న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (ఎయిర్‌పాడ్స్)ను ఫాక్స్‌కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్‌కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్‌పాడ్‌లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్‌లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment