Virat Kohli New Earbuds During West Indies Tour, Check Price And Other Details - Sakshi
Sakshi News home page

Virat Kohli New Earbuds Price: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published Tue, Aug 1 2023 2:57 PM | Last Updated on Tue, Aug 1 2023 3:29 PM

Virat Kohli new earbuds price and details - Sakshi

Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్‌బడ్స్​ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర..
నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్‌బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్​ పవర్​బీట్స్​ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్​బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్​బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు.

ఈ ఇయర్‌బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్‌లలో లేదా అమెజాన్ వంటి ఆన్‌లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది.

ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!

కోహ్లీ వెస్టిండీస్​ వికెట్​ కీపర్​ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement