టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టింస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆ పదమే నచ్చదని అన్నారు. దీనికి ఓ కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని మనుషులతో పోల్చడం సరికాదని అన్నారు.
1950లలో పుట్టుకొచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదం పట్ల సత్య నాదెళ్ల అయిష్టతను వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను, మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలువవచ్చు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి ఏఐ అవసరం లేదని సత్య నాదెళ్ల అన్నారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సుకు సరికాదు. ఎందుకంటే మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది మనిషి సృష్టించినదాన్ని మనిషి కంటే గొప్పదని అనుకుంటున్నారు. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే చెందుతుంది. ఎందుకంటే వాటిని రూపొంచేది మనిషే కాబట్టి.
ఏఐ ఇలా పనికొస్తుంది
ఏఐ మానవ పరిభాషలో కావలసిన విషయాలను వెల్లడిస్తుందని అంగీకరించారు. సాఫ్ట్‌వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్‌వేర్ వెనుక ఉన్న అల్గారిథమ్‌లను అర్థం చేసుకోవడానికి ప్రజలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment