gadgets
-
స్క్రీన్కు బానిసవుతున్న బాల్యం
విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.పేరెంట్స్ నుంచే పిల్లలకుకేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్‌ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్‌టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’సమయం గడపాలిమొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్‌డోర్‌లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు. -
కొత్తగా వచ్చాయ్.. లేటెస్ట్ ఫోన్లు.. గ్యాడ్జెట్లు
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ట్యాబ్స్ వంటి కొత్త గ్యాడ్జెట్స్ ఏవో ఒక ఒకటి మార్కెట్లోకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి ఫీచర్స్, ప్రత్యేకతలేంటి అన్న విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫోన్లు, వాచీలు, గ్యాడ్జెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈడిస్ప్లే: 6.7 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080×2340 పిక్సెల్స్మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్/256 జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 14; ఫ్రంట్ కెమెరా: 10 ఎంపీబ్యాటరీ: 4700 ఎంఏహెచ్; కనెక్టివిటి: 5జీనథింగ్ సీఎంఎఫ్ వాచ్ ప్రో2సైజ్: 1.32రిజల్యూషన్: 466×466 పిక్సెల్స్» స్విమ్మింగ్, రన్నింగ్, రాక్ క్లైంబింగ్, జిమ్ సెషన్..మొదలైన యాక్టివిటీలలో ఉపకరిస్తుంది.» స్ట్రెస్ రీడింగ్, స్లీప్ మానిటరింగ్లాంటి ఫీచర్లు ఉన్నాయి.ఫుల్ చార్జ్: (జీరో నుంచి) 100 నిమిషాలుఒప్పో ప్యాడ్ 3 ప్రోసైజ్: 12.5 అంగుళాలురిజల్యూషన్: 2000×3200 పిక్సెల్స్ఇంటర్నల్ మెమొరీ: 256 జీబిబ్యాటరీ కెపాసిటీ: 10000 ఎంఏహెచ్వివో ఎక్స్ 200 ప్రోడిస్ప్లే: 6.78 అంగుళాలు; బరువు: 223 గ్రా.మెమొరీ: 256జీబి 12జీబి ర్యామ్/512జీబి 16జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 15రిజల్యూషన్: 1260×2800 పిక్సెల్స్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ;బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ -
ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు
ఎవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. 23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్‌పాయింట్ పెన్ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.చిన్నప్పటి నుంచే గాడ్జెట్లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం.ఈ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలునాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే.. అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ ఇవే..
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లదే హవా. కళ్లు చెదిరే ధరతో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే స్థాయిలో లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్‌ఫోన్స్ ధర తెలిస్తే మాత్రం నిజంగానే మతిపోతుంది! లూయిస్ విట్టన్ అనే కంపెనీకి చెందిన ఇయర్‌ఫోన్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి. ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్ఫోన్లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది. వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్‌బడ్‌ల ధర సోషల్ మీడియాలో వైరల్ మారి వీటికి క్రేజ్‌ను పెంచాయి. ప్రత్యేకతలెన్నో.. మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్‌తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్‌బడ్స్‌కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్ స్పెషల్ ఫీచర్స్. -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్‌ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్‌ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్‌మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్‌లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
తలనొప్పిని తరిమేసే గాడ్జెట్.. ధర ఎంతంటే?
తలనొప్పి చాలామందిని తరచు వేధించే సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలతో ఉపశమనం పొందడం తప్ప ఇప్పటివరకు నానా తలనొప్పులకు తగిన పరిష్కారమే లేదు. అయితే, ఈ చిన్న పరికరం ఎలాంటి మొండి తలనొప్పులనైనా చిటికెలో తరిమికొడుతుంది. అమెరికన్ కంపెనీ ‘గామాకోర్’ ఇటీవల ఈ పరికరాన్ని ‘గామాకోర్ సఫైర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మెడవద్ద నరాలు ఉండేచోట పెట్టుకుని, ఆన్ చేసుకుంటే వైబ్రేట్ అవుతూ ‘వేగస్’నరాన్ని ఉత్తేజపరచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులనైనా, తరచుగా పీడించే మైగ్రేన్ వంటి తలనొప్పులనైనా ఇది నిమిషాల్లోనే తరిమికొడుతుంది. దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మాత్రల వాడకమే కాకుండా, వాటితో ఎదురయ్యే దుష్ఫ్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. దీని ధర 655 డాలర్లు (రూ.54,446) మాత్రమే! -
గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్‌కున్న డిమాండ్!
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్‌కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. గతంలో ఇలా.. గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది. -
అదిరిపోయే టెక్నాలజీ.. డిజిటల్ ఇన్ హేలర్ ఎలా పనిచేస్తుందంటే?
ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇన్హేలర్ వాడక తప్పదు. ఇన్హేలర్లు నోట్లోకి ఔషధాన్ని విడుదల చేసి, స్వేచ్ఛగా ఊపిరి ఆడేలా చేస్తాయి. ఇవి వాడే ప్రతిసారీ కచ్చితమైన మోతాదులోనే ఔషధం విడుదల అవుతుందనే భరోసా లేదు. సాధారణ ఇన్హేలర్లు వాడిన ప్రతిసారి విడుదల చేసే ఔషధం మోతాదులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా నిర్దిష్టమైన మోతాదులోనే ఔషధం విడుదల చేస్తుంది. ఇది యాప్ ద్వారా బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ డిజిటల్ ఇన్హేలర్ను బ్రిటన్‌కు చెందిన ‘టెవా’ కంపెనీ ‘గో రెస్ప్ డిజిహేలర్’ బ్రాండ్ పేరుతో రూపొందించింది. ఈ డిజిహేలర్ రెండు మోడల్స్‌లో దొరుకుతుంది. ఒక మోడల్ 55/14 మైక్రోగ్రాములు, రెండో మోడల్ 113/14 మైక్రోగ్రాముల ఔషధాన్ని విడుదల చేస్తాయి. ఈ డిజిహేలర్ ధర 399 డాలర్లు (రూ.32,709) మాత్రమే! -
విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్‌బడ్స్ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర.. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్‌బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇయర్‌బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! కోహ్లీ వెస్టిండీస్ వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. 𝙒𝙝𝙤𝙡𝙚𝙨𝙤𝙢𝙚 😊 ❤️ When Virat Kohli made Josh's mom's day & "year" 🤗#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL — BCCI (@BCCI) July 22, 2023 -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
ప్రపంచాన్ని మార్చిన టాప్ 10 గాడ్జెట్స్
-
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్‌తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ల్యాప్‌టాప్‌లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్‌టాప్‌లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్‌లో రూ.11,999తో టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను పొందవచ్చు. -
తక్కువ ధరలో లభించే బెస్ట్ గ్యాడ్జెట్స్!
Best Affordable Gadgets: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు సరసమైన ధర వద్ద లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలంటి వారి కోసం రూ. 500 కంటే తక్కువ ధర వద్ద లభించే 5 బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ రూ. 399 వద్ద లభించే విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ చాలా మందికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్. ఇది మానిటర్లు, కీబోర్డులు, ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో క్లీనర్ కిట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్ మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో గ్యాడ్జెట్ 'వైర్లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ అండ్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్'. దీని ధర రూ. 200 కంటే తక్కువ కావడం గమనార్హం. QOCXRRIN వైర్లెస్ బ్లూటూత్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది బ్లూటూత్ ట్రాకర్. అంతే కాకుండా దీనిని ఆండ్రాయిడ్ పరికరాలతో ఉపయోగించవచ్చు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, దీని పరిధి 25 మీటర్ల వరకు ఉంటుంది. 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్ దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ మోడల్ 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్. దీని ధర రూ. 333 మాత్రమే. ఇది దాదాపు చాలా పరికరాలకు ఉపయోగపడే విధంగా రూపుదిదుకున్న యూనివెర్సల్ ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా యాపిల్ పరికరాలకు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి ఛార్జింగ్ వేసుకోవచ్చు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా రూపొందించారు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ కీ చైన్ అనేది మహిళలు, పురుషులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం. ఈ కారణంగా కీ చైన్ల వినియోగం ఆధునిక కాలంలో కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూ. 200 కంటే తక్కువ ధర వద్ద కీ చైన్ కావాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ (Multi-function keychain light). ఇది కేవలం కీ చైన్ మాదిరిగా మాత్రమే కాకుండా లైట్‌గా కూడా పనికొస్తుంది.ఇందులో LED లైటింగ్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అయస్కాంతం ఉండటం వల్ల డోర్ లేదా హ్యాండిల్స్ వంటి వాటికి తగిలించుకోవచ్చు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) Hkaudio ఎమ్28 టిడబ్ల్యుఎస్ ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ పవర్ బ్యాంక్‌తో కూడిన Hkaudio M28 TWS ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ధర కూడా రూ. 500 కంటే తక్కువ. ఇది USB టైప్ ఏ పోర్ట్ కలిగి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది గేమింగ్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఇయర్ఫోన్గా ఉపయోగపడుతుంది. -
గాలిలోని వైరస్‌లనూ ఖతం చేస్తుంది.. ధర ఎంతంటే?
ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్‌ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్‌కి చెందిన ‘హోమ్ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని రూపొందించింది. ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే! -
సూపర్ గ్యాడ్జెట్ : బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా!
హెల్మెట్‌లా కనిపిస్తున్న ఈ హెడ్‌సెట్‌ను తలమీద ధరిస్తే, కొద్దిరోజుల్లోనే బట్టతల మీద జుట్టు మొలుస్తుంది. ఇది ‘కరెంట్ బాడీ స్కిన్ ఎల్ఈడీ హెయిర్ రీగ్రోత్ డివైస్’. దీనిని అమెరికన్ సౌందర్య సాధనాల తయారీ సంస్థ ‘కరెంట్ బాడీ’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్‌కి అనుసంధానమై పనిచేసే హెడ్‌ఫోన్స్ కూడా ఉండటం విశేషం. దీనిని తల మీద తొడుక్కుని, ఇంచక్కా నచ్చిన సంగీతాన్ని వినవచ్చు. దీని లోపల తలను కప్పి ఉంచే భాగంలో 120 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటి నుంచి వెలువడే ‘లో లెవల్ లైట్ థెరపీ’ కిరణాలు వెంట్రుకలు కోల్పోయిన భాగంలోని కణాలను ఉత్తేజపరుస్తాయి. దీనిని రోజుకు పది నిమిషాల చొప్పున కనీసం పదహారు వారాలు వినియోగించినట్లయితే, జుట్టు కోల్పోయిన చోట తిరిగి జుట్టు మొలుచుకొస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 773 డాలర్లు (రూ.63,951) మాత్రమే! -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్‌హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. -
స్మార్ట్ వాటర్ బాటిల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇది చాలా స్మార్ట్ వాటర్ బాటిల్. ఇందులో ఏ కొళాయి నీళ్లయినా పట్టుకుని, నిక్షేపంగా తాగవచ్చు. ఇది బ్రిటన్‌కు చెందిన ‘గ్రే ఆర్క్ టెక్’ రూపొందించిన సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ బాటిల్. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇందులో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు నీటిలోని సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేసి, నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తాయి. దీని వాక్యూమ్ సీల్డ్మూత వల్ల ఇందులోని నీళ్ల ఉష్ణోగ్రత ఇరవైనాలుగు గంటలకు పైగా స్థిరంగా ఉంటుంది. దీనిని ఫ్లాస్క్ మాదిరిగా వేడి లేదా చల్లని పానీయాల కోసం కూడా వాడుకోవచ్చు. మూత మీద ఉండే ఎల్ఈడీ డిస్ప్లేలో బాటిల్లోని పానీయం ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. దీని ధర 98.41 పౌండ్లు (రూ.9,644). . -
మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్‌పుర్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్‌లెట్‌కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది. మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి... ‘బర్డ్ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్‌లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్లెట్’ కూడా ఇలాంటిదే. ‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్‌లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్‌ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు.. ఎలాగంటే..) -
ఆహార పదార్ధాల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచే వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్
ఆహార వృథా ప్రపంచవ్యాప్త సమస్య. ఏటా దాదాపు వందకోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. ఆహారాన్ని తగిన విధంగా ఎక్కువకాలం నిల్వ చేసుకోగల వసతులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా వంటిళ్లల్లో ఆహారం వృథా అయ్యే పరిస్థితులను అరికట్టడానికి టర్కీకి చెందిన యువ డిజైనర్ గోఖన్ సెతింకయా వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్కు రూపకల్పన చేశాడు. ఇళ్లల్లో వాడుకునే ఆహార పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఇది దోహదపడుతుంది. ఆహార పదార్థాలను నిల్వచేసుకునే ప్లాస్టిక్ డబ్బాలను మూతలతో సహా ఈ వాక్యూమ్ ఫుడ్ ప్రిజర్వర్లో పెడితే, డబ్బాల్లోని గాలిని తొలగించేసి, మూతలను దృఢంగా బిగించేస్తుంది. అంతేకాదు, దీనిని ఆన్ చేయగానే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు డబ్బాల్లోని సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తాయి. అప్పటికే ఉన్న సూక్ష్మజీవులు నశించడంతో పాటు, గాలిని తొలగించడం వల్ల కొత్తగా సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉండదు. దానివల్ల డబ్బాల్లోని ఆహార పదార్థాలు దాదాపు రెట్టింపు కాలం పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఆహారం ఇంకెన్నాళ్లు నిల్వ ఉండేదీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దీని ధర 989 డాలర్లు (రూ. 81,313). -
అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్!
పండగలు వస్తే విద్యాసంస్థలు సెలవులు ఇచ్చినట్లే కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. దసరా అయ్యిందో లేదో వెనకే దీపావళి సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో దీపావళి సేల్ ప్రారంభించనుంది. ఈ సారి పండుగకి మీ ఇంటికి అవసరమయ్యే గ్యాడ్జెట్లు లేదా మీ ప్రియమైన బెస్టీలకు విలువైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా! అయితే దీనికి సమాధానం తమ వద్ద ఉందని ఆమెజాన్ ఇండియా అంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్‌లో కొనుగోలుదారులు కొన్ని గాడ్జెట్లపై అదనపు డిస్కౌంట్లతో తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. RGB LED ల్యాంప్ కలర్‌తో వస్తుంది. Odzeni Crystal Rose Diamond Led Lamp: ఇది ₹1,299 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీని అసలు ధర ₹3,599 ఉండగా ప్రస్తుతం Amazonలో 64% తగ్గింపుతో కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. USB ఛార్జింగ్‌తో వస్తోంది. ఒక ఛార్జ్‌తో 8 గంటల వరకు పని చేస్తుంది. ఈ ల్యాంప్ మూడింతల బ్రైట్నెస్ లైటింగ్ అందిస్తుంది. సరేగామా కార్వాన్ మినీ హిందీ 2.0- మ్యూజిక్ ప్లేయర్ ఈ ప్రాడెక్ట్ అసలు ధరపై 19% తగ్గింపు తర్వాత, Saregama Carvan Mini Hindi 2.0- Music Player ప్రస్తుతం కొనసాగుతున్న Amazon సేల్‌లో ₹1,499కే లభిస్తోంది. మ్యూజిక్ ప్లేయర్ 351 ఎవర్ గ్రీన్ హిందీ పాటలతో ప్రీలోడ్ చేసి ఉంటుంది. మీ పర్సనల్ సాంగ్స్ కలెక్షన్ కోసం USB బ్లూటూత్ మోడ్‌లను కలిగి ఉంది. వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ (OnePlus Smart Band): OnePlus స్మార్ట్ బ్యాండ్ 100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం ఉంది. స్మార్ట్ బ్యాండ్ 1.1-అంగుళాల స్క్రీన్ తో స్టైలిష్ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అమెజాన్‌లో ₹1,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. Echo Dot (4th Gen, Blue) combo : Wipro 9W LED smart color bulb నాలుగు రేట్ల బ్రైట్నెస్ కాంతిని అందిస్తుంది. విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్‌తో ఎకో డాట్ (4వ జనరేషన్, బ్లూ) కాంబో.. విప్రో బల్బ్ కాంబోతో కూడిన ఈ Amazon Echo Dot (4వ జనరేషన్) Amazonలో రూ. 2,499కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
షూస్‌ను పదికాలాలు కాపాడే డివైజ్, ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం పాదరక్షలకు రక్షణ సాధనం. ఖరీదైన షూస్‌ను పదిలంగా పదికాలాలు కాపాడుకోవడం కష్టమే! అయితే, ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు. బహుళజాతి సంస్థ ‘నెసుగర్’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్–డీయాడరైజర్. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే, ఇందులోని ఓజోన్ స్టెరిలైజేషన్ మోడ్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, షూస్లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం.