ్లలో కొత్తగా 3 వేల మంది
దేశవ్యాప్తంగా స్పీచ్ రికగ్నిషన్ సేవల్లో విస్తరణ: నుయాన్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాయిస్, లాంగ్వేజ్ సొల్యూషన్స్ అందిస్తున్న అమెరికాకు చెందిన నుయాన్స్ కమ్యూనికేషన్స్ వచ్చే రెండేళ్లలో భారత్‌లో 3,000 మంది మెడికల్ లాంగ్వేజ్ స్పెషలిస్టులను (ట్రాన్స్క్రిప్షనిస్ట్) నియమించనుంది. నాస్డాక్లో లిస్టయిన ఈ కంపెనీకి హైదరాబాద్‌లోని 400 మంది సిబ్బందితో సహా భారత్‌లో అయిదు నగరాల్లోని కార్యాలయాల్లో 4,000 మంది ఉద్యోగులున్నారు. నుయాన్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్‌కు కొత్తగా 200 మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ హెల్త్ విభాగం గ్లోబల్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ టించ్ తెలిపారు. మాటలను గుర్తించే (స్పీచ్ రికగ్నిషన్) టెక్నాలజీ ఉత్పత్తులతో దేశంలో విస్తరించనున్నట్టు చెప్పారు. గత రెండేళ్లలో కంపెనీ భారత్‌లో రూ.45 కోట్ల దాకా వెచ్చించింది. కాగా ఇప్పుడిప్పుడే దేశంలోని ఆసుపత్రులు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సేవలను వినియోగిస్తున్నట్లు నుయాన్స్ ఇండియా హెచ్ఆర్ హెడ్ సౌమిత్ర కుమార్ దాస్ తెలియజేశారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యులు తమవద్దకు వచ్చిన రోగి వివరాలు, వారికున్న సమస్య, చేయాల్సిన చికిత్స వంటివి వాయిస్ రికార్డ్ చేస్తారు. ఈ వాయిస్ రికార్డులను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సేవలందించే కంపెనీకి ఆసుపత్రులు పంపిస్తాయి. వైద్యుడు మాట్లాడిన ప్రతి మాటను ట్రాన్‌స్క్రిప్షనిస్టులు హెడ్ఫోన్లలో విని డిజిటల్ డాక్యుమెంట్లుగా అక్షర రూపం కల్పిస్తారు. ఈ డాక్యుమెంట్లను తిరిగి సంబంధిత ఆసుపత్రికి పంపిస్తారు. పత్రాలు డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కడైనా, ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు’’ అని ఆయన వివరించారు. స్పీచ్ రికగ్నిషన్లో తాము అందించే సేవలు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్టులకు బాగా ఉపయోగపడతాయన్నారు. -
చక్కటి గొంతుంటే సెట్టయిపోతారు
మీరు మధురమైన కంఠాన్ని కలిగినవారా..! అయితే, రెస్యూమ్ విషయం పక్కన పెట్టండి.. అవునండీ.. మీకు బాగా మాట్లాడే నైపుణ్యం ఉంటే అదే మీకు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్‌కు చెందిన అధ్యయనకారులు. సాధారణంగా ఉద్యోగం ఇవ్వదలుచుకున్నవారు మీరు ఎంతటి విషయ సంపాదన కలిగి ఉన్నవారనే విషయం, పోటీ ప్రపంచంలో మీకున్న సమర్థతను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా మరో విషయంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చూస్తారంట. చెప్పే విషయాలు ఎంత శ్రద్ధగా వింటున్నారనే విషయాన్ని బట్టి కాకుండా ఆ చెప్పిన విషయాలను ఎంత చక్కగా ఎదుటివారికి వీణుల విందుగా ఎంత మేరకు చదువుతున్నారనే విషయాన్నే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారట. -
మాటలతోనే వెతికేయండి!
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను మీరెలా వాడుతున్నారు? ఏముంది... గూగుల్ వెబ్సైట్లో కీవర్డ్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలంటున్నారా! అంత కష్టం కూడా పడాల్సిన అవసరం లేదిప్పుడు. గూగుల్ ‘నౌ’ ఫీచర్‌తో ఎంచక్కా మీ మాటలతోనే వెతికేయవచ్చు... ఇంకొన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. అదెలాగో చూడండి... ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించే వారందరికీ ‘సిరి’ వాయిస్ అసిస్టెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ మీ సహాయకుడిలా పనిచేస్తుంది. మీ మాటల్నే ఆదేశాలుగా నెట్లో సమాచారం వెతికి పెడుతుంది... నోట్స్ టైప్ చేసి పెడుతుంది. చెప్పినవాళ్లకు మెయిల్ కూడా చేసేస్తుంది. దీనికి పోటీగా గూగుల్ అభివద్ధి చేసిన వాయిస్ అసిస్టెంట్ పేరు గూగుల్ ‘నౌ’. డెస్క్‌టాప్ పీసీలతోపాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లతో పనిచేస్తుంది. చాలావరకూ స్మార్ట్ఫోన్లతోపాటు వచ్చే ఈ ఫీచర్‌ను ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చునంటే... లెక్కలేస్తుంది... ఎప్పటికప్పుడు మారిపోయే విదేశీ కరెన్సీ రేట్లను తెలుసుకునేందుకు, శాతాలు లెక్కకట్టేందుకు, కొలతలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు... "Ok Google, what's ten dollars in Japanese Yen?" "Ok Google, how many teaspoons in a liter liquid?"ఇలాగన్నమాట! భాషల హద్దులు వద్దు... మీరు విదేశాలకు వెళ్లారనుకుందాం. అక్కడి భాషలోనే సమాచారం తెలుసుకోవాలన్నా? మాట్లాడాలన్నా గూగుల్ నౌకు మించిన సహాయకుడు దొరకడు. మీకు ఏం కావాలో ఎంచక్కా ఈ అప్లికేషన్‌తో మాట్లాడేయండి. అంతేకాదు. మీ ప్రయాణపు టికెట్లను ఖరాదు చేసిన మెయిళ్లు జీమెయిల్ ద్వారా వచ్చి ఉంటే గూగుల్ నౌ మీకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తూ ఉంటుంది. ఆయా ప్రదేశాల వాతావరణం వంటివన్నమాట. మీరు స్పెయిన్ వెళ్లారనుకుంటే కింద చూపినట్లుగా గూగుల్ నౌను అడిగేయవచ్చు. "Ok Google, say in Spanish, 'Where is the bathroom?'" "Ok Google, say in Spanish, 'I'm sorry officer.'" "Ok Google, say in Spanish, 'I want to go to the Indian embassy.'" కుతూహలంగా ఉంటే.. చాలా సందర్భాల్లో అకస్మాత్తుగా మనకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా గూగుల్ సెర్చ్ చేసే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు గూగుల్ నౌ అక్కరకొస్తుంది. మీరు చేయాల్సిందల్లా నేరుగా ప్రశ్న అడిగేయడమే. ఉదాహరణకు... "Ok Google, who is Narendra Modi?" "Ok Google, what's FORTRAN?"ఈ ప్రశ్నలకు గూగుల్ నౌ వికీపీడియా వంటి ప్రముఖ వెబ్సైట్ల నుంచి సమాచారం సేకరించి మీకు అందిస్తుంది. అంతేకాదు... ఈ అప్లికేషన్‌ను ఇప్పుడు ఎలాంటి సందర్భంలోనైనా ఉపయోగించుకోవచ్చు. అంటే... ప్రత్యేకంగా వెబ్సైట్ ఓపెన్ చేసే పనిలేకుండా... మామూలుగా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చునన్నమాట. అయితే దీనికోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌లో అప్లికేషన్‌ను వెతికిన తరువాత... Settings >Language & Input >Voice Search >"Ok Google"లోకి వెళ్లండి. ఆ తరువాత ఏఏ సందర్భాల్లో ఈ అప్లికేషన్ పనిచేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. దీంతోపాటు మ్యూజిక్ ప్లేయర్‌ను మాటలతోనే నియంత్రించగలగడం, పాటల వివరాలు తెలుసుకోగలగడం కూడా గూగుల్ నౌలో ఉన్న కొన్ని ఇతర ఫీచర్లు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా డెస్క్టాప్పై ఉన్న మీ గూగుల్ నౌను వాడటం మొదలుపెట్టండి. చేయాల్సిందల్లా గూగుల్ సెర్చ్‌బార్ పక్కనే కనిపించే చిన్న మైక్‌ను క్లిక్ చేయడం అంతే! -
సర్వేలో మహిళల సిగపట్లు
ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళల ఘర్షణ ఆ ఇంటిని వదిలేసిన ఎన్యూమరేటర్ పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ పరకాల : సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌తో ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన సంఘటన పట్టణంలోని వెలమవాడలో మంగళవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని వెలమవాడకు చెందిన దగ్గు నర్సింగరావు ఎంబీబీఎస్ వైద్యుడు. పరకాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సునీతతో 1999లో వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చాయి. అదే సమయంలో నర్సింగరావు శ్రీశైలం సమీపంలోని సుండిపేటకు చెందిన వాణి(నూర్జహాన్)ను 2005లో మరో పెళ్లి చేసుకున్నాడు. అతడు అనారోగ్యంతో 2008లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్యలు సునీత, వాణి మధ్య తగాదా వచ్చి కోర్టుకెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు సమాచారం అందడతో వాణి సోమవారం రాత్రి పట్టణానికి చేరుకుంది. సర్వే కోసం వచ్చే సిబ్బంది కోసం మంగళవారం ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో 9-49 ఇంటినంబర్లో ఉంటున్న వారివద్దకు ఎన్యూమరేటర్ కేదారి వచ్చారు. ఆయన సమక్షంలోనే సునీత, వాణి.. ఆ ఇంటిపై నా పేరు రాయమంటే.. నా పేరు రాయమని ఘర్షణకు దిగారు. గంటల తరబడి ఇద్దరు పేరు కోసం పట్టుబట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సునీత, వాణికి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవ పెట్టుకోవడం సరికాదని సూచించారు. కేసు విచారణలో ఉండగా మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదని, మరోసారి గొడవ జరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్యూమరేటర్ ఆ ఇంటిని మినహాయించి సర్వే కొనసాగించాడు. -
గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. స్వరమే అసలైన పెట్టుబడి టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి. అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే. వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది. వాయిస్, డిక్షన్‌తో రాణింపు ‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్లో ఎదిగేందుకు వీలుంటుంది’’ -రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే -
గర్జించిన మహిళలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :సిక్కోలు మహిళలు గర్జించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డెక్కి నినదించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన మహిళా గర్జన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గృహిణులు, డ్వాకా మహిళలు, ఐకే పీ, ఐసీడీఎస్‌కు చెందిన మహిళా ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువతులు భాగస్వాములయ్యారు. గర్జనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం ఎన్జీవో హోం వద్దకు ఉదయం తొమ్మి ది గంటలకే భారీగా మహిళలు చేరుకున్నారు. అక్కడ నుంచి వైఎస్ఆర్ కూడలి వరకు సమైక్యాంధ్రకు మద్దంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. అక్కడ మానవ హారం చేపట్టారు. డప్పులు వాయిస్తూ, నెత్తిపై కడవలతో నీటిని పట్టుకొని, తెలుగుతల్లి వేషధారణలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీసీ జిల్లా కన్వీనర్ ధర్మన పద్మప్రియాదాస్, పార్టీ నాయకులు బొడ్డేపల్లి మాధురి, వరుదు కల్యాణి, వైవీ సూర్యనరాయణ, ఎన్ని ధనుంజయ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గీతా శ్రీకాంత్, ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం, చౌదరి పురుషోత్తం, ఏఆర్కే దాస్, హరికృష్ణ, విద్య సంస్థల ప్రతినిధు లు జామి భీమ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్‌లో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఆర్ ఎంఓ ఎల్.ప్రసన్న కుమార్, ఏఆర్ఎంఓ బీసీహెచ్ అప్పలనాయుడు భాగస్వాములయ్యారు. మహిళా ఉద్యోగులు రిమ్స్ ఆవరణను తుడిచి నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ, గృహనిర్మాణ, పశుసంవర్థక, ఆర్అండ్బీ, పురుపాలక, ఆర్టీసీ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. వైఎస్ఆర్ కూడలి వద్ద ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కోర్టువద్ద న్యాయవాదులు దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షాశిబిరాన్ని ఆ సంస్థ చైర్మన్ సందర్శించి సంఘీభావం తెలిపారు. 15న కలెక్టరేట్, జెడ్పీ వద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఉద్యోగుల సహకరించాలని కోరారు. 20వ తేదీన తలపెట్టి లక్ష గళార్చనకు ఉద్యోగులు వారి స్నేహితులను, బంధువులను తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో టి.వైకుంఠరావు, ఎస్.వి.రమణమూర్తి పాల్గొన్నారు. పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో 150 అడుగుల జాతీయ జెండాతో మహార్యాలీ చేపట్టారు. వేలాది మహిళలతో పాలకొండలో మహిళా మార్చ్ జరిగింది. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద నిర్వహించిన ప్రజాబ్యాలెట్లో సమైక్యాంధ్రకు శతశాతం ఓటింగ్ నమోదైంది. చినమంగళాపురం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 50 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహారదీలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి శిబిరం వద్ద సీతంపేట మండలం చినబగ్గ, పూతికవలస, కొత్తూరు మండలం లబ్బ స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఉపాధ్యాయులు దాదాపు 70 మంది నిరాహారదీక్ష చేపట్టారు. విద్యార్థి జేఏసీ నేతృత్వంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సోనియా, మన్మోహన్, సీమాంధ్ర కేంద్రమంత్రుల మాస్క్‌లు పెట్టు.. వ్యంగ్య ప్రదర్శనలతో నిరసన తెలిపారు. సీతంపేటలో మండల మహిళా సమాఖ్య నుంచి పీఎంఆర్సీ వరకు మహిళలు ర్యాలీ చేసి రహదారిపైనే సమావేశం ఏర్పాటు చేశారు. వీరఘట్టంలో ఐసీడీఎస్ ఐధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రహదారిని కంపలతో తుడుస్తూ నిరసన తెలిపారు. ఐకేపీ, ఐసీడీఎస్‌ల ఆధ్వర్యంలో అధికసంఖ్యలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. లక్ష్మీనగర్ జంక్షన్ వద్ద మానవహారం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమంపై అవగాహక కల్పించేందుకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సరుబుజ్జిలి జంక్షన్లో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. 48 గంటలుగా సరుబుజ్జలిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయలుకు ఎంపీడీఓ కె.వసంతరావు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. బూర్జ జంక్షన్లో మహిళా సంఘాలు మానవహారం చేపట్టారు.నరసన్నపేటలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిం చారు. రోడ్డుపై ైబె ఠాయించి నినాదాలు చేశారు. సమైక్య గీతాలు ఆలపించారు. జలుమూరు, పోలాకి, సారవకోట మండలాల్లో నిరసన కార్యక్రమాలను సమైక్యవాదులు చేపట్టారు. జలుమూరు మండలం కరవంజి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పలాస-కాశీబుగ్గ సూర్యతేజ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్‌కు సమైక్య సెగ తగిలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేయించారు. పలాస జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. పొందర కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఉద్యోగుల సంఘాలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. టీడీపీ, ఉపాధ్యాయ జేఏసీ, ప్రెస్‌క్లబ్ సభ్యుల దీక్షలు కొనసాగాయి. గురుదాసుపురం, మామిడిమెట్టు గ్రామాల్లో ఉపాధ్యాయులు ర్యాలీ రాష్ట్రాన్ని విభజించవద్దని నినాదాఉలు చేశారు. సున్నాడ గ్రామానికి చెందిన జీడి కార్మికులు రోడ్డుపై జీడిపిక్కలు కొడుతూ నిరసన తెలిపారు. మందసలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లో వెఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోని రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధికంగా మహిళలు పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కవిటి మండలంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. కంచిలి మండలంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఎచ్చెర్లలోని పాలటెక్నిక్ కళాశాల ఆధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కుశాలపురం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పలువురు అయ్యవార్లు పాల్గొన్నారు.