ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్దికి మూలం కావొచ్చు. అభిప్రాయాలకు విరుద్ధంగా లక్షలాది మంది ఉద్యోగాలు ప్రభావితాయేమో. కానీ భవిష్యత్ బాగుండాలంటే నాలెడ్జ్ అనేది చాలా అవసరం’ అంటూ ప్రపంచ దేశాల జాబ్ మార్కెట్‌లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, చాట్‌జీపీటీ టూల్స్‌పై మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో మూడు రోజుల పాటు కొనసాగుతున్న బీ20 సమ్మిట్‌కు బ్రాడ్ స్మిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృత్తిమ మేధతో పొంచి ఉన్న ప్రమాదాలు, చాట్‌జీపీటీ వంటి ప్రొడక్టీవ్ టూల్స్‌పై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంత మనుషుల నియంత్రణలోనే ఉంటుంది.అలా నిర్ధారించేలా వ్యవస్థలు చాలా అవసరమని అన్నారు.
అంతేకాదు, ఏఐ అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడంలో, వారికి కావాల్సిన అనేక ప్రశ్నలకు సమాధానాలను కొనుగొనేందుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. ట్రాన్స్‌లేషన్, వర్క్ ప్రొడక్టివిటీ వంటి అంశాల్లో పని తీరు బాగుంటుంది. అలా అని ఆలోచించడం మానేయాకూడదు. ఇది మరింత వృద్ధికి, కొత్త ఉద్యోగాలను తయారు చేసేలా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
భవిష్యత్ కోసమే తప్ప
చాట్‌జీపీటీ వంటి ప్రొడక్టీవ్ టూల్స్ మానవ జీవన విధాన్ని మరింత సులభతరం చేసేందుకు ఓపెన్ ఏఐతో అభివృద్ది చేయించాం. రానున్న రోజుల్లో చాట్‌జీపీటీతో వైద్యులు వ్యాధులను నిర్ధారించడంలో, ఆ వ్యాధుల్ని నయం చేసేలా కొత్త ఔషదాల్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అన్నింటికంటే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులు ఒక ట్యూటర్‌లా కలిసి పనిచేస్తుంది. ఏఐ లాంటి టెక్నాలజీ లేని సమయంలో అంటే సుమారు 600 ఏళ్ల క్రితం మనకున్న జ్ఞానంతో ప్రింటింగ్ ప్రెస్ లాంటి గొప్ప ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చామని గుర్తు చేశారు. మనిషి తెలివి తేటలకంటే ఏఐ టెక్నాలజీ గొప్పవేం కావని అన్నారు.
మ్యాజిక్ ఏం చేయదు
‘ఏఐ మ్యాజిక్ ఏం చేయదు. మ్యాథ్స్ మాత్రమేనని అన్నారు. ఏఐపై మన ముందున్న లక్ష్యం వాటితో ప్రమాదం లేకుండా చూసుకోవడమేనని తెలిపారు. అవి మనుషుల నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఏఐ నుంచి ప్రమాదాల బారిన పడకుండా భద్రత, వ్యవస్థలను అభివృద్ది చేయాలి. బాధ్యతాయుతమైన పద్దతిలో ఏఐ టూల్స్‌ను తయారు చేయాలి. ప్రతి దేశంలో కొత్త చట్టాలు, నిబంధనల్ని తప్పని సరిగా అమలు చేయాలని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment