Ear Buds
-
యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రొ: భారీ తగ్గింపు
టెక్దిగ్గజం యాపిల్‌కు చెందిన ఎయిర్‌పాడ్స్ భారీ డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ పోర్ట్ ఫోలియోలో అత్యంత అధునాతన ఇయర్ బడ్స్ ఎయిర్‌పాడ్ ప్రో. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన TWS ఇయర్‌బడ్స్‌గా పాపులర్ అయ్యాయి. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 22,000లకు పైగా తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ ఎయిర్పాడ్ప్రోరూ.3,910 తగ్గింపు తర్వాత రూ.22,990గా ఉంది. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారంఈ ఆఫర్ వర్తిస్తే రూ. 21,900 తగ్గింపును కూడా పొందవచ్చు. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు) ఎయిర్పాడ్ప్రో ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,MagSafe ఛార్జింగ్ కేస్, ట్రాన్సపరెంట్ మోడ్‌లో లభ్యం. మొత్తంచార్జింగ్ తరువాత 24 గంటల కంటే ఎక్కువ సమయమే వినవచ్చు. ఈ ఎయిర్ పాడ్స్ ప్రో రూ. 26,900 ధరతో లాంచ్ అయ్యాయి. కాగా యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న విడుదల చేయనుంది కంపెనీ. ఈ మెగా ఈవెంట్లో ఎయిర్‌పాడ్స్ కొత్త సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పాడ్స్ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి. (ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?) -
ఎయిర్‌పాడ్స్ ఇక మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్‌లోనే తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్లెస్ ఇయర్‌బడ్స్ (ఎయిర్‌పాడ్స్)ను ఫాక్స్‌కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్‌కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్పాడ్లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్‌లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు. -
విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్‌బడ్స్ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర.. నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్‌బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇయర్‌బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! కోహ్లీ వెస్టిండీస్ వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. 𝙒𝙝𝙤𝙡𝙚𝙨𝙤𝙢𝙚 😊 ❤️ When Virat Kohli made Josh's mom's day & "year" 🤗#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL — BCCI (@BCCI) July 22, 2023 -
ఇయర్ బడ్స్ విషయమై స్నేహితులు కొట్టడంతోనే మృతి
విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిడమానూరు ప్రాంతంలో సోమవారం జరిగిన చెన్నూరు అజయ్‌సాయి (23) హత్యకు గంజాయి మత్తు కారణం కాదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా స్పష్టం చేశారు. ఇయర్ బడ్స్ విషయమై స్నేహితులు కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడి మృతి చెందాడని తెలిపారు. గంజాయి మత్తులో దాడి జరిగిందంటూ అసత్య ప్రచారం చేయడం, ప్రతి దానికీ గంజా యితో ముడిపెట్టడం తగదని మీడియాకు సూచించారు. సీపీ రాణా, ఎస్పీ జాషువా విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఘటన వివరాలను వెల్లడించారు. పెనమలూరుకు చెందిన అజయ్‌సాయి, మణికంఠ, నాగార్జున మరో ముగ్గురు స్నేహితులని తెలిపారు. వారంతా ఈ నెల ఏడో తేదీన పెనమలూరు ప్రాంతంలో సంతోష్ అనే స్నేహితుడి ఇంట్లో గడిపారని, అతని ఐఫోన్ ఇయర్ బడ్స్ కనిపించకపోవడంతో అజయ్‌సాయిని ప్రశ్నించారని పేర్కొన్నారు. అతను ఒకసారి తీశానని, మరోసారి తీయలేదని పొంతనలేకుండా చెప్పడంతో స్నేహితులు ఐదుగురు సోమవారం రాత్రి నిడమానూరులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలు, చేతులతో దాడి చేయడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడని వివరించారు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పరారవగా, నాగార్జున, మణికంఠ కలిసి అజయ్‌సాయిని సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి మూర్చతో అపస్మారక స్థితికి వెళ్లాడని డాక్టర్‌కు చెప్పారని తెలిపారు. కొద్ది సేపటికే అజయ్‌సాయి మరణిం చడం, అతని ఒంటిపై దెబ్బలు ఉండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని అజయ్‌సాయి హత్యకు గురయ్యాడని నిర్ధారించుకుని విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు. ఘటన వెలుగు చూసిన గంటల వ్యవధిలోనే నాగార్జున, మణికంఠ, మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా సరిహద్దులో జరిగిన ఈ ఘటనపై రెండు జిల్లాల పోలీసు యంత్రాంగం సమన్వయంతో విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. గంజాయి కట్టడికి పటిష్ట చర్యలు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో గంజాయి మూలాలను పెకిలించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సీపీ రాణా, ఎస్పీ జాషువా తెలిపారు. డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలతో గంజాయి విక్రయ, సరఫరాదారులతో పాటు గంజాయి తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తూ గంజాయి చైన్ లింక్‌ను ఛేదిస్తున్నామని స్పష్టంచేశారు. గడిచిన ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాపై ఎన్టీఆర్ జిల్లాలో 84 కేసులు నమోదు చేశామని, 284 మందిని అదుపులోకి తీసుకున్నామని, 251 కేజీల గంజా యిని స్వాధీనం చేసుకున్నామని, ఏడుగురిని జిల్లా బహిష్క రణ చేశామని, నలుగురిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు పంపామని వివరించారు. గంజాయి తాగే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కృష్ణాజిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై 91 కేసులు నమోదు చేసి 324 మందిని అరెస్ట్ చేసి, 154 కేజీల గంజా యిని సీజ్ చేశామని, 19 మంది గంజాయి సరఫరా దారు లపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ ఫైల్ జిల్లా కలెక్టర్ వద్ద ఉందని పేర్కొన్నారు. గంజాయి దుష్ఫరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ, ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు, విద్యా సంస్థల వద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని డీ–ఎడిక్షన్ సెంటర్ల ద్వారా సన్మార్గంలోకి తీసుకొస్తున్నామన్నారు. స్నేహితుల మధ్య జరిగిన వివాదాలకు గంజాయితో ముడిపెట్టడం తగదని మీడియాకు హితవు పలికారు. నిజానిజాలు తెలుసుకున్న తరువాతనే వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు గంజాయి సరఫరాదారులపై పీడీ యాక్ట్ విజయవాడ స్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధి లోని ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ టి.కె. రాణా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన బొంతుల దుర్గా రావు అలియాస్ గొంతులుపై గతంలో 12 కేసులు, పాయకాపురం శాంతినగర్‌కు చెందిన మున్నంగి సురేష్‌పై 10 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గంజా యిని సరఫరా చేస్తున్న వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. జైలు జీవితం గడిపినా వారి ప్రవర్తనలో మార్పు లేకపోవడం, యువతను మత్తుకు బానిసలు చేస్తుండటంతో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నా మని తెలిపారు. గంజాయి, ఇతర మత్తుపదార్ధాలు జిల్లాలోకి ప్రవేశించకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. -
రూ.10వేలయాపిల్ ఎయిర్‌పాడ్స్ రూ. 549కే: చెక్ యువర్ లక్!
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌పై ఓ లుక్కేయాల్సిందే. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ ఎయిర్ పాడ్లు కేవలం రూ. 549కి అందుబాటులో ఉన్నాయి. Apple AirPod (2nd Gen) లు కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నట్టే, ఫ్లిప్కార్ట్సేల్లో ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలంటే పాతస్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. తద్వారా నిబంధనల మేరకు రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో సుమారు పది వేల రూపాయల యాపిల్ ఇయర్ బడ్స్‌ను రూ.549కి సొంతం చేసుకోవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) -
పారదర్శక చార్జింగ్ కేస్‌తో పీట్రాన్ ఇయర్‌బడ్స్
హైదరాబాద్: డిజిటల్ లైఫ్‌స్టయిల్, ఆడియో యాక్సెసరీల బ్రాండ్ పీట్రాన్ సంస్థ కొత్తగా పారదర్శక డిజిటల్ చార్జింగ్ కేస్‌తో బేస్‌బడ్స్ నైక్స్ పేరిట వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది. తరచూ ప్రయాణాల్లో ఉండే ఎగ్జిక్యూటివ్‌లు, సంగీత ప్రియులకు ఇవి ఎంతగానో అనువుగా ఉంటాయని సంస్థ సీఈవో అమీన్ ఖ్వాజా తెలిపారు. దీని ధర రూ. 1,299 కాగా ప్రా రంభ ఆఫర్ కింద అమెజాన్ ఇండియాలో రూ. 999కే అందుబాటులో ఉంటుందని తెలిపారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్!
లండన్: వైద్య చరిత్రలో కొన్ని చిత్రమైన కేసులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి. అయితే.. ఇక్కడ మాత్రం విచిత్రమైన కేసు ఒకటి నమోదు అయ్యింది. ఐదేళ్లపాటు చెవులు వినిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే ఆయన చెవిటితననాకి కారణం తెలుసుకుంటే.. విస్తుపోవడం మీ వంతూ అవుతుంది కూడా!. ఇంగ్లండ్(ఉత్తర) డోర్సెట్ వెయ్మౌత్లో నివాసం ఉండే వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఏవియేషన్ పరిశ్రమలో పని చేయడం వల్లనో, రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉంటుందా? అనే అనుమానం పెంచుకున్నారు ఆ 66 ఏళ్ల పెద్దాయన. వినికిడి శక్తి నానాటికీ తగ్గిపోతూ వస్తుండడంతో ఆయన భార్య సైతం ఆందోళన చెందసాగింది. ఈ క్రమంలో.. డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. ఆపై ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో.. ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు రాబట్టగలిగారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!. ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!. -
బిగ్’సి’ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు ‘‘డబుల్ ధమాకా ఆఫర్’’ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199లకే లేదా రూ.3,999 విలువైన గిగ్మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.999లకే అందించనుంది. ప్రతిస్మార్ట్ ఫోన్‌పై రూ.7900 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి ల్యాప్‌ట్యాప్ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఇస్తుంది. ఏటీఎం కార్డుపై ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. -
అత్యంత చవకైన ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసిన బోట్..!
పాపులర్ వేరబుల్స్ బ్రాండ్ బోట్ (boAt) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెగ్మెంట్లో అత్యంత చౌకైన ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఆడియో వేరబుల్స్ మార్కెట్లోకి బోట్ 411 ఎయిర్‌డోప్స్‌ను (boAt 411 Airdopes) కంపెనీ లాంచ్ చేసింది. సరసమైన ధరలకు బడ్జెట్ ఉత్పత్తులను అందించడంలో బోట్ ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇంతకుముందు వేవ్ ప్రో 47 అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. బోట్ 411 ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, డ్యూయల్-ఎనేబుల్డ్ మైక్, టచ్ కంట్రోల్స్‌తో సహా అనేక ఫీచర్లతో రానుంది. ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో తక్కువ ధరకే ఇయర్‌బడ్స్‌ను బోట్ తొలిసారిగా అందిస్తోంది. ధర ఏంతంటే..! బోట్ 411 ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్ రూ. 1999 ఆకర్షణీయమైన ధరకు రానున్నాయి. బ్లాక్ స్టార్మ్, బ్లూ థండర్, గ్రే హరికేన్‌తో వంటి కలర్ వేరియంట్స్‌లో లభించనుంది. ఈ ఇయర్‌బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. బోట్ 411 ఎయిర్‌డోప్స్ స్పెసిఫికేషన్లు 10mm డ్రైవర్ boAt సిగ్నేచర్ సౌండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాంబియంట్ సౌండ్ మోడ్ అత్యుత్తమ కాలింగ్ నాణ్యతను అందించేందుగాను డ్యూయల్ ENx మైక్స్ చదవండి: ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే! -
మీ చెవులు బిజీయా.. అయితే వీటి ముప్పు తప్పదు
రోజుకు ఎన్ని గంటలు చెవి ఒగ్గుతున్నారు? అదేనండీ! రోజుకు ఎంత సేపు ఫోన్ వాడుతున్నారు? ఇయర్ ఫోన్స్... హెడ్ ఫోన్‌తో చెవిని బిజీగా ఉంచుతున్నారా? ఇక... ఇన్ఫ్లమేషన్... ఇరిటేషన్... ఇన్ఫెక్షన్ పొంచి ఉంటాయి. ‘చెయ్యి ఖాళీ లేదు’ అనే మాట ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కానీ చెవి ఖాళీ లేదని మాత్రం చెప్పాల్సిన పనిలేకనే కనిపిస్తోంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆరు ఫోన్లుంటాయి. కొన్ని ఫోన్లకు రెండు సిమ్‌లు కూడా. ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మరో ఫోన్ రింగవుతుంది. ఆన్సర్ చేయడానికి చెయ్యి ఖాళీ ఉండదు. ఒకవేళ ఇయర్ ఫోన్స్‌తో వింటూ మాట్లాడుతూ ఉంటే చెయ్యి ఫ్రీగానే ఉంటుంది. కానీ చెవి మాత్రం ఖాళీ ఉండదు. రోజులో ఓ రెండు గంటల సేపు ఫోన్ కోసం చెవిని అంకితం చేయక తప్పని లైఫ్‌స్టైల్ ఇది. ఆ పైన ఖాళీ సమయాన్ని ఎవరికి వాళ్లు స్మార్ట్‌ఫోన్‌లో తమకు నచ్చిన చానెల్లో ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తూ గడిపేస్తారు. పక్క వాళ్లకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇయర్‌ఫోన్స్‌ను ఆశ్రయించక తప్పదు. ఇలా రోజులో ఐదారు గంటల సమయం చెవుల్లో ఇయర్ ఫోన్ ఉంటోంది. మరికొన్ని వృత్తుల్లో అయితే హెడ్‌ఫోన్ తప్పనిసరి. వాళ్లు ఏడెనిమిది గంటల సమయం హెడ్‌ఫోన్ ధరించి ఉంటారు. మొదట్లో బాగానే ఉంటుంది. కానీ క్రమంగా తమకు తెలియకనే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పెద్దగా గొంతు పెంచి మాట్లాడడం అలవాటవుతుంది. ఇంట్లో వాళ్లు చెప్పేది సరిగ్గా వినిపించదు. చిరాకులు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తెలియని దూరం పెరుగుతుంది. ఆ తర్వాత చెవిలో దురద, వాపు, ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. వీటన్నింటికీ కారణం ఇయర్‌ఫోన్స్, హెడ్ ఫోన్స్‌తో చెవులను రొద పెట్టడమేనంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ సమస్యను ‘స్విమ్మర్స్ ఇయర్’ అంటారు. ఈ రకమైన ఇబ్బంది మొదలైన వాళ్లలో పన్నెండు శాతం మందికి వినికిడి శాశ్వతంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం చెవి అదేపనిగా శబ్దాలను వినాల్సి రావడమేనంటే... వింతగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంది. కానీ ఇదే వాస్తవం. అనుక్షణం మితిమీరిన శబ్దాల మధ్య ఈదులాడాల్సిన దుస్థితి చెవిది. గ్రాఫ్ పెరుగుతోంది పాశ్చాత్యదేశాలతో పోలిస్తే ఈ సమస్య మనదేశంలో వేగంగా పెరుగుతోంది. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండడం, సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభించడం స్వాగతించాల్సిన పరిణామమే. కానీ టెక్నాలజీని ఎంత వరకు ఉపయోగించుకోవాలనే విషయంలో స్వీయ నియంత్రణ ఉండి తీరాలి. ఇక తప్పని సరిగా ఎక్కువ సేపు మాట్లాడాల్సిన ఫోన్‌కాల్స్ విషయంలో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం ఓ మధ్యేమార్గం. ట్రాఫిక్ శబ్దాల్లో ఎక్కువ సమయం పని చేయాల్సిన వాళ్లు... ఇయర్ కెనాల్‌ను (చెవిరంధ్రాన్ని) కాటన్ బాల్ లేదా ఇయర్ప్లగ్స్తో కప్పి ఉంచడం మంచిది. చివరగా ఒకమాట... చెవుల నుంచి వైర్లు వేళ్లాడుతూ, సంగీతానికి అనుగుణంగా మెలికలు తిరుగుతూ ఉంటే... మోడరన్ లుక్ ఫీలవచ్చేమో కానీ... ఇది శృతి మించితే హియరింగ్ మెషీన్‌తో సహజీవనం చేయాల్సిందే. ఎంతటి సంగీత ప్రియులైనా సరే... ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వినేటప్పుడు 70 నుంచి 80 డెసిబుల్స్‌కు మించితే హియరింగ్ మెషీన్‌కు దగ్గరగా వెళ్తున్నట్లే. అలాగే ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్ వాడే వాళ్లు అరగంటకోసారి వాటిని తీసి చెవులను సొంతంగా మామూలు శబ్దాలను కూడా విననివ్వాలి. -
లిప్‌స్టిక్ ఇయర్ బడ్స్‌ను చూశారా...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే యూరప్ మార్కెట్లలోకి కొత్త హువావే నోవా 9 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా సరికొత్త హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్, ఫ్రీబడ్స్ లిప్‌స్టిక్ ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది. హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ఈ-సిమ్ సపోర్ట్‌ను పొందనుంది. యూరప్ మార్కెట్లలో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ. 21600గా ఉండనుంది. పలు స్ట్రాప్స్ ఆప్షన్స్‌తో హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ రానుంది. హువావే లాంచ్ చేసిన ఉత్పత్తుల్తో ఇయర్‌బడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ చూడటానికి లిప్‌స్టిక్ ఆకృతిలో ఉంది. మహిళ కొనుగోలుదారులను ఆకర్షించేందుకుగాను లిప్‌స్టిక్ షేప్‌లో హువావే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్‌బడ్స్ ధర సుమారు రూ. 21000 వరకు ఉండనుంది. కాగా ఈ గాడ్జెట్స్‌ను భారత మార్కెట్లలోకి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్.. పేరు మార్చడం అంత ఈజీనా? మరి ఆ కంపెనీల సంగతి ఏంది? హువావే జీటీ3 స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ 42మీ.మీ*46మీ.మీ డయల్ అమ్లోడ్ డిస్ప్లే విత్ అల్ట్రా కర్వ్డ్ 3డీ గ్లాస్ 32ఎమ్బీ ర్యామ్+4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 14 రోజులవరకు బ్యాటరీ బ్యాకప్ బ్లూటూత్, జీపీఎస్ టెంపరేచర్ సెన్సార్, ఆప్టికల్ హర్ట్ రేట్ రీడర్ హువావే ఫ్రీబడ్స్ లిప్‌స్టిక్ ఫీచర్స్.. ఆక్టివ్ నైక్ క్యాన్సిలేషన్ 22 గంటల మ్యూజిక్ ప్లే 410mAh బ్యాటరీ చదవండి: ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..! -
ఏఐ టెక్నాలజీతో వైర్లెస్ ఇయర్ బడ్స్, సూపర్ ఫీచర్లతో
టెక్ మార్కెట్లో వైర్ లెస్ ఇయర్ బడ్స్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలు విడుదల చేసిన వైర్లెస్ ఇయర్ బడ్స్ వినియోగదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజగా మరో సంస్థ సౌండ్ కోర్ బడ్జెట్ ధరలో 'లైఫ్ నోట్ ఈ టీడబ్ల్యూఎస్' పేరుతో ఇయర్ బడ్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లు ఆడియో టెక్నాలజీలో గ్లోబుల్ లీడర్ గా ఉన్న సౌండ్ కోర్ తాజాగా బ్యాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్ చేతులు మీదిగా 'లైఫ్ నోట్ ఈ టీడబ్ల్యూఎస్' పేరుతో ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. ఇక ఇయర్ బడ్స్‌లోని ఫీచర్ల విషయానికొస్తే 32హెచ్ ప్లే టైమ్, 3 ఈక్యూమోడ్స్, బిగ్ బ్యాస్, ట్రిపుల్ లేయర్ 10ఎంఎం డ్రైవర్స్, 50 శాతం పవర్ ఫుల్ బ్యాస్‌తో మెస్మరైజ్ చేసేలా సౌండ్‌ను అందిస్తుంది. యూనిక్ 3 ఈ క్యూ మోడ్స్, సౌండ్ కేర్ సిగ్నేచర్స్ ఫీచర్లు ఉన్నాయి. ఏఐతో పనిచేస్తుంది ఇక ఈ లైఫ్ నోట్ ఈ ఇయర్ బడ్స్ పూర్తిగా ఏఐ టెక్నాలజీ పనిచేస్తుందని సౌండ్ కోర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు 4.6 గ్రాముల బరువు ఉండే ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ వినియోగిస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. లైట్ వెయిట్‌తో పాకెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ ధర రూ.2,799 ఉండగా.. లాంచ్ సందర్భంగా రూ.1999కే అందిస్తున్నట్లు సౌండ్ కోర్ తెలిపింది. -
ఈ ఇయర్ బడ్స్‌తో వింటే చెవులకు స్ట్రెస్ ఉండదట ! న్యూ గాడ్జెట్
కరోనా కారణంగా గేమింగ్ ఇండస్ట్రీ జోరందుకుంది.అయితే వారికి అనుగుణంగా ఆయా టెక్ సంస్థలు పలు గాడ్జెట్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా గేమింగ్ ప్రియులు వినియోగించేందుకు వీలుగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ 'వన్‌ప్లస్ బడ్స్ ప్రో'ను మన దేశంలో విడుదల చేసింది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ఫీచర్స్ తాజాగా విడుదలైన ఈ వన్ ప్లస్ బడ్స్ ప్రోను వినియోగించే సమయంలో చుట్టుపక్కల నుంచి వచ్చే డిస్టబెన్స్ లేకుండా, ఒత్తిడి తగ్గించేందుకు జెన్ మోడ్ ఎయిర్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు వైర్ లెస్ ఛార్జింగ్, 1 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ బరువున్న ఏ వస్తువు ఈ ఇయర్ బర్డ్ పై పడినా.. ఎలా డ్యామేజీ కలగకుండా ఉండే (ఐపీ - 44 సర్టిఫికేషన్ ) ఫీచర్ తో డిజైన్ చేశారు. యూఎస్బీ టైప్‌సీ పోర్ట్, సౌండ్ ను ప్రొడ్యూస్ చేసే 11ఎంఎం మ్యాగ్నెటిక్ డైనమిక్ డ్రైవర్లు, హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్సీ), మూడు ఏఎన్సీ మోడ్లుతో పాటు ఎక్స్ట్రీం, ఫెయింట్, స్మార్ట్ మోడ్‌లో ఏఎన్సీ వినియోగించుకునే సౌకర్యం ఉంది. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ, 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుండగా..10 నిమిషాల చార్జింగ్ పెడితే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నారు. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర గ్లాసీ వైట్, మాట్ బ్లాక్ రంగుల్లో ఉండే ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర రూ.9,990గా నిర్ణయించారు. ఆగస్ట్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చని వన్ ప్లస్ ప్రతినిధులు వెల్లడించారు. -
మార్కెట్లోకి రియల్మీ బ్రాండ్స్, వాటి ధరెంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తాజాగా విస్తృత శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసింది. వీటిలో రియల్మీ వాచ్–2 ప్రో, వాచ్–2, బడ్స్ వైర్లెస్–2, బడ్స్ వైర్లెస్–2 నియో, బడ్స్ క్యూ2 నియో ఉన్నాయి. ధరల శ్రేణి రూ.1,299 నుంచి రూ.4,999 వరకు ఉంది. జూలై 26 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఉత్పాదననుబట్టి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. కొద్ది రోజుల్లో ఆఫ్లైన్లోనూ దొరుకుతాయి. -
హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి
పుణె: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరో వస్తువు వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆవేశంతో, అసహనంతో ఊగిపోతారు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి చెడామడా తిట్టేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఎగిరి గంతేస్తున్నాడు. ఎందుకో తెలిస్తే... మీరు షాకవుతారు. పుణెకు చెందిన గౌతమ్ రేజ్ అనే వ్యక్తి ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో స్కిన్ లోషన్ ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాక అందులో ఉన్న వస్తువును చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అందులో రూ.19 వేలు విలువ చేసే బోస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఉంది. దీంతో అతను కస్టమర్ కేర్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. అయితే అది నాన్ రిటర్నబుల్ ఆర్డర్ అయినందున వెనక్కు తీసుకోలేమని చెప్పారు. అంతేకాదు.. స్కిన్ లోషన్‌ను ఇవ్వనందున దాని డబ్బును కూడా తిరిగి చెల్లించేశారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) దీంతో అతను ఇది నిజమా కళా అని నమ్మలేకపోయాడు. వెంటనే ట్విటర్లో తనకు జరిగిన అద్భుత అనుభవాన్ని రాసుకొచ్చాడు. "నేను రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే దానికి బదులు రూ.19 వేలు ఖరీదు చేసే బోస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ వచ్చాయి. కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే వీటిని నా దగ్గరే ఉంచుకోమన్నారు" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీనితోపాటు ఓ సర్ఫ్ ప్యాకెట్ వచ్చిందని తెలిపాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు "కాస్త ఆ స్కిన్ లోషన్ పేరు చెప్తారా? వీలైతే లింక్ సెండ్ చేయండి" అంటూ అతడి వెంట పడుతున్నారు. "హేయ్, నాకు ఇయర్‌బడ్స్‌కు బదులు లోషన్ వచ్చింది.. మనిద్దరం వస్తువులు మార్చుకుందామా?" అంటూ చమత్కరించారు. మరొకరు మాత్రం "ఇయర్‌బడ్స్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏం వచ్చుంటుందో, ఏమో?"నని విచారం వ్యక్తం చేశాడు. (ఆహా ఆన్లైన్ భోజనం..) -
అమెజాన్ నుంచి ‘అలెక్సా’ ఇయర్ బడ్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ సదుపాయం ద్వారా మనకు కావాల్సిన పాటలు, వార్తలు, జోకులు ఎల్ల వేళలా వినేందుకు అమెజాన్ కంపెనీ (అమెజాన్ వాయిస్ అసిస్టెంట్) ‘అలెక్సా’ యాప్ కలిగిన ‘అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్’ను మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదే అమెజాన్ కంపెనీ ‘వైర్ లెస్ ఎకో ఇయర్ బడ్స్’ను తీసుకొస్తోంది. దీనికి కూడా ‘వాయిస్ కమాండ్స్’ను రిసీవ్ చేసుకొనే ‘అలెక్సా’ను అనుసంధానించింది. ‘అలెక్సా!’ అని సంబోధించడం ద్వారా మనం కోరిన పాట, వార్తలు లేదా జోక్స్‌ను ఇంటర్నెట్లో వెతుక్కొని అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో (కమాండింగ్‌తో) పనిచేసే వైర్ అవసరం లేని ఇయర్ బడ్స్‌ను తీసుకొస్తోంది. ఆ ఇయర్ బడ్స్‌ను మనం చెవిలో పెట్టుకొని ‘అలెక్సా’ అంటూ కమాండ్ ఇస్తే చాలు, దానికి అనుగుణంగా స్పందించి మనం కోరింది ఇంటర్నెట్లో వెతికి ఇయర్ బడ్స్ ద్వారా వినిపిస్తోంది. ఒక ఇంట్లోనే కాకుండా మనం బయటకు వాహ్యాళికి వెళ్లినప్పుడు, బస్సో, రైలో ఎక్కినప్పుడు ఈ ఇయర్ బడ్స్ ద్వారా పాటలు లేదా వార్తలు వినవచ్చు. అయితే బయటకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం కోసం స్మార్ట్ ఫోన్ వెంట ఉండాల్సిందే. లేకపోతే ‘వైఫై’ సదుపాయం ఉన్న హోటల్‌నో, కేఫ్నో, మరో చోటునో ఆశ్రయించాల్సి ఉంటుంది. రోడ్డు మీద వినిపించే రణగొణ ధ్వనులను తగ్గించేందుకు ప్రఖ్యాత ‘బోస్’ కంపెనీ రూపొందించిన ‘నాయిస్ రిడక్షన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఇయర్ బడ్స్‌లో ఉపయోగించారు. ఇందులో ప్రతి బడ్కు రెండు స్పీకర్లు బయటకు, ఒక స్పీకర్ లోపలికి చొప్పున సెట్‌కు ఆరు స్పీకర్లు ఉంటాయి. బయటకు ఉండే రెండేసీ స్పీకర్లు మనకు వినిపించడానికైతే ఒకటేసి స్పీకర్ ‘అలెక్సా’ మన అడిగింది వినడానికి. దీని వల్ల బిజీ రోడ్లో ప్రయాణిస్తున్నా, గోల గోలగా ఉండే రైల్వే స్టేషన్లో ఉన్నా ‘అలెక్సా’ సులభంగా మన కమాండ్‌ను వినగలదు. ఈ ఏడాది చివరిలో తీసుకరానున్న ‘అమెజాన్ ఎక్ ఇయర్ బడ్స్’కు 129.99 డాలర్లు (దాదాపు పదివేల రూపాయలు)గా ధరను ఖరారు చేసింది. ఇప్పటికే మార్కెట్లో 160 డాలర్లకు అందుబాటులో ఉన్న ఇలాంటి ఇయర్ బడ్స్ ‘ఆపిల్స్ ఏర్ పాడ్స్’కు పోటీగా అమెజాన్ కంపెనీ తీసుకొచ్చింది. త్వరలో అలెక్సా తరహాలో పనిచేసే ఆపిల్ కంపెనీ ‘సిరి’, గూగుల్ కంపెనీ ‘గూగుల్ అసెస్టెంట్’లకు కూడా ఈ ఇయర్ బడ్స్‌ను అనుసంధానిస్తామని అమెజాన్ కంపెనీ వర్గాలు తెలిపాయి. మన వెంట ఉండే స్మార్ట్ ఫోన్లో అలెక్సా, సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ ఉన్నప్పుడు ఇయర్ బడ్స్‌లో లేకపోయినా మనం కోరింది వినవచ్చుగదా! అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. రణగొణ ధ్వనుల మధ్య ఫోన్ మైక్ నోటి దగ్గర పెట్టుకొని మనం కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన గొంతుకన్నా బయటి ధ్వనులు ఎక్కువగా ఉన్నప్పుడు అలెక్సా....స్పందించకపోవచ్చు. అందుకనే ఈ ఇయర్ బడ్స్‌లో ‘నాయిస్ రిడక్షన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. కొంత ఈ వాదన కరెక్టే అయినా. ‘అన్నింట్లో అన్ని సౌకర్యాలు’ అనేది ఆధునిక సాంకేతిక వ్యాపార సూత్రం. -
పిల్లలూ...వింటున్నారా?
కన్ను తర్వాత పరిసరాల గురించి అత్యంత ఎక్కువ సమాచారం దొరికేది వినికిడి జ్ఞానంతోనే. అందుకే పంచేంద్రియాల్లో చెవికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు ఉపకరించేది చెవే. కాబట్టి పాఠశాల పిల్లల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే ఈ చెవినీ, దాని వల్ల వచ్చే పరిజ్ఞానాన్ని విస్మరించడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లలకు చెవుల విషయంలో కనిపించే సమస్యలను ఇప్పుడే తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న సెలవుల్లోనే వాటిని చక్కదిద్దుకొని స్కూలుకు వెళ్లే సమయానికి హాయిగా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో శాశ్వత వినికిడి లోపం ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో నలుగురు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని అంచనా. వినికిడి లోపం కారణంగా భవిష్యత్తులో మాట్లాడటం కూడా రాకపోవచ్చు. అందుకే పుట్టీపుట్టగానే వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి తగిన వైద్యం చేసి, ఆ లోపాలను సరిదిద్దవచ్చు. ఇక బాల్యంలో స్యూలుకు వెళ్లే సమయంలోనూ పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. వినికిడి సమస్యల వల్ల మనం ఇతరులతో సమచారాన్ని రాబట్టుకోవడం, పంచుకోవడం కష్టమవుతుంది. చెవితో పాటు గొంతు, ముక్కు సమస్యలు కూడా పిల్లలను సమస్యలకు లోను చేస్తాయి. ఇలాంటివారు తమ చెవితో పాటు, సంబంధిత ఇతర సమస్యలను చక్కదిద్దుకోడానికే ఈ కింది సూచనలు. 1.మనలో చాలామంది తరచూ చేసే తప్పు... చెవులను శుభ్రపరచడం. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రమయ్యేలా ప్రకృతి వాటిని డిజైన్ చేసింది. మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘ఇయర్ బడ్స్’ వల్ల మన చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చెవిలోని గువిలిని ఇంకా లోపలికి నెడుతున్నాం. చెవిలోకి ఏదైనా వస్తువుగానీ, పురుగుగానీ ప్రవేశించినప్పుడు వాటినుంచి చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి ఎక్కువ స్రవిస్తుంది. ఆ గువిలిని శుభ్రం చేయడం కోసం మనం పుల్లలను ఉపయోగించడం వల్ల చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవించేలా చేసి సమస్య తీవ్రత అధికమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఇయర్‌బడ్స్, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటివి చెవుల్లో పెట్టుకొని శుభ్రం చేసుకోకూడదు. 2.చెవులను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి వేయడం వల్ల కొత్త సమస్యలు మొదలువుతాయి. కాబట్టి ఆ పని ఎప్పుడూ చేయకూడదు. 3.చెవులలో చీముకారడం మరొక ముఖ్యమైన చెవికి సంబంధించిన సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిపుణులైన ఈఎన్టీ వైద్యులకు కలిసి సరైన చికిత్స, మందులు తీసుకోవాలి. సమస్యను బట్టి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించాల్సి రావచ్చు. 4.పిల్లలు ముఖ్యంగా వేసవికాలం సెలవుల్లో ఈత నేర్చుకోవడం కోసం నీటి కుంటలు, చెరువుల వంటి చోట్లకు వెళ్తుంటారు. ఆ సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు నీళ్లలో దిగిన సమయంలో పరిశుభ్రమైన నీళ్లలోకి దిగాలి. ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ ధరించడం ద్వారా ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. 5.తరచూ జలుబు చేసే పిల్లల్లో కూడా ముక్కు మూసుకుపోవడం వల్ల చెవి మధ్యభాగంలో గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల వీరిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అందువల్ల తరచూ జలుబు చేసేవారిలో అందుకు సంబంధించిన కారణాలు కనుక్కొని తగిన చికిత్స తీసుకోవాలి. ఈమధ్యకాలంలో పిల్లల్లో అలర్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల కూడా పిల్లల్లో తరచూ జలుబు కనిపిస్తోంది. ఇలా తరచూ జలుబు కనిపిస్తున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూ ఏది తింటే సరిపడకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి, దాని నుంచి వారిని దూరంగా ఉంచడం, లేదా సరిపడని వాతావరణంలోకి వారిని తీసుకెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 6.గట్టి శబ్దాలను ఎక్కువసేపు వినడం, సంగీతం వినే సమయంలో ఎక్కువ తీవ్రతతో వినడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే పిల్లలు పెద్ద పెద్ద శబ్దాలను గట్టిగా వినడం సరికాదు. మ్యూజిక్‌ను పెద్దగా సౌండ్ పెట్టుకొని వినడం, గట్టిగట్టిగా పేలే టపాకాయ శబ్దాలను వినడం వారిలో వినికిడి సమస్యలు రావడానికి కారణం కావచ్చు. 7.కొంతమంది పిల్లలు చెవిలో పుల్లలు, పెన్నులు, పిన్నులు, పిన్నీసులు వంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల ఒక్కోసారి వాళ్ల కర్ణభేరికి దెబ్బతగలవచ్చు. ఇలా జరగడం వల్ల కూడా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. 8.శుభ్రమైన తాగు నీరు తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఐస్‌క్రీములు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడంతో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఇవే ఇన్ఫెక్షన్లు చెవులకూ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు కీలక అవయవాల్లో ఏ భాగంలో ఆరోగ్య సమస్య తలెత్తినా అది ఇతర భాగాలకు వ్యాపించే ఆస్కారం ఉంది. అవన్నీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చెవి, గొంతు, ముక్కు... ఈ మూడు కీలక అవయవాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్లను అస్సలు విస్మరించకూడదు. 9.చెవిలో ఎక్కువ గువిలి వస్తున్నా, చెవి నుంచి చీము కారుతున్నా, చెవిలో నొప్పి వస్తున్నా, చెవిపోటు అనిపించినా, రాత్రి సమయాల్లో చెవిలో గుయ్ మనే శబ్దం వినిపిస్తున్నా, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నా, మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతున్నా... ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. వీలైతే ఈ సెలవుల్లోనే పిల్లలను ఈఎన్టీ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. తగిన సలహా, చికిత్స తీసుకోండి. బడికి వెళ్లే సమయానికల్లా వారి సమస్యలు దూరమవుతాయి. - డాక్టర్ ఈసీ వినయకుమార్, హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్