న్యూఢిల్లీ: జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) ద్వారా భారతీయ భాషల్లో వాయిస్ ఆధారిత బుకింగ్ సర్వీసులు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ట్రావెల్ పోర్టల్ మేక్‌మైట్రిప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో సందర్భం, బడ్జెట్, కాల వ్యవధి, యాక్టి విటీలు మొదలైన వివరాలను ప్రయాణికులు తెలియజేస్తే .. వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను ఆఫర్ చేసేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది.
పోర్టల్‌లో ఈ సాంకేతికతను పొందుపర్చారు. ప్రస్తుతం ఫ్లయి ట్లు, హాలిడేస్ కస్టమర్ల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు మేక్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మాగో తెలిపారు. మేక్‌మైట్రిప్ అనుభవం, తమ ఏఐ సామర్థ్యాలతో దేశీయంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ఈడీ సంగీతా బవి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment