2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి | Microsoft To Invest 3 Billion In India For Cloud And AI Expansion Says CEO Satya Nadella | Sakshi
Sakshi News home page

2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి

Published Tue, Jan 7 2025 3:57 PM | Last Updated on Tue, Jan 7 2025 4:14 PM

Microsoft To Invest 3 Billion In India For Cloud And AI Expansion Says CEO Satya Nadella

టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.

బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.

సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.

ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!

మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement