
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్‌డేట్ అవుతున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మార్చి 2025లో ఇండియాలో అధికంగా అమ్ముడైన టాప్-5 పాపులర్ మొబైల్ మోడళ్ల వివరాలను కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఆయా వివరాలు కింది విధంగా ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్: యాపిల్ ఏ 18 ప్రో చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే.
ఇదీ చదవండి: ఐపీఎల్ టీమ్‌లతో మాస్టర్ కార్డ్ జట్టు
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్: ఏఐ ఆధారిత కెమెరా, టెన్సర్ జీ 4 చిప్‌సెట్, 6.8 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే.
షియోమీ 15 అల్ట్రా: 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5410 ఎంఏహెచ్ బ్యాటరీ.
వన్‌ప్లస్ 13: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.